mother hood
-
బౌన్స్ బ్యాక్..ఈ విషయాలు అందరికీ తెలియాలి : టాలీవుడ్‘చందమామ’
మహిళలకు పెళ్లి, మాతృత్వం, పిల్లల పెంపకం అనేది కరియర్లో పెద్ద అడ్డంకిమాత్రమే కాదు. శారీరకంగా,మానసికంగా, భావోద్వేగ పరంగా చాలా క్లిష్టమైంది కూడా. ఈ విషయాన్నే టాలీవుడ్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ సోషల్ మీడియా పోస్ట్ ద్వారా చెప్పుకొచ్చింది. పట్టుదలగా, ఓర్పుగా సాధన చేస్తే పెళ్లీ, పిల్లల బాధ్యతలతో పాటు, కరియర్‌ను సాగించడం, అలాగే శారీరకంగా ఫిట్‌గా ఉండటం సాధ్యమే అంటూ తన అనుభవాలను షేర్ చేసింది.బ్యాలెన్స్ అనేది చెప్పుకోడానికి బానే ఉంటుంది, కానీ వాస్తవం చాలా క్లిష్టంగా ఉంటుందంటూ 2024లో తన జర్నీ గురించి వివరించింది కాజల్. 2024 ఏడాది అంతా భావోద్వేగాలు, శారీరక మార్పులు వీటన్నిటికీ మించిన బాధ్యతల వలయంలో గడిచిపోయింది. పసిబిడ్డకు తల్లిగా మాత్రమే కాకుండా, ఒక నటిగా తన బాడీనీ, శక్తిని నిరంతరం దృష్టిలో ఉంచుకోవాల్సిన పయనమిది అని పేర్కొంది.బిడ్డ పుట్టిన తరువాత బాగా బరువు పెరిగాను, తల్లిగా పెరిగిన బరువును తగ్గించుకోవడంతోపాటు, మాతృత్వపు బాధ్యతలు, నటిగా కరియర్, రెండింటినీ చాలా బలంగా నిర్వర్తించారు. ఆందోళనను అధిగమించాను. కానీ అదంతా సులభంగా సాగలేదు. ఎన్నో సందేహాలు, ఆశలు, నిరాశలు, అలసట ఇలాంటివెన్నో ఉన్నాయి. ‘‘మనలో చాలా మందిలాగే, నేనూ అద్దంలో చూసుకున్నాను.. మళ్లీ మునుపటిలా మారతానా అని ఆలోచించేదాన్ని’’ అంటూ ఇన్‌స్టాలో తెలిపింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) "బౌన్స్ బ్యాక్" అసాధ్యం కాదని గ్రహించడమే కీలక మలుపు. దృఢ సంకల్పంతో కొత్త అధ్యాయం కోసం ముందుగా సాగా అని చెప్పుకొచ్చింది. అలాగే పోషకాహార నిపుణుడి సాయంతో ఆరోగ్యకరమైన, పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని ఎంచుకున్నాను. తృప్తినిచ్చే భోజనంతోపాటు క్రమశిక్షణగా, సమతుల్య ఆహారంపై దృష్టి కేంద్రీకరించాను అంటూ వివరించింది కాజల్. ఈ ప్రయాణంలో ఫిట్నెస్ మరో మూలస్తంభం. చాలా ఓర్పుగా, ధైర్యం, సంకల్పంతో ముందుకెళ్లాను. శ్రద్ధగా తీసుకున్న పోషకాహారం బిజీ షెడ్యూల్లో మరింత శక్తినిచ్చింది. ఈ నా జర్నీ మరింత మందికి ధైర్యంతో ముందుకు సాగాలే ప్రేరణనిస్తుందని ఆశిస్తున్నాను. ప్రపంచం కోసంమాత్రమే కాకుండా, మనకోసం మన ఆనందం కోసం కలిసి సాగుదాం అంటూ ముగించింది. అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపింది.కాగా చందమామ, మగధీర లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్న కాజల్, 2020లో తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమారుడు. ఈ బాధ్యతల విరామం తరువాత మళ్లీ సినిమాల్లో నటిస్తున్న సంగతి తెలిసిందే. -
నేషనల్ సేఫ్ మదర్‌హుడ్ డే 2024 : ఇంట్రస్టింగ్ ఫ్యాక్ట్స్
ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు. మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు. గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం. 2024 థీమ్: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. పోషకాహారం, రెగ్యులర్ చెకప్‌లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది. ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు! -
సినిమాలకు హీరోయిన్ కాజల్ గుడ్‌బై చెప్పనుందా?
‘లక్ష్మీ కళ్యాణం’ సినిమాతో టాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్. స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్నప్పుడే 2020లో వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడింది. ఇటీవలె మగబిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోంది. అయితే తాజాగా కాజల్‌కు సంబంధించి ఓ వార్త నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. కొడుకు కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని కాజల్ భావిస్తోందట. ఈ నేపథ్యంలోనే సినిమాలను దూరం కావాలనే నిర్ణయానికి వచ్చినట్లు టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే పలువురు దర్శక నిర్మాతలతో కూడా చేసుకున్న అగ్రిమెంట్‌ను రద్దు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఈ వార్తలపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇక గంలో కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరమైన సంగతి తెలిసిందే. -
మన జీవితాల్లో మార్పులు రాబోతున్నాయి: భర్తపై కాజల్ ఎమోషనల్
Kajal Aggarwal Shares Emotional Post On Her Husband: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె మాతృత్వ అనుభూతిని ఆస్వాధిస్తోంది. అంతేకాదు ఈ ఆనందాన్ని తన ఫ్యాన్స్, ఫాలోవర్స్‌తో పంచుకుంటూ బేబీ బంప్ ఫొటోలను షేర్ చేస్తోంది. ఇలా ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతున్న కాజల్ తాజాగా భర్త గౌతమ్ కిచ్లుపై ఎమోషనల్ నోట్ రాసింది. ఈమేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేస్తూ భర్తపై ప్రశంసలు కురిపించింది. తన ప్రెగ్నెన్సీ టైంలో కాబోయే తల్లిగా కాజల్ ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో గౌతమ్ భర్తగా ఎంత బాధ్యతగా వ్వవహరించాడో ఈ సందర్భంగా కాజల్ వివరించింది. చదవండి: జూ. ఎన్టీఆర్ తల్లి శాలినిపై యశ్ ఆసక్తికర వ్యాఖ్యలు ‘డియర్ హస్సెండ్.. మీరు ఓ మంచి భర్తగా ఉండటమే కాదు ప్రతి అమ్మాయి కోరుకునే గొప్ప తండ్రి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నా పట్ల నువ్వు నిస్వార్థంగా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ప్రతి రోజు రాత్రి నాతో పాటు మెలకువగా ఉండి.. మార్నింగ్ సిక్నెస్లో కూడా ఎలాంటి విసుగు లేకుండా నన్ను కంఫర్ట్ చేశావు. ఆస్వస్థతగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చావు. అసౌకర్యంగా అనిపిస్తే నా పుట్టింటికి తీసుకెళ్లావు. ఇలా ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నావు. నేను ఇబ్బంది పడకుండా నాకు అన్ని సౌకర్యాలను అందించావు’ అంటూ రాసుకొచ్చింది. చదవండి: ఎట్టకేలకు రణ్‌బీర్-అలియా పెళ్లిపై నోరువిప్పిన నీతూ కపూర్, వీడియో వైరల్ అలాగే త్వరలోనే మన బిడ్డ ఈ లోకంలోకి రాబోతోంది. అంతకుముందే నువ్వు ఎంత గోప్ప తండ్రివో ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. గత 8 నెలలుగా నీలో ఓ గొప్ప తండ్రిని చూస్తున్నాను. పుట్టబోయే బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, అప్పుడే ఆ బిడ్డ సంరక్షణ కోసం నువ్వు ఏం చేయాలో అది చేశావు. ఇలా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పరిమితులు లేని తండ్రి ప్రేమను మన బిడ్డ పొందబోతున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. మన బిడ్డకు నువ్వు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. చదవండి: ఆర్ఆర్ఆర్లో చరణ్ డామినేషన్‌పై స్పందించిన జక్కన్న అలాగే బిడ్డ పట్టిన అనంతరం వారి జీవితాల్లో వచ్చే మార్పుల గురించి కూడా కాజల్ రాసుకొచ్చింది. ‘త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి మాదిరి మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకోలేం. పార్టీలకు దూరమవుతాం. అయినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం కాబట్టి. మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందంగా మారుతుంది. పరిస్థితులు మారొచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ’ అంటూ భర్త గౌతమ్‌ను ఉద్దేశించి ఎమోషనల్ అయ్యింది కాజల్. View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
కంగారు మెథడ్...
ప్రసవం అంటే బిడ్డకు జన్మ.... తల్లికి పునర్జన్మ.... ప్రసవం తరువాత శిశువును చూసి తల్లి ఆనందంతో తన బాధనంతా మరిచిపోతుంది.. అలాంటి సమయంలో శిశువు అనారోగ్యానికి గురైతే ఆ తల్లి పడే వేదన వర్ణనాతీతం.. బరువుతక్కువ, నెలలు నిండకుండా పుట్టిన శిశువులకు ‘ కంగారు థెరపీ యూనిట్లు సంజీవని’లా పనిచేస్తున్నాయి... అలాగే ప్రసవం ముందు గర్భిణులకు వచ్చే సమస్యలను ‘హైరిస్క్ కేంద్రాల’ ద్వారా పరిష్కరిస్తున్నారు...ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ఈ కేంద్రాల పై ప్రత్యేకకథనం... సిద్దిపేట :శిశు మరణాలు తగ్గించడంలో సిద్దిపేటలోని మాతా శిశు సంక్షేమ కేంద్రం సత్ఫలితాలను అందిస్తోంది. పెరిగిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని వైద్యశాస్త్రంలో సంస్కరణలను జోడిస్తు మెరుగైన వైద్యాన్ని అందించే దిశగా ప్రభుత్వ ప్రయత్నం పసికందులకు పునర్జన్మను అందిస్తున్నాయి. 2015లో మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో సిద్దిపేటలో ఏర్పాటు చేసిన కంగారు యూనిట్, నవజాత శిశు సంరక్షణ కేంద్రాలు ప్రభుత్వ వైద్యానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి. అప్పట్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా 12 బెడ్లను కలిగిన కంగారు యూనిట్‌ను సిద్దిపేటలో ఏర్పాటు చేశారు. మరోవైపు గర్భిణులకు ప్రసవం కంటే ముందు ఉత్పన్నమయ్యే విపత్కర పరిస్థితుల నుంచి వారిని గట్టెక్కించేందుకు సిద్దిపేట, గజ్వేల్ హైరిస్క్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వైద్యశాస్త్రంలో వచ్చిన కొత్త పోకడలతో ఏర్పాటైన నూతన యూనిట్లతో కొట్లాది రూపాయాల విలువ గలిన వైద్య సేవలను పేద ప్రజలు పొందుతున్నారు. ఇప్పటి వరకు కంగారు మెథడ్ యూనిట్లో వెయ్యి మంది చిన్నారులకు, ఎస్‌ఎన్‌సీయూలో 4వేల మంది పసికందులకు సుమారు 20 కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించారు. ఈ రోజు ‘సేఫ్ మదర్‌హుడ్ డే’ సందర్భంగా ప్రత్యేక కథనం.. కంగారు మెథడ్... వైద్యరంగంలో ఇప్పుడిప్పుడే చర్చనీయాంశమవుతున్న పదం కంగారు. ఆస్ట్రేలియాకు చెందిన కంగారు జంతువులు నెలల నిండకుండానే ప్రసవిస్తాయి. వాటి పిల్లలను కాపాడుకునే క్రమంలో శరీరంలోని పొట్టభాగంలో భద్రపరుస్తాయి. అవసరమైన వేడిని అందించి వాటి పరిణితికి ప్రకృతి సిద్ధంగా దోహదపడుతాయి. కంగారు జంతువుల తాపత్రయాన్ని వైద్యశాస్త్రానికి అనువయింపచేసి తక్కువ బరువు, నెలలతో జన్మించే శిశువులను ప్రత్యేక విధానంతో కాపాడే పద్ధతే కంగారు మెథడ్ యూనిట్ (కేఎంసీ) 2015 జూలైలో సిద్దిపేటలోని ఎంసీహెచ్‌లో ప్రయోగాత్మకంగా ప్రభుత్వం కేఎంసీని ప్రారంభించింది. ప్రసుత్తం 12 బెడ్లతో కొనసాగుతున్న సిద్దిపేట కేఎంసీ దేశంలోనే అతిపెద్ద యూనిట్ కావడం విశేషం. ఇప్పటి వరకు వెయ్యి మందికి కేఎంసీలో అరుదైన వైద్యాన్ని అందించి రూ. 20కోట్ల విలువైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే కాకుండా వెయ్యి మంది పసికందులకు పునర్జన్మ ప్రసాదించిన కేంద్రం కేఎంసీ యూనిట్. నవజాత శిశు సంరక్షణ కేంద్రం.... మరోవైపు కంగారు మెథడ్ యూనిట్‌కు అనుసంధానంగా కీలక భూమిక పోషించే మరో అరుదైన వైద్య సహాయం నవజాత శిశుసంరక్షణ కేంద్రం. (ఎస్ఎన్సీయూ) ప్రాణాపాయ స్థితిలో ఉన్న పసికందులను నవజాత శిశుసంరక్షణ కేంద్రం ద్వారా పునర్జన్మ అందించడే యూనిట్ ప్రత్యేకత. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా సిద్దిపేటలో 18 పడకలతో ఎస్‌ఎంసీయూ యూనిట్‌ను జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా 2015 జూలైలో మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇవి ప్రధానంగా తీవ్ర అనారోగ్యానికి గురైన శిశువులు, పచ్చకామెర్లతో వచ్చిన చిన్నారులు, ఉమ్మనీటిని మింగి ఆపత్కాల పరిస్థితిని ఎదుర్కొనే పసికందులను రక్షించే ఎకైక పరిష్కారమార్గం ఎస్ఎన్సీయూ. ఒక్కమాటలో చేప్పాలంటే ఈ యూనిట్ శివు సంజీవని లాంటిది. ఈ యూనిట్ ద్వారా ఇప్పటి వరకు 4వేల మందికి వైద్యసేవలు అందించారు. దీనికి తోడు పచ్చ కామెర్లతో పుట్టిన శిశువుకు వైద్యం అందించే ఫోటోథెరపీ విభాగంలో ఇప్పటి వరకు 6493 మందికి సిద్దిపేట యూనిట్లో వైద్యాన్ని అందించారు. గర్భిణులకు వరం... హైరిస్కు కేంద్రాలు గర్భిణులకు వరంలాంటివి. ప్రసవం కంటే ముందు వచ్చే ఆనారోగ్య, వైద్యపర సమస్యలను గుర్తించి 24 గంటల పాటు పరిశీలనలో పెట్టి గర్భిణులకు గడ్డు కాలాన్ని దూరం చేయడంలో హైరిస్కులు ఎంతో దోహద పడుతున్నాయి. సుమారు 50 పడకలతో గర్భిణులకు మెరుగైన వైద్యాన్ని అందిస్తున్న హైరిస్కు సేవలతో గ్రామీణ పేద మహిళలకు కార్పొరేట్ ఆసుపత్రి మెట్లెక్కే అవసరం లేకుండా ఈ కేంద్రాలు సముచిత సేవలను అందిస్తున్నాయి. ‘కంగారూ’పనితీరు ఇలా ఆస్ట్రేలియా దేశంలో ఉండే కంగారు అనే జంతువు తన బిడ్డను తన పొత్తి కడుపులోని కింది భాగంలో ఒక సంచిలాంటి అరలో జాగ్రత్తగా పొదిగి పట్టుకుంటుంది. ఆ దేశం చాలా శీతల ప్రదేశం కావడంతో తన బిడ్డను అలా తన కడుపు ముందు భాగంలోని అరలో పెట్టుకొని వెచ్చదనాన్ని అందిస్తుంది. దీనినే వైద్యశాస్త్రానికి అన్వయిస్తూ బరువు తక్కువగా పుట్టిన పిల్లలకు, నెలలు నిండకుండా పుట్టిన పిల్లలను తల్లి ఛాతీపై ఉంచుకొని పసికందుపై నుంచి వస్త్రంతో తల్లీని, పసికందును కలిపి కట్టి ఉంచడం, తల్లి ఛాతీపైన ఒకే వస్త్రంతో పాపను కలిపి కట్టి ఉంచడం వల్ల తల్లి నుంచి పాపకు ఉష్ణప్రసారం (వేడిమి) జరిగి తల్లీ బిడ్డ ఒకే విధమైన ఉష్ణోగ్రతను కలిగి ఉంటారు. పాపతల్లి కడుపులో ఉన్నప్పుడు ఏ విధంగా వెచ్చగా ఉంటుందో ప్రసవం అనంతరం బయటికి వచ్చిన తర్వాత కూడా తల్లి కడుపులో ఉండే వెచ్చదనాన్ని కలిగించే పద్ధతినే కంగారు పద్ధతి అంటాం. ఈ పద్ధతిలో పసికందు తల్లి లేదా తండ్రి, బంధువులతో కూడా పుట్టిన పసికందుకు మెథడ్‌ను వినియోగించవచ్చు. ఈ విధానం ఎందుకంటే... నెలలు నిండకుండా పుట్టిన పిల్లలు, నెలలు నిండి బరువు తక్కువగా ఉన్న పిల్లల్లో శరీరంలోని ఉష్ణోగ్రత త్వరగా కోల్పోయే ప్రమాదం ఉంది. దీని వల్ల పిల్లలు నీరసంగా ఉండడం, బరువు పెరుగుదల సరిగా ఉండక పోవడం, అంటు వ్యాధులు వచ్చే అవకాశం, పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం లాంటివి సంభవిస్తాయి. ఇలా ప్రమాదం నివారించవచ్చు... కంగారు మాతృసంరక్షణ పద్ధతి ద్వారా ప్రమాదాన్ని నివారించవచ్చు. కేఎంసీ యూనిట్లో 1.3 కిలోల కన్న బరువుతో శిశువు జన్మిస్తే వెంటనే కంగారు పద్ధతిలో 15 నుంచి 30 రోజుల వరకు ఇదే విధానాన్ని అమలు చేయాలి. దీని ద్వారా పిల్లలకు తగినంత ఉష్ణోగ్రత, తల్లి్లపాలు తాగడానికి అధిక అవకాశం, పిల్లల బరువు పెరుగుదల, తల్లికి, బిడ్డకు మధ్య బాంధవ్యం పెరుగుతాయి, నెలలు నిండని పిల్లల్లో అకస్మాత్తుగా ఊపిరి అగిపోయే అవకాశంఉంటుంది. కంగారు పద్ధతి ద్వారా తల్లి తీసుకునే శ్వాస బిడ్డకూడా తీసుకునేలా చేస్తుంది. ఎంత సమయం చేయాలి... కేఎంసీ విధానం కేవలం ఆస్పత్రుల్లోనే కాకుండా ఇంటికి వెళ్లిన తర్వాత కూడా చేయవచ్చు. 1.3 కిలోల బరువుతో జన్మించే పసికందులను, నెలలు తక్కువతో పుట్టే పిల్లలను పది నుంచి, 15రోజుల వరకు కేఎంసీ పద్ధతిలో తల్లి కానీ, బంధువుతోకానీ బిడ్డను ఒకే చోట ఉండేలా చూడాలి. దీనికి సమయమంటూ ఏమీ లేదు. రెండు కిలోల బరువు వచ్చే వరకు ఖర్చులేని సులభమైన ఉపయోగకరమైన పద్ధతిలో దీనిని వినియోగించవచ్చు. -
'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు'
లాస్ ఎంజెల్స్: తల్లి కావడమే ప్రపంచంలో గొప్ప విషయం అని ప్రముఖ హాలీవుడ్ మోడల్ లారా బింగిల్ అన్నారు. 28 ఏళ్ల ఆమె ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అతడి ఆలనపాలనలో మునిగిపోయింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ప్రతి రోజు తన బిడ్డకు సపర్యలు చేయడమే తనకు గొప్ప చాలెంజ్‌గా మారిందని, అది కూడా చాలా సంతోషాన్నిస్తుందని, మాతృత్వాన్ని మించిన సంతోషం ఈ ప్రపంచంలో మరొకటి లేదని తాను భావిస్తున్నానని పేర్కొంది. ప్రతిరోజు తన చంటి ఆలనపాలనలో తానో కొత్త విషయం నేర్చుకుంటున్నానని, అవి నిజంగా అద్భుతమైన విషయాలని పేర్కొంది. తనకు ఇంత మంచి సంతోషాన్ని, అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటుచేసిన కుటుంబ సభ్యులకు భర్త శ్యాం వార్టింగ్టన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ మురిసిపోతుంది.