ప్రతీ ఏడాది ఏప్రిల్ 11న జాతీయ మాతృత్వ దినోత్సవాన్ని(NSMD) జరుపుకుంటారు. ఇది మాతృత్వాన్ని గౌరవించే రోజు. కాబోయే తల్లులకు, పుట్టబోయే బిడ్డలకు సరైన ఆరోగ్య సంరక్షణ, ప్రసూతి సేవల ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించడానికి దేశంలో జాతీయ సురక్షిత మాతృత్వ దినోత్సవాన్ని జరుపు కుంటారు.
మహిళ ఒక బిడ్డకు జన్మనివ్వడంలో సమాజ బాధ్యతపై అవగాహన కల్పించేందుకు ఏర్పరచుకున్న ఒక రోజు. అన్నీ సవ్యంగా జరిగితే నిజంగా అదొక అద్భుతం. మరపురాని మధుర జ్ఞాపకంగా మిగిలిపోయే రోజు. కానీ మన దేశంలో ప్రసవ సమయంలో ప్రాణాలు కోల్పోతున్న స్త్రీలు ఇంకా చాలామందే ఉన్నారు.
గర్భధారణ సమయంలో, ఆ తర్వాత కూడా పోషకాహార లోపంతో మహిళలు బాధపడుతున్నారు. ఫలితంగా ముందస్తు ప్రసవాలు, శిశువుల్లో శారీరక లోపాలు లాంటి సమస్యలు తలెత్తు తున్నాయి. ఈనేపథ్యంలో మహిళలకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల, ఆరోగ్యవంతమైన శిశవులు జననంపై అవగాహన కల్పించేందుకే ఈ జాతీయ మాతృత్వ దినోత్సవం. తద్వారా మాతాశిశు మరణాల రేటును తగ్గించడంలో పురోగతి సాధించగలం.
2024 థీమ్: ఈ సంవత్సరం ప్రినేటల్ కేర్ (గర్భంధ రించిన తర్వాత గర్భిణీలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు) స్కిల్డ్ బర్త్ అటెండెంట్‌లు, ప్రసవానంతర సహాయాన్ని మెరుగు పరచడంపై దృష్టి పెడుతుంది. పోషకాహారం, రెగ్యులర్ చెకప్‌లు , గర్భిణీ స్త్రీలకు అవసరమైన సమాచారాన్ని పొందాల్సిన ప్రాముఖ్యతను కూడా హైలైట్ చేస్తుంది.
ప్రతి స్త్రీకి మాతృత్వాన్ని సురక్షితమైన, సంతోషకరమైన అనుభవంగా మార్చడానికి కృషి చేద్దాం. కాబోయే తల్లి ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తామని , ప్రతి తల్లికి నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సదుపాయాలు అందుబాటులో ఉండేలా ప్రతిజ్ఞ చేద్దాం. తల్లీబిడ్డలకు ఆరోగ్యకరమైన భవిష్యత్తు అందేలా పాటుపడదాం. సురక్షిత మాతృత్వ దినోత్సవ శుభాకాంక్షలు!
Comments
Please login to add a commentAdd a comment