టూ పీస్ బికినీలో...
టూ పీస్ బికినీలో...
Published Thu, Dec 5 2013 2:36 AM | Last Updated on Tue, Oct 30 2018 5:58 PM
టాలీవుడ్‌లో కాస్త పద్దతిగా కనిపించడం, కోలీవుడ్‌కి వెళ్లగానే.... అందాలను వెండితెరపై విస్తారంగా ఆరేయడం కథానాయికలకు పరిపాటే. ఆ విషయంలో తాను మినహాయింపేమీ కాదు అంటున్నారు కాజల్ అగర్వాల్. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అక్కడ విజయ్‌తో ‘జిల్లా’ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో కాజల్ గ్లామర్ పరిధుల్ని దాటిందని యూనిట్ సభ్యుల సమాచారం.విజయ్, కాజల్ కలిసి నటించిన ‘తుపాకీ’ చిత్రం తమిళంతో పాటు తెలుగులోనూ విజయం సాధించడంతో అదే ఫీట్ మళ్లీ రిపీట్ అవుతుందనే ఆశతో... తన తదుపరి చిత్రంలో కూడా కాజల్‌నే కథానాయికగా ఎంచుకున్నారు విజయ్.
ఆయన ఆకాంక్షను నిజం చేయాలని కాజల్ కూడా గట్టిగానే ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగా బికినీ వేయడానికి కూడా కాజల్ వెనుకాడటం లేదని సమాచారం. కథ రీత్యా ఈ సినిమాలో స్విమ్మింగ్‌పూల్ సన్నివేశం ఉందట. రెండు నిమిషాల నిడివి గల ఈ సన్నివేశంలో కాజల్ టూ పీస్ బికినీ వేయడానికి పచ్చజెండా ఊపేశారని తెలిసింది. సంక్రాంతికి విడుదల కానున్న ఈ సినిమాతో యువతరాన్ని కాజల్ కిర్రెక్కించడం ఖాయం అని వేరే చెప్పాలా!
Advertisement
Advertisement