Kajal Aggarwal Shares Emotional Post On Her Husband Gautam Kitchlu, Recounted Their Pregnancy Time Memories - Sakshi
Sakshi News home page

Kajal Aggarwal: త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి

Published Thu, Apr 14 2022 2:02 PM | Last Updated on Thu, Apr 14 2022 2:28 PM

Kajal Aggarwal Shares Emotional Post On Her Husband Gautam Kitchlu - Sakshi

Kajal Aggarwal Shares Emotional Post On Her Husband: స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌ త్వరలో ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వనుంది. ప్రస్తుతం ఆమె మాతృత్వ అనుభూతిని ఆస్వాధిస్తోంది. అంతేకాదు ఈ ఆనందాన్ని తన ఫ్యాన్స్‌, ఫాలోవర్స్‌తో పంచుకుంటూ బేబీ బంప్‌ ఫొటోలను షేర్‌ చేస్తోంది. ఇలా ప్రతి క్షణాన్ని సంతోషంగా గడుపుతున్న కాజల్‌ తాజాగా భర్త గౌతమ్‌ కిచ్లుపై ఎమోషనల్‌ నోట్‌ రాసింది. ఈమేరకు ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ షేర్‌ చేస్తూ భర్తపై ప్రశంసలు కురిపించింది. తన ప్రెగ్నెన్సీ టైంలో కాబోయే తల్లిగా కాజల్‌ ఎదుర్కొనే అనారోగ్య సమస్యల్లో గౌతమ్‌ భర్తగా ఎంత బాధ్యతగా వ్వవహరించాడో ఈ సందర్భంగా కాజల్‌ వివరించింది. 

చదవండి: జూ. ఎన్టీఆర్‌ తల్లి శాలినిపై యశ్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘డియర్‌ హస్సెండ్‌.. మీరు ఓ మంచి భర్తగా ఉండటమే కాదు ప్రతి అమ్మాయి కోరుకునే గొప్ప తండ్రి కూడా. ఇలాంటి పరిస్థితుల్లో నా పట్ల నువ్వు నిస్వార్థంగా ఉన్నందుకు ముందుగా ధన్యవాదాలు. ప్రతి రోజు రాత్రి నాతో పాటు మెలకువగా ఉండి.. మార్నింగ్‌ సిక్‌నెస్‌లో కూడా ఎలాంటి విసుగు లేకుండా నన్ను కంఫర్ట్‌ చేశావు. ఆస్వస్థతగా ఉన్నప్పుడు వెంటనే డాక్టర్లకు సమాచారం ఇచ్చావు. అసౌకర్యంగా అనిపిస్తే నా పుట్టింటికి తీసుకెళ్లావు. ఇలా ప్రతి విషయంలో నా పక్కనే ఉన్నావు.  నేను ఇబ్బంది పడకుండా నాకు అన్ని సౌకర్యాలను అందించావు’ అంటూ రాసుకొచ్చింది.

చదవండి: ఎట్టకేలకు రణ్‌బీర్‌-అలియా పెళ్లిపై నోరువిప్పిన నీతూ కపూర్‌, వీడియో వైరల్‌

అలాగే త్వరలోనే మన బిడ్డ ఈ లోకంలోకి రాబోతోంది. అంతకుముందే నువ్వు ఎంత గోప్ప తండ్రివో ఈ ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాను. గత 8 నెలలుగా నీలో ఓ గొప్ప తండ్రిని చూస్తున్నాను. పుట్టబోయే బిడ్డను నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, అప్పుడే ఆ బిడ్డ సంరక్షణ కోసం నువ్వు ఏం చేయాలో అది చేశావు. ఇలా నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది. పరిమితులు లేని తండ్రి ప్రేమను మన బిడ్డ పొందబోతున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. మన బిడ్డకు నువ్వు ఎప్పుడూ ఒక ప్రేరణగా ఉండాలని కోరుకుంటున్నా’ అని పేర్కొంది. 

చదవండి: ఆర్‌ఆర్‌ఆర్‌లో చరణ్‌ డామినేషన్‌పై స్పందించిన జక్కన్న

అలాగే బిడ్డ పట్టిన అనంతరం వారి జీవితాల్లో వచ్చే మార్పుల గురించి కూడా కాజల్‌ రాసుకొచ్చింది. ‘త్వరలోనే మన జీవితాల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఇప్పటి మాదిరి మన కోసం మనం సమయాన్ని కేటాయించుకోలేం. సినిమాలు, షికార్లకు వెళ్లలేం. టీవీ చూస్తూ ఆలస్యంగా పడుకోలేం. పార్టీలకు దూరమవుతాం. అయినప్పటికీ నాకు చాలా సంతోషంగా ఉంది. వీటన్నింటికి దూరమైనా బిడ్డతో విలువైన సమయాన్ని గడుపుతాం కాబట్టి. మన జీవితంలో ప్రతిక్షణం మరింత ఆనందంగా మారుతుంది. పరిస్థితులు మారొచ్చు కానీ, నాపై నీకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ ఇలాగే ఉంటుంది. ఐ లవ్యూ’ అంటూ భర్త గౌతమ్‌ను ఉద్దేశించి ఎమోషనల్‌ అయ్యింది కాజల్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement