మన కోసం మనం, బౌన్స్ బ్యాక్ జర్నీ షేర్ చేసిన కాజల్
న్యూఇయర్ స్పెషల్ విషెస్
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్‌లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.
బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.
బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్.
"బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్.
ఈ ప్రయాణంలో ఫిట్‌నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్‌లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.
కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment