
‘ది ఇండియా స్టోరీ’లో భాగం అయ్యారు హీరోయిన్ కాజల్ అగర్వాల్. శ్రేయాస్ తల్పాడే హీరోగా చేతన్ డీకే దర్శకత్వంలో ‘ది ఇండియా స్టోరీ’ అనే మూవీ రానుంది. ఈ చిత్రంలోనే హీరోయిన్‌గా నటించనున్నారు కాజల్ అగర్వాల్. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ముంబైలోప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ ముంబై షెడ్యూల్‌లోనే కాజల్ అగర్వాల్ కూడా పాల్గొంటున్నారని సమాచారం. అలాగే ఈ సినిమాను ఈ ఏడాది ఆగస్టు 15న రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు మేకర్స్. ‘‘ఓ పవర్‌ఫుల్ స్టోరీ... ఇప్పటివరకు ఎవరూ ఇలాంటి కథ చెప్పలేదు’’ అని మేకర్స్ పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో జరుగుతున్న మోసాలు, పురుగుల మందులు అమ్మే సంస్థల మోసాల నేపథ్యంలో ఈ మూవీ ఉంటుందనే టాక్ బాలీవుడ్‌లో వినిపిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న ‘సికందర్’లో కాజల్ అగర్వాల్ ఓ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీలో రష్మికా మందన్నా హీరోయిన్. ఈ ఏడాది రంజాన్ సందర్భంగా ఈ మూవీ రిలీజ్ కానుంది.
అలాగే కాజల్ అగర్వాల్ ఇప్పటికే పూర్తి చేసిన హిందీ మూవీ ‘ఉమ’ రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఇంకా కమల్‌హాసన్ హీరోగా చేసిన ‘ఇండియన్ 3’ చిత్రంలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించారు. ఈ చిత్రం కూడా ఈ ఏడాదే రిలీజ్‌కు ముస్తాబు అవుతోంది. ఇలా ఈ ఏడాది బిజీ బిజీగా ఉండటంతో పాటు వరుస సినిమాల రిలీజ్‌లతో కాజల్ వెండితెరపై సందడి చేస్తారనుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment