bikini
-
బికినీలో మోడల్ ర్యాంప్ వాక్.. మండిపడుతున్న నెటిజన్లు
పాకిస్తానీ మోడల్ రోమా మైఖేల్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2024 అందాల పోటీలో భాగంగా బికినీలో ర్యాంప్ వాక్ చేయడంతో ఆమెకు ఈ పరిస్థితి తలెత్తింది. అంతేగాదు ఆమె బికినీలో ర్యాంప్ వాక్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో పెద్ద ఎత్తున వ్యతిరేకత వెల్లువెత్తింది. దీంతో ఆమె ఆ వీడియోని తన ఖాతా నుంచి తొలగించక తప్పలేదు. ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో రోమా పాకిస్తాన్‌కి ప్రాతినిధ్యం వహించడంతోనే ఇంతలా వ్యతిరేకత ఎదురయ్యింది. పాకిస్తాన్లో మహిళలు ధరించే దుస్తుల విషయమై కొన్ని కఠిన నియమాలు ఉంటాయి. అందులోనూ రోమా బికినీ ధరించి ర్యాంప్‌వాక్ చేయడమే గాక తాను పాకిస్తానీని ప్రకటించడంతో ఒక్కసారిగా ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఊపందుకున్నాయి.రోమా మైఖేల్ ఎవరు?లాహోర్‌కు చెందిన రోమా మైఖేల్ దక్షిణాసియా విశ్వవిద్యాలయం నుంచి ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేసింది. ఒక ప్రొఫెషనల్ మోడల్‌గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన ఫ్యాషన్ డిజైనర్లు, ప్రసిద్ధ బ్రాండ్లతో కూడా పనిచేస్తుందామె. అంతేగాదు రోమా కేన్స్ ఫ్యాషన్ వీక్, దుబాయ్ ఫ్యాషన్ షోతో సహా పలు అంతర్జాతీయ వేదికలపై పాకిస్థాన్‌కు ప్రాతినిధ్యం వహించింది. ఇన్‌స్టాలో రోమాకు ఏడు లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు. అయితే థాయ్‌లాండ్‌లో జరుగుతోన్న ఈ మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ అందాల పోటీల్లో దాదాపు 69 మంది అందాల భామలు పాల్గొన్నారు. అక్టోబర్ 25న ఫైనల్ ఈవెంట్ జరుగనుంది. అప్పుడే టైటిల్ విన్నర్‌ను ప్రకటిస్తారు. అందులో భాగంగా వారందరికీ వివిధ పోటీలు నిర్వహిస్తారు. ఈ క్రమంలోనే పాకిస్తానీ మోడల్ రోమా (Roma Michael) బికినీలో ర్యాంప్ వాక్ చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఒక్కసారిగా నెటిజన్లు ఆమె వస్త్రాధారణను తప్పపడుతూ విమర్శలు చేయడం ప్రారంభించారు. కానీ అప్పటికే ఈ వీడియో పలు ఖాతాల్లో షేర్ కావడంతో ఆ పోస్టును తొలగించినా ఆమెపై కామెంట్ల వెల్లువ ఆగడం లేదు. View this post on Instagram A post shared by Roma Michael Official (@romamichael78) (చదవండి: టెక్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ జుట్టు సంరక్షణ చిట్కాలు..!) -
బంగారంలా మెరిసిపోతున్న శ్రియ (ఫొటోలు)
-
అలాంటి డ్రెస్ వేసుకుంటే పెద్ద స్టార్ అవుతానన్నాడు: హీరామండి నటి
ఇటీవల హీరామండి వెబ్ సిరీస్‌తో అభిమానులను ఆకట్టుకున్న బాలీవుడ్ నటి మనీషా కొయిరాలా. 1990ల్లో స్టార్ హీరోయిన్గా రాణించింది. తాజాగా సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన హీరామండిలో కనిపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన మనీషా తన కెరీర్లో ఎదురైన పలు సంఘటలను గుర్తు చేసుకుంది. 90వ దశకంలో బాలీవుడ్లో మహిళా నటులు ఎదుర్కొన్న ఇబ్బందులను ప్రస్తావించింది. ఒక ఫోటోగ్రాఫర్‌తో తనకెదురైన చేదు అనుభవాన్ని వివరించింది.మనీషా మాట్లాడుతూ.. 'నా కెరీర్లో ప్రారంభంలో నన్ను చాలామంది ఫోటోషూట్లు అడిగేవారు. ఒకసారి నేను అమ్మతో కలిసి ఫోటోషూట్‌కు వెళ్లాను. అక్కడే ప్రముఖ ఫోటోగ్రాఫర్ కూడా ఉన్నారు. అతను నువ్వే తర్వాతి సూపర్‌స్టార్ అని నాతో అన్నాడు. ఆ తర్వాత అతను నా దగ్గరకు రెండు పీసుల బికినీ తెచ్చి ధరించమని అడిగాడు. అప్పుడు నేను బీచ్‌కి వెళ్లినప్పుడు, ఈత కొట్టేటప్పుడు మాత్రమే ఇది వేసుకుంటాను. కానీ ఇలాంటి వాటితో సినిమాల్లోకి రావాలనుకోవడం నాకు ఇష్టం లేదు. దీంతో బికినీ ధరించను అని చెప్పా. పూర్తి దుస్తులతోనే ఫోటోలు తీయమని సూచించా. ఆ తర్వాత అతను నాకు ఓ డైలాగ్ చెప్పాడు. నేను పెద్దస్టార్ అయ్యాక తానే నా ఫోటోలు తీసేందుకు వచ్చాడు' అని వెల్లడించారు.కాగా.. మనీషా మొదట నేపాలీ చిత్రం ఫెరి భేతౌలాతో సినీ కెరీర్ ప్రారంభించింది. ఆ తర్వాత సౌదాగర్ (1991) మూవీతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. అనంతరం ధన్వన్ , 1942: ఎ లవ్ స్టోరీ, బాంబే , అగ్ని సాక్షి , గుప్త, ది హిడెన్ ట్రూత్, దిల్ సే లాంటి చిత్రాలలో నటించింది. అయితే కొన్నేళ్ల పాటు పరిశ్రమకు దూరంగా ఉన్న మనీషా లస్ట్ స్టోరీస్ (2018)తో రీ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది విడుదలైన షెహజాదా (2023) చిత్రంలో కనిపించింది. -
Mehreen Pirzada: చాలా రోజుల తర్వాత గ్లామర్ ట్రీట్ ఇచ్చిన మెహరీన్ (ఫోటోలు)
-
రద్దీ బస్సులో బికినీలో అమ్మడు : ఒక్కసారిగా షాకైన జనం
ఢిల్లీలో రద్దీగా ఉండే బస్సులో ఓ మహిళ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అభ్యంతర కర తరహాలో బికినీ ధరించి రద్దీగా ఉన్న బస్సు ఎక్కింది. దీంతో తోటి ప్రయాణీకులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఈ దృశ్యాలు కూడా వీడియోలో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియోపై నెటిజన్లలో విభిన్న స్పందనలు కనిపించాయి. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ ఫాం ‘ఎక్స్’లో బుధవారం ఈ వీడియో షేర్ అయింది. ఈ వీడియోలో ఓ మహిళ టూపీస్ బికినీలో బస్సెక్కడం కనిపించింది. అప్పటికే అక్కడ నిలబడి ఉన్న ఓ వృద్ధురాలు పక్కకు వెళ్లిపోగా సీట్లో కూర్చున్న ఓ ప్రయాణికుడు సైతం లేచి వెళ్లిపోవడం గమనార్హం. దీపికా నారాయణ భరద్వాజ్ అనే యూజర్ షేర్ చేసిన ఈ వీడియోకి దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. (ఫుడ్ ఫోటోగ్రాఫర్ అవార్డుల పోటీ : ఈ అద్భుతమైన ఫోటోలు చూశారా?) బికినీలో ఆమెను చూసి షాక్ అయ్యామని కొందరు వ్యాఖ్యానించారు. ఆమె తీరును అభ్యతరకరంగా ఉందననారు. మరికొందరు మాత్రం ఆమె బట్టలు ఆమె ఇష్టం అంటూ వ్యాఖ్యానించారు. ఎలాంటి దుస్తులు వేసుకోవాలో ఎంచుకునే స్వేచ్ఛను గట్టిగా సమర్థించారు. కాగా ఢిల్లీ మెట్రో రైల్లోనూ ఓ మహిళ బ్రా, మినీ స్కర్ట్ తో ప్రయాణించి కలకలం రేపింది.అలాగే హోలీ సందర్భంగా ఇద్దరు అమ్మాయిలు చేసిన రీల్స్ కూడా వివాదాన్నా రేపిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఈ ఉదంతంపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ స్పందించింది. తాజా ఘటనపై అధికారులు ఇంకా స్పందించలేదు. (కొంచెం శ్రద్ధ ఉంటే చాలు..టెర్రస్ మీదే బోలెడన్ని మొక్కలు) What's really happening 😵💫😵💫pic.twitter.com/rfjavOsWMp — Deepika Narayan Bhardwaj (@DeepikaBhardwaj) April 17, 2024 -
బికినీ ధరించిన మొదటి హీరోయిన్ ఎవరు..? ఆమె ఎలా మరణించారో తెలిస్తే..
బాలీవుడ్ హీరోయిన్ నళిని జయవంత్ 20వ శతాబ్దం మధ్యకాలంలో హిందీ చిత్రాలలో ఒక ఊపు ఊపేసింది. ముంబైలో పుట్టిన నళిని తనకు 15 ఏళ్ల వయసులోనే అంటే 1941లో హీరోయిన్గా బాలీవుడ్లో అడుగుపెట్టింది. ఆ రోజుల్లో ఆమె నటించిన చిత్రాలలో లెక్కలేనన్ని భారీ హిట్లు కొట్టాయి. పరిశ్రమకు ఆమె చేసిన కృషి చాలా ఎక్కువగానే ఉన్నప్పటికీ , ఆమె తన తరువాతి సంవత్సరాలలో ఒంటరిగా జీవించి.. 84 సంవత్సరాల వయస్సులో 2010లో మరణించింది. ఆమె మరణం చాలా విషాధంతో కూడుకొని ఉంది. అత్యంత అందమైన హీరోయిన్గా గుర్తింపు 1950వ దశకంలో, ఫిల్మ్‌ఫేర్ నిర్వహించిన ఒక పోల్‌లో అత్యంత అందమైన మహిళగా ఆమె ఎంపికైంది. దిలీప్ కుమార్ వంటి స్టార్ హీరో కూడా తనతో పాటుగా కలిసి పనిచేసిన వారిలో గొప్ప నటి నళిని జయవంత్ అని ప్రశంసించారు. బాలీవుడ్ నివేదికల ప్రకారం, బికినీ ధరించిన మొదటి నటి నళిని జయవంత్ అని ఉంది. ఆమె ఇండియన్ ఒకప్పటి స్టార్ హీరోయిన్, దర్శకురాలు అయిన శోభనా సమర్థ్‌కు మొదటి కోడలు. 1950లో విడుదలైన సంగ్రామ్ చిత్రంలో నళిని జయవంత్ స్విమ్ సూట్ ధరించారు. అప్పట్లో ఆమె బికినీ ఫోటోలు ప్రేక్షకులను షాక్ గురిచేశాయి. ఈ చిత్రంలో అశోక్ కుమార్ సరసన నళిని జతకట్టింది. ఫిల్మ్‌ఫేర్ నివేదికల ప్రకారం ఆవారా (1951)లో నర్గీస్ స్విమ్ సూట్ ధరించింది. ఆ తర్వాత శోభనా సమర్థ్ కుమార్తె అయిన 'నూతన్' కూడా 'డిల్లీ కా థగ్' (1958) చిత్రంలో స్విమ్సూట్ను ధరించి మెప్పించారు. ఆ ఒక్క సినిమాతో నూతన్‌కు కూడ భారీ అవకాశాలు వచ్చాయి. అలా నూతన్, నళిని జయవంత్ ఒకే కుటుంబం నుంచి ఇద్దరూ బాలీవుడ్‌నే ఏలేశారు. నూతన్ సోదరి అయిన తనూజ కూతురే బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజోల్. నళినీ మరణించిన మూడు రోజులకు.. నళినీ జయవంత్ డిసెంబర్ 22, 2010న 84 ఏళ్ల వయసులో ముంబైలోని చెంబూర్ వద్ద ఉన్న యూనియన్ పార్క్‌లోని తన బంగ్లాలో 60 ఏళ్లుగా జీవించి కన్నుమూశారు. ఆమె మరణించిన మూడు రోజుల తర్వాత ఆమె మరణించినట్లు గుర్తించారు. ఆమె మృతదేహాన్ని తీసుకెళ్లడానికి అంబులెన్స్ వచ్చే వరకు కూడా నళినీ చనిపోయినట్లు ఎవరూ గమనించబడలేదు. దుర్వాసన రావడంతో గమనించిన ఒకరు సమాచారం ఇవ్వడంతో ఆమె మరణ వార్త బయటి ప్రపంచానికి తెలిసింది. 2001లో తన భర్త ప్రభు దయాళ్ మరణించిన తర్వాత నళినీ పూర్తిగా తనను తాను ఒంటరిగా ఉండేలా బంధించుకుంది. అలా తొమ్మిదేళ్ల పాటు జీవించి దారుణమైన స్థితిలో కన్నుమూసింది. ఆమెకు పిల్లలు లేరు. వృద్ధాప్యంలో బంధువులు కూడా ఆమె వద్దకు ఎవరూ రాకపోవడంతో ఒక అనాథలా తన జీవితాన్ని ముగించింది. 1941 నుంచి 1983 వరకు సుమారు 80కి పైగా చిత్రాల్లో నటించిన నళినీకి 2005లో దాదాహెబ్ ఫాల్కే అకాడమీ జీవితకాల సాఫల్య పురస్కారం దక్కింది. -
బికినీలో టాలీవుడ్ స్టార్.. వీడియో వైరల్!
టాలీవుడ్లో మంచులక్ష్మి పరిచయం అక్కర్లేని పేరు. ప్రముఖ నటులు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా తర్వాత తన సొంత టాలెంట్‌తో గుర్తింపు తెచ్చుకుంది. గతేడాది మోహన్‌లాల్ నటించిన మాన్స్టర్ మూవీతో ప్రేక్షకులను అలరించిన మంచు లక్ష్మి ప్రసన్న.. ప్రస్తుతం అగ్నినక్షత్రం అనే సినిమాలో నటిస్తోంది. సినిమాలతో బిజీగా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్గానే ఉంటోంది. ప్రస్తుతం విదేశాల్లో వేకేషన్లో ఉన్న మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో బికినీలో కనిపిస్తూ గడ్డకట్టే చల్లని నీటిలో మునుగుతూ కనిపించింది. ఆ వీడియోలో సన్నింగ్ లుక్‌లో అభిమానులకు ఒక్కసారిగా షాకిచ్చింది టాలీవుడ్ భామ. ఇదంతా క్రియో థెరపీ కోసమేనంటూ క్యాప్షన్ కూడా ఇచ్చింది. ప్రస్తుతం మంచులక్ష్మి ఫిన్లాండ్ వెకేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వీడియో చూసిన అభిమానులు సైతం క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. Frozen thrill, no chill! ❄️ #CryoTherapy pic.twitter.com/MN4ccHl1yS — Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) December 17, 2023 I am thrilled to reveal Telusa Telusa from the movie #Agninakshatram by @LakshmiManchu So turn up the volume and listen now:https://t.co/pptzkiUdJB And that's not all! "Vaanam Thuram Illaiye" is also out now in Tamil too.https://t.co/KWEwHZAOvq ♥️ pic.twitter.com/iE4CZQRGV0 — Samantha (@Samanthaprabhu2) March 9, 2023 -
బికినీతో ఎయిర్‌పోర్టుకు మోడల్.. ఖంగుతిన్న సిబ్బంది..
బికినీ డ్రెస్‌లో ఎయిర్‌పోర్టుకు వచ్చింది బ్రిజెల్కు చెందిన ఓ మోడల్. మోడల్ విపరీత స్వభావానికి ఖంగుతిన్న సిబ్బంది ఆమెను అడ్డుకున్నారు. సరైన దుస్తులు ధరిస్తేనే విమానంలోకి ఎంట్రీ ఉంటుందని స్పష్టం చేశారు. సెక్యూరిటీ పట్టువీడకపోవడంతో ఆ మోడల్ ఎట్టకేలకు వెనుదిరిగారు. తనకు ఎదురైన కష్టాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది. కేన్ చాన్(21) ఓ ప్రముఖ మోడల్. బ్రెజిల్లో మంచి ఫాలోయింగ్ ఉన్న కేన్ చాన్‌ను ఇన్‌స్టాలో 6 లక్షల మందికి పైగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఈవెంట్లతో బిజీగా ఉండే ఆవిడ.. బ్రెజిల్‌లోని నవేగాంటెస్ ఎయిర్‌పోర్టుకు బికినీలో వెళ్లింది. కేవలం నల్లని బికినీ, విగ్, నల్లని షాండిల్స్ను ధరించింది. ఇది అచ్చం అనిమే వెబ్ సిరీస్ సైబర్ ఫంక్లోని రెబక్కా వేషధారణలాగే ఉంది. మోడల్ వేషధారణ చూసిన ఎయిర్‌పోర్టు సిబ్బంది ఆమెను అడ్డగించారు. ఇలాంటి దుస్తులు ధరిస్తే అనుమతించబోమని అన్నారు. శరీరాన్ని కప్పుకునే దుస్తులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. అయితే.. ఈవెంట్‌కు ఆలస్యం అవుతున్న కారణంగానే తాను అలాంటి దుస్తులు ధరించాల్సి వచ్చిందని కేన్ చాన్ తెలిపారు. సమయం వృథా చేయలేక ఈవెంట్‌కు సంబంధించిన దుస్తులు వేసుకున్నానని చెప్పారు. View this post on Instagram A post shared by Kine-chan/Digital Influencer (@kinechan2.0) కేన్ చాన్ పోస్టుపై నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. కొందరు మోడల్‌కు మద్దతు తెలపగా.. మరికొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాజంలో కనీస విలువల్ని కాపాడాలని, దుస్తులు సరిగా ధరించాలని మోడల్‌కు విన్నవించారు. కొన్నిసార్లు ఈవెంట్ల మధ్య చాలా తక్కువ సమయం ఉంటుందని, ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతుందని మరికొందరు ఆమెకు మద్దతు పలికారు. కొందరైతే లవ్ యూ మేడమ్.. కానీ ఇలాంటి డ్రెస్సులు వద్దని సూచించారు. ఇదీ చదవండి: సమాధి నుంచి అరుపులు, వింత శబ్ధాలు.. తవ్వి చూసి గుడ్లు తేలేశారు! -
Ananya Panday : బీచ్‌లో పింక్ బికినీలో లైగర్ హీరోయిన్ (ఫొటోలు)
-
బికినీలో రకుల్ ప్రీత్ బోల్డ్ ట్రీట్.. వీడియో అదిరిపోయిందిగా!
-
మైనస్ 15 డిగ్రీల చలి.. బికినీలో స్టార్ హీరోయిన్ హాట్ ట్రీట్.!
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ గుర్తింపు దక్కించుకున్న బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ప్రస్తుతం ఈ భామ బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది. బాలీవుడ్లో ఛత్రివాలి, డాక్టర్ జి, థ్యాంక్ గాడ్ చిత్రాల్లో విభిన్న పాత్రల్లో రకుల్ నటించింది. టాలీవుడ్లో దూరమయ్యాక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది. అయితే ఇటీవల తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నెట్టింట్లో హల్చల్ చేస్తోంది. అయితే తాజాగా ఆమె చేసిన సాహసానికి నెటిజన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. (ఇది చదవండి: మాళవిక బోల్డ్ కామెంట్స్.. సిగ్గుపడి మెలికలు తిరిగిపోయిన డైరెక్టర్!) రకుల్ ప్రీత్ మరీ బోల్ట్ డ్రెస్సులతో కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. బికినీ ధరించి మైనస్ 15 డిగ్రీల వాటర్‌లో ఉంటూ అందరినీ ఆశ్చర్యానికీ గురి చేసింది. బికినీ డ్రెస్‌లో.. అది మైనస్ డిగ్రీల చన్నీళ్లలో మునగడం సాహసమేనని మెచ్చుకుంటున్నారు. అయితే ఇదంతా ఆమె ఇటీవలే క్రియో థెరపీ చేయించుకుంది. అందులో భాగంగానే ఇలా గడ్డకట్టే నీటిలో స్నానం చేసిందంటున్నారు. ఏది ఏమైనా ఇలా అందాలు ఆరబోస్తూ రకుల్ ప్రీత్ సింగ్ ఏమాత్రం తగ్గడం లేదు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. (ఇది చదవండి: అసలు కీర్తీ సురేశ్‌కు ఏమైంది.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్!) -
బికినీలో సీనియర్ నటి రాధ.. ఎలా ఉందో చూశారా?
వెండితెరపై ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ రాధ తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. 1980లో సీనియర్ స్టార్ హీరోలతో నటనతో మెప్పించింది. తెలుగు ఇండస్ట్రీలో రాధ పేరుతోనే ఫేమ్ సాధించింది. కానీ ఆమె అసలు పేరు ఉదయచంద్రిక. దక్షిణాదిలో దాదాపు 250కు పైగా సినిమాల్లో నటించింది. ముంబయికి చెందిన ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పింది. ఆమె కూతురు కార్తీక తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. అయితే ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా ఆమె నటించిన ఓ సినిమాలోని ఫోటోను ఇన్‌స్టాలో పంచుకుంది. అప్పట్లో కమల్‌హాసన్ సినిమాలో నటించిన ఫోటోను అభిమానులతో పంచుకున్నారామె. అది కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. రాధ తన ఇన్‌స్టాలో రాస్తూ.. 'టిక్ టిక్ టిక్ సినిమా షూటింగ్ రోజుల్లో నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో ఇదీ ఒకటి. అప్పటికి అది నా కెరీర్లో ఒక భాగం. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే అలా కనిపించడానికి మేము చేసిన పోరాటాన్ని మెచ్చుకుంటున్నా. సరైన లుక్‌తో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు. యాటిట్యూడ్‌తో పని చేయగలిగినందుకు ఆమెకు హ్యాట్సాఫ్. కొన్ని జ్ఞాపకాలు ఇప్పుడు గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్‌గా ఉంటుంది. ఆలాంటి కొన్ని చెప్పలేని ఆలోచనలను ఇక్కడ పంచుకుంటున్నా. ఈ అందమైన దుస్తులను తయారు చేసిన డిజైనర్ వాణీ గణపతికి మా కృతజ్ఞతలు.' అంటూ పోస్ట్ చేశారు. ఆ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో ఉండగా.. రాధ, స్వప్న, మాధవి ఆయన వెనక నిలబడి ఉన్నారు. కమల్ హాసన్ హీరోగా 1981లో తెరకెక్కిన టిక్ టిక్ టిక్ చిత్రంలో రాధ నటించింది. View this post on Instagram A post shared by Radha (@radhanair_r) -
బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్.. అందుకేనా భారీ రెమ్యునరేషన్!
ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్స్ ఏ సన్నివేశంలో నటించటానికైనా రెడీగా ఉండాలి. ఇక కమర్షియల్ సినిమాలకు హీరోయిన్ గ్లామర్ బాగా ప్లస్ అవుతుంది. ఈ నాటి స్టార్ హీరోయిన్స్ అందరూ కెరీర్ స్టార్టింగ్ లో అందాలు ఒలకబోసివారే. రొమాంటిక్ సన్నివేశాలతో పాటు.....ఇంటిమేట్ సీన్స్ లో వారి టాలెంట్ చూపించారు. గ్లామర్ షో చేయటానికి ఇష్టపడే హీరోయిన్స్ కూడా బికినీ డ్రెస్ లో నటించటానికి నో చెబుతారు. కొంతమంది హీరోయిన్స్ మాత్రమే బికినీ ధరించి ప్రేక్షకులకి ట్రీట్ ఇస్తారు. వారిలో సౌతిండియా లేడీ సూపర్ స్టార్ నయనతార ఒకరు. అయితే గత కొంతకాలంగా నయనతార రోమాంటిక్ సన్నివేశాలకు...బోల్డ్ అటెంప్ట్ లకు దూరంగా ఉంటుందనే చెప్పాలి. అయితే నయనతార కెరీర్ స్టార్టింగ్ లో యూత్ ను తన గ్లామర్ తోనే ఆకట్టుకుంది. ఎక్కువ కమర్షియల్ మూవీస్ లో నటించిన నయనతార తన అందాలతో కనువిందు చేయటానికి ఏ మాత్రం వెనకడుగు వేసేది కాదు. అజిత్ బిల్లా సినిమాలో నయనతార బికినీ ధరించి కనిపించింది. అలాగే శింబు వల్లభ సినిమాలో లిప్ లాక్ సీన్స్ తో నటించటమే కాదు..ఇంటిమేట్ సన్నివేశాల్లో కూడా నటించింది. అలా నయనతార తనని తాను స్టార్ హీరోయిన్ గా ఎస్టాబ్లిస్ చేసుకుంది. ఆ తర్వాత వుమెన్ సెంట్రిక్ సినిమాలవైపు టర్న్ తీసుకుని తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. ఇన్నాళ్లు సౌత్ మూవీస్ చేసిన నయన్.. షారుఖ ఖాన్ జవాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగుపెడుతోంది. కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తెరకెక్కిస్తున్న జవాన్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. నయనతార గతంలో ఎప్పుడూ లేని విధంగా జవాన్ సినిమాలు కనిపించబోతున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఆమె గ్లామర్ షో కూడా నెవర్ బిఫోర్ అనేలా ఉండబోతుందట. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ లోనే ఆమె స్టన్ అయ్యేలా కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. షారూఖ్ ప్రతి సినిమాలో ఇంటిమేట్ సీన్స్ తప్పకుండా కనిపిస్తాయి. రీసెంట్ గా పఠాన్ సినిమాలో హీరోయిన్ దీపికా పదుకునేతో చాలా ఘాటు సీన్స్ ఉన్నాయి. అలాగే బేషరమ్ సాంగ్ లో దీపికా బికినీ వేసుకుని నటించింది. అలాగే జవాన్ లో కూడా హీరోయిన్ క్యారెక్టర్ లో ఆ రేంజ్ గ్లామర్ షో ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. దీంతో నయన్ బికినీ సీన్ చేయబోతుందనే టాక్ బీటౌన్ లోనే కాదు చెన్నైలో కూడా వినిపిస్తోంది. బికినీ సీన్లు ఉన్నాయి కాబట్టే.. రెమ్యునరేషన్ కూడా భారీగా తీసుకుందట నయన్. ప్రతి సినిమాకు రూ.6 నుంచి 7 కోట్ల వరకు తీసుకునే నయన్.. జవాన్ కోసం ఏకంగా రూ. 10 కోట్లు డిమాండ్ చేసిందట. ఇందులో నిజమెంత ఉందనేది తెలియదు. ఒకవేళ నయన్ జవాన్ లో బికినీ కనిపిస్తే ..సిల్వర్ స్క్రీన్ షేక్ అయిపోవటం మాత్రం గ్యారెంటీ. జవాన్ మూవీని అక్టోబర్ లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. -
బికినీలకు బదులుగా షార్ట్‌లు.. ఆటగాళ్లకు భారీ జరిమానా
బ్రసెల్స్: బల్గేరియాలో జరిగిన యురోపియన్ మహిళల బీచ్ హ్యాండ్‌బాల్ ఛాంపియన్షిప్ పోటీల్లో నార్వే జట్టుకు యురోపియన్ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ (ఈహెచ్ఎఫ్) భారీ జరిమానా విధించింది. టోర్నీలో భాగంగా స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో నార్వే జట్టు సభ్యులు బికినీలకు బదులు షార్ట్‌లు వేసుకుని బరిలోకి దిగినందుకు 1500 యూరోలు ఫైన్ వేసినట్లు ఈహెచ్ఎఫ్ ప్రకటించింది. రూల్స్‌కు వ్యతిరేకంగా అనుమతి లేని దుస్తులు ధరించి మ్యాచ్ ఆడినందుకు డిసిప్లినరి యాక్షన్ కింద జరిమానా విధించినట్లు వెల్లడించింది. అయితే ఈహెచ్ఎఫ్ నిర్ణయంపై నార్వే జట్టు అధికారులు విస్మయం వ్యక్తం చేశారు. డ్రెస్ కోడ్ విషయంలో 2006 నుంచి పోరాటం చేస్తున్నామని, సౌకర్యవంతమైన దుస్తులు ధరించడం ఆటగాళ్ల హక్కు అని, ఈ విషయంలో ఈహెచ్ఎఫ్ అనవసర రాద్దాంతం చేస్తుందని వారు పేర్కొన్నారు. ఈ విషయంలో తాము ప్లేయర్స్‌కు మద్దతుగా నిలుస్తామని, అలాగే వారికి విధించిన జరిమానాను తామే చెల్లిస్తామని తెలిపారు. కాగా, అంతర్జాతీయ హ్యాండ్‌బాల్ ఫెడరేషన్ రూల్స్ ప్రకారం మహిళా అథెట్లు తప్పనిసరిగా బికినీలు ధరించే బరిలోకి దిగాలి. View this post on Instagram A post shared by Norges Håndballforbund (@norgeshandballforbund) -
నా ప్రియుడు మరీ ఇంత నీచంగా ఆలోచిస్తాడా?
సంబంధ బాంధవ్యాలు చాలా గమ్మత్తైనవి. ముఖ్యంగా రిలేషన్లో ఉన్నప్పుడు ఎవర్ని ఎవరు ఇష్టపడుతున్నారో, ద్వేషిస్తున్నారో అర్ధం చేసుకోవడం చాలా కష్టం అని అంటోంది ఓ యువతి. ప్రేమ స్వర్గపుటంచుల్లో విహరిస్తున్న ఆ యువతికి తన ప్రియుడి నుంచి ఎదురవుతున్న ఇబ్బందుల్ని నెటిజన్లతో పంచుకున్నారు. ప్రస్తుతం ఆ యువతి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ యువకుడితో రిలేషన్లో ఉన్న సదరు యువతి తన ప్రియుడు లేని సమయంలో బికిని ధరించాలని భావిస్తున్నారు. కానీ అందుకు ఆమె ప్రియుడు ఒప్పు కోవడం లేదు. ఎందుకంటే అతను ఇతర మగాళ్లను అస్సలు నమ్మడు. ఎందుకంటే బికిని ధరించిన అమ్మాయిల్ని తదేకంగా చూస్తానని, తను బికినీ ధరిస్తే కూడా ఇతర మగాళ్లు అలాగే చూస్తారని అనటం తనను ఎంతగానో బాధించిందని పేర్కొన్నారు. ఈ విషయంపై అతనితో వాధించానని, తను బికిని ధరించడం ఇష్టం లేకపోతే చెప్పాలని తెలిపానన్నారు. కానీ బికిని ధరించిన అమ్మాయిల్ని అలా ట్రీట్ చేయడం మానుకోవాలని హితవు పలికినట్లు చెప్పుకొచ్చారు. బికిని ధరించిన వాళ్లను ఎందుకు అలా ట్రీట్ చేస్తున్నావని ప్రశ్నించానని తెలిపారు. తనను బికినిలో చూడకూడదని అతను అనుకోవటం మంచిదే. కానీ ఇతర అమ్మాయిల గురించి అసభ్యంగా అనుకోవద్దని చెబితే తన మాటల్ని కొట్టిపారేస్తున్నాడని ఆమె తన అనుభవాల్ని నెటిజన్లతో షేర్ చేసుకున్నారు. ‘నా ప్రియుడి ఆలోచనను నేను చాలా అగౌరవంగా భావిస్తున్నాను. నా శరీరాన్ని అందంగా తీర్చిదిద్దుకోవడానికి చాలా కష్టపడుతున్నాను. ఇతరుల అటెన్షన్‌ను పొందడానకి బికిని ధరించడం లేదన్నా అతను నమ్మటంలేదు. పరాయి పురుషుల్ని నమ్మడు. అతను ఇతరుల పట్ల ఆలోచిస్తున్న తీరు చూస్తుంటే నాకు విసుగొస్తుంది. ప్రేమ అనే ముసుగు ధరించిన అతను నాకు రక్షణగా నిలుస్తున్నాడా?. లేదంటే నన్ను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడా?’ అని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ఆమె ప్రియుడి ఆలోచనపై పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ‘అతను మిమ్మల్ని నమ్మడం లేదు. మిమ్మల్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాడు. అతనికి గుడ్‌బై చెప్పడం మంచిది’ అని ఓ నెటిజన్ సలహా ఇచ్చాడు. ‘మీరు బికినీ ధరించడాన్ని నియంత్రిస్తున్నాడంటే, వివాహం తర్వాత మీ స్వేచ్ఛను ఎలా హరిస్తాడో ఊహించుకోండి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. ‘అతను మిమ్మల్ని నమ్ముతున్నాడా? లేదా అనేది ముఖ్యం కాదు. మీరు ఎలాంటి దుస్తుల్ని ధరించినా, మిమ్మల్ని చూడనివ్వకుండా ఆపలేడు. మిమ్మల్ని అతను ఎలా ట్రీట్ చేస్తున్నారనేది మీరే డిసైడ్ చేసుకోవాలి’ అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. చదవండి: వైరల్: అమ్మాయి టీ-షర్ట్‌పై ఆర్జీవీ కొంటె కామెంట్.. -
బాత్ టబ్ వద్ద బికినీలో నటి వర్కవుట్లు
హిందీ పరిశ్రమలో మందిరా బేడి నటిగా గుర్తింపు పొందారు. దాంతోపాటు ఆమె ఫిట్నెస్ నిపుణురాలిగా రాణిస్తున్నారు. తాజాగా ఆమె వర్కవుట్ చేస్తున్న వీడియో సెగలు రేపుతోంది. సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఆమె వీడియో ట్రెండవుతోంది. బికినీ వేసుకుని.. బాత్ టబ్ వద్ద ఎక్సర్సైజ్లు చేస్తూ అందరినీ కవ్విస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను మందిరా బేడీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. బాత్ టబ్ వద్ద బికినీలో వర్కవుట్‌లో చేస్తూ కనిపించింది. బాత్ టబ్ సహాయంతో కూడా కొన్ని వర్కవుట్ చేసింది. ఆమె బాలీవుడ్లో ఫిట్నెస్ గురుగా గుర్తింపు పొందారు. లంగ్ కిక్స్, గ్లబ్ బ్రిడ్జెస్, ట్రెసప్ డిప్స్ వంటి వర్కవుట్లు మందిరా బేడీ చేశారు. ఆమె గతేడాది తన 365 రోజుల వ్యాయాయం ఛాలెంజ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. రోజు వ్యాయామం / వ్యాయామం.. నా కార్యాచరణ అంతే అని ఆమె పేర్కొంటుంటారు. దిల్వాలే దుల్హానియా లే జయేంగే చిత్రంలో ప్రీతి సింగ్ పాత్రలో మందిరా బేడీ నటించారు. 48 ఏళ్ల మందిరా బేడి వర్కవుట్లు చూస్తుంటే కుర్రకారు షాక్‌కు గురవుతున్నారు. View this post on Instagram A post shared by Mandira Bedi (@mandirabedi) -
బికినీ మోడల్ ఫోటోకి ‘లైక్’.. చిక్కుల్లో పోప్
వాటికన్ సిటి: మతాధికారులు, గురువులు, ప్రీస్ట్‌లకు కొన్ని పరిమితులు ఉంటాయి. సామాన్యుల మాదిరిగా ప్రవర్తించకూడదు. బంధాలు, బాహ్య సుఖాలకు దూరంగా ఉండాలి. వాంఛలు లేకుండా బతకాలి. అలా కాదని హద్దు దాటితే ఇదిగో ఇలానే విమర్శలు మూటగట్టుకోవాల్సి వస్తుంది. తాజాగా ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు పోప్ ఫ్రాన్సిస్. ‘మీకిది తగునా.. దీనికి మీ సమాధానం ఏంటి’ అని ప్రశ్నిస్తున్నారు నెటిజనులు. ఇంత ఆగ్రహం దేనికి అంటే పోప్ ఇన్స్టాగ్రామ్ అధికారక అకౌంట్ నుంచి.. బికినీ ధరించిన ఓ బ్రేజిలియన్ మోడల్ ఫోటోని లైక్ చేశారు. దాంతో ఈ విమర్శలు. వివరాలు.. మోడల్ నటాలియో గారిబోట్టో గత నెల ఐదో తారీఖున బికినీ ధరించి ఓ స్కూల్ లాకర్ వద్ద నిలబడి దిగిన ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ‘నేను మీకు ఒకటి, రెండు విషయాలు నేర్పించగలను’ అనే క్యాప్షన్‌తో పోస్ట్ చేసిన ఈ ఫోటోకి 1.5 మిలియన్లకి పైగా లైక్స్ వచ్చాయి. ఈ ఫోటోని పోప్ ఫ్రాన్సిన్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి ఈ నెల 13న ‘లైక్’ చేసినట్లు ఉంది. ఇందుకు సంబంధించిన స్క్రీన్ షాట్ సోషల్ మీడియాలో తెగ వైరలయ్యింది. అనుహ్యంగా మరుసటి రోజే ‘డిస్లైక్’ అని కనిపించింది. దాంతో కాస్త గందరగోళం తలెత్తింది. ఈ లోపు నటాలియా మానేజ్మెంట్ కంపెనీ సీఓవై.కో ఈ విషయాన్ని తన పబ్లిసిటీకి వాడుకోవాలని భావించింది. పోప్ ఫ్రాన్సిస్ లైక్ చేసిన స్క్రీన్ షాట్‌ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో షేర్ చేసింది. ‘సీఓవై.కోకి పోప్ నుంచి ఆశీర్వాదాలు లభించాయి. మా ఐకానికిక్ క్వీన్ నటాలియాకు ధన్యవాదాలు’ అంటూ స్క్రీన్ షాట్‌ని షేర్ చేసింది. దాంతో సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయ్యింది. అది కాస్తా ముదరడంతో హోలీ సీ ఈ వార్తల్ని ఖండించింది. సిబ్బంది ఎవరో మోడల్ ఫోటోని లైక్ చేసి ఉండవచ్చు. దీని గురించి విచారణ చేస్తున్నాం అని తెలిపారు. వాటికన్ ప్రతినిధి గార్డియన్‌తో మాట్లాడుతూ, "హోలీ సీ నుంచి" లైక్ "వచ్చిందని భావిస్తున్నాం. వివరణ ఇవ్వాల్సిందిగా ఇన్‌స్టాగ్రామ్‌ని కోరాం" అని తెలిపారు. (నన్ను కొరకనంటేనే ముద్దిస్తాను: పోప్) పోప్ ఫ్రాన్సిస్ సోషల్ మీడియాలో అధిక ఫాలోయింగ్ కలిగి ఉన్నారు. అతని ఇన్స్టాగ్రామ్ ఖాతా ఫ్రాన్సిస్కస్కు 7.4 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. దీనిలో 971 పోస్టులు ఉన్నాయి. వేరే అకౌంట్లని ఫాలో అవ్వరు. -
తెలుగింటి అమ్మాయి
‘పక్కింటి అమ్మాయిలా ఉండటం’ అనేది తెలుగు సినిమా హీరోయిన్లు మామూలుగా సంపాదించుకునే ఓ కాంప్లిమెంట్. అలాగే ‘గ్లామరస్‌గా కనిపించడం’ ఇంకో రకమైన కాంప్లిమెంట్. అయితే ఈ రెండు రకాల కాంప్లిమెంట్స్ అందుకునేవాళ్లు తెలుగమ్మాయిలు అయి ఉండరు. ఎప్పుడో గానీ తెలుగు సినిమాల్లో తెలుగు హీరోయిన్లు కనిపించరు. తాజాగా ఈమధ్యే విడుదలై సూపర్‌హిట్ కొట్టిన ‘గూఢచారి’లో హీరోయిన్గా నటించిన శోభిత ధూళిపాళ మాత్రం పక్కా తెలుగమ్మాయి. లేటెస్ట్ సెన్సేషన్ శోభిత గురించి కొన్ని విశేషాలు... పక్కా తెలుగమ్మాయి... శోభిత ధూళిపాళ తెనాలిలో పుట్టింది. ఆ తర్వాత చదువంతా విశాఖపట్నంలో సాగింది. చిన్నప్పట్నుంచీ సినిమాలంటే పిచ్చి. ఎలాగైనా సినిమాల్లోకి వెళ్లాలని కలలు కంటూ ఉండేది. సరిగ్గా అప్పుడే ముంబైలో పై చదువులు చదివే అవకాశం రావడంతో, చదువుకుంటూనే మోడలింగ్‌లోకి వచ్చింది. 2013లో ‘మిస్ ఇండియా ఎర్త్’ టైటిల్ కూడా సంపాదించింది. ఆ టైటిల్ ఇచ్చిన ఉత్సాహంతో 2014లో కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో బికినీతో కనిపించి మోడలింగ్‌లో సెన్సేషనల్ స్టార్ అయింది. బాలీవుడ్లో బోల్డ్ ఎంట్రీ! కింగ్‌ఫిషర్ క్యాలెండర్లో కనిపించాక శోభిత చాలా మేగజైన్స్‌లో వరుసగా కవర్‌పేజీలపై దర్శనమిచ్చింది. ఆ సమయంలోనే ఇండియాలో పాపులర్ డైరెక్టర్స్‌లో ఒకరైన అనురాగ్ కశ్యప్ తన ‘రమణ్ రాఘవ్ 2.0’ సినిమాలో శోభితికు హీరోయిన్ అవకాశం ఇచ్చాడు. ఆ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. శోభితకూ సూపర్ పాపులారిటీ వచ్చింది. ఈ సినిమాలోనే ఆమె న్యూడ్‌గా కనిపించి ఆశ్చర్యపరిచింది. తెలుగు సినిమాతో ఫుల్ సర్కిల్... బాలీవుడ్లో ‘రమణ్ రాఘవ్ 2.0’ తర్వాత శోభితకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయి. అనురాగ్ కశ్యప్ ప్రొడక్షన్లోనే మూడు సినిమాలు ఒప్పుకుంది. మాతృభాష తెలుగులో మాత్రం సినిమా చేయాలన్న ఆశ శోభితకు మొదట్నుంచీ ఉంది. గత నెలలో విడుదలై సూపర్‌హిట్ అయిన ‘గూఢచారి’తో ఆ కల నెరవేర్చుకుంది. ఈ సినిమాలో సమీరా రావ్ పాత్రలో ఆమె అద్భుతంగా నటించి కుర్రకారుకు లేటెస్ట్ క్రష్‌గా మారిపోయింది. ‘తెలుగులో నటించడంతో నా కల ఇప్పుడు ఫుల్ సర్కిల్‌కు వచ్చిందని అనుకుంటున్నా’ అంది ‘గూఢచారి’ సక్సెస్ ఇచ్చిన ఆనందాన్ని పంచుకుంటూ. మలయాళం ఎంట్రీ! ఫ్యాషన్ ఇండస్ట్రీ, బాలీవుడ్, టాలీవుడ్‌లలో ఇప్పటికే కుర్రకారు హృదయాలను దోచుకున్న శోభిత ఇప్పుడు చిన్న సినిమాలకు పెద్ద స్టార్. ఈ ఏడాది చివర్లో మలయాళ సినీ పరిశ్రమకూ పరిచయమవుతోంది. ‘మూథన్’ పేరుతో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నివిన్ పాలీ హీరో. పాత్ర కోసం ఎంత దూరమైనా! కింగ్ఫిషర్లో బికినీతో కనిపించిన శోభిత, ‘రమణ్ రాఘవ్ 2.0’లో ఏకంగా న్యూడ్‌గా కనిపించింది. పాత్ర కోసం ఇలాంటి సాహసాలు చెయ్యడానికి వెనుకాడనని చెప్తోన్న శోభిత, అన్ని రకాల పాత్రలు చేసి మెప్పించడం ఇష్టమని అంటోంది. -
బికినీ అనగానే భయపడ్డా..
ఈత కొలనులో చీర కట్టుకుని ఈదలేం. గుడికి స్విమ్ సూట్ వేసుకుని వెళ్లలేం కదా. సందర్భానికి తగ్గట్టుగా డ్రెస్ చేసుకోవాలి. స్టోరీ డిమాండ్ చేసింది కాబట్టి స్విమ్ సూట్ వేసుకున్నాం. ఏదైనా సినిమాలో బికినీ ధరించిన హీరోయిన్ని ‘స్విమ్ సూట్ ఇబ్బందిగా అనిపించలేదా?’ అని అడిగితే.. ఈ విధంగా సమాధానం చెబుతారు. ఇప్పుడు రెజీనా కూడా అలానే అంటున్నారు. బికినీ సీన్ గురించి దర్శకుడు తిరు చెప్పగానే ఆమె తటపటాయించారట. గౌతమ్ కార్తీక్‌తో కలిసి యాక్ట్ చేసిన తమిళ చిత్రం ‘చంద్రమౌళి’ కోసం రెజీనా బికినీ ధరించారు. సినిమా కోసం ఈ బ్యూటీ బికినీ ధరించడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ ఎక్స్పీరియన్స్ గురించి రెజీనా మాట్లాడుతూ – ‘‘బికినీ అనగానే భయపడ్డా. నేను బికినీ వేసుకోనని డైరెక్టర్ తిరుకు చెప్పాను. కానీ తిరు మాత్రం ‘నువ్వు బికినీ ధరిస్తేనే నేనీ సాంగ్ షూట్ చేస్తాను’ అని పట్టుబట్టి ఒప్పించారు. స్క్రిప్ట్‌లో కూడా బీచ్ సాంగ్ ఉంది. హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అవ్వడం కోసం ఆ సాంగ్ షూట్ చేశారు డైరెక్టర్. అలాగే బికినీ వేసుకోవాలంటే కరెక్ట్ ఫిజిక్ ఉండాలి. దానికోసం నేను కొంచెం వెయిట్ కూడా తగ్గాల్సివచ్చింది. ముందు చెప్పినట్టుగానే ఎక్కడా వల్గారిటీ లేకుండా దర్శకుడు షూట్ చేశారు. ఆడియన్స్ ఇబ్బందిపడేలా ఉండదు’’ అని పేర్కొన్నారు రెజీనా. ఈ సాంగ్ బయటకు వచ్చినప్పటినుంచి ‘చంద్రమౌళి’ సినిమా కంటే ఆ సాంగ్‌లో రెజీనా గురించే ఎక్కువగా మాట్లాడుకోవటం విశేషం. -
‘బికినీలో మీ రూపాన్ని చూసి గర్వపడండి’
సాక్షి, సినిమా : నటి పూజాహెగ్డే బికినీ దుస్తుల్లో మిమ్మల్ని మీరు చూసుకుని గర్వపడండి అంటోంది. హీరోయిన్లు శృంగారతారల్ని మించిపోతున్నారనడంలో అతిశయోక్తి ఉండదనుకుంటా. గ్లామర్‌గా నటించారని విమర్శిస్తే ఒకప్పుడు హీరోయిన్లు ఆవేదన పడేవారేమో, కానీ ఇప్పుడు గర్వపడుతున్నారు. అవును గర్వపడాలి అంటోంది నటి పూజాహెగ్డే. ముగముడి చిత్రంతో కోలీవుడ్‌కు దిగుమతి అయిన ఈ ఉత్తరాది బ్యూటీ గుర్తుందా? జీవాతో రొమాన్స్ చేసిన ఈ చిత్రం తరువాత ఇక్కడ పత్తాలేదు. అందుకు కారణం ముగముడి చిత్రంలో దర్శకుడు మిష్కిన్ ఈ అమ్మడిని పక్కింటి అమ్మాయిలా చూపించడమే కావచ్చు. ఇదే పూజాహెగ్డే టాలీవుడ్లో అందాలారబోతలో దుమ్మురేపుతోంది. ఇక అక్కడ అవకాశాల గురించి ప్రత్యేకంగా చెప్పాలా? స్టార్ హీరోలతో నటించే అవకాశాలు వరుస కడుతున్నాయి. ఇటీవల రామ్‌చరణ్, సమంత జంటగా నటించిన రంగస్థలం చిత్రంలో ఐటమ్ సాంగ్‌లో నటించి అలాంటి పాటలకు తాను సై అని హింట్ ఇచ్చిన పూజాహెగ్డే తెలుగు చిత్ర పరిశ్రమలో క్రేజీ నటిగా రాణిస్తోంది. ఆ క్రేజ్‌తో మళ్లీ కోలీవుడ్‌కు వచ్చినా ఆశ్చర్య పడనవసరం లేదు. ముఖ్యంగా ఉత్తరాది భామలు ఎక్కువగా గ్లామర్‌నే నమ్ముకుంటున్నారని చెప్పవచ్చు. నటి పూజాహెగ్డే ఒక చిత్రంలో బికినీ దుస్తులు ధరించిన గ్లామరస్ సన్నివేశాలకు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. కొందరు అభిమానులు ఆక్షేపణ వ్యక్తం చేస్తూ ఆమెకు మెసేజ్ చేస్తున్నారు. మరి కొందరు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నెటిజన్లు కూడా రకరకాల కామెంట్లతో దుమ్మురేపుతున్నారు. ఇదంతా చూసిన నటి పూజాహెగ్డే టెన్షన్ అయ్యిందట. అంతటితో ఆగలేదు స్మిమ్మింగ్ పూల్ పక్కన టూ పీస్ దుస్తులు ధరించి దిగిన ఒక ఫొటోను ఇంటర్నెట్లో విడుదల చేసింది. ఈ సందర్భంగా పూజాహెగ్డే పేర్కొంటూ మహిళలందరూ తమ శరీరాకృతిని చూసి ఆనందపడడానికి అలవాటు పడాలన్నది. ఎందుకంటే కొందరు చిన్నబుద్ధి కలిగిన మగవారు మిమ్మల్ని ఎగతాళి చేసి నమ్మకాన్ని కోల్పోయేలా ప్రవర్తిస్తారని అన్నారు. అందుకే చెబుతున్నా అలాంటి పరిహాసాలను అస్సలు పట్టించుకోకండి అని పేర్కొంది. బికినీ దుస్తుల్లో మీ రూపాన్ని చూసి గర్వపడండి అని పూజాహెగ్డే అంది. ఏంటీ? కూసే గాడిద వచ్చి మేసే గాడిదను చెడగొట్టినట్టుందని అనుకుంటున్నారా మీ ఇష్టం. మీరెలా అయినా అనుకోవచ్చు. -
బీచ్‌లో చీర కట్టుకొని తిరగాలా?
సాక్షి, న్యూఢిల్లీ : బాలీవుడ్ నటి రాధికా ఆప్తే తెలుగువారికీ సుపరిచితురాలే. బాలకృష్ణతో లెజెండ్, లయన్.. వర్మ రక్తచరిత్ర వంటి సినిమాలతోపాటు రజనీకాంత్ హీరోగా నటించిన ‘కబాలి’సినిమాతో ఆమె దక్షిణాదివారికి చేరువైంది. బాలీవుడ్‌లోనూ మంచి నటిగా పేరొందిన రాధికా ఆప్తే ఇటీవల అక్షయ్‌కుమార్ సరసన ‘ప్యాడ్‌మ్యాన్’ సినిమాలో అలరించింది. ఇటీవల ఈ భామ తన స్నేహితుడితో కలిసి బీచ్‌లో సేదదీరుతున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. బికినీ ధరించి గోవా బీచ్‌లో దిగిన ఈ ఫొటో పెట్టగానే.. ఆమెను కించపరుస్తూ పలువురు కామెంట్లు చేశారు. బాడీషేమింగ్ చేస్తూ ఎద్దేవా చేశారు. ఈ విషయమై మీడియా ప్రస్తావించగా.. ‘నన్ను ట్రోల్ (కించపరుస్తూ) చేసేవారి కామెంట్లు పెద్దగా పట్టించుకోను. ఎవరైనా ఆ విషయం చెప్తే తప్ప నాకు వాటి గురించి తెలియదు. అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మూర్ఖత్వం. బీచ్‌లో నేను చీర కట్టుకొని తిరగాలని వారు భావిస్తున్నారా?’ అని ఆమె ప్రశ్నించారు. ట్రోలర్స్‌ను ఎలా ఎదుర్కొంటారని ప్రశ్నించగా.. నాకు వాళ్లు ఎవరో తెలియదు.. వాళ్ల గురించి అసలే పట్టించుకోను అని ఆమె తాపీగా సమాధానం ఇచ్చారు. సోషల్ మీడియాలో హీరోయిన్లను కించపరుస్తూ ట్రోలర్స్ చెలరేగిపోవడం ఇదే తొలిసారి కాదు. గతంలో బాలీవుడ్ నటీమణులు ప్రియాంకచోప్రా, తాప్సీ పన్ను, ఈషా గుప్తా, దీపికా పదుకోన్, పరిణీత చోప్రా తదితరుల ఫొటోలపై కూడా కొందరు కించపరిచేరీతిలో అసభ్య కామెంట్లు పెట్టారు. ఇలా ట్రోల్ చేసేవారికి కొందరు ఘాటు రిప్లే ఇవ్వగా.. మరికొందరు సెలబ్రిటీలు లైట్ తీసుకున్నారు. #holiDay #timeoff #goa #sea #sunset #friends @marc_t_richardson #afteraswim A post shared by Radhika (@radhikaofficial) on Feb 24, 2018 at 5:55am PST -
బికినీలో ఆఫీసుకు రమ్మన్నారు!
లండన్: ‘కానీ ఓ కండీషన్.. మీరు బికినీలో మాత్రమే ఆఫీసుకు రావాలి. ఆ దర్శకుడికి మీరు బాగా నచ్చారు. డబ్బులు కూడా పెద్ద మెత్తంలోనే ఇస్తారు. కాదనకండి. బికినీలో వస్తేనే మీరు లావు కాలేదన్న విషయం డైరెక్టర్‌గారికి అర్థమవుతుందట..’ అంటూ ఫోన్లో ఏజెంట్ చెప్పిన ఒక్క మాటలకు షాకయ్యానని చెప్పింది నటి ఎమ్మీ రస్సుమ్స్. ‘ది డే ఆఫ్టర్ టుమారో’,, ‘యూ ఆర్ నాట్ యూ’, ‘బ్యుటిఫుల్ క్రియేచర్’, లాంటి సూపర్‌హిట్ సినిమాలతోనేగాక ఫేమస్ టీవీషో ‘షేమ్‌లెస్’ ద్వారానూ హాలీవుడ్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఎమ్మీ.. కొన్నేళ్ల కిందట తన జీవితంలో చోటుచేసుకున్న ఘటనను మీడియాకు వివరించింది. బికినీలో ఆఫీసుకు రమ్మనగానే తాను షాకయ్యానన్న ఎమ్మా.. అది మంచి ఆఫర్ కావడంతో ఒక్క నిమిషం ఆలోచించి తన ఏజెంట్‌తో ఇలా చెప్పిందట.. ‘స్క్రిప్ట్ పంపమను. అందులో హీరోయిన్ బికినీ సీన్లుంటే అలాగే చేద్దాం’ అని! చివరికి ఆ సినిమాలో తాను నటించలేదన్న హీరోయిన్.. బికినీ డిమాండ్ చేసిన దర్శకుడు ఎవరనేదిమాత్రం వెల్లడించకపోవడం గమనార్హం. -
పిల్లల్ని పాడు చేయకండి!
ప్రియాంకా చోప్రా పద్ధతి చూస్తుంటే భలే ముచ్చటేస్తోంది. ఎంత ఇంగ్లీష్ సినిమా చేసినా... అక్కడి ప్రేక్షకుల కోసం రెండు పీలికల దుస్తులు (బికినీలు) వేసినా... భారతీయులకు ఓ సందేశం ఇచ్చారు. నా సినిమాకు మీ పిల్లల్ని తీసుకురావద్దని పెద్దలకు భలే పద్ధతిగా చెప్పారామె. ప్రియాంక నటించిన ఫస్ట్ హాలీవుడ్ మూవీ ‘బేవాచ్’ జూన్ 2న విడుదలవుతోంది. అమెరికన్ ‘బేవాచ్’ టీవీ సిరీస్‌ను ఫాలో అయినవాళ్లకు అందులో నటించిన భామలు దాదాపు బికినీల్లో దర్శనిమిచ్చిన విషయం తెలుసు. ఒక్క లైన్లో చెప్పాలంటే, ‘బేవాచ్’ అంటే బికినీ బ్యూటీలకు ఫేమస్. ఆ సిరీస్‌కు కొన్ని మార్పులు చేసి, ‘బేవాచ్’ సినిమా తీశారు. ‘క్వాంటికో’ టీవీ సిరీస్‌లో హాట్ హాట్‌గా కనిపించిన ప్రియాంక, ఈ సినిమాలోనూ అదే స్థాయిలో నటించారు. అందుకేనేమో... ‘ఈ సినిమాకు మీ పిల్లల్ని తీసుకు వెళ్లకండి’ అనే స్టేట్మెంట్ ఇచ్చినట్టున్నారు. ఇందులో ప్రియాంక విలన్‌గా చేశారు. హాట్ విలన్ వేషాలు చూసి, పిల్లలు ఎక్కడ పాడవుతారోనని వాళ్లకు సినిమా చూపించొద్దని భలే పద్ధతిగా చెప్పారు కదా! ప్రస్తుతం ఈ సినిమా ప్రచారం కోసం అమెరికాలో ఉన్న ప్రియాంక విపరీతంగా అందాలను ఒలకబోస్తున్నారు. ఫ్లోరిడాలోని మియామీ బీచ్‌లో బికినీల్లో ప్రియాంక చేసిన సందడి, స్టిల్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్!! -
బికినీతో రుహిసింగ్ రచ్చరచ్చ
సినిమా ల్లో పేరు ప్రతిష్ట లు పొందాలని వచ్చే భామలు నటనాపరంగా ఆకట్టుకోలేకపోయినా అందాలను ప్రదర్శించి మార్కెట్‌ను దక్కించుకుంటారు. ఆ విధంగా క్యాలెండర్ గర్ల్స్ తమ మార్కెట్ పెంచుకుంటారు. ఇక ఇష్క్ ఫర్ ఎవర్ వంటి హిందీ చిత్రాల్లో నటించిన బ్యూటీ రుహిసింగ్. ఈమె చదురంగ వేట్టై హీరో నడ్డీ నటరాజన్ నటించిన ‘బోంగు’ చిత్రంలో నాయకిగా నటించింది. హిందీలో నటించిన చిత్రాలు ఏవీ అంతగా విజయం సాధించకపోవడంతో మార్కెట్లో ఇంకా వెనుకంజలోనే ఉన్న రుహిసింగ్ తన గుర్తింపు కోసం అప్పుడప్పుడు ఒంపుసొంపులను చూపుతూ ఫొటోలను విడుదల చేసి కలకలం సృష్టిస్తూ వస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఎంట్రీ ఇస్తున్న ఈ సుందరి మార్కెట్‌ను చేజిక్కించుకోవడం కోసం బోంగు సినిమాలోని పాటల సన్నివేశాల్లో విచ్చలవిడిగా తన అందచందాలను ఆరబోసి నటించింది. అదే సమయంలో హిందీలో తన పేరు ప్రసిద్ధి చెందడం కోసం తాజాగా ఫొటో ఆల్బమ్ విడుదల చేసింది. వేసవి ఎండల తాపాన్ని తగ్గించే విధంగా స్విమ్మింగ్‌పూల్‌లో తాను జలకాలాడుతున్న ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసింది రుహిసింగ్. అమ్మడు విడదల చేసిన తన బికినీ ఫొటోలు కుర్రకారు నరనరాలను జివ్వున లాగేస్తూ మార్కెట్లో కొత్త ట్రెండ్ సృష్టిస్తూ రచ్చరచ్చ చేస్తున్నాయి. -
నటి బికినీ వేసుకోవలసిందేనా?
ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేయాలంటే బికినీ వేసుకోవలసిందేనా? స్కిన్ షో తప్పనిసరా? అనడిగితే... ‘‘స్కిన్ షోకి ప్రేక్షకులు ఎట్రాక్ట్ అవుతారనేది అపోహే. నేను నమ్మను’’ అంటున్నారు తమన్నా. హీరోయిన్గా మీకు మీరు ఏవైనా పరిమితులు పెట్టుకున్నారా? అని తమన్నాను ప్రశ్నిస్తే... ‘‘యస్. కొన్ని ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ముందు మా అమ్మానాన్నలకు కొన్ని ప్రామిస్‌లు చేశా. నాకు కంఫర్ట్‌బుల్‌గా లేని బట్టలను నేను వేసుకోను. అయినా వేసుకునే డ్రెస్సులు మనకు పాపులారిటీ తీసుకురావు. ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేయడానికి నేను బికినీ వేసుకోవలసిన అవసరం లేదని నా అభిప్రాయం. నేనెప్పుడూ అలా చేయను’’ అని సమాధానం ఇచ్చారు. ఈ శుక్రవారం వస్తోన్న ‘బాహుబలి–2’ మినహా... ప్రస్తుతం తమన్నా చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేదు. తమిళంలో ఓ మూడున్నాయి. హిందీలో ప్రభుదేవాతో కలసి చేస్తున్న సినిమాలో చెవిటి, మూగ అమ్మాయిగా నటిస్తున్నారు. ప్రతి వారం రెండు మూడు సినిమాలు తమన్నా తలుపు తడుతున్నాయట. తెలుగులోనూ అవకాశాలు వస్తున్నాయట. మంచి కథల కోసం ఎదురు చూస్తున్నానని తమన్నా చెప్పుకొచ్చారు. -
అంతకు మించి..!
బికినీలందు అసలు సిసలైన బికినీ వేరయా అంటున్నారు రాయ్ లక్ష్మి. తెరపై బికినీలో కనిపించాలంటే అందాల తారలకు బోలెడన్ని గట్స్ కావాలనేది తరచూ సినీ జనాలు చెప్పే మాట! అటువంటి గట్స్ రాయ్ లక్ష్మిలో ఉన్నాయనే చెప్పుకోవాలి. సినిమాలు, స్పెషల్ సాంగులు, క్యాలెండర్లకు పోజులు.. పలుమార్లు రాయ్ లక్ష్మి బికినీ తరహా దుస్తుల్లో కనిపించారు. అవన్నీ ఓ ఎత్తు.. ఇప్పుడు హిందీలో హీరోయిన్గా పరిచయం అవుతోన్న ‘జూలీ-2’లో బికినీ మరో ఎత్తు అట! ఎందుకంటే.. అవన్నీ పక్కా బికినీ సన్నివేశాలు కావట! ‘బికినీ సన్నివేశాల్లో నటించడం మీకు కష్టంగా అనిపించిందా?’ అని రాయ్ లక్ష్మిని అడిగితే.. ‘‘నేనిప్పటి వరకూ పక్కా బికినీ సీన్లు చేయలేదు. ‘జూలీ-2’లో మాత్రం చేయవలసి వచ్చింది. దాన్నో సవాలుగా స్వీకరించి చేశా. ఎంతైనా హీరోయిన్లకు బికినీ సీన్లు చేయడం ఛాలెంజింగే’’ అన్నారామె. అంటే.. ఈ హాట్ బ్యూటీ ‘జూలీ-2’తో ప్రేక్షకులను కనువిందు చేయడం పక్కా అన్న మాట. హిందీ సంగతులు పక్కన పెడితే... చిరంజీవి ‘ఖైదీ నంబర్ 150’లో రాయ్ లక్ష్మి స్పెషల్ సాంగ్ చేశారు. మెగాస్టార్‌తో చిందేయడం గురించి మాట్లాడుతూ - ‘‘ఎప్పుడో ఒకప్పుడు చిరంజీవి వంటి లెజెండ్ పక్కన డ్యాన్స్ చేస్తానని ఊహల్లో కూడా అనుకోలేదు. నా కల నిజమైంది’’ అన్నారు. -
హాట్ వీడియో పోస్ట్ చేసిన ఇలియానా
సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగి ప్రస్తుతం బాలీవుడ్లో టైం పాస్ చేస్తున్న హాట్ బ్యూటీ ఇలియానా. హిందీలో కూడా పెద్దగా సినిమా అవకాశాలు లేకపోయినా, సోషల్ మీడియాలో మాత్రం తెగ హడావిడి చేస్తోంది ఈ గోవా సుందరి. హాట్ హాట్ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తుంది. అయితే తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ సంఖ్య 40 లక్షలకు చేరినందుకు గాను ఓ హాట్ వీడియోను పోస్ట్ చేసింది ఇల్లీ బేబి. సినిమా అవకాశాలు పెద్దగా లేకపోవటంతో గతంలో కూడా ఇలాంటి వీడియోలతో సందడి చేసింది ఈ బ్యూటి. టూ పీస్ బికినీలో అండర్ వాటర్‌లో తీసిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అభిమానులకు కృతజ్ఞతలు తెలపడం కూడా ఇంత హాట్ గానా అంటూ కొంత మంది పెదవి విరుస్తుంటే, మరి కొంత మంది మాత్రం ఇలియానా అందాలను షేర్ చేస్తూ ఖుషీ చేస్తున్నారు. ప్రస్తుతం ఒక్క ప్రాజెక్ట్ మాత్రమే చేతిలో ఉన్న ఇలియానా సౌత్ ఇండస్ట్రీ పిలుపు కోసం ఎదురుచూస్తోంది. 4 MILLION!!!! U guys ROCK!!! Sending so much love your way! -
హాట్ వీడియో పోస్ట్ చేసిన ఇలియానా
-
బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా...
-
బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా...
విశాఖ: విశాఖ బీచ్ లవ్ ఫెస్టివల్ నిర్వహణపై బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు స్పందించారు. బికినీ ఫెస్టివవల్ నిర్వహించడం తెలుగు సంస్కృతికి మంచిది కాదని, అదొక వింత పోడక అని ఆయన గురువారమిక్కడ అన్నారు. ‘విశాఖలో పాశ్చాత్య దేశాల నుంచి జంటలు వస్తారట. జంటకు ఒక టెంట్ అట.... ఏమిటీ తమాషా. బికినీ అంటే స్కర్ట్ అనుకున్నా, నెట్ లో చూస్తే అర్థమైంది. ఎట్టి పరిస్థితుల్లో ఇది అంగీకరించం, బికినీలతో కొత్త సంప్రదాయం కరెక్ట్ కాదు. మహిళలను కించపరచడం, ఎక్స్పోజ్ చేసి బికినీ ఫెస్టివల్ ఎలా నిర్వహిస్తారు. పర్యాటకరంగం అభివృద్ధికి ఇలాంటి ఫెస్టివల్‌ను ఎంచుకోవడం తగదు. మహిళల బికినీలు చూసి పెట్టుబడులు పెట్టే వ్యాపారస్తులు అవసరం లేదు. ఎవరో బయట వ్యక్తులు వచ్చి టూరిజాన్ని అభివృద్ధి చేస్తామంటే అది భారతీయ సంస్కృతిని నాశనం చేస్తుంది, ఇదొక కుట్ర’ అని విష్ణుకుమార్ రాజు పేర్కొన్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో ముంబైకి చెందిన పాజిటివ్ గ్లోబల్ సర్వీసెస్ అండ్ కన్సల్టెన్సీ సంస్థ బీచ్ లవ్ ఫెస్టివల్ పేరుతో ఈ ప్రేమోత్సవం నిర్వహించనుంది. ఫిబ్రవరి 12 నుంచి ప్రేమికుల దినమైన 14వ తేదీ వరకు మూడురోజుల పాటు బీఎల్ఎఫ్-2017 పేరిట ఉత్సవాలు జరగనున్నాయి. ప్రఖ్యాత పాప్ గాయని, బెల్లీ డ్యాన్సర్ షకీరా ఆటపాటలు, హాలీవుడ్, బాలీవుడ్ తారలు, మోడళ్ల క్యాట్ వాక్‌లు, అందాల పోటీలు ఏర్పాటు చేస్తున్నారు. ఐరోపా, అమెరికా తదితర దేశాల నుంచి ఏకంగా 9వేల జంటలను ఈ ఉత్సవానికి ఆహ్వానిస్తున్నారు. వారికోసం ప్రత్యేకంగా టెంట్లు ఏర్పాటు చేస్తున్నారు. విశాఖ తీరంలో ఎక్కడ ఈ ఫెస్టివల్ నిర్వహించాలన్న దానిపై తర్జన భర్జనలు సాగుతున్న విషయం తెలిసిందే. -
బికినీకి సై
నటి లక్ష్మీమీనన్ మైండ్‌సెట్ మారిందా? తన సహ నటీమణులకంటే వెనుక పడ్డానని గ్రహించిందా? అవకాశాలను పెంచుకోవాలనే నిర్ణయానికి వచ్చిందా? తన తాజా మాటల్లో ఇలాంటి ప్రశ్నలు సాధారణ ప్రేక్షకుడికి కూడా తెలెత్తకపోవు. కొండవాసి యువతిగా కుంకీ చిత్రంతో కోలీవుడ్‌కు పరిచయమైన ఈ కేరళాకుట్టి ఆ చిత్ర విజయం తన జీవితాన్నే మార్చేసింది. ఆ తరువాత వరుస అవకాశాలు. వాటిలో తొంబై శాతం విజయాలు వరించడంతో తమిళచిత్ర పరిశ్రమలో ఒక మంచి స్థానాన్ని ఏర్పరచుకుంది. అలాంటి సమయంలో ఆపేసిన చదువును పూర్తి చేయాలంటూ నటనకు చిన్న విరామం తీసుకుంది. అది తనపై పెద్ద ప్రభావాన్నే చూపించిందనే చెప్పాలి. అజిత్‌కు చెల్లెలిగా వేదాళం చిత్రంలో నటించింది. ఆ చిత్రం విజయం సాధించింది. లక్ష్మీమీనన్‌కు మంచి పేరే వచ్చింది. అయినా అవకాశాలు తగ్గాయి. దీంతో కోలీవుడ్‌లో చిత్రాలను తగ్గించుకుంటోందనే ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఈ మలయాళీ భామను అడిగితే అలాంటిదేమీ లేదని బదులిచ్చింది. అయితే ఇకపై నటనపై అధిక శ్రద్ధ చూపాలని నిర్ణయించుకన్నట్లు పేర్కొంది. విజయ్‌సేతుపతికి జంటగా నటించిన రెక్క చిత్రం ఏడో తేదీన తెరపైకి రానుందని, ఇందులో గ్లామరస్ పాత్రను పోషించానని తెలిపింది. అదే విధంగా విజయ్‌సేతుపతితో కలిసి నటించడం వినూత్న అనుభవంగా పేర్కొంది. తదుపరి జీవాకు జంటగా నెంజముండు నేర్మైయుండు చిత్రంలో నటించనున్నానని చెప్పింది. గ్లామర్‌కు సిద్ధం అయ్యానంటున్నారు ఈత దుస్తులు ధరించి నటిస్తారా? అన్న ప్రశ్నకు తాను స్విమ్మింగ్‌లో శిక్షణ పొందుతున్న సమయంలోనే ఈత దుస్తులు ధరించి స్మిమ్ చేశానని, అలాంటిది సినిమాల్లో ఈత దుస్తుల్లో నటించడం ఒక లెక్కా అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.తనకు ఇప్పటి వరకూ ఈత దుస్తుల్లో నటించే అవకాశం రాలేదని, అలాంటి సందర్భం వస్తే కచ్చితంగా నటిస్తానని చెప్పింది. అయితే నిజ జీవితంలో ఇప్పటి వరకూ బికినీ ధరింలేదని, అందువల్ల సినిమాల్లోనూ అలాంటి దుస్తులు ధరించనని తెలిపింది. విశేషం ఏమిటంటే ఇంతకు ముందు మోడరన్ దుస్తులు తన శరీరాకృతికి నప్పవు అని చెప్పుకొచ్చిన ఈ కేరళాకుట్టి ఇప్పుడు అలాంటి పాత్రలకు సిద్ధపడింది.రేపు బికినీ ధరించినా ఆశ్చర్యపడనక్కర్లేదు. -
బికినీకి 70 ఏళ్ళు!
ప్రపంచ అతిచిన్న బాతింగ్ సూట్ గా ప్రకటనల్లో ప్రసిద్ధి చెంది, ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా వంటి ఎన్నో దేశాల్లో రంగు రంగులతో ఆకట్టుకున్న బికినీల వెనుక.. పెద్ద చరిత్రే ఉంది. బికినీలు రూపొందిన తర్వాత మొదట్టో ఎన్నో అభ్యంతరాలు వెల్లువెత్తినా... అనంతరం ఈతకోసం స్త్రీలు ధరించే ప్రత్యేక దుస్తులుగా గుర్తింపు పొంది, ప్రపంచవ్యాప్తంగా అందర్నీ ఆకట్టుకున్నాయి. అతి కురుచ దుస్తులైన బికినీల వెనుక అభ్యంతరాలు కోకొల్లలైనా... ప్రాచుర్యంలోకి వచ్చి 70 ఏళ్ళు పూర్తి చేసుకున్నాయి. భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలను ధరించడం అరుదుగా కనిపించినా.. బాలీవుడ్ సినిమాల్లో తారలు తమ అందాలను ఆరబోసేందుకు బికినీలను ధరించడం దశాబ్దాల క్రితమే కనిపిస్తుంది. సముద్ర తీరాల్లోనూ, స్విమ్మింగ్ పూల్స్ లోనూ ఈతకోసం స్త్రీలు ధరించే ఈ ప్రత్యేక దుస్తులైన బికినీలు శరీరభాగాలను బహిర్గతం చేస్తున్నాయన్న కారణంతో చాలా దేశాల్లో ఈ దుస్తులపై నిషేధం కూడా విధించారు. టూ పీస్ డ్రెస్ అంటూ మొట్టమొదటిసారి ఈ దుస్తులను ఫ్రాన్స్ దేశస్థుడు లూయిజ్ రియర్డ్ రూపొందించగా..బెర్నార్గీ అనే ఫ్రెంచ్ మోడల్ ధరించి జూలై 5, 1946 లో జరిగిన ప్యారిస్ ఫ్యాషన్ షోలో ప్రదర్శించి ప్రపంచ ప్రజలను ఆకట్టుకుంది. సంప్రదాయాలకు పెద్ద పీట వేసే భారతదేశంలో సాధారణ ప్రజలు బికినీలకు వ్యతిరేకమైనా.. తారల అందచందాలను ఒలకబోసేందుకు సినీరంగం ఈ దుస్తులను బాగానే ఆదరించింది. బాలీవుడ్ తార మీనాక్షీ శిరోద్కర్ ఓ మరాఠీ సినిమాలో సింగిల్ స్విమ్ సూట్ లో కనిపించి, చరిత్రను తిరగరాసింది. అనంతరం యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ సినిమాలో షర్మిలా ఠాగూర్, బాబీ సినిమాలో డింపుల్ కపాడియా.. స్విమ్ సూట్ (బికినీ) లో కనిపించగా... తర్వాత ఎందరో నటీమణులు ఆ సంప్రదాయాన్ని ధైర్యంగా కొనసాగించారు. అలాగే తెలుగు సినిమాల్లోనూ నాటితరం నుంచి నేటివరకూ బికినీ భామలు హొయలొలికిస్తూనే ఉన్నారు. రోమన్ చిత్ర పటాల్లోని బికినీలను పోలిన దుస్తులను చూస్తే ఎన్నో వేల ఏళ్ళ క్రితమే స్త్రీలు బికినీలు ధరించినట్లు తెలుస్తుంది. 1700 సంవత్పరాల క్రితం ఛాంబర్ ఆఫ్ టెన్ మెయిడెన్స్ అనే రోమన్ మొజాయిక్ చరిత్రను చూస్తే.. క్రీడాకారిణులు బికినీలు ధరించినట్లు కనిపిస్తుంది. అనంతరం అనేక రకాల ఆధునిక బికినీలు ప్రపంచానికి పరిచయమయ్యాయి. బీచ్ లాంజెర్ లో రిలాక్స్ అయ్యేందుకు మొట్టమొదటి సౌరశక్తి బికినీ 'ఐకిని' ని డిజైనర్ ఆండ్రూ స్కూనైడర్ రూపొందించారు. 1951 లో జరిగిన ప్రిమియర్ మిస్ వరల్డ్ పోటీల్లో విజేతగా నిలిచిన స్వీడన్ కు చెందిన కికి హాకన్ సన్ బికినీని ధరించి టైటిల్ గెలుచుకొంది. అయితే అనంతరం బ్యూటీ పేజెంట్లలో ప్రపంచవ్యాప్తంగా బికినీలపై నిషేధం విధించడంతో.. బికినీ ధరించి మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకున్న మొట్టమొదటి, చివరి మహిళగా ఆమె మిగిలిపోయింది. అలాగే 30 మిలియన్ డాలర్ల అతి ఖరీదైన బికినీని డైమండ్స్ తో సుసాన్ రోజెన్ రూపొందించారు. స్టార్ వార్స్ 6వ ఎపిసోడ్ లో ప్రిన్సెస్ లీయా డోన్డ్ సైతం మెటాలిక్ బికినీ ధరించి కనిపిస్తుంది. 90వ శకంలో ఇంటర్నేషనల్ వాలీబాల్ ఫెడరేషన్ బీచ్ వాలీబాల్ పోటీలకు 'శాండ్ రిలీజ్ సిస్టమ్' కలిగిన బికినీని మహిళల యూనిఫాంగా అనుమతించింది. జంతు హింసను నిరోధించి జనం శాకాహారులుగా మారాలంటూ చేసిన ప్రచారానికి సైతం మహిళలు.. ముఖ్యంగా ఆకులు అలములతో రూపొందించిన బికినీలు ధరించినట్లు ఆధారాలను బట్టి తెలుస్తోంది. -
నా వల్లే మా అమ్మాయికి ఇబ్బంది!
సెలబ్రిటీలే కాదు.. వారి పిల్లలు కూడా ఏం చేసినా అది హాట్ టాపిక్ అవుతుంది. వారిని అటు అభిమానులతో పాటు ఇటు మీడియా సైతం ఫాలో అవుతూ ఉంటుంది. ఇతర రంగాల సెలబ్రిటీల ఫాలోయింగ్ ఒక ఎత్తయితే.. సినిమా రంగంలోని వారికి ఉండే ఫాలోయింగ్ మరో ఎత్తు అవుతుంది. ఇందుకు తాజా ఉదాహరణ బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్ ముద్దుల కుమార్తె సుహాన. ఈ టీనేజ్ బ్యూటీ బికినీలో ఉన్న ఫొటోలు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో షారుక్ అసహనం వ్యక్తం చేశారు. ‘‘సుహాన వయస్సు ఇప్పుడు పదహారేళ్లు. బీచ్‌లో తన తమ్ముడు అభిరామ్‌తో కలసి ఆడుకుంటున్నప్పటి ఫొటోలు తీసి పబ్లిసిటీ చేయడం తగదు. పైగా షారుక్ కూతురు బీచ్‌లో బికినీతో బాడీ ప్రదర్శన ఇస్తోందని రాయడం సభ్యత కాదు. ఇటువంటి ఫొటోలు సోషల్ మీడియాలో పెట్టి ఎందుకంత వివాదం చేస్తున్నారు? ఇది సరైన పద్ధతి కాదు. సుహాన ఫొటో ఇలా వైరల్ కావడానికి కారణం నా స్టార్డమ్. అదే తన పాలిట శత్రువైందేమో అనిపిస్తోంది. తను నా కుమార్తె కాకుండా ఉంటే అసలు అది వార్త అయ్యుండేది కాదు. ఎవరూ చాటుమాటుగా ఫొటోలు తీసి, పరువు బజారుకీడ్చేవాళ్లు కాదు. సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన వారికి పర్సనల్ లైఫ్ ఉండదా? వయసుతో సంబంధం లేకుండా ఇటువంటి ఫొటోలు పెట్టి వివాదం చేయడం తగదు’’ అని ఆగ్రహావేదనలతో షారుక్ అన్నారు. ఓ తండ్రిగా ఆయన పడుతున్న బాధలో న్యాయం ఉంది కదూ! -
ప్లస్ సైజ్ బ్లాగర్ కు ఇన్ స్టాగ్రామ్ సారీ!
ప్లస్ సైజ్ ఉన్నవారి ఫోటోలను డిలీట్ చేసిన ఇన్ స్టాగ్రామ్.. అనంతరం బ్లాగర్లకు క్షమాపణలు చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. సింగపూరియన్ ఇండియన్ బ్లాగర్ ఆర్తీ ఒలీవియా దుబే.. తాను బికినీతో ఉన్న ఫోటోలను పోస్టు చేయగా కొద్దికాలం క్రితం ఇన్ స్టాగ్రామ్ నుంచి వాటిని తొలగించారు. దీంతో ఆమె వారంపాటు ఆందోళన నిర్వహించడంతో చివరికి దారికొచ్చిన ఇన్ స్టాగ్రామ్... తప్పైపోయిందంటూ ఆమెకు క్షమాపణలు చెప్పడంతోపాటు, అనుకోకుండా ఫోటోలు డిలీట్ అయినట్లుగా వివరణ కూడ ఇచ్చింది. తన బ్లాగ్ లో 'పెంఛంట్ ఫర్ ఫ్యాషన్, ఫాట్ బ్రౌన్ ఫెమినిస్ట్' అంటూ తనకు తాను నిర్వచించుకునే బ్లాగర్ ఒలీవియా దుబే... తనతోపాటు మరో ఇద్దరు ప్లస్ సైజ్ బ్లాగర్ల బికినీ షూట్ ఫోటోలను మే 21న సైట్ నుంచి తొలగించడంతో ఆందోళన ప్రారంభించింది. తన బికిని ఫోటోలను సైట్ నుంచి తొలగించి తనను అవమానించినందుకు గాను తనకు ఇన్ స్టాగ్రామ్ అధికారికంగా క్షమాపణలు చెప్పాలంటూ జూన్ 1న తన అకౌంట్ లో ఓ నోట్ పెట్టి డిమాండ్ ప్రారంభించింది. అయితే దుబే డిమాండ్ కు దిగొచ్చిన ఇన్ స్టాగ్రామ్ ఆమె ఫోటోలను తొలగించినందుకు క్షమాపణలు చెప్పింది. కాగా ఇన్ స్టాగ్రామ్ క్షమాపణలు చెప్పినంత మాత్రాన సరిపోదని, తాను క్షమాపణలను అంగీకరించినా తదుపరి ప్రయోజనం ఉండదని, అందుకే తిరిగి తన ఫోటోలను పోస్ట్ చేయడంతోపాటు, తొలగించిన ఇన్ స్టాగ్రామ్, ఫేస్ బుక్ లలోని ప్లస్ సైజ్ ఫ్రెండ్స్ అందరి ఫోటోలను పోస్ట్ చేసి, అకౌంట్లను తిరిగి ప్రారంభించాలంటూ దుబే పట్టుబడుతోంది. -
త్రిష బికినీ పార్టీ
జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలన్నది నటి త్రిషను చూసి నేర్చుకోవాలని చాలా మందికి అనిపించకమానదు. అంతదాకా ఎందుకు సహ నటీమణులే అసూయ పడేలా ఆమె లైఫ్ స్టైల్ ఉంటుందనవచ్చు.చాలా మంది హీరోయిన్లు డబ్బు సంపాదనే ధ్యేయంగా అవిరామంగా శ్రమిస్తుంటారు. కొందరికి తెగ సంపాదించినా ఎలా జల్సా చేయాలో తెలియదు. కూడబెట్టిన దాన్ని ఖర్చు చేయడానికి మనసు రాదు మరికొందరికి. అయితే నటి త్రిష ఇలాంటి వారందరికీ భిన్నం. ఎంత సంపాదిస్తుందో అంతగా జీవితాన్ని జాలీగా గడిపేస్తుంది. ఈ చెన్నై చిన్నదానికి పార్టీలంటే ఎంత ఇష్టమో. అవి స్నేహితురాలితో జరుపుకోవడానికి తెగ ముచ్చట పడుతుంది. వారితో దేశ విదేశాలు తిరిగేస్తూ చుట్టేస్తూ తనకు నచ్చినట్లు గడిపేస్తుంది. ఆ మధ్య ప్రేమించి,పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన నిర్మాత, వ్యాపారవేత్త వరుణ్‌మణియన్‌తో ప్రత్యేక విమానంలో ఆగ్రా వెళ్లి తాజ్మహాల్తో పాటు దాని చుట్టు పక్కల సుందర ప్రాంతాలన్నీ చుట్టొచ్చింది. ఆ విహార యాత్రలోనూ తన స్నేహితురాళ్లను దూరంగా పెట్టలేదామె. వరుణ్‌మణియన్‌తో ప్రేమ,పెళ్లి అన్న కథ కంచెకు చేరినా, అందుకు ఇసుమంత కూడా చింతించని త్రిష పబ్‌లు, పార్టీలు అంటూ ఖుషీ ఖుషీగా జీవితాన్ని ఎంజాయ్ చేసేస్తోంది. ఈ చెన్నై చిన్నది తన చిన్న నాటి స్నేహితులకు తరచూ పార్టీ ఇస్తుంటుంది. అలా ఇటీవల వారితో బికినీ పార్టీ జరుపుకుంది. ఇందులో విశేషం ఏమిటంటే అందరూ ఒక యూనిఫామ్‌లో దుస్తులు ధరించి రావాలన్నట్టు విప్‌ను జారీ చేసిందట త్రిష. నాయకురాలు ఆర్డర్ జారీ జేస్తే నెచ్చెలిలు పాటించకుండా ఉంటారా. అందరు బికినీలు ధరించి పార్టీకి చేరుకున్నారు.త్రిష కూడా బికినీ ధరించి దానిపై జర్కీలాంటిది వేసుకుని స్నేహితురాళ్లతో కలిసి పార్టీలో ఎంజాయ్ చేసిందట. అందాలతో కూడిన ఫొటోలను త్రిష స్నేహితురాళ్లలో ఏ తుంటరి చిన్నదో ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు.అవి ఇప్పుడు సోషల్ మీడియాల్లో హల్చల్ చేస్తున్నాయి. -
బికినీలో తొలిసారి దర్శనమిస్తాను...
ముంబై: బాలీవుడ్ ముద్దుగుమ్మ శ్రద్ధాకపూర్ వరుస విజయాలతో జోరుపెంచినట్లు కనిపిస్తోంది. 'ఆషికీ2'తో ఆరంగ్రేటంతో తొలి మూవీలోనే క్యూట్ లుక్స్ తోనే కాదు నటనతోనూ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. 'ఏబీసీడీ' మూవీలో అదరగొట్టే స్టెప్పులేస్తూ హీరో వరుణ్ ధావన్ తో పోటీపడి మరీ నటించింది. ఇక తన లేటెస్ట్ మూవీ 'బాఘీ'లో సీనియర్ హీరో జాకీష్రాఫ్ తనయుడు టైగర్ ష్రాఫ్ తో జోడీకట్టిన విషయం తెలిసిందే. షబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో యాక్షన్ సీన్లకు లోటులేదని శ్రద్ధా అంటోంది. ఈ మూవీ ట్రైలర్ నిన్న విడుదలయింది. మీడియా ఆమెను సంప్రదించగా శ్రద్ధాకపూర్ కొన్ని విషయాలను పంచుకుంది. 'తొలిసారిగా నేను 'బాఘీ' మూవీలో బికినీలో దర్శనమిస్తున్నాను. బికినీలో ప్రేక్షకులు నన్ను బాగా రిసీవ్ చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ కొత్త అవతారం అందరినీ ఆకట్టుకుంటుంది అనిపిస్తుంది.' అని శ్రద్ధా చెప్పింది. బికినీ వేసుకోవడం చాలా మంచి అనుభవం, దీనిపై తనకు చాలా మంచి కామెంట్స్ వస్తాయని ఈ భామ చెప్పుకొచ్చింది. చూడటానికి పక్కింటి అమ్మాయిలా కనిపించే పాత్రల్లో నటించే శ్రద్ధా ఈ మూవీలో చాలా సాహసమే చేసిందని చెప్పవచ్చు. హీరో టైగర్ తో కలిసి కొన్ని యాక్షన్ సీన్లలోనూ నటించినట్లు వెల్లడించింది. అందులో భాగంగానే కొన్నిసార్లు గాయాలపాలయ్యానని చెప్పింది. ఏ నటుడు టైగర్ లా నటించలేడని, అతడితో కలిసి పనిచేయడం చాలా ప్రేరణ ఇచ్చేవిధంగా ఉంటుందంటోంది ఈ అమ్మడు. తన స్కూలు రోజులను గుర్తుచేసుకుంటూ... టైగర్ స్కూలు రోజుల్లో ఎలా ఉండేవాడో, ఇప్పుడు కూడా పనిపట్ల అదే ఎనర్జీతో, చాలా ఏకాగ్రతతో ఉన్నాడని తన మిత్రుడిని తెగ పొగిడేసింది శ్రద్ధాకపూర్. -
'బికినీ కోసం అలాంటి పనులు చేయలేదు'
ముంబై: బాలీవుడ్ ఫ్యాన్స్ ఆమె ప్రస్తుతం చేస్తున్న పనులపై చాలా ఆగ్రహంగా ఉన్నారు. కొన్నిరోజుల కిందటి వరకు చాలా లావుగా ఉందని, అన్ని పాత్రలకు ఆమె సెట్ అవ్వదని విమర్శలున్నాయి. అయితే కఠిన వ్యాయామాలతో చెమటోడ్చి మరీ శరీర బరువు తగ్గించుకోవడం ద్వారా బాలీవుడ్ చిన్నది పరిణీతి చోప్రా వార్తల్లో ఎక్కిన విషయం తెలిసిందే. ఏంటి సైజ్‌జీరో శరీరాకృతి కోసం కష్టపడుతుందా.. అసలు పరిణీతి ఏం చేయాలనుకుంటుంది అని బాలీవుడ్ చెవులు కొరుక్కుంది. సన్నబడ్డాక పరిణీతి చోప్రా 'బిల్ట్ దట్ వే' హాట్‌హాట్ ఫొటోషూట్‌తో కనువిందు చేయడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేక పోతున్నారు. తాను మాత్రం సన్నబడటం కంటే శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడానికే ప్రాధాన్యమని చాలాసార్లు చెప్పుకొచ్చింది. ఇప్పుడు కూడా ఆమె సన్నబడటంపై చాలా విమర్శలొచ్చాయి. దీంతో ఈ అమ్మడు ఆ విషయాన్ని కాస్త సీరియస్ గా తీసుకున్నట్లు కనిపిస్తోంది. తాను బికినీ వేయడం కోసం సన్నగా అవ్వలేదని, శారీరకంగా ధృడంగా మారడాలనికి చాలా కష్టపడ్డాడని వివరించింది. ఆరోగ్యం కోసం తాను స్విమ్మింగ్, జిమ్, మార్షల్ ఆర్ట్స్, డ్యాన్సింగ్ ఇలా తన చేతనైన అన్ని కళలతోనూ కాస్త కుస్తిపట్టీ మరి అనుకున్నఫలితాన్ని సాధించుకుంది. అయితే, పరిణీతి కేవలం బికినీ లాంటివి ధరించడం కోసమే సన్నబడిందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అసలు విషయాన్ని బయటపెట్టింది. తాను స్కిన్ షో చేయడం కోసం ఈ వర్క్ అవుట్స్ చేయలేదని, అవి చాలా వికృత విమర్శలు అని కొట్టిపారేసింది. సన్నబడటం వేరే విషయం.. తాను మాత్రం స్టామినాను పెంచుకొని శరీరం మీద అదుపు తెచ్చుకోవడానికి ప్రయత్నించాను అని ఇటీవల జరిగిన స్టార్‌డస్ట్ అవార్డ్స్ వేడుక సందర్భంగా చెప్పిన విషయాన్ని మరోసారి ప్రస్తావించింది. -
బికినీ కోసం తప్పు చేశాను!
‘‘పట్టుచీర కట్టుకుని ఈత కొలనులో ఈదగలుగుతామా? బికినీ వేసుకుని గుడికి వెళ్లగలుగుతామా?’’ అని కొంతమంది తారలు అంటుంటారు. ‘ఈ చిత్రంలో మీరు బికినీ ధరించడానికి కారణం?’ అనే ప్రశ్నకు ఈ విధంగా స్పందిస్తుంటారు. సీన్ డిమాండ్ చేసింది కాబట్టే, బికినీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చామని చెబుతుంటారు. ఇప్పుడు ఆలియా భట్ కూడా అదే అంటున్నారు. వచ్చే నెల విడుదల కానున్న ‘షాన్‌దార్’ చిత్రంలో ఆలియా బికినీలో కనిపించనున్నారు. ఈ కాస్ట్యూమ్ కోసం ఆమె సన్నబడ్డారు. కానీ, ఇప్పుడు బాధపడుతున్నారు. దాని గురించి ఆలియా చెబుతూ - ‘‘బికినీలో నా శరీరాకృతి బాగుండాలని సన్నబడ్డాను. కానీ, ‘ఏంటి ఇలా అయిపోయావ్? మరీ సన్నబడిపోయావ్’ అని అందరూ అడుగుతుంటే, ఏదో తప్పు చేసినట్టుగా చాలా బాధగా ఉంది. ఏదో రోగిని పరామర్శించినట్లుగా పరామర్శిస్తున్నారు. నాకైతే ఇప్పుడున్న బరువుతో ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి కాస్ట్యూమ్స్ అయినా నా ఫిజిక్‌కి సెట్ అవుతోంది. కానీ, అందరూ ‘ఇలా అయిపోయావేంటి?’ అని అడుగుతుంటే, బరువు పెరగాలనిపిస్తోంది’’ అని చెప్పారు. -
ఆలియా బికినీ కష్టాలు!
సాగర తీరాన ఆలియా భట్ ఓ టూపీస్ బికినీ వేసి నడుస్తుంటే, షాహిద్‌కపూర్ చూసి స్టన్ అయిపోవడం... ఇదంతా ‘షాన్‌దార్’ సినిమా ట్రైలర్‌లోని ఓ షాట్. ఆమె అభిమానులు కూడా ఈ బికినీ షాట్ చూసి స్వీట్ షాక్ తిన్నారు. వెండితెరపై ఆలియా లాంటి అందగత్తెలు బికినీ వేస్తే కుర్రకారుకు అంతకు మించిన ఆనందం ఉండదు. కానీ ఆలియా మాత్రం ఈ బికినీ షాట్ కోసం నానా క ష్టాలు పడ్డారట! ‘‘బికినిలో కనిపించడం నాకిది రెండో సారి. మొదటి సారి ఓకే కానీ, ఈ సారి మాత్రం చాలా ఇబ్బంది పడ్డా. మైనస్ 2 డిగ్రీస్ చలిలో ఆ టూపీస్ బికినీ వేసి నడుస్తుంటే నాకు నరకం కనిపించింది. అసలు నిలబడలేకపోయా. ఆ సన్నివేశం బాగా వచ్చాక మాత్రం చాలా హ్యాపీ ఫీల్ అయ్యా’’ అని ఆలియా చెప్పుకొచ్చారు. షాహిద్ కపూర్ కూడా ఈ విషయం గురించి చెబుతూ- ‘‘ఆ సన్నివేశంలో ఓ బనియన్, షార్ట్ వేసుకున్న నేను... ఆ చలికి గజగజ వణికిపోయాను. ఇక ఆలియా పరిస్థితి ఏంటో ఊహించుకోగలను’’ అన్నారు. -
బికినీ అంటే ఒక దీవి!
పేరు వెనుక... శరీరానికి సూర్యరశ్మి తగలడానికి వీలుగా ఆడవాళ్ల కోసం రూపొందించిన ఈతదుస్తులే... బికినీ! యూరోపియన్ దేశాల్లో 1940ల తర్వాత వీటి వినియోగం విస్తృతం అయ్యింది. దీన్ని మొదట ధరించింది ఫ్రెంచ్ మహిళామణులు. ఫ్రాన్స్‌కు చెందిన కాస్ట్యూమ్ డిజైనర్ జాక్వెస్ హీమ్ తొలుత టూ పీస్ ‘ఆటోమ్’ రూపొందించాడు. దాన్ని అత్యంత చిన్న బాతింగ్ సూట్‌గా ప్రచారం చేశాడు.అయితే, 1946లో అమెరికా అణుపరీక్ష నిర్వహించింది. పసిఫిక్ మహాసముద్రంలోని ఒక చిన్న దీవి ‘బికినీ అటాల్’(కొబ్బరికాయల దీవి అని అర్థం) వేదికగా ఆ పరీక్ష జరగడంతో బికినీ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగింది. ఇదే అదనుగా మరో ఫ్రెంచ్ డిజైనర్ లూయిస్ రీడ్ మరింత చిన్నవైన ఈతవస్త్రాలను రూపొందించి వాటికి ‘బికినీ’ అని నామకరణం చేశాడు. బికినీ అటాల్ చిన్నదే, తను రూపొందించిన వస్త్రం కూడా చిన్నదే, కాబట్టి ఆ పేరుతో వ్యవహరించడం బాగుంటుందనే అభిప్రాయానికి వచ్చాడు లూయిస్. -
సన్నీ లియోన్.. క్రేజీ వాషింగ్!
పెద్దల తార సన్నీ లియోన్ ఏం చేసినా సెన్సేషన్‌లా ఉంది. అందచందాల ప్రదర్శనలతో కుర్రాళ్లకు నిద్దర లేని రాత్రులు మిగులుస్తున్న ఈ సెక్సీ సైరన్... మరో బాణం వదిలింది. దక్షిణాది చిత్రాల్లో ఐటెమ్ సాంగ్స్ చేసి మత్తెక్కించిన సన్నీ... తాజాగా థాయిలాండ్ పట్టాయా బీచ్‌లో బికినీ వేసుకుని దర్శనమించ్చింది. అదీ ఓ వాటర్ పైపు చేతబట్టి... కారును వాష్ చేస్తూ వినూత్నంగా అందాలు ‘చిందిస్తుంది’. తుషార్‌కపూర్ హీరోగా చేస్తున్న చిత్రంలోనిదీ సన్నివేశం. ఈ ఫొటో సోషల్ సైట్లో అప్లోడ్ చేసి.. పురుష పుంగవుల టెంపరేచర్ బిల్డప్ చేసేస్తోంది. ‘ఈ షాట్ కోసం ఎంతో శ్రమించాల్సి వచ్చింది. అంతే అద్భుతంగా వచ్చింది. పాల్స్ అందరితో షేర్ చేసుకోవాలని ఈ పిక్చర్ పోస్ట్ చేశా’ అంటూ తనకు తానే కితాబిచ్చుకుంటూ ట్విట్టర్లో మురిసిపోయిందీ భామ. -
‘హీట్’ బకెట్..!
‘ఐస్’ బకెట్ చాలెంజ్ నానాటికీ వేడెక్కుతోంది. అసలు ఉద్దేశం తెరవురుగైపోరుు... బాలీవుడ్ తారల అందాల ఆరబోతకు వేదికగా మారిపోతోంది. నిన్న పూనమ్‌పాండే బికినీలో కిర్రెక్కిస్తే... తాజాగా సొగసరి భావు సోఫియూ హయుత్ ఇంకాస్త వుుందుకెళ్లి నగ్నంగా ఐస్ బకెట్‌ను మీద గువ్మురించుకుని పిచ్చెక్కించింది. ఓ బీచ్‌లో ఈ సవాలును స్వీకరించినట్టు సవూచారం. మొత్తానికి ఐస్ బకెట్ చాలెంజ్ కూడా ‘ఎ’ సర్టిఫికెట్ సినివూను తలపించేస్తున్నారు బీ-టౌన్ భావులు. -
బికినీలో త్రిష?!
త్రిషను సముద్ర కెరటంతో పోల్చొచ్చు. పడి లేవడం కెరటానికి ఎంత సహజమో, కెరీర్ పరంగా పడి లేవడం త్రిషకు సహజమై పోయింది. ‘ఈ అమ్మాయి పని అయిపోయింది’ అని అనుకునేలోపే... ఏదో ఒక క్రేజీ ప్రాజెక్ట్‌తో మళ్లీ తన హవా చాటుతుంటారు త్రిష. గత ఏడాది జీవాతో ఆమె చేసిన ‘ఎండెండ్రుం పొన్నగై’ చిత్రం తమిళనాట పెద్ద హిట్‌గా నిలిచింది. ఆ సినిమాతో మళ్లీ త్రిష వెలుగులోకి వచ్చారు. తెలుగులో తాజాగా బాలకృష్ణ సరసన చాన్స్ కొట్టేసి అందరి దృష్టినీ ఆకర్షించేశారు. మరో వైపు కన్నడంలో ‘దూకుడు’ రీమేక్‌గా రూపొందిన ‘పవర్’ చిత్రంలో పునీత్ రాజ్‌కుమార్‌కు జోడీగా నటించారు. ఇలా దక్షిణాది మొత్తాన్ని కవర్ చేస్తున్నారు త్రిష. ఇదిలావుంటే... సమంత, తమన్నా, కాజల్ లాంటి కథానాయికల పోటీని తట్టుకోడానికో ఏమో కానీ... ‘పవర్’ చిత్రం కోసం ఎప్పుడూ చేయని సాహసం చేసేశారట త్రిష. అదే... ‘బికినీ’. ఈ సినిమాలో త్రిష బికినీలో కనిపించబోతున్నారనేది బెంగళూరు టాక్. ఇటీవలే విడుదలైన ఈ చిత్రం ప్రచార చిత్రాలు కన్నడ ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయట. ఈ నెల 28న ‘పవర్’ విడుదల కానుంది. అంటే... త్రిష బికినీ సోయగాలతో కన్నడ యువతకు కనువిందు చేసే రోజు ఇంకెంతో దూరంలో లేదన్నమాట. -
ఆయన మీద నమ్మకంతోనే అంత ధైర్యం చేశా : సమంత
మొదట తమిళంలో నటించినా, ఇప్పుడు తెలుగు చిత్రాలతో యమ బిజీగా ఉంటున్న హీరోయిన్ సమంత తాజా తమిళ చిత్రం ‘అంజాన్’ (తెలుగులో ‘సికిందర్’) పుణ్యమా అని ఒక్కసారిగా వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఈ సినిమాలోని ఓ పాటలో సమంత టూ పీస్ బికినీలో కనిపించడం, డెనిమ్ షార్ట్‌లు - ఒళ్ళు కనిపించే తెల్ల చొక్కా - నుదుటన ఎర్ర స్కార్ఫ్‌తో సినిమాలో నర్తించడం ఇప్పుడు తెలుగు సినీ వర్గాల్లో చర్చ రేపింది. నిన్న మొన్నటి వరకు పాత్రలతో పాటు దుస్తులూ హుందాగా ఉండేలా జాగ్రత్తపడుతూ వస్తున్న ఈ యువ హీరోయిన్ ఒక్కసారిగా ఇలా సెక్స్ అప్పీల్ ఉండేలా డ్రెస్సింగ్ స్టయిల్ మార్చడం కెరీర్లో కొత్త దశకు సన్నాహం చేసుకోవడానికేనని విమర్శకుల వాదన. ఈ విషయంపై సమంత తాజాగా వివరణనిస్తూ... ‘‘నేను వేసుకున్న దుస్తుల గురించి ఇంత చర్చ జరుగుతుందని అనుకోలేదు’’ అంటూ అసలు సంగతి వివరించారు. జరిగింది ఏమిటంటే, పాట చిత్రీకరణకు కావాల్సిన దుస్తుల ఎంపికకు కేవలం రెండు రోజులే టైమ్ ఉందట. పాట కొద్దిగా జానపద ఫక్కీలో ఉంది కాబట్టి, దానికి ఆధునిక రంగు తేవడం కోసం షార్ట్‌లు వేసుకుందట సమంత. ఈ సినిమాలో తాను ఆ మాత్రం సెక్సీగా కనిపించడానికి సిద్ధపడ్డానంటే, అందుకు ఛాయాగ్రాహకుడు సంతోష్ శివన్ కారణమంటున్నారామె. ‘‘ఆయన ఉన్నారు కాబట్టి, తెరపై నేను చెత్తగా కనిపించనని నాకు నమ్మకం ఉంది. అందుకే, కాస్తంత గ్లామరస్‌గా కనిపించడానికి ఇదే మంచి అవకాశమనుకున్నా. ఇవాళ తెరపై అందంగా కనిపిస్తున్నానంటే, అది ఆయన చలవే’’ అని సమంత అన్నారు. ఈ సినిమా పుణ్యమా అని సినిమా రంగానికి వచ్చి అయిదేళ్ళయిన తరువాత ఇప్పుడు అందరూ సమంత కూడా సెక్సీగా కనిపించగలదంటూ ఒప్పుకోవడం ఈ అమ్మడికి ఆనందం కలిగిస్తోంది. ‘‘ఇన్నేళ్ళుగా దాదాపు ఒకే రకంగా చూసి చూసి ప్రేక్షకులకే కాదు, నా లుక్ మీద నాకే విసుగెత్తింది. అలాంటప్పుడు ‘అంజాన్’తో ఈ కొత్త గుర్తింపు రావడం ఆనందంగా ఉందంటోంది సమంత. మొత్తానికి, గతంలో మహేశ్‌బాబు ‘1 - నేనొక్కడినే’ సినిమా ప్రచార సమయంలో బీచ్‌లో హీరో నడుస్తుంటే, అతని వెనక హీరోయిన్ పాకుతున్న ఫోటో మీద కామెంట్‌తో వివాదాస్పదమైన సమంత ఈసారి మాత్రం కురచ దుస్తుల్లో, బికినీలో కనిపించడం విశేషమే. ఆ పేరు చెప్పి, చర్చ పెట్టదలుచుకోలేదు! అన్నట్లు హీరో సిద్ధార్థ్‌తో తనకున్న అనుబంధం గురించి రకరకాల వార్తలు వస్తున్నా, ఆ విషయం గురించి సమంత ఇప్పటికీ నోరు విప్పడం లేదు. ‘‘వ్యక్తి పేరెందుకు కానీ, ఒకరితో నా అనుబంధం ఎంతో సంతోషంగా సాగుతోంది. నలుగురితోనూ చెప్పి, దాన్ని పాడుచేసుకోదలుచుకోలేదు’’ అని తాజాగా వ్యాఖ్యానించారామె. ‘‘ఎవరేం రాసినా సరే, నటీమణులకు ఇబ్బం దికరంగా ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ, నేను అలా అనుకోవడం లేదు. నా వ్యక్తిగత ప్రేమ జీవితం గురించి బహిరంగ చర్చలు జరగడం నాకిష్టం లేదు’’ అని సమంత కుండబద్దలు కొట్టారు. ఆమె అభిప్రాయం గౌరవించదగినదే కదూ! -
బికినీలు వద్దు.. ధోతిలే ముద్దు!
పానాజీ: గోవా బీచ్ ల్లో బికినీలు ధరించడానికి వీల్లేదంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేసిన గోవా మంత్రి సుదీన్ ధావల్కర్ మరోసారి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. గోవా ప్రజలు సంప్రదాయ పద్దతిలో ధోతిలు ధరించాలని సుదీన్ పిలుపునిచ్చారు. ధోతి ధరించే భారతీయ సాంప్రదాయం ప్రపంచంలోనే గొప్ప సంస్కృతి అని అన్నారు. వర్షాకాలం అసెంబ్లీ సమావేశాలకు బీజేపీ శాసన సభ్యుడు విష్ణు వా ధోతి ధరించడంపై సుదీన్ స్పందించారు. విష్ణును స్పూర్తి తీసుకుని అందరూ థోతి ధరించాలన్నారు. యువతులు నైట్ క్లబ్ లో స్కర్టులు ధరించడం వల్ల గోవా సంస్కృతికి ముప్పు వాటిల్లుతోందని సుధీన్ ఇటీలవ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. -
బికినీకి సై అన్న శృతిహాసన్!
-
బికినీ- గోచీ పేచీ
సముద్రతీర అందాలకు నెలవైన గోవాలో బికినీ-గోచీ పేచీ కలకలం రేపింది. బీచుల్లో బికినీలను నిషేధించాలని ఓ మంత్రిగారంటే.. గోచీ పెట్టుకు తిరగడంటూ ఓ ఫ్యాషన్ డిజైనర్ రుసరుసలాడారు. దీంతో బికినీ-గోచీల చర్చ హాట్ టాఫిక్ గా మారింది. గోవా పేరు వినగానే అందరికీ గుర్తుకొచ్చేవి అందమైన బీచ్‌లు. అమ్మాయిలు బికినీలతో అరేబియా సముద్రంలో కేరింతలు కొడుతుండడం ఇక్కడ సర్వసాధారణం. అయితే బికినీ సంస్కృతితో తమ రాష్ట్రం భ్రష్టుపట్టిపడుతోందని ఆందోళన చెందిన గోవా ప్రజాపనుల శాఖ మంత్రి సుదీన్ దావలికర్ దీన్ని నిషేధించాలని గళమెత్తారు. ఎక్కడపడితే అక్కడ ఇలా 'టూపీస్' స్కర్టులు వేసుకు రావడం గోవా సంస్కృతికి ఏమాత్రం సరిపోదని, ఇలాగే కొనసాగితే ఏమైపోవాలని వాపోయారు. తాము దీన్ని అంగీకరించేది లేదని కుండబద్దలు కొట్టారు. బికినీ సంస్కృతిని నిషేధించాలన్న సుదీన్ దావలికర్ డిమాండ్‌పై ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ వెన్‌డెల్ రోడ్రిక్స్ ఘాటుగా స్పందించారు. పాశ్చాత్య పోకడలను, సంస్కృతిని నిషేధించాలనుకుంటే మంత్రే గోచీ పెట్టుకు తిరగాలని ఆయనకు పరోక్షంగా సూచించారు. విదేశాల్లో తయారైన ఫ్యాంటు, చొక్కాలు తొడుక్కోవడం మానేసి, శాలువా కప్పుకుని మీ శాఖకు వెళ్లగలరా అంటూ బహిరంగ లేఖ రాశారు. ఉచిత సలహాలు ఇవ్వడం మానేసి పాలనపై దృష్టి పెట్టాలని దావలికర్ కు కాంగ్రెస్ పార్టీ హితవు పలికింది. టూరిజంపై అధిక ఆదాయం ఆర్జించే గోవా.. సుదీన్ దావలికర్ డిమాండ్ తో ఒక్కసారిగా ఉలిక్కిపడింది. బికినీలను నిషేధించబోమని స్పష్టం చేసింది. బీచుల్లో బికినీ ధరించడాన్ని తమ ప్రభుత్వం వ్యతిరేకించడం లేదని గోవా సీఎం మనోహర్ పారికర్ అంటూ ఔదార్యం దాల్చడంతో వివాదం సద్దుమణిగింది. అయితే బికినీ-గోచీ పేచీ దేశంలోని అందరి దృష్టిని ఆకర్షించింది. -
ఆ తరం టు ఈ తరం
ఇప్పటికీ తరచు వార్తల్లో ఉండే బికిని ఎప్పుడో షష్టిపూర్తి చేసుకుంది. అయితేనేం... ఎప్పుడూ ‘హాట్’టాపిక్కే. ఈత దుస్తులుగా పుట్టుకొచ్చి... ఈతరం కూడా ఆచితూచి ఎంపిక చేసుకునే వస్త్రధారణగా తన ప్రత్యేకతను నిలబెట్టుకుంటోంది. అరవై ఎనిమిదేళ్ల బికిని సంగతులివి... బీచుల్లో బికినీలు నిషేధించాలని గోవా ప్రజా పనుల శాఖా మంత్రి సుదిన్ దావలికర్ ఇటీవల ఒక వివాదాస్పద వాఖ్య చేశారు. గోవా సంస్కృతికి బికినీలు గొడ్డలి పెట్టు అన్న ఈ మంత్రి వాఖ్యలపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. బహిరంగ ప్రదేశాలలో కురుచ దుస్తులు ధరించడం వల్ల మహిళలకు ప్రమాదం అని, అందుకే అలా అన్నానని ఈ మంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా ఇక నుంచి బికినీ బామల ఫొటోలతో పర్యాటక ప్రకటనలు చేయకూడదని నిర్ణయించుకున్నట్టుగా గోవా టూరిజమ్ శాఖ మంత్రి మరో హాట్ టాపిక్‌కి తెర తీశారు. ఇప్పటికే షష్టిపూర్తి వయసు దాటేసిన ‘బికిని’ ఇంకా హాట్ హాట్‌గా న్యూస్‌లో ఎందుకు చోటుచేసుకుంటున్నట్టు? ఒళ్లంతా కప్పుకుని ఒద్దికగా ఉండే మన సంస్కృతిలోకి ‘బికిని’ ఎప్పుడు ప్రవేశించింది? బీచ్ డ్రెస్‌గా మోత మోగిస్తున్న ‘బికిని’ పుట్టి ఈ రోజుకి 68 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా బికిని రూపవిలాసాలు తెలుసుకుందాం... పుట్టింది ప్యారిస్ ఇంట...: బికిని అనగానే పాశ్చాత్య ఈతకొలనులలో ఈదులాడే అందమైన అమ్మాయిల రూపాలు, వారు ధరించిన అతి కురుచ దుస్తులు కళ్లముందు కదులుతుంటాయి. టు పీస్ బికినీగా ప్రపంచమంతా ఆకట్టుకుంటున్న ఈ డ్రెస్‌ను మొదటిసారి ఫ్రాన్స్ దేశీయుడైన లూయిజ్ రియర్డ్ రూపకల్పన చేశాడు. ఇతను రూపొందించిన బికినీని ‘బెర్నార్డి’ అనే ఫ్రెంఛ్ మోడల్ ధరించి జూలై 5, 1946లో ప్యారిస్ ఫ్యాషన్ షోలో హొయలు పోయింది. ఆ విధంగా ప్రపంచ ప్రజల దృష్టిని ఆకట్టుకుంది బికిని. ప్రపంచమంతా పరుగులు: పసిఫిక్ మహా సముద్రంలోని మార్షలీస్ దీవులలో ‘బికిని అటోల్’ అనేది ఒక దీవి పేరు. ఇక్కడ అమెరికా మొదటిసారి అణుబాంబు పరీక్షలు జరిపింది. ఈ దీవి పేరునే టూ పీసెస్ డ్రెస్‌కు పెట్టారు లూయిజ్ రియర్డ్. ‘వరల్డ్ స్మాలెస్ట్ బాతింగ్ సూట్’గా ప్రకటనలలో విజృంభించి అటు తర్వాత ఫిలిప్పీన్స్, బాలి, హవాలి, గోవా... వంటి ఎన్నో బీచ్‌లలో రంగురంగులుగా పరుగులు పెడుతోంది బికిని. బికినీతో పాటు పై నుంచి కింది వరకు ఒళ్లంతా కవర్ చేసే స్విమ్సూట్లెన్నో మార్కెట్లోకి వచ్చాయి మీకుతెలుసా! 20వ శతాబ్దపు ఫ్యాషన్ చరిత్రను తిరగేస్తే విస్మయానికి లోనుచేసే విషయాలు ఎన్నో తెలుస్తాయి. శరీర సౌష్టవం చక్కగా కనిపించేలా ఒంటికి అతుక్కుపోయే పొడవాటి స్కర్ట్లు, స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్ ధరించడం మొదలుపెట్టారు. 1920లో క్రీడాకారులు స్లీవ్‌లెస్ టాంక్ సూట్స్‌ను ఈత సమయాలలో ధరించేవారు 1930లో కాటన్ ప్రింటెడ్ మెటీరియల్‌తో మార్కెట్లోకి వచ్చిన ఒన్పీస్ బాతింగ్సూట్ 20వ శతాబ్ధపు అతి చెత్త ఫ్యాషన్ జాబితాలో చేరింది 1931లో బీచ్‌లకు ప్రత్యేకం అనిపించే ‘కోర్సెట్’ స్విమ్సూట్లు మార్కెట్లోకి వచ్చాయి 1940ల కాలంలో మహిళల శరీరాకృతికి తగిన విధంగా స్ట్రాప్‌లెస్, సన్నని స్ట్రాప్స్.. వంటి రకరకాల స్విమ్ సూట్స్‌ని తయారుచేశారు 1950ల కాలం నుంచి నేటి వరకు ఈ తరహాను పోలిన స్విమ్ సూట్స్ కనిపిస్తున్నాయి. 1960ల కాంలో నైలాన్ లేదా లిక్రా లేదా ఈ రెంటినీ పోలిన మెటీరియల్స్‌తో స్విమ్సూట్ను తయారుచేసేవారు. ఈ తరహా గార్మెంట్స్ సాగడం, ఒంటికి హత్తుకున్నట్టు సౌకర్యంగా ఉండటంతో బాగా ప్రాచుర్యం పొందాయి. స్పాండెక్స్ మెటీరియల్‌తో తయారైన స్విమ్‌సూట్స్ ప్రపంచమంతటా ఆకట్టుకుంటున్నాయి. కాటన్, పాలియస్టర్ కలిపి తయారుచేయడంతో చూడటానికి, ధరించడానికి సౌకర్యంగా ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్. సాగే గుణం గల ఈ ఫ్యాబ్రిక్ దీర్గకాలం మన్నుతుంది. డిజైనర్ సూచనలు స్విమ్ సూట్ / బికిని ఎంపిక శరీరాకృతికి తగిన విధంగా ఉండాలి. టాప్స్... బాండేయు: శరీరాకృతి తీరుగా ఉన్నవారు స్ట్రాప్స్లేని బాండేయు టాప్ స్టైల్ స్విమ్ వేర్‌ను ఎంచుకోవాలి. ట్రయాంగిల్: మెడ, వీపు భాగంలో ముడులు వేసుకొని అడ్జెస్ట్ చేసుకునే స్టైల్ ఇది. ఛాతి పరిమాణం తక్కువగా ఉన్నవారికి ఇవి నప్పుతాయి. అండర్‌వైర్: ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారి నుంచి తక్కువ ఉన్నవారి వరకూ ఈ స్టైల్ నప్పుతుంది. హాల్టర్: ఈ స్టైల్లో వెడల్పాటి పట్టీలు ఉండటంలో ఛాతి భాగంలో మరింత సపోర్టివ్‌గా ఉంటుంది. టాన్‌కిని: ఉదరభాగాన్ని కూడా కవర్చేసే స్టైల్ ఇది. బాటమ్స్... బ్రెజిలియన్: పిరుదల భాగం బాగున్నవారికి ఈ స్టైల్ నప్పుతుంది. సైడ్టై: రెండు వైపులా ముడులు వేసుకోవడానికి స్ట్రాప్స్ ఉంటాయి. పిరుదల భాగాన్ని తక్కువ కవర్ చేస్తుంది. హిప్స్టర్: ఈ బాటమ్ సైడ్స్ విశాలంగా ఉండటం వల్ల పిరుదుల భాగం ఎక్కువ కవర్ అవుతుంది. హై వెయిస్టెడ్: పొత్తికడుపు ఎత్తు ఉన్నవారికి నప్పుతుంది. స్కర్టెడ్: బాటమ్‌కి సరిపడా స్కర్ట్ కూడా అటాచ్ అయి ఉంటుంది. నోట్: జియోమెట్రిక్ ప్రింట్స్ స్విమ్‌వేర్/బికినీ ఈ ఏడాది (2014) ట్రెండ్‌గా మారింది. సినిమాలలో బికిని... మొదటిసారి స్విమ్సూట్ను పోలిన డ్రెస్ వేసిన తార మీనాక్షి శిరోద్కర్. ‘బ్రహ్మచారి’ (1938) అనే మరాఠీ సినిమాలో ఈమె ఈత కొలనులో సింగిల్ పీస్ స్విమ్ సూట్లో కనిపించి ప్రేక్షకులను విస్మయానికి లోనుచేశారు. మన బాలీవుడ్ తారలు నమ్రతశిరోద్కర్, శిల్పా శిరోద్కర్‌ల బామ్మ మీనాక్షి శిరోద్కర్. మొట్టమొదట బాలీవుడ్లో ‘యాన్ ఈవెనింగ్ ఇన్ ప్యారిస్ (1967) సినిమాలో బికినీలో కనిపించిన హీరోయిన్ షర్మిలా ఠాగూర్. ఈ సినిమాలో ఒన్ పీస్ బాతింగ్ సూట్లో కనిపించా రు ఈమె. ఆ తర్వాత డింపుల్ కపాడియా బాబీ (1973) సినిమాలో... ఆ తర్వాత వరుసగా హీరా పన్నా, పర్వీన్ బాబి స్విమ్‌సూట్‌లో కనువిందుచేశారు. తెలుగు సినిమాలలో నాటి తరం హీరోయిన్ లు లక్ష్మి మొదలుకొని మాధవి వరకు స్విమ్ సూట్లో మెరిశారు. నేటితరం తారలలో నయనతార, అనుష్క, దీపిక పదుకొనెలు బికినీ భామల జాబితాలో తొలి మూడు స్థానాలలో ఉన్నారు. ఆ తర్వాత ఇలియానా, ప్రియమణి, శ్రీయ, కాజల్, నమిత, శృతిహాసన్, సదా, అంకిత, లక్ష్మీరాయ్, దీక్షాసేథ్... తదితరులు ఉన్నారు. ఆత్మవిశ్వాసం తప్పనిసరి... మిగిలిన వస్త్రధారణల్లా కాకుండా బికినీ ధారణకు తప్పనిసరిగా చక్కని శరీరాకృతి ఉండాల్సిందే. అత్యంత ఆత్మవిశ్వాసం కలిగిన యువతులు మాత్రమే ధరించగలరు. నేనూ బికినీ డిజైన్స్ చేశాను. మన దేశంలో బికినీ కల్చర్ బాగా తక్కువ కాబట్టి, వీటిని కోరుకునేవారు ఫ్యాషన్ డిజైనర్స్‌ను సంప్రదించాల్సిందే. -జుబిన్వకీల్, ఫ్యాషన్డిజైనర్ -
ఆన్లైన్లో స్విమ్ సూట్‌ను కొనుగోలు చే యాలంటే...
షాపింగ్ ఇటీవల షాపులకు వెళ్లి, కొంత టైమ్ కేటాయించి నచ్చిన వాటిని ఎంచుకునే సమయం అందరికీ ఉండటం లేదు. దీంతో ఆన్లైన్ షాపింగ్ పట్ల ఆసక్తి పెరుగుతోంది. ఆన్లైన్లో స్విమ్ సూట్ కొనుగోలు చేయాలంటే... రూల్ వన్: మీ శరీర సౌష్టవం ఏ తరహాలో ఉంటుందో చెక్ చేసుకోవాలి. ఛాతి పరిమాణం ఎక్కువ ఉన్నవారు అడ్జస్టబుల్ స్ట్రాప్స్ ఉన్న బికినీ ఎంచుకుంటే మేలు. పొట్ట దగ్గర ఎక్కువ ఫ్యాట్ ఉంటే ఆ భాగాని కవర్ చేసే చిన్న ప్రింట్లు ఉన్న స్విమ్ సూట్ ఎంపిక సరైనది. ప్రముఖ స్విమ్‌వేర్ కంపెనీలు ఆన్లైన్ చాటింగ్ ద్వారా కొనుగోలుదారుల సందేహాలను తీరుస్తున్నాయి. వాటిని ఫాలో అవడం మంచిది. రూల్ టు: మీకు నచ్చిన సూట్స్ కనీసం 2 కొలతలలో ఆర్డర్ ఇవ్వాలి. సైజ్ చార్ట్‌లో సూచించిన సైజ్, ఆ తర్వాతి సైజ్ సూట్‌ను ఆర్డర్ చేసుకోవడం మేలు. రూల్ త్రీ: కొన్ని రకాల డిజైన్లు, ప్రింట్లు ఆన్లైన్లో చూడగానే నచ్చుతాయి. కాని ధరిస్తే అవి అంతగా నప్పవు. రంగులు, డిజైన్లు గల మరో క్లాత్‌తో మీకు ఆ తరహా ప్రింట్లు నచ్చుతాయో లేదో చెక్ చేసుకొని, ఆర్డర్ ఇవ్వడం మేలు. -
బికినీకి దూరం
టీ.నగర్: తనకు ఎంత డబ్బు ఇచ్చినా బికినీ దుస్తుల్లో నటించేది లేదని నటి యామిగౌతం ఖరాఖండిగా తెలిపారు. రాధామోహన్ దర్శకత్వంలో గౌరవం చిత్రంలో నటించారు యామి గౌతం. తమిళ్ సెల్వనమ్ తనియా అంజలుమ్ చిత్రంలో ప్రస్తుతం నటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు కాబోయే భర్త మనిషిగా కాకుండా రోబోగా ఎంపిక చేసుకుంటే బాగుం టుందని తన స్నేహితులు తనను ఆటపట్టిస్తుంటారని అన్నారు. తనను గౌరవించే మనస్తత్వం, ఆత్మాభిమానం కలిగిన వ్యక్తి తనకు భర్తగా రావాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆయన ప్రేమతో తనను ఆకర్షించాలని కూడా వివరించారు. తన మన స్తత్వం లాగానే అతని మనస్తత్వం ఉండాలని ఇందులో రాజీ పడే ప్రసక్తి లేదని తెలిపారు. తాను సహకరించే నటిని మాత్రమేనని అయితే తనకు అసౌకర్యం కల్పించే సన్నివేశాల్లో నటించబోనన్నారు. అంతేకాకుండా ఈత దుస్తుల్లో నటించబోనని స్పష్టం చేశారు. పెద్ద బ్యానర్, భారీ పారితోషికం అందచేసినప్పటికీ తన విధానం మార్చుకోనన్నారు. -
బికిని ఫొటో షూట్ తో మత్తెక్కించిన క్వీన్ కంగనా రనౌత్
-
బికినీలో ముగ్గురు బ్యూటీలు
ముగ్గురు ముద్దుగుమ్మలు... అదీ బికినీలో... మరి కుర్రాళ్లకు కనువిందు ఖాయం. నిద్ర ఖరాబు కావడం అంతకన్నా ఖాయం. దర్శక నిర్మాత సాజిద్ ఖాన్ 'హమ్ షకల్' లో డస్కీ బ్యూటీ బిపాశా బసు, నటి మోడల్ ఈశా గుప్తా, మిల్కీ బ్యూటీ తమన్నాలు బికినీలో కనిపించనున్నారు. అయితే ఈ అందాల ఆరబోతంతా సినిమాలోని ఒక సీనులో మాత్రమేనట. ఈ ముగ్గురమ్మలూ తమ శరీరాకృతికి సరిపోయే బికినీలు తామే సెలక్ట్ చేసుకుంటున్నారట. అంతే కాదు సెలెక్ట్ చేసుకున్న బికినీలకు తగిన శరీరాకృతిని సాధించుకునే పనిలో పడ్డారట. తన ప్రతి సినిమాలోనూ ఒక బికినీ సీనును తప్పనిసరిగా ఉంచే సాజిద్ ఈ సినిమాలోనూ అదే ఆచారాన్ని పాటించాడు. ఈ సినిమాలో సైఫ్ అలీ ఖాన్, రితేశ్ దేశ్ ముఖ్, రామ్ కపూర్ లు హీరోలు. సినిమాను వాశూ భగ్నానీ నిర్మిస్తున్నారు. ఈ సినిమా జూన్ 20 న విడుదలవుతుంది. -
నేను బికినీ ధరించను
కథానాయికలు బికినీ దుస్తులు ధరించడం అనేది ఇవాళ సర్వసాధారణం అయిపోయింది. అదేమంటే కథ డిమాండ్ మేరకేనంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలే విచ్చలవిడి అవుతుంటే బికినీ దుస్తులు గురించి అంతగా ప్రస్తావిస్తున్నారేమిటని అంటారా? నయనతార, అనుష్క లాంటివారే ఈత దుస్తుల్లో తెరపై అందాలు ఆరబోశారు. అలాంటిది నటి తమన్న మాత్రం బికినీ దుస్తులు ధరించనని మొరాయించారట. అదేమిటి తెలుగు చిత్రాల్లో తడి తడి అందాలతో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించిన ఈ బ్యూటీ బికినీకి నో అన్నారా? అని ఆశ్చర్యపోతున్నారా? అయినా ఇది నమ్మాల్సిందే. తమన్నకు ప్రస్తుతం దక్షిణాదిలో ఎక్కువ అవకాశాలు లేవు. ప్రస్తుతం ఈ బ్యూటీ తమిళంలో ఆర్య సరసన రాజేష్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ఈ చిత్రం సెప్టెంబరులో సెట్‌పైకి రానుంది. వీరం చిత్రం తరువాత తమన్న నటించనున్న తమిళ చిత్రం ఇదే. తెలుగులో రెండు చిత్రాలు చేస్తున్నారు. కాగా హిందీలో హమ్‌షకల్స్ అనే చిత్రంలో సైప్ అలీఖాన్ సరసన నటిస్తున్నారు. షాహిద్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో బికినీ దుస్తులు ధరించాలని దర్శకుడు చెప్పడంతో సారీ అంటూ షూటింగ్ స్పాట్ నుంచి బయటకు వచ్చేశారని సమాచారం. ఆ తరువాత మళ్లీ తర్జన భర్జన పడి బికినీ దుస్తులు ధరించడానికి తమన్న అంగీకరించారని బాలీవుడ్ రూమర్. అయితే అదంతా తప్పుడు ప్రచారం అంటున్నారు తమన్న. తాను చిత్రాన్ని అంగీకరించి ఒప్పందం చేసుకున్నప్పుడే లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించేది లేదని, బికినీ దుస్తులను దరిదాపులకు కూడా రానీయనని స్పష్టంగా దర్శక నిర్మాతలకు చెప్పేశానన్నారు. టాలీవుడ్, కోలీవుడ్‌తోపాటు బాలీవుడ్‌లోనూ ఇలాంటి విషయాల కారణంగా కొన్ని చిత్రాలను వదులుకున్నానని తెలిపారు. -
స్కిన్ షోకు దూరం
బికిని వంటి బిగుతైన దుస్తులు, అరకొర డ్రస్‌తోనే శృంగారం ఆవిష్కృతమవుతుందనుకోవడం పొరపాటని నటి రమ్యానంబీశన్ పేర్కొన్నారు. ఈ మాలీవుడ్ బ్యూటీ తమిళం, మలయాళం, కన్నడం భాషల్లో హీరోయిన్గా నటిస్తూ బిజీగా ఉన్నారు.ఆమె మంచి గాయని కూడా. పాండియనాడు చిత్రంలో ఈ అమ్మడు పాడిన ఫై ఫై ఫై కలాచీ ఫై పాట వాడవాడలా మారుమోగుతోంది. ఈ ముద్దుగుమ్మ నటించిన తాజా చిత్రం డమాల్ డుమీల్ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఆమెతో చిన్న భేటి. ప్ర : మునుపటికంటే చాలా స్లిమ్‌గా తయారైనట్టున్నారు? జ: అందుకు చాలా కసరత్తులు చేస్తున్నాను. హీరోయిన్లకు అందం ప్రధానాకర్షణ కదా..! ప్ర : హీరోయిన్గా అవకాశం వస్తే పాడే ఛాన్స్ కోరుతూ షరతులు విధిస్తున్నారట? జ : అదంతా మీడియా ప్రచారం. ఇప్పటి వరకు ఏ దర్శక నిర్మాతలకు అలాంటి షరతులు విధించలేదు. నేను మలయాళ నటి అయినా తమిళ భాష స్పష్టంగా మాట్లాడగలను. పాడడమంటే చాలా ఇష్టం. ఇప్పటి వరకు మలయాళంలో 20 పాటలకు పైగా పాడాను. తమిళంలో పాండియనాడు చిత్రంలో ఫై ఫై ఫై కలాచీ ఫై పాటకు నా తమిళ ఉచ్ఛరణ చాలా హస్కిగా ఉందంటూ ప్రశంసలు అందుకున్నాను. డమాల్ డుమీల్ చిత్రంలో ముంబాయి ప్రముఖ గాయని ఉషా ఉతప్ ఒక పాట పాడారు. ఆమె నా అభిమాన గాయని. దర్శక నిర్మాతల కోరిక మేరకే నేను ఒక పాట పాడాను. ప్ర: నటిగా, గాయనిగా వేర్వేరు పారితోషికాలు పొందుతున్నారా? జ: నేను హీరోయిన్గా నటించే చిత్రానికి పాడితే గాయనిగా పారితోషికం తీసుకోను. ఇతర చిత్రాల్లో తగినంత వసూలు చేస్తాను. ప్రస్తుతం అరుళ్‌నిధి సరసన నటిస్తున్న నాలు పోలీసుం నల్లా ఇరుంద ఊరు చిత్రంలో కూడా ఒక పాట పాడాను. అదే విధంగా బర్మా అనే చిత్రంలో కూడా నా పాటవినవచ్చు. నా తొలి ప్రాధాన్యత మాత్రం నటనకే. ప్ర : తమిళంలో ఎక్కువ చిత్రాలు చేయడం లేదే? జ : పిజ్జా చిత్రం తర్వాత చాలా అవకాశాలు వస్తున్నాయి. మల యాళం, కన్నడ భాషల్లో కూడా నటిస్తుండడంతో కాల్ షీట్స్ సమస్య ఏర్పడుతోంది. అందువల్ల తమిళంలో కొన్ని అవకాశాలను అం గీకరించలేకపోతున్నాను. ఆ మధ్య తెలుగులో నటిం చాను. హిందీలోనూ అవకాశాలు వస్తున్నాయి. బాలీవుడ్ రంగ ప్రవేశం గురించి ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ప్ర: బికిని దుస్తులకు దూరం అంటున్నారటగా? జ : స్కిన్ షో ప్రదర్శించాల్సిన అవసరం మాత్రం లేదు. మోడ్రన్ దుస్తుల్లో గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు. కథ విన్నప్పుడు ఏ సన్నివేశంలో ఎలా నటిస్తానన్న విషయాన్ని దర్శక నిర్మాతలకు చెప్పేస్తాను. అందువల్ల ఇప్పటి వరకు ఏ షూటింగ్లోను ఎలాంటి సమస్య ఎదురవ్వలేదు. అయినా బికిని లాంటి కురుచ దుస్తుల్లోనే కాదు సాధారణ దుస్తుల్లోను శృంగారాన్ని ఆవిష్కరించవచ్చు. ప్ర: నాన్ శిగప్పు మనిధన్ చిత్రంలో నటి లక్ష్మీమీనన్ ముద్దు సన్నివేశాల గురించి? జ: ఇది నాకు అవసరం లేని అంశం. ఇతర నటీమణులు ఏం చేస్తున్నారన్న విషయాల గురించి నన్ను అడగకండి. నా వరకు ముద్దు సన్నివేశాల్లో నటించడం నచ్చదు. ప్ర : మీప్రేమ, పెళ్లి విషయాల గురించి? జ : ఆ విషయాల గురించిన ప్రస్తావన ఇప్పుడొద్దు. ప్రేమ, పెళ్లి అంటూ అనవసర ప్రశ్నలతో నా సమయాన్ని వృథా చేయవద్దు. -
బికినీలో మారిషస్ బీచ్‌లో...
బాలీవుడ్లో నిలదొక్కుకోవడం అనేది కథానాయికలకు ఓ లక్ష్యంగా మారిపోయింది. దానికోసం వాళ్లు భారీ త్యాగాలకు కూడా వెనుకాడటం లేదు. దక్షిణాదిలో పద్ధతిగా కనిపించిన కథానాయికలందరూ బాలీవుడ్ కెమెరా ముందుకు రాగానే... హాట్ హాట్‌గా మారిపోతారు. ఈ విషయంపైనే నిన్నటిదాకా ఇలియానా చర్చనీయాంశమైంది. ఇప్పుడు తమన్నా వంతు వచ్చింది. దక్షిణాదిలోని కొన్ని సినిమాల్లో ట్రెండీగా కనిపించినా... తమన్నా ఎక్కడా హద్దులు దాటలేదు. కానీ... ఇటీవల ఓ బాలీవుడ్ సినిమా కోసం ఏకంగా బికినీ ధరించేసిందట తమన్నా. బికినీ వేయడమే కాదు, ఆ డ్రెస్‌లో మారిషస్ బీచ్‌లో స్టెప్పులు కూడా వేసిందట. ఇంతకీ తమన్నా... ఇలా నర్తించిన సినిమా ఏంటా? అనుకుంటున్నారా! ఆ సినిమా పేరు ‘హమ్ షకల్స్’. సైఫ్ అలీఖాన్, రితీష్ దేశ్‌ముఖ్ ఇందులో హీరోలు కాగా, బిపాసా బసు, ఇషా గుప్త, తమన్నా హీరోయిన్లు. మిగతా నాయికలను ఎలాగైనా డామినేట్ చేయాలనే తమన్నా ఈ సాహసం చేసిందని బాలీవుడ్ టాక్. బికినీలో పాలరాతి శిల్పంలా అనిపించే తమన్నా అందాలు యువతను కట్టిపడేస్తాయనడంలో సందేహం లేదని ‘హమ్ షకల్స్’ దర్శకుడు సాజిద్ ఖాన్ చెబుతున్నారు. జూన్ 20న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. -
ఎక్స్‌పోజింగ్‌కు వెంపర్లాడుతున్న హీరోయిన్లు
ఇతర ప్రాంతాల నుంచి శృంగార తారల రాక అధికమవడంతో దక్షిణాది తారలు ఎక్స్పోజింగ్ కోసం సంకోచించడం లేదు. గతంలో బికినీ దుస్తులు ధరించేందుకు విముఖత చూపిన హీరోయిన్లు కూడా ప్రస్తుతం అంగాంగ ప్రదర్శనకు సిద్ధమవుతున్నారు. పాకిస్థాన్ నటి వీణా మాలిక్, బాలీవుడ్ నటి మల్లికా షెరావత్, టాప్‌లెస్ నటీమణులు షెర్లిన్ చోప్రా, సన్నిలియోన్ వంటి తారల ఆకస్మిక చిత్రరంగ ప్రవేశం మిగతా హీరోయిన్లకు తలనొప్పిగా పరిణమించింది బెడ్ రూం సీన్ అయినా, అర్ధనగ్న సన్నివేశమైనా అభ్యంతరం చెప్పకుండా ఒప్పుకుంటున్న సన్నీలియోన్ తదితరులు మిగతా భాషా చిత్రాల్లోను, దక్షిణాది చిత్రాల్లోను నటించేందుకు సిద్ధమవుతున్నారు. వీరి రాకతో తమ అవకాశాలు చేయిజారిపోకుండా ఉండేందుకు ఏ మేరకు దుస్తుల్లో పొదుపు పాటించాలో, బెడ్ రూం సన్నివేశాల్లో ఎలా జీవించాలో క్షుణ్ణంగా నేర్చుకుంటున్నారు. లిప్‌లాక్ సన్నివేశాలు సర్వసాధారణంగా మారాయి. కుటుంబ కథా చిత్రాల కథానాయకిగా ముద్రపడిన గుంకీ (గజరాజు) హీరోయిన్ లక్ష్మీమీనన్‌కు తన ఐదవ చిత్రంలోనే లిప్ టు లిప్ ముద్దు సన్నివేశంలో నటించాల్సిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఁనాన్ సిగప్పు మనిదన్* చిత్రం కోసం ఇటీవల లిప్ టు లిప్ సీన్ చిత్రీకరించారు. రేసు గుర్రర చిత్రంలో శ్రుతిహాసన్ బెడ్రూం సీన్లో అసభ్యంగా నటించినట్లు మహిళా సంఘాలు నిరసనలు తెలిపాయి. ఁచంద్రా* చిత్రంలో నటి శ్రీయ జాకెట్ ధరించకుండా నటించారు. టాప్‌లెస్ నటీమణుల సినీ ప్రవేశం, సెక్స్ చిత్రాలను ప్రోత్సహించే విధంగా ఉందని, అయినప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగే అవకాశం లేదని చిత్రవర్గాలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నాయి. -
బికినీ షాట్‌తో మంచి ఓపెనింగ్స్ వస్తాయట!!
-
రణవీర్‌తో లిప్‌లాక్‌కు సోనాక్షి నో!
బికినీ, లిప్‌లాక్... బాలీవుడ్లో ఈ రెండూ కామన్. వీటికి ‘సై’ అనని కథానాయికలు అక్కడ నిజంగా అరుదే. కానీ... శత్రుఘ్నసిన్హా తనయ సోనాక్షి సిన్హా కేవలం వీటి కారణంగా ఓ భారీ సినిమానే తృణప్రాయంగా వదిలేశారట. ప్రస్తుతం బాలీవుడ్లో చర్చనీయాంశమైన విషయం ఇది. ఇంతకీ సోనాక్షి తిరస్కరించిన ఆ సినిమా ఏంటనుకుంటున్నారా? విషయం ఏంటంటే... ‘రామ్‌లీలా’తో స్టార్‌స్టేటస్ సొంతం చేసుకున్న రణవీర్‌సింగ్ హీరోగా ‘లుటేరా’ దర్శకుడు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందుతోంది. ఇందులో నాయికగా ముందు సోనాక్షిని అనుకున్నారు. అయితే... కథ రీత్యా బికినీ ధరించాల్సిఉంది. అలాగే... ఓ లిప్‌లాక్ కూడా ఉంది. ఈ విషయాలను తెలుసుకున్న సోనాక్షి నిర్మొహమాటంగా ఆ సినిమా చేయనని చెప్పాశారట. అయితే, సోనాక్షి ఈ సినిమాను కాదనడానికి అసలు కారణం ఇది కాదని మరో వాదన కూడా ఉంది. ఇటీవల రిలీజైన ‘రామ్‌లీలా’ చిత్రంలో తొలుత సోనాక్షి పేరును సంజయ్‌లీలా భన్సాలీ పరిశీలనలోకి తీసుకున్నారట. అయితే... దీపికా పదుకొనే వైపు రణవీర్ మొగ్గుచూపడంతో ఆ చిత్రంలో నటించే అవకాశం సోనాక్షికి మిస్ అయినట్టు సమాచారం. అందుకే టిట్ ఫర్ ట్యాట్ అన్నట్టుగా రణవీర్‌కి ‘నో’ చెప్పారట సోనాక్షి. -
బికినీకి రెడీ
ప్రస్తుతం యూత్‌ను టార్గెట్ చేస్తూ రూపొందుతున్న చిత్రాలే అధికం అన్నది ఎవరూ కాదనలేని నిజం. అలాంటి వారు కోరుకునే అంశాల్లో కథానాయికల అందచందాలు ఒకటి. అలాంటి అందాలారబోతకు మన హీరోయిన్లెప్పుడూ ముందుంటారన్నది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అయితే కొందరు గ్లామర్ విషయంలో కొన్ని హద్దులు విధించుకుంటామంటారు. అయితే బికినీ ధరించడానికి అంగీకరించే భామల సంఖ్య తక్కువనే చెప్పాలి. ఇంతకుముందు బిల్లా చిత్రంలో నటి నయనతార, నమిత పోటీపడి బికినీలో అందాలను ఆరబోశారు. నటి ప్రియమణి తెలుగు చిత్రం ద్రోణాలో మరింత మితిమీరి సొగసును వెండితెరపై పరిచారు. తాజాగా కాజల్ బికినీలో యువతను మత్తెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ సుందరికి చిత్రాల సంఖ్య తగ్గిందనే కంటే ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న జిల్లా మినహా ఒక్క చిత్రం చేతిలో లేదు. తదుపరి కమల్ చిత్రంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతున్నా అధికారిక సమాచారం లేదు. దీంతో మళ్లీ అవకాశాలను రాబట్టుకోవడానికి ఈ ముద్దుగుమ్మ గ్లామర్ బాటను ఎంచుకున్నట్లుంది. జిల్లా చిత్రంలో తడితడి అందాలతో కుర్రకారును కిర్రెక్కించడానికి సిద్ధం అవుతున్నారు. కథకు అవసరం అవడంతో కొన్ని సెకన్లు మాత్రమే ఉండే సన్నివేశాల్లో కాజల్ బికినీ దుస్తుల్లో కాస్త శ్రుతిమించి గ్లామర్‌ను ప్రదర్శించినట్టు చిత్ర యూనిట్ పేర్కొన్నారు. అయితే హీరోయిన్ల మధ్య పోటీ అధికం అవుతోందన్నది నిజం. దాన్ని ఎదుర్కొని నిలబడాలంటే గ్లామర్ విషయంలో పట్టువిడుపులు అవసరమనే భావనతోనే కాజల్ అగర్వాల్ బికినీ సొగసులను ఆరబోయడానికి సిద్ధం అయినట్లు తెలుస్తోంది. -
టూ పీస్ బికినీలో...
టాలీవుడ్లో కాస్త పద్దతిగా కనిపించడం, కోలీవుడ్‌కి వెళ్లగానే.... అందాలను వెండితెరపై విస్తారంగా ఆరేయడం కథానాయికలకు పరిపాటే. ఆ విషయంలో తాను మినహాయింపేమీ కాదు అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అక్కడ విజయ్‌తో ‘జిల్లా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ గ్లామర్ పరిధుల్ని దాటిందని యూనిట్ సభ్యుల సమాచారం.విజయ్, కాజల్ కలిసి నటించిన ‘తుపాకీ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విజయం సాధించడంతో అదే ఫీట్ మళ్లీ రిపీట్ అవుతుందనే ఆశతో... తన తదుపరి చిత్రంలో కూడా కాజల్‌నే కథానాయికగా ఎంచుకున్నారు విజయ్. ఆయన ఆకాంక్షను నిజం చేయాలని కాజల్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బికినీ వేయడానికి కూడా కాజల్ వెనుకాడటం లేదని సమాచారం. కథ రీత్యా ఈ సినిమాలో స్విమ్మింగ్‌పూల్ సన్నివేశం ఉందట. రెండు నిమిషాల నిడివి గల ఈ సన్నివేశంలో కాజల్ టూ పీస్ బికినీ వేయడానికి పచ్చజెండా ఊపేశారని తెలిసింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాతో యువతరాన్ని కాజల్ కిర్రెక్కించడం ఖాయం అని వేరే చెప్పాలా! -
బికినీకి రెడీ...
సోహా అలీఖాన్ తల్లి షర్మిలా టాగోర్ ఒకప్పుడు ఫేమస్ హీరోయిన్. అన్నయ్య సైఫ్ అలీఖాన్... ప్రెజెంట్ స్టార్ హీరో. దానికి తోడు పటౌడీ రాజవంశం నేపథ్యం. ఇవేవీ సోహాకు బాలీవుడ్లో ప్రాచుర్యం తీసుకురాలేకపోయాయి. అందుకే తన రూట్ మార్చాలనుకుంటున్నారామె. సంప్రదాయ ధోరణిని వదిలేసి ఫుల్ గ్లామర్‌తో బాలీవుడ్‌ని షేక్ చేయాలనుకుంటున్నారు. అందుకే తెరపై బికినీతో కనిపించేందుకు సోహా ఓకే చెప్పేశారు. గౌరవప్రదమైన వంశం నుంచి వచ్చిన సోహా బికినీతో నటిస్తున్నారనే వార్త బాలీవుడ్లో హాట్ టాఫిక్‌గా నిలిచింది. ‘రంగ్‌దే బసంతి’ చిత్రంలో ప్రేక్షకులను ఆకట్టుకున్న సోహా, ఆతర్వాత తుమ్ మిలే, సాహెబ్ బీవీ ఔర్ గ్యాంగ్‌స్టర్ చిత్రాల్లో అభిమానులను ఆకర్షించడంలో దారుణంగా విఫలమయ్యారు. తాజాగా ’మిస్టర్ జో బి కార్వాల్హో’ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రను పోషించారామె. అయితే పాత్ర డిమాండ్ మేరకు వివిధ అవతారాల్లో ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ కనిపించనున్నారు. క్యాబరే డాన్సర్‌గా కనిపించడమేకాకుండా.. సాహోసోపేతమైన పోరాటల్లో కూడా నటిస్తున్నారామె.