'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు' | Lara Bingle loves motherhood | Sakshi
Sakshi News home page

'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు'

Published Mon, Oct 12 2015 8:34 AM | Last Updated on Sun, Sep 3 2017 10:51 AM

'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు'

'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు'

లాస్ ఎంజెల్స్: తల్లి కావడమే ప్రపంచంలో గొప్ప విషయం అని ప్రముఖ హాలీవుడ్ మోడల్ లారా బింగిల్ అన్నారు. 28 ఏళ్ల ఆమె ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అతడి ఆలనపాలనలో మునిగిపోయింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ప్రతి రోజు తన బిడ్డకు సపర్యలు చేయడమే తనకు గొప్ప చాలెంజ్గా మారిందని, అది కూడా చాలా సంతోషాన్నిస్తుందని, మాతృత్వాన్ని మించిన సంతోషం ఈ ప్రపంచంలో మరొకటి లేదని తాను భావిస్తున్నానని పేర్కొంది.

ప్రతిరోజు తన చంటి ఆలనపాలనలో తానో కొత్త విషయం నేర్చుకుంటున్నానని, అవి నిజంగా అద్భుతమైన విషయాలని పేర్కొంది. తనకు ఇంత మంచి సంతోషాన్ని, అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటుచేసిన కుటుంబ సభ్యులకు భర్త శ్యాం వార్టింగ్టన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ మురిసిపోతుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement