Motherhood
-
శివగామినే మించిపోయిన సాహసమది!.. గుర్తుందా?
తన ప్రాణం పోతున్నా లెక్కచేయకుండా పసికందుగా ఉన్న మహేంద్రుడిని నీట మునగకుండా ఒక చేత్తో పైకెత్తి ముందుకెళ్తుంది రాజమాత శివగామి బాహుబలి(Bahubali)లో. కానీ, ఇక్కడో తల్లి తన పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ ఊపిరి కోసం.. ఏ తల్లి చేయని సాహసం చేసి చరిత్రకెక్కింది. అయితే ఆ సాహసమే ఆరేళ్ల తర్వాత.. అదే తల్లిని మళ్లీ వార్తల్లో నిలబెట్టింది.జే35 అనే ఓర్కా తిమింగలం.. మరో బిడ్డకు జన్మనిచ్చింది. ఈ నెల 23వ తేదీన అది ఓ బిడ్డకు జన్మనిచ్చిందని సెంటర్ ఫర్ వేల్ రీసెర్చ్ అనే ఫేస్బుక్ పేజీ ప్రకటించింది. ఆ ఆడ ఓర్కా(Orca) పిల్లకు జే61గా నామకరణం చేశారు. సియాటెల్ నగరపు తీరాన ఉన్న రీసెర్చ్ సెంటర్ వద్దకు చేరుకుంటున్న అంతర్జాతీయ మీడియా సంస్థల ఫొటోగ్రాఫర్లు ఆ తల్లీబిడ్డలను క్లిక్‌మనిపిస్తున్నారు. ఇందులో అంత చెప్పుకోదగిన విషయం ఏముందని అంటారా?.. ఆరేళ్ల కిందట.. బ్రిటీష్ కొలంబియా విక్టోరియాలోని తీర ప్రాంతానికి ఓ ఓర్కా తిమింగలం ఈదుకుంటూ వచ్చింది. అయితే దాని వీపు మీద ఓ పిల్ల ఓర్కాను మోసుకుంటూ వచ్చిందది. ఆ ప్రయాణం వెనుక ఎంతో వ్యధ ఉందని తర్వాతే తేలింది. పుట్టిన గంటకే బిడ్డ మరణాన్ని జీర్ణించుకోలేకపోయిన ఆ తల్లి ఓర్కా బిడ్డకు వీడ్కోలు చెప్పాలని అనుకోలేదు. మళ్లీ ఊపిరి తీసుకుంటుందన్న ఆశతో తలపై మోసుకుంటూ నీటిలో పైకి, కిందకు ఈదటం(Swim) ప్రారంభించింది. అలా గంటలు గడిచాయి.. రోజులు దొర్లిపోయాయి. తలపై 400 పౌండ్ల(181 కేజీల) బరువుతో.. ఏకంగా 17 రోజులపాటు ఏకధాటిగా 1,600 కిలోమీటర్లు ప్రయాణించిందది!. చివరకు.. సాన్ జువాన్ ఐలాండ్ వద్ద ప్రముఖ వేల్ రీసెర్చర్ కెన్ బాల్కోమ్ ఆ అమ్మ ప్రేమను ఓ డాక్యుమెంటరీగా చిత్రీకరించారు. జంతువుల్లో ఇలాంటి ప్రవర్తన సాధారణమే అయినా.. జే35 ప్రేమ మాత్రం అసాధారణమని కొనియాడారు. అలా ఆ దృశ్యాలు.. చూపరుల గుండెను బరువెక్కించాయి. చరిత్రకెక్కిన ఆ తల్లి ఓర్కానే ఈ జే35. సాధారణంగా.. ఓర్కాలు కిల్లర్ వేల్(Killer Whale)లు. సముద్రపు డాల్ఫిన్ జాతిలోనే అతి పెద్దవి. అయితే వాటి మనుగడ చాలా కష్టంగా ఉంటుంది. గుంపుగా బతికే సమూహంలో.. ఏడాది వయసున్న పిల్లలను రక్షించుకోవడానికి అవి సాహసాలే చేస్తుంటాయి. ఆ గండం దాటితే అవి బతికి బట్టకట్టినట్లే!. అయితే.. జే35 ఓర్కాకు జే61ను ఏడాదిపాటు కాపాడుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఆ తల్లి మనుసు గతంలోనే ఓసారి గాయపడింది. అయినప్పటికీ ఈ ఆరేళ్ల గ్యాప్‌లో జే47, జే57 అనే రెండు ఓర్కాలకు అది జన్మనివ్వగా.. అవి సజీవంగానే ఉన్నాయని గుర్తు చేస్తున్నారు.ఇదీ చదవండి: ఇరాన్లో తొలిసారి మహిళలతో.. -
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
Mahathalli Jahnavi Dasetty: తల్లి కాబోతున్నట్లు ప్రకటించిన 'మహాతల్లి' (ఫొటోలు)
-
త్వరలోనే తల్లి కాబోతున్న హీరోయిన్ పూర్ణ.. వీడియో షేర్ చేసిన నటి
హీరోయిన్ పూర్ణ అటు వెండితెరతో పాటు ఇటు బుల్లితెరపై కూడా సందడి చేస్తుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం సినిమాల్లో నటించి ఎంతోమంది అభిమానాన్ని సొంతం చేసుకున్న ఈ భామ ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్‌ను కొనసాగిస్తుంది. సోషల్ మీడియాలోనూ వరుస ఫోటోషూట్స్‌తో ఫ్యాన్స్‌తో ఎప్పుడూ టచ్‌లో ఉంటోంది. ఇక ఇటీవలె వివాహ బంధంలోకి అడుగుపెట్టిన పూర్ణ తాజాగా గుడ్‌న్యూస్ చెప్పింది. తాను త్వరలోనే తల్లి కాబోతున్నట్లు స్వయంగా ప్రకటించింది. ఈ ఏడాది జూన్ 12న దుబాయ్‌లో వ్యాపారవేత్త ఆసిఫ్ అలీతో పూర్ణ వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అతికొద్ది మంది కుటుంబసభ్యుల సమక్షంలో పూర్ణ పెళ్లి ఘనంగా జరిగింది. తాజాగా తాను తల్లికాబోతున్నట్లు వెల్లడించడంతో పూర్ణ దంపతులకు ఫ్యాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
అబార్షన్ హక్కుకు గొడ్డలిపెట్టు
ప్రపంచంలో ఎక్కడైనా సరే, ఒక పసిపాప భూమ్మీదికి వచ్చిన వార్త కంటే సంతోష కరమైన విషయం మరొకటి ఉండదు. భూమ్మీద అన్ని బాధలూ, వ్యాధులూ, మరణాలూ సంభవిస్తున్నప్పటికీ, శిశువు జన్మించడం అంటే ఒక కుటుంబ భవిష్యత్తే కాదు, మానవజాతి భవిష్యత్తుకు కూడా గొప్ప ఆశాభావాన్ని కలిగిస్తుందన్నమాట. అందుకే కడుపులో ఉన్న బిడ్డను అబార్షన్ రూపంలో చంపడం అంటే అది ఘోరమైన హత్య అని చాలామంది విశ్వసిస్తున్నారు. కానీ బిడ్డ పుట్టడం అనేది అంత సులభమైన విషయం కాదు. అత్యంత నిస్పృహలో, నిరాశాజనకమైన పరిస్థితుల్లో పుట్టే బిడ్డ జననం మహిళలను తరచుగా తీవ్రమైన కుంగుబాటుకూ, కొన్నిసార్లు వైద్యపరమైన సంక్లిష్టతల్లోకీ నెడుతుంటుంది. కానీ జన్మనివ్వడం అనేది మహిళలు, వారి కుటుంబాలు చేసుకోవలసిన ఎంపిక. అత్యవసరమైన సమయాల్లో అది వారి హక్కు, ఎంపికగా మాత్రమే ఉంటుంది. స్వచ్ఛంద మాతృత్వం అని కొంత మంది చెబుతున్నది, మహిళల గర్భస్రావ హక్కు. ఇది పునరుత్పత్తి, పనిలో సమానత్వానికి సంబంధించిన సాహసోపేతమైన ఫెమినిస్టు డిమాండుగా మాత్రమే లేదు. ఇది నిజంగానే మహిళ తన సొంత దేహంపై తాను మాత్రమే తీసుకోవలసిన ఎంపిక స్వాతంత్య్రంగా ఉంటుంది. అబార్షన్ అనేది వైద్యపరమైన అవసరమనీ, వైద్య శాస్త్రం స్వీయాత్మకమైన అంశంగా ఉండదనీ అమెరికన్ కాలేజీ ఆఫ్ ఆబ్‌స్టిట్రీషియన్స్ అండ్ గైనకాలజిస్ట్స్ (ఏసీఓజీ) చెప్పింది. అబార్షన్ రూపంలో గర్భధారణను తొలగించడానికి వైద్యపరమైన జోక్యం అవసరమైన పరిస్థితులు ఉంటాయి. మహిళ ఆరోగ్యాన్ని ఈ జోక్యమే కాపాడుతుంది. 2012లో సవితా హలప్పనవర్ అనే భారత సంతతి మహిళా డెంటిస్టు ఐర్లండులో రక్తంలో వ్యాధికారక క్రిములు ఉన్న కారణంగా ఆపరేషన్ అవసరమైన పరిస్థితుల్లో దారుణంగా చనిపోయారు. అబా ర్షన్ చేసుకుంటానన్న ఆమె డిమాండును ఐర్లండ్ చట్టాలు తిరస్కరిం చాయి. ఆమె మరణం పెద్ద ఉద్యమానికి దారితీసి, ఐర్లండులో సంస్క రణలు తీసుకొచ్చింది. దీంతో 2018లో ఆరోగ్య బిల్లు (గర్భధారణ తొలగింపు క్రమబద్ధీకరణ చట్టం)ను కూడా ఆ దేశం ఆమోదించింది. 1973 నాటి ‘రో వర్సెస్ వేడ్’ తీర్పును గత వారం అమెరికా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. మహిళల అబార్షన్ హక్కును ఎత్తిపట్టిన ఆనాటి తీర్పును అమెరికన్ సుప్రీంకోర్టు రద్దు చేసింది. అదే సమయంలో గర్భస్రావ ప్రక్రియను విడివిడిగా రాష్ట్రాలు ఆమోదించచ్చు లేదా పరిమితం చేయవచ్చునని ఫెడరల్ కోర్టు పేర్కొంది. దీంతో గత పాతికేళ్లలో చట్టపరమైన అబార్షన్‌కు ఉన్న రక్షణలను తొలగించిన నాలుగు దేశాల్లో అమెరికా ఒకటిగా మారింది. అబార్షన్ చట్టాలపై ఆంక్షలు విధించడం అనేది మహిళలకు వ్యతిరేకంగా వివక్షలో ఒక రూపమని మానవ హక్కుల సంస్థలు విమర్శిస్తున్నాయి. అంతర్జాతీయ న్యాయవాదులు, అడ్వకేట్ల హక్కుల సంస్థ అయిన సెంటర్ ఫర్ రీప్రొడక్టివ్ హెల్త్, అమెరికా సుప్రీంకోర్టు తాజా చర్యను నిశితంగా విమర్శించింది. అబార్షన్లపై తరచుగా జరుగుతున్న చర్చ గర్భస్థ పిండం, పిండంలో రూపు దిద్దుకుంటున్న జీవానికి సంబంధించి మానసిక, వైద్యపరమైన అంశాలపై మాత్రమే దృష్టి సారిస్తోంది. అయితే పిల్లలను కనాలా, వద్దా అనే అంశాన్ని మహిళలు నిర్ణయించుకోవడం ఒక సామాజిక అడ్డంకిగా ఎందుకుందనే ప్రశ్నపై చర్చ జరగడం లేదు. మహిళలు కేవలం గర్భస్థ పిండాన్ని మోసేవారు మాత్రమే కాదు. ఇలాంటి అభిప్రాయంతోనే పిండంలో రూపొందుతున్న మరొక ప్రాణిని కాపాడే బాధ్యతను రాజ్యవ్యవస్థ తీసుకుని నిర్బంధ చట్టాలను అమలు చేస్తోంది. అబార్షన్ హక్కును నిషేధించడం మహిళకు ఎలాంటి అండనూ లేకుండా చేస్తుంది. ఆమె సొంత దేహం, ఆమె ఎంపిక అనేవి ఇంకా పుట్టని బిడ్డ కంటే ద్వితీయ ప్రాధాన్యత కలిగిన అంశాలుగా మారిపోయాయి. కడుపులోని పిండాన్ని కాపాడటానికి మహిళ ప్రవర్తనను క్రమబద్ధీకరిస్తున్నారు, నియంత్రిస్తున్నారు. మహిళ అంటే గర్భాన్ని మోయడం తప్ప ఒక వ్యక్తిగా ఇక ఏమాత్రం ఉండదన్నమాట. తల్లి శారీరక, మానసిక ఆరోగ్యం ప్రమాదంలో పడినప్పడు అబార్షన్ చేసుకోవడాన్ని ప్రపంచంలో మూడింట రెండొంతుల దేశాలు అనుమతిస్తున్నాయి. అత్యాచారం ద్వారా, వివాహేతర సంబంధం ద్వారా గర్భం దాల్చినప్పుడు లేక బలహీనమైన పిండం కారణంగా గర్భస్రావాన్ని సగం దేశాలు అనుమతిస్తున్నాయి. కాగా ఆర్థిక, రాజకీయ కారణాలవల్ల లేక అభ్యర్థించిన కారణంగా గర్భస్రావాన్ని మూడింట ఒక వంతు దేశాలు మాత్రమే అనుమతిస్తున్నాయి. ఆంక్షలతో కూడిన అబార్షన్ విధానాలు ఉన్న దేశాల్లో సంతానోత్పత్తి రేటు అధికంగా ఉంటోంది. అయితే అబార్షన్లపై ఆంక్షలు విధించిన దేశాల్లో అరక్షిత అబార్షన్ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ దేశాల్లో ప్రసూతి మరణాలు కూడా చాలా ఎక్కువగా సంభవిస్తున్నాయి. 1973 నాటి రో తీర్పు వల్ల అమెరికాలో వేలాదిమంది టీనేజర్లు బాల్యవివాహాన్ని, చిన్నతనంలోనే మాతృత్వాన్ని అధిగమించడానికి వీలయింది. అలాగే అవాంఛిత, అనూహ్యమైన గర్భధారణల కారణంగా తక్షణం వివాహాలు చేసుకోవలిసిన పరిస్థితినుంచి మహిళలను ఈ తీర్పు కాపాడింది. కానీ ప్రపంచంలో అత్యంత అభివృద్ధి చెందిన దేశంలో ఇలాంటి తీర్పు రావడం అనేది మహిళల హక్కులపై తీవ్ర అఘాతం మాత్రమే కాదు... దశాబ్దాల స్త్రీవాద ఉద్యమం, మహిళల పునరుద్ధరణ, వారి హక్కుల రక్షణ కూడా ఇప్పుడు ప్రమాదంలో పడిపోయింది. అబార్షన్ చేసుకోగలగడానికీ, మహిళలు ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితుల్లో తల్లులు కావాలో నిర్ణయించుకోవడానికీ మధ్య సాధారణమైన లింకు ఉంటోందనీ, ఇది మహిళల జీవితాంతం వారిపై ప్రభావాలు వేస్తోందనీ 2021 బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ నివేదిక పేర్కొంది. మహిళల విద్య, ఆదాయం, కేరీర్, తమ పిల్లలకోసం కల్పించాల్సిన జీవితంపై ఇది పెను ప్రభావం చూపిస్తూంటుంది. రో వర్సెస్ వేడ్ తీర్పును రద్దు చేయడం ద్వారా అబార్షన్ని రద్దు చేయడం, లేదా పూర్తిగా ఆ హక్కుకే దూరం చేయడం అనేది మహిళల వ్యక్తిగత, ఆర్థిక జీవితాలను, వారి కుటుంబ జీవితాలను హరింప జేస్తుందని ఈ నివేదిక స్పష్టం చేసింది. అబార్షన్ చేసుకునే రాజ్యాంగబద్ధమైన హక్కును అమెరికన్ మహిళలు ప్రస్తుతం కోల్పోతుండగా, భారతదేశం మాత్రం 1971 నుంచే వైద్యపరంగా గర్భధారణ తొలగింపు చట్టం (ఎంటీపీ)ని కలిగి ఉంది. జనన లేదా కుటుంబ నియంత్రణ సాధనంగా ఇది ఉనికిలోకి వచ్చింది. 2021లో తీసుకొచ్చిన చట్ట సవరణ ద్వారా 24 వారాలలోపు గర్భస్రావం చేసుకునేందుకు ఈ చట్టం భారత మహిళలకు అనుమతించింది. మహిళల ఆరోగ్యానికి సురక్షితమైన, చట్టబద్ధమైన అబార్షన్లు ఎంతగానో అవసరం అవుతాయి. అయితే గర్భధారణను తొలగించుకోవాలంటే భారత్‌లో వైద్యుల ఆనుమతి అవసరం. కానీ అవివాహిత మహిళలు గర్భస్రావాన్ని చేయించుకోవడం భారత్‌లో మహిళలకు కళంకప్రాయంగా ఉంటున్న స్థితి కొనసాగుతోంది. అబార్షన్ హక్కును వెనక్కు తీసుకోవడం అంటే ఆధునికతను మడతపెట్టేయడమే అవుతుంది. చట్టబద్ధమైన పద్ధతులు, వైద్యపరంగా సురక్షితమైన అబార్షన్లు లేకుంటే మహిళలు మరింత ప్రమాదంలో పడతారు. వారి జీవితాలు మరింతగా దుర్భరమవుతాయి. అనూహ్యమైన, అవాంఛితమైన గర్భధారణను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మహిళలు మరింత ప్రమాదకరమైన, అంధకారయుతమైన స్థానంలోకి నెట్టబడతారు. పైగా నిర్బంధ మాతృత్వం వల్ల వారి జీవిత గమనమే మారిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. (క్లిక్: ఆదివాసీలు అందరికీ ప్రయోజనాలు అందాలి) - వినీతా ద్వివేది అసిస్టెంట్ ప్రొఫెసర్, ఎస్పీజేఐఎంఆర్ (‘మింట్’ సౌజన్యంతో) -
పెద్దపులుల మధ్య ఏమాత్రం జంకులేకుండా దర్జాగా..
వైరల్: ఇంటర్నెట్లో ఒక్కొసారి కొన్ని వీడియోలు.. అనూహ్యాంగా వైరల్ అవుతుంటాయి. కొన్ని వీడియోలకు ఉనికి(సోర్స్, ప్లేస్), సమయం తెలియకపోయినా నెటిజన్స్ ఆదరణ మాత్రం చురగొంటుంటాయి. అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చెప్పుకోబోయేది. గోల్డెన్ రెట్రైవర్ బ్రీడ్‌కు చెందిన ఓ శునకం.. పెద్దపులుల మధ్య దర్జాగా తిరుగాడుతోంది. అంతేకాదు.. వాటిని వీడియో తీసేవాళ్లను చూస్తూ ‘భౌ’ మంటూ తెగ బిల్డప్ కొట్టింది. పక్కనే ఉన్న పులులు ఏవీ కూడా దానికి హాని తలపెట్టే ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలుసా?.. ఆ పులులు, కూనలుగా ఉన్న సమయంలో తల్లికి దూరం అయ్యాయి. అప్పటి నుంచి ఆ కుక్క వాటికి పాలిచ్చి పెంచింది. అన్నేసి పులి కూనలను సాకడం చిన్న విషయమూ కాదు. అందుకే తమతో పాటు పెరిగిన ఆ కుక్కను అమ్మగానే భావిస్తున్నాయి ఆ పులులు. టిక్‌టాక్ ద్వారా బాగా వైరల్ అయిన ఆ వీడియోను.. టైగర్ బిగ్ఫ్యాన్ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో అప్లోడ్ చేసింది. ఇప్పుడు ఆ వీడియో ఇప్పుడు ఎక్కువ మంది దృష్టిని ఆకర్షిస్తోంది. View this post on Instagram A post shared by Tiger (@tiger__bigfan) -
డెలివరీ తర్వాత ఫస్ట్ ఫోటో షేర్ చేసిన కాజల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ఇటీవలె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మథర్‌వుడ్‌ని ఎంజాయ్ చేస్తోన్న కాజల్ డెలీవరీ తర్వాత తొలిసారిగా తన ఫోటోను షేర్ చేసింది. పీల్స్ లైక్ సమ్మర్ అంటూ గ్లామరస్ ఫోటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇటీవలె కాజల్ సినిమాలకు ఫుల్స్టాప్ పెట్టనుందనే వార్తలు నెట్టింట చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. చదవండి: విషాదం.. కేజీయఫ్ నటుడు మృతి కొడుకు నీల్ కోసం పూర్తి సమయాన్ని కేటాయించాలని భావిస్తోందని, అందుకే సినిమాలకు గుడ్‌బై చెప్పనుందంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో కాజల్ ఇలాంటి స్టన్నింగ్ ఫోటో షేర్ చేయడం విశేషం. దీంతో ఫుల్ ఫిట్నెస్తో త్వరలోనే సినిమాలకు కంబ్యాక్ ఇవ్వనున్నట్లు కాజల్ ఇలా హింట్ ఇచ్చిందా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. చదవండి: సందీప్ కిషన్ 'మైఖేల్' ఫస్ట్‌లుక్ చూశారా? View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నాకు ఇంకో బిడ్డ ఉంది: కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్
హీరోయిన్ కాజల్ అగర్వాల్ త్వరలోనే తల్లి కాబోతున్న సంగతి తెలిసిందే. 2020 అక్టోబర్30న వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లును పెళ్లాడిన కాజల్ ప్రెగ్నెన్సీ కారణంగా ప్రస్తుతం సినిమాలకు దూరమైంది. రీసెంట్‌గానే సీమంతం ఫోటోలను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేసింది. ఇక బేబీ కాజల్ కోసం ఆమె ఫ్యామిలీ మొత్తం ఎంతగానో ఎదురుచూస్తుంది. తాజాగా ఇదే విషయాన్ని కాజల్ చెల్లెలు నిషా అగర్వాల్ సైతం వ్యక్తం చేసింది. నాకు మరో బిడ్డ పుట్టబోతోంది. నా రెండవ బిడ్డ ఆన్ ది వే. నిన్ను కలుసుకోవడానికి ఇంకా వెయిట్ చేయలేను లిటిల్ వన్ అంటూ కాజల్‌తో కలిసి దిగిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. త్వరలోనే పేరెంట్స్‌గా ప్రమోట్ కాబోతున్న కాజల్-కిచ్లు దంపతులకు బెస్ట్ విషెస్ తెలియజేసింది. ప్రస్తుతం నిషా షేర్ చేసిన ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. చదవండి: ఘనంగా హీరోయిన్ కాజల్ సీమంతం.. ఫోటోలు వైరల్ View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) -
పెళ్లి నా కెరీర్‌పై ప్రభావం చూపలేదు: నటి కామెంట్స్ వైరల్
Malaika Arora About Her Early Marraige And Motherhood: బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నిత్యం ఏదో ఒక విధంగా వార్తల్లో నిలిచే ఈ హాట్ బ్యూటీ తాజాగా తన పెళ్లిపై కీలక వ్యాఖ్యలు చేసింది. 1998లో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్‌తో మలైకా వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తర్వాత వీరికి కొడుకు పుట్టాడు. కానీ మనస్పర్థల కారణంగా 2017లో వీరు విడాకులు తీసుకున్నారు. అయితే 25ఏళ్ల వయసులోనే పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత బిడ్డను కనడం తన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపలేదని మలైకా పేర్కొంది. గ్లామరస్‌గా ఉండేందుకు ప్రయత్నిస్తూనే ఆ సమయంలో ఎదురైన అడ్డంకుల్ని అధిగమించినట్లు తెలిపింది. పెళ్లి చేసుకొని పిల్లలు పుట్టాక చాలా తక్కువ మంది సినిమాల్లో నటించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. అలాగే నటనకు నేను గ్లామర్ ఇండస్ట్రీగానే భావిస్తాను. ఆ విధంగా గ్లామరస్‌గా ఉండేందుఎకు ప్రయత్నిస్తూనే అవకాశాలు సొంతం చేసుకున్నాను అని వెల్లడించింది. కాగా ప్రస్తుతం మలైకా బాలీవుడ్ హీరో అర్జున్ కపూర్‌తో డేటింగ్లో ఉంది. ఈ ఏడాది పెళ్లి చేసుకోవచ్చనే రూమర్స్ కూడా వినిపిస్తున్నాయి. -
‘బిడ్డను కనాలనుకుంటున్నాను నా భర్తకు బెయిలివ్వండి’
డెహ్రడూన్: ఉత్తరాఖండ్ హైకోర్టు ముందుకు ఓ వింత పిటిషన్ వచ్చింది. ‘‘బిడ్డను కనాలనుకుంటున్నాను.. నా భర్తకు బెయిల్ ఇవ్వండి’’ అంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. పైగా ఆమె భర్త జైల్లో ఉన్నది అత్యాచార ఆరోపణల మీద. భర్త ఇలాంటి పనులు చేసి జైలుకెళ్తే ఏ భార్య అయినా అతడి నుంచి విడిపోవాలని అనుకుంటుంది. కానీ నువ్వేంటి తల్లి.. ఏకంగా అతడితో బిడ్డను కనాలనుకుంటున్నావ్.. అసలు రాజ్యంగా ఖైదీలకు ఇలాంటి ఓ హక్కును కల్పించిందా అనే దాని గురించి పరిశోధించే పనిలో ఉన్నారు అధికారులు. ఆ వివారలు.. ఉత్తరాఖండ్‌కు చెందిన సచిన్ అనే వ్యక్తి, మరో ముగ్గురు స్నేహితులతో కలిసి ఓ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ కేసును విచారించిన కోర్టు సచిన్‌తో పాటు మిగిలిన దోషులకు 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. ఇప్పటికి అతడు జైలుకెళ్లి ఏడు సంవత్సరాలు అవుతుంది. పెళ్లైన మూడు నెలలకే భర్త జైలుకెళ్లాడని.. తమకు కలిసి ఉండే అవకాశమే లభించలేదని తెలిపింది సచిన్ భార్య. ‘‘మాతృత్వంలోని మాధుర్యాన్ని అనుభవించాలని కోరుకుంటున్నాను. కనుక నా భర్తకు షార్ట్ టర్మ్ బెయిల్ ఇవ్వండి’’ అంటూ సచిన్ భార్య హైకోర్టును ఆశ్రయించిది. తనకు మాతృత్వంలోని మాధుర్యం అనుభవించాలని ఉందని, ఇది భార్యగా తన హక్కు అని ఆమె తన పిటిషన్లో పేర్కొంది. తన భర్తకు కొంతకాలం బెయిల్ ఇస్తే తాను గర్భం దాల్చేందుకు అవకాశం ఉంటుందని వేడుకుంది. ఉత్తరాఖండ్ హైకోర్టు ప్రధాని న్యాయమూర్తి ఆర్ఎస్ చౌహాన్, జస్టిస్ అలోక్ కుమార్ వర్మల ధర్మాసనం ఈ పిటిషన్‌ని విచారించింది. గతంలో ఎన్నడూ ఇలాంటి వింత పిటిషన్ రాలేదని విచారణ సందర్భంగా వారు అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్ విచారణ సందర్భంగా ధర్మాసనం పలు అనుమానాలను లేవనేత్తింది. ఈ క్రమంలో తమకు సలహా ఇవ్వాలని ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. కోర్టు వ్యక్తం చేసిన అనుమాలు ఇలా ఉన్నాయి.. ‘‘అత్యాచారం కేసులో దోషిగా నిరూపణై జైలుశిక్ష అనుభవిస్తున్న వ్యక్తికి బెయిల్ ఇవ్వొచ్చా?.. ఈమె ‘భార్యగా నా హక్కు’ అంటూ కోర్టుకెక్కింది. ఆమె హక్కులను గౌరవించి అతనికి బెయిల్ ఇస్తే వారికి కలిగే సంతానం కూడా వచ్చి ‘బిడ్డలుగా మా హక్కు’ అనే అవకాశం ఉంది కదా’’.. అని హైకోర్టు అభిప్రాయపడింది. పైగా తండ్రి లేని బిడ్డను తల్లి ఒక్కతే పోషించడం చాలా కష్టమైన విషయం, ఇలాంటి పరిస్థితుల్లో పిల్లలు కనడం కోసమే నిందితుడికి బెయిల్ ఇవ్వడం సబబేనా అని కూడా ధర్మాసనం ఆలోచిస్తోందన్నారు. అలాగే తండ్రి లేకుండా పెరిగే బిడ్డల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం కూడా ఉందని కోర్టు అభిప్రాయపడిది. ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో తమకు సరిగా తెలియడం లేదని ధర్మాసనం పేర్కొంది. గతంలో ఇలాంటి కేసులేమైనా అమెరికా, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, కెనడా వంటి దేశాల్లో నమోదయ్యాయా.. ఒకవేళ నమోదైతే అక్కడి కోర్టులు ఎలాంటి తీర్పులిచ్చాయి.. అన్న వివరాలతో తమకు నివేదిక సమర్పించాలని హైకోర్టు అధికారులను ఆదేశించింది. ఈ విషయంలో ప్రభుత్వ అభిప్రాయాన్ని కూడా తెలపాలని హైకోర్టు కోరింది. -
మాతృత్వం కోసం తన వీర్యాన్ని దాచుకున్న ‘దయారా’
గాంధీనగర్: గుజరాత్, అహ్మదాబాద్‌కు చెందిన డాక్టర్ జిస్నూర్ దయారా రాష్ట్రం నుంచి వైద్య విద్యనభ్యసించిన తొలి ట్రాన్స్ వుమెన్‌గా రికార్డు సృష్టించారు. తాజాగా ఆమె మరో సంచలన నిర్ణయం తీసుకుని మరో సారి వార్తల్లో నిలిచారు. త్వరలోనే శస్త్ర చికిత్స ద్వారా పూర్తిగా మహిళగా మారనున్న దయారా సంచలన నిర్ణయం తీసుకున్నారు. స్త్రీ జన్మకు పరిపూర్ణ అర్థాన్ని చేకూర్చే మాతృత్వాన్ని అనుభూతి చెందడం కోసం తన వీర్యాన్ని భద్రపరుచుకున్నారు. భవిష్యత్తులో దీన్ని ఉపయోగించి ఆమె బిడ్డను కనాలని భావిస్తున్నారు. ఇలా జన్మించే బిడ్డకు దయారానే తల్లి, తండ్రి అవుతారు. ఒకే జన్మలో ఆమె మగాడిగా, స్త్రీగా జీవించనున్నారు. అదే విధంగా తొలిసారి ఓ బిడ్డకు తల్లి, తండ్రి ఒక్కరే అవుతుండటం విశేషం. ఈ సందర్భంగా దయారా మాట్లాడుతూ.. ‘‘చిన్నప్పటి నుంచి నాకు ఆడవారిగా జీవించాలని ఉండేది. మా అమ్మ, అక్కలాగా చీర కట్టుకోవాలని.. లిప్‌స్టిక్ వేసుకోవాలని మనసు తహతహలాడేది. కానీ చుట్టూ ఉన్న సమాజానికి భయపడి.. నాలోని స్త్రీని బయటకు రానివ్వలేదు. ఇదిలా కొనసాగుతుండగానే.. ఎంబీబీఎస్ చదవడానికి నేను రష్యా వెళ్లాను. అక్కడ నాలాంటి వారు ఎంతో ధైర్యంగా.. తమకు నచ్చినట్లు బతకడం చూశాను. నాలో ధైర్యం వచ్చింది. భయాల్ని తొలగించుకున్నాను. నాకు నచ్చినట్లు బతకడం మొదలు పెట్టాను. చీర కట్టుకోవడం, లిప్‌స్టిక్ వేసుకోవడం నేర్చుకున్నాను. నన్ను చూసి మొదట నా తల్లిదండ్రులు ఇబ్బంది పడ్డారు. కానీ ప్రస్తుతం వారు నన్ను అర్థం చేసుకున్నారు. నా చుట్టు ఉన్న సమాజం కూడా నన్ను అంగీకరించడం ప్రారంభించింది’’ అంటూ చెప్పుకొచ్చారు దయారా. తల్లి అవ్వడం నా కల ‘‘ప్రస్తుతం ఇండియాలో ప్రాక్టీస్ చేయడం కోసం మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నిర్వహించే పరీక్ష రాయబోతున్నాను. ఆ తర్వాత శస్త్ర చికిత్స ద్వారా నేను పూర్తిగా స్త్రీగా మారతాను. ఆడవారికి లభించిన అద్భుతమైన వరం ఓ జీవికి జన్మనివ్వడం. నేను కూడా ఆ వరాన్ని అందుకోవాలని భావిస్తున్నాను. మాతృత్వాన్ని అనుభూతి చెందాలనుకుంటున్నాను. అందుకే లింగ మార్పిడి శస్త్రచికిత్సకు ముందే నా వీర్యాన్ని భద్రపరుచుకోవాలని భావించాను. ఇందుకు గాను అహ్మదాబాద్, ఆనంద్‌లోని ఓ ఐవీఎఫ్ ఆస్పత్రిని సంప్రదించి.. నా కోరికను వారికి చెప్పాను. నా నిర్ణయాన్ని గౌరవించిన వారు నా వీర్యాన్ని భద్రపరిచేందుకు అంగీకరించారు. వారికి ఎంతో రుణపడి ఉంటాను’’ అన్నారు దయారా. సరోగసి ద్వారా బిడ్డను కంటాను ‘‘కాళీ మాతా దయ వల్ల నేను ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నాను. అలా జన్మించే బిడ్డకు బయాలజీకల్గా నేనే తల్లి, తండ్రి. ఈ విషయం తలుచుకుంటే నా మనసు గర్వంతో ఉప్పొంగిపోతుంది. బిడ్డను కనడం కోసం నేను సరోగసి విధానాన్ని ఎంచుకోబోతున్నాను. ఇందుకు నేనేం సిగ్గుపడటం లేదు. ట్రాన్స్ వుమెన్‌గా మారిన వ్యక్తి.. ఓ బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో ధైర్యం కావాలి. చుట్టూ ఉన్న సమాజం కూడా ట్రాన్స్‌జెండర్స్ పట్ల దయతో వ్యవహరించాలి’’ అని కోరారు. ఆస్పత్రి చరిత్రలో ఇదే ప్రథమం: నయనా పటేల్ ఇక దయారా వీర్యాన్ని భద్రపరిచిన ఆస్పత్రి వైద్యుడు డాక్టర్ నయానా పటేల్ మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న మగాళ్లు, ఇంటికి దూరంగా ఉంటున్న సైనికులు, చాలా కాలం వరకు బిడ్డలు వద్దనుకునే దంపతుల్లోని మగవారు తమ భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని వారి వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకుంటారు. ఆ తర్వాత బిడ్డలు కావాలనుకున్నప్పుడు ఐవీఎఫ్, సరోగసి ద్వారా పిల్లల్ని కంటారు. కానీ మొదటిసారి ఓ ట్రాన్స్ఉమెన్ భవిష్యత్తులో తల్లి అవ్వడం కోసం తన వీర్యాన్ని మా ఆస్పత్రిలో భద్రపర్చుకోవడం మా ఆస్పత్రిలో ఇదే మొదటిసారి’’ అన్నారు. చదవండి: చిన్ని తండ్రీ నిన్ను చూడక... ట్రాన్స్... అప్డేట్ వెర్షన్ -
నువ్వు బాగున్నావు కదా?
‘ఆర్యూ ఓకే’ అనే భావం భర్త చూపుల్లో మేఘన్‌కు కనిపించింది! హాస్పిటల్ బెడ్‌పైన ఉంది మేఘన్. భర్త అలా చూడగానే ఆమెకు విషయం అర్థమైంది. గుండె పగిలి ఒక్కసారిగా ఏడ్చేసింది. మాతృత్వం! ఆ భావనలోనే అమృతం దాగుంది. దేవుడు స్త్రీకిచ్చిన వరం మాతృత్వం అని అంటుంటారు. అందుకే ఎన్నిసార్లు తల్లయినా, మళ్లీ మరో బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఆ అమ్మదనాన్ని స్త్రీ కొత్తగా కోరుకుంటుంది. గర్భంలో అప్పుడే ప్రాణం పోసుకుంటున్న జీవిని కంటికి రెప్పలా కాచుకుంటుంది. అయిన వారందరికీ చెప్పుకొని మురిసిపోతుంది. పుట్టబోయే బిడ్డని అందనంత ఎత్తులో చూడాలని కలలు కంటుంది. కానీ.. ఆ కలలు అర్ధంతరంగా కల్లలైపోతే! రేపో మాపో పుడుతుందనుకున్న నలుసు కడుపులోనే కరిగి, అందని లోకాలకు వెళ్లిపోతే! ఆ బాధను భరించడం ఏ తల్లికీ తరం కాదు. ఆ తల్లి కన్నీటిని తుడవడం ఏ ఒక్కరికీ వశం కాదు. 2020 జూలై. అప్పుడే రోజు మొదలవుతోంది. గర్భంతో ఉన్న మేఘన్ మార్కెల్ తన మొదటి కొడుకు డైపర్ మార్చుతోంది. అకస్మాత్తుగా తెలీని నిస్సత్తువ ఏదో ఆవరించినట్లు ఆమె శరీరమంతా తిమ్మిర్లు మొదలయ్యాయి. చేతుల్లో ఒక బిడ్డ, కడుపులో మరో బిడ్డ. చేతుల్లోని ఏడాది బిడ్డను ఉన్నఫళంగా వదిలేయలేదు. వదిలేయకుంటే తనలో ప్రాణం పోసుకుంటున్న మరో బిడ్డపై ఆ క్షణాన పడుతున్న ఒత్తిడి ఏమిటో తెలుసుకోలేదు. మనసేదో కీడు శంకిస్తోంది. ఏమిటది? ఆలోచించే లోపే తనకు తెలీకుండానే చేతుల్లో ఉన్న బాబుతో సహా కింద పడిపోయింది. కళ్లు తెరిచి చూసేసరికి ఆసుపత్రి పడకపై ఉంది! పక్కన భర్త హ్యారీ ఓదార్పుగా ఆమెనే చూస్తూ ఉన్నాడు. కళ్లు తెరిచాక, ‘నువ్వు బాగున్నావ్ కదా?!’ అనే భావం అతడి చూపుల్లో ఆమెకు కనిపించింది. ఆమె చెయ్యి విడువకుండా, దుఃఖాన్ని దిగమింగుకొని, కడుపులోని జీవం కడుపులోనే పోయిందని చెప్పలేకపోతున్నాడు. కడుపు కోతంటే కేవలం తల్లిది మాత్రమే కాదు తండ్రిది కూడా. విషయం ఆమె గ్రహించింది! ఒక్కసారిగా ఆమె గుండె పగిలి పోయింది. తట్టుకోలేక పోయింది. భోరున ఏడ్చేసింది. ∙∙ ప్రిన్స్ హ్యారీని ప్రేమించి, పెళ్లాడి బ్రిటన్ రాజవంశంలోకి అడుగుపెట్టిన మేఘన్ మార్కెల్‌ను ఈ చేదు ఘటన ఒక్కసారిగా తలకిందులు చేసింది. భర్త హ్యారీ, ముద్దులొలికే తమ చిన్నారి కుమారుడు ఆర్చీ మాత్రమే లోకంగా జీవిస్తూ వస్తోంది ఆమె ఇంతవరకూ. ‘మొదటి బిడ్డను పుట్టగానే నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ఎంత సంతోషం అనుభవించానో.. రెండో బిడ్డను కడుపులోనే పొగొట్టుకున్నప్పుడు అంతకు రెట్టింపుగా బాధపడ్డాను’ అని తాజాగా ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రికకు రాసిన వ్యాసంతో ఆమె తన వ్యధను దిగమింగుకోలేకపోయారు. బ్రిటన్ రాజవంశానికి చెందిన ఓ ఉన్నత వ్యక్తి ఇలా వ్యక్తిగత విషయాలు బయటకు వెల్లడించడం.. అందులోనూ ఇలాంటి విషయాల గురించి మీడియాతో పంచుకోవడం ఇదే ప్రథమం కాకపోవచ్చు. కానీ ఎంతో ఆవేదనా భరితంగా ‘ది లాసెస్ వియ్ షేర్’ అనే ఆ వ్యాసం కొనసాగింది. కొద్దికాలం క్రితమే బ్రిటన్ రాజప్రాసాదాన్ని వీడిన ఈ దంపతులు ప్రస్తుతం లాస్ ఏజెలిస్లో ఉంటున్నారు. తన వ్యాసంలోనే ఇంకో మాట కూడా రాశారు మేఘన్. గత ఏడాది ప్రిన్స్ హ్యారీ, తను దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్నప్పుడు ఒక జర్నలిస్టు.. ‘ఆర్యూ ఓకే’ అని మేఘన్‌ను అడిగారట. అది మామూలు ప్రశ్నే అయినా అలాంటి పలకరింపు ప్రతి మహిⶠకూ అవసరం అని మేఘన్ అన్నారు. బహుశా తనను వద్దనుకున్న రాజప్రాసాద బాంధవ్యాలను తలచుకుని అలా రాసి ఉండవచ్చు. ఏమైనా భర్త తన పక్కన ఉన్నాడు. ‘ఆర్యూ ఓకే’ అని అతడు తనని అడుగుతున్నట్లే ఉంది ఆమెకు ప్రతి క్షణం. – జ్యోతి అలిశెట్టి, సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం -
పిల్లల పెంపకంలో టెన్షన్
పిల్లల పట్ల తల్లికి ఉండే ప్రేమను, బాధ్యతను, వాత్సల్యాన్ని కలగలిపి ‘మాతృత్వం’ అంటుంటారు. ఇంగ్లిష్‌లో ‘మదర్‌హుడ్’. ఈ మాతృత్వం గొప్పదని, వరమని అంటూ తల్లి చుట్టూ బంధాలు బిగించారా? పిల్లల పెంపకంలో వొత్తిడి మదర్‌హుడ్‌ను మెంటల్హుడ్గా మార్చిందా? బాలాజీ టెలిఫిల్మ్స్ తీసిన కొత్త వెబ్‌సిరీస్ ‘మెంటల్‌హుడ్’ ఆ విషయాన్నే చర్చిస్తుంది. భర్తలు బయటికెళ్లి సంపాదించుకుని రావాలి, భార్యలు ఇంటి పట్టున ఉండి పిల్లల ఆలనా పాలనా చూడాలి అనేది అనాదిగా ఉన్న భారతీయ సంప్రదాయం. ‘రోజంతా ఇంట్లో ఉంటావ్ కదా... ఏం చేస్తుంటావ్?’ అని అనే భర్తలు ఇప్పుడూ ఎప్పుడూ ఉండనే ఉంటారు. భార్యను పుట్టింటికి పంపి, పిల్లలతో ఒకరోజు ఇంట్లో గడిపితే తెలుస్తుంది రోజంతా ఇంట్లో ఉండి భార్య ఏం చేస్తుందో. పిల్లలను రోజూ నిద్ర లేపి, రెడీ చేసి, టిఫెన్లు తినిపించి, స్కూళ్లకు పంపే పని తండ్రులు ఎంతమంది చేస్తారు ఇళ్లల్లో అనేది ఎవరికి వారు ఆలోచించుకుంటే తల్లులు పడే వొత్తిడి తెలిసి వస్తుంది. నిత్య జీవితంలో సమస్యలు అన్నీ సినిమా ఫార్ములాకు తగినట్టుగా ఉండవు. అందుకే చాలా విషయాలు పెద్ద తెర మీద కనిపించవు. థ్యాంక్స్ టు వెబ్ సిరీస్. వెబ్ కంటెంట్‌కు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో రకరకాల స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్స్ వచ్చాక తప్పనిసరై ఇంటి సమస్యల పై కూడా దృష్టి పడుతోంది. ఇప్పుడు తాజాగా బాలాజీ టెలిఫిల్మ్స్ ఏక్తా కపూర్ నిర్మాణంలో ‘మెంటల్‌హుడ్’ వెబ్ సిరీస్‌ను తయారు చేసింది. మార్చిలో ‘జీ5’లో ఈ సిరీస్ టెలికాస్ట్ కానుంది. హిందీలో పేరున్న స్టార్స్– కరీష్మా కపూర్, డినో మారియా, సంజయ్ సూరి తదితరులు ఇందులో నటించారు. మెంటల్‌హుడ్ కథ ప్రధానంగా ఐదుగురు తల్లుల చుట్టూ తిరుగుతుంది. వీరితో పాటు ఒక ‘హౌస్ హజ్బెండ్’ కూడా ఉంటాడు. హౌస్ హజ్బెండ్ అంటే భార్య ఉద్యోగానికి వెళితే ఇంట్లోనే ఉండి పిల్లల బాగోగులు చూసుకునే తండ్రి అనమాట. ఈ ఆరుగురు తమ పిల్లల జీవితాలను ఎలా డీల్ చేశారనేది కథ. ఇందులో కరీష్మా ముగ్గురు పిల్లల తల్లిగా నటించింది. ఈమె సగటు గృహిణి. పిల్లలు పెంచే వొత్తిడిని భర్త ఏ మాత్రం పంచుకోడు. ఆమె ఏం చేయాలి? మరో తల్లి ‘వర్కింగ్ మదర్’గా ఉంటూనే తన మాతృత్వానికి పూర్తి న్యాయం చేయాలని పెనుగులాడుతూ ఉంటుంది. ఒక తల్లి తన పిల్లలకు కేవలం ఆల్టర్నేట్ మెడిసిన్ వాడాలని, వాళ్లు ఆర్గానిక్ ఫుడ్ తినాలని అనుకుంటూ ఉంటుంది. వీళ్లలో ఒక పాపను స్కూల్లో మోలెస్ట్ చేస్తారు. ఆ వొత్తిడి ఎలా ఎదుర్కోవాలి?... ఇవన్నీ సమస్యలు. మన వొడిలో కూచుని ఆడుకుని ఎదిగిన పిల్లలే వయసు పెరిగే కొద్దీ అభిప్రాయాలు పెంచుకుని, అంచనాలు తెచ్చుకుని తల్లిని ప్రేమించాలా ద్వేషించాలా అనేవరకు ఈ మదర్‌హుడ్ వెళుతుంది. ప్రతి కుటుంబం తనను తాను చూసుకునే ఈ వెబ్ సిరీస్‌కు దర్శకురాలు కూడా స్త్రీయే. కరిష్మా కోహ్లి. కనుక స్త్రీల దృష్టికోణంలో పిల్లల పెంపకాన్ని ఈ సిరీస్ గట్టిగా చర్చకు పెడుతుందని చెప్పవచ్చు. -
నేరాల సంఖ్య తగ్గాలంటే..?
లలితాపరా భట్టారికా స్వరూపాన్ని చూడడానికి ఏ కాంచీపురమో, శృంగేరీయో వెళ్ళక్కరలేదు, అప్పుడే పుట్టిన తన పిల్లలకు పాలు ఇస్తున్న కుక్కలో కనబడుతుంది. తన్నుకు పోవడానికి వచ్చిన గద్దనుంచి రక్షించడానికి పిల్లలను రెక్కల కింద దాచిని కోడిపెట్ట కళ్ళల్లో ఆ మాతృత్వం, లలితా పరా భట్టారికా తత్త్వం కనబడుతుంది. ఆ మాతృత్వానికున్న విశేషం ఏమిటో నిజంగా పరమేశ్వరుడు ఎలా సృజించాడో అర్థం చేసుకున్న నాడు ప్రతి స్త్రీలో నిబిడీకృతమై ఉన్న మాతృత్వాన్ని చూడవచ్చు. ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావనచేత మరలువాడు..‘‘ అంటారు పోతన గురించి. ఇంత పరమ పవిత్రమైన అమ్మవారి విభూతిని సంతరించుకున్న తల్లి–అని ఆమె పాదాలను చూసి నమస్కారం చేసి తప్పుకుంటాడు తప్ప అన్యమైన భావనలు మనసులో పొంగే అవకాశమే ఉండదు. మాతృత్వం చేత స్త్రీ పట్టాభిషేకాన్ని పొందింది. ఈ జాతిలో అన్యభావనలు, అనవసర విషయాలు ఎప్పుడు ప్రబలుతాయి? మన సంస్కృతిని ఉపదేశం చేయనప్పుడు, కావ్యాలు, పురాణాల్లో ఎంతో గొప్పగా చెప్పబడిన స్త్రీ వైశిష్ట్యాన్ని ప్రబోధం చేయడం ఆగిపోయినప్పుడు... నేర మనస్తత్వం పెరుగుతుంది. మన శాస్త్రాల్లోని మంచి మాటలు, స్త్రీలను గౌరవిస్తూ వేదాలు చెప్పిన విషయాలు మనం మన పిల్లలకు చెప్పగలిగినప్పుడు, చెప్పినప్పుడు అసలు నేరాల సంఖ్య ఇలా అయితే ఉండదు. ఆమె చదువుకుందా లేదా అన్నదానితో సంబంధం ఉండదు. అవసరమయితే తన ప్రాణాన్ని ఇస్తుంది. అది పురుషుడివల్ల వశం కాదు. ఒకసారి తన ముగ్గురు బిడ్డలు, భరత్‌తో కలిసి ఒక సాధారణ ప్యాసింజరు రైలనుకుని వేరొక రైలెక్కిన నిరక్షాస్యురాలయిన ఒక పేద స్త్రీ. విషయం తెలుసుకుని దిగిన తరువాత చూసుకుంటే ఒక బిడ్డ లోపలే ఉండిపోయాడని తెలిసి.. ప్రాణాలకు తెగించి అప్పుడే బయల్దేరిన రైలువెంట పరుగులు తీస్తున్నది. ఛస్తావని అందరూ చివరకు భర్తకూడా హెచ్చరిస్తున్నా లెక్క చేయకుండా ప్లాట్‌ఫారమ్ మీద పరుగులు తీస్తుంటే చూసిన రైల్వే అధికారి ఒకరు రైలును ఆపించి బిడ్డను తల్లికి చేర్చారు. బిడ్డను తీసుకొచ్చేలోగా ఆమె స్పృహ తప్పింది. తరువాత బిడ్డను తడిమి చూసుకుని ఆమె పడ్డ ఆనందం మాటల్లో చెప్పనలవికాదు. అది కేవలం తల్లికే సాధ్యమయిన విశిష్ట లక్షణం. ఒక ప్రత్యేకమైన యాగం చేస్తే పితృరుణం తీరుతుంది. కానీ మాతృరుణం అలా తీరేది కాదని వేదం చెప్పింది. అందుకే దేశంలో ఒక సత్సంప్రదాయం ఉంది. సన్యాసం తీసుకుని పీఠాధిపత్యం పొందిన తరువాత ఆయనను చూడడానికి పూర్వాశ్రమంలోని తండ్రి వెడితే... మిగిలిన అందరిలాగే దర్శించుకుని నమస్కారం చేసి రావాల్సి ఉంటుంది. అంతే తప్ప మరో ఏర్పాటేదీ ఉండదు. అదే తల్లి కనబడిందనుకోండి. అప్పటిదాకా కూర్చుని ఉన్న పీఠాధిపతి లేచి నిలబడాలి. తల్లి అన్న మాటకు సన్యాసాశ్రమంలో కూడా అంత గౌరవం ఇచ్చింది శాస్త్రం. పరమాత్ముడంతటివాడు కూడా అంత విలువనిస్తాడు. స్త్రీ విషయంలో సాష్టాంగ నమస్కారానికి కూడా మినహాయింపు ఇచ్చింది శాస్త్రం. ఇంత గౌరవం, ఇంత ప్రాధాన్యత ఆమెపట్ల మాత్రమే ప్రకాశిస్తాయి. అది పురుషుని శరీరం విషయంలో అలా ప్రకాశించదు. -
త్యాగశీలవమ్మా..!
కోడిపెట్ట అల్పప్రాణి. మాతృత్వం ఎంత కష్టంతో కూడుకున్నదో ఆ తల్లికోడికి అంత ఆనందంతో భరించేదయి ఉంటుంది. కోడిగుడ్డు లోపల పిండం ఉంటుంది. దాన్ని గట్టిగా నొక్కితే పెంకు పగిలిపోయి లోపల ఉన్న పిండం స్రవించి కిందకు జారిపోతుంది. అదే తల్లికోడి కదిలివచ్చి... చక్కగా రెండు కాళ్ళు దూరంగా పెట్టి ఆ గుడ్డు పెంకు పగిలిపోకుండా దాని కడుపును ఆన్చి దాని శరీరంలోని వేడిని పెంకు ద్వారా పిండానికి అందించి, పొదగబడుతున్న పిండంలోంచి తన పిల్ల ఉద్భవిస్తోందనే ఆనందాన్ని పొందిన ఆ కోడి ఆ క్షణాల్లో ఎంతగా తన్మయత్వం చెందుతుందో ఎవ్వరూ చెప్పలేరు. అందుకే రామకృష్ణ పరమ హంస ఏమంటారంటే – గుడ్డును పొదుగుతున్న కోడిపెట్ట బొమ్మ గీయగలరేమో గానీ గుడ్డులో పిండం పిల్లగా తయారవుతున్నప్పుడు పొదుగుతున్న తల్లి కోడిపెట్ట కళ్ళల్లోని ఆనందాన్ని ఆవిష్కరించగలిగిన చిత్రకారుడు మాత్రం ప్రపంచంలో పుట్టలేదు–అని. పిల్లలు పుట్టిన తరువాత రెక్కల కింద పెట్టుకుని కాపాడుతుంది. ఎక్కడెక్కడ తిరుగుతూ ఆహార సేకరణలో నిమగ్నమై ఉన్నా మధ్యమధ్యలో తలఎత్తి ఆకాశం వంక గద్దలేమైనా వస్తున్నాయేమోనని ఒక కంట కనిపెట్టి ఉంటుంది. నిజంగా గద్ద వస్తే కోడి ఎదుర్కోగలదా! ఎదుర్కోలేదు. కానీ గద్ద కిందకు దిగుతున్నదనిపించిన వెంటనే రెక్కలు విప్పి ఎంతో బాధతో పిల్లల్ని చేరదీసి రెక్కల కింద కప్పేస్తుంది. అంటే దాని ఉద్దేశం–ఒకవేళ గద్ద తన వాడిముక్కుతో పొడిచినా, గోళ్ళతో చెణికినా అది తనకే తగలాలి, తాను చనిపోవాలి... తాను చనిపోయిన తరువాత పిల్లలకి ఆపద రావాలి తప్ప తాను బతికి ఉండగా మాత్రం తన పిల్లల్లో ఒక్క దానికి కూడా హాని కలగకూడదు. అంటే తాను ప్రాణత్యాగానికి సిద్దపడిపోతుంది తప్ప పిల్లల్ని ఎరగా వేసి మాత్రం తన ప్రాణం కాపాడుకోదు. లోకంలో ఎవరయినా తల్లుల త్యాగానికి ఉదాహరణ చెప్పవలసి వస్తే కోడి రెక్కలకింద పెట్టి పెంచినట్టు ఆవిడ బిడ్డల్ని పెంచుకుంది–అంటారు. అశుద్ధాన్ని, అమలినమైన పదార్థాలను తినే పంది కూడా దానికి పిల్లలు పుడితే అన్ని పిల్లలకు వరుసలో ఉన్న సిరములనన్నిటినీ ఇచ్చి వాటి కడుపునిండుతుంటే తాను తృప్తి పొందుతుంది. ఆవు ఎక్కడెక్కడో తిరుగుతుంది. పుట్టలమీద మొలచిన గడ్డి తింటుంది. ఎవ్వరికీ అక్కరలేని నీళ్లు తాగుతుంది. ప్రశాంతంగా కూర్చుని నెమరు వేసుకుంటుంది. అంటే కడుపులోకి పంపిన ఆహారాన్ని మళ్ళీ వెనక్కి నోట్లోకి తెచ్చుకుని తీరికగా నమిలి మింగుతుంది. ఒకసారి దూడ వచ్చి పొదుగులో మూతిపెట్టి నాలుగుమార్లు కుదిపితే తాను కష్టపడి నిల్వ చేసుకున్న పాలను విడిచి పెట్టేస్తుంది. ఆహారాన్ని వెనక్కి తెచ్చుకున్నట్లుగా... ఒకసారి దూడకు వదిలిన పాలను అది వెనుకకు తీయదు, తీయలేదు. సమస్త ప్రాణుల్లో ... ముఖ్యంగా స్త్రీలలో ఉన్న ఈ మాతృత్వం ఒక అద్భుతం. అందుకే వేదం ఆమెకు అంత ప్రాధాన్యతనిచ్చింది. -
అన్నీ సర్దుకుంటాయి: సానియా మీర్జా
సాక్షి, హైదరాబాద్: భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా మాతృత్వం ఆశయాలకు అడ్డంకి కాబోదంటోంది. త్వరలోనే తల్లిని కాబోతున్నట్లు ప్రకటించిన సానియా... ‘గాయం కారణంగా విశ్రాంతి తీసుకుంటున్నా. గతేడాది అక్టోబర్ మధ్య నుంచి ఆటకు విరామం ఇచ్చాను. 2020 టోక్యో ఒలింపిక్స్ కోసం ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నా. అమ్మతనం నా ఆశయాలకు అడ్డురాదు. తల్లి కావడమనేది నాకే కాదు ప్రతీ ఒక్కరికి ఓ అద్భుతం, అదృష్టం. గర్భిణిని కావడంతో బరువు పెరిగిన మాట వాస్తవమే. అయితే అది ఎవరికైనా అంతే. తిరిగి బరిలో దిగితే అన్నీ సర్దుకుంటాయి. నాకు పుట్టబోయే బిడ్డ నా కలలను చెరిపేయదు. నిజానికి ఆ బిడ్డ నా ఉత్సాహానికి ప్రేరణగా నిలుస్తుంది. తల్లిగా మారాక టెన్నిస్‌లో రాణించిన వారిలో నా పేరు ప్రముఖంగా వినిపించాలని లక్ష్యంగా పెట్టుకున్నా. ప్రస్తుతం నా బిడ్డ భవిష్యత్తు నాకు ముఖ్యం. అలాగని నాకెంతో ఇష్టమైన ఆటను వదిలేయను. బిడ్డ తర్వాత నేను అధిక ప్రాధాన్యం ఇచ్చేది టెన్నిస్‌కే’ అని తెలిపింది. -
తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు కార్యక్రమాలు
కలెక్టర్ మిశ్రా కాకినాడ సిటీ : తల్లీబిడ్డల ఆరోగ్య పరిరక్షణకు వైద్యారోగ్యశాఖ, మహిళా, శిశు సంక్షేమ శాఖల ద్వారా ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు కలెక్టర్ కార్తికేయ మిశ్రా తెలిపారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాలలో భాగంగా గురువారం కలెక్టరేట్ విధానగౌతమి హాలులో ఐసీడీఎస్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు. జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభించి మాట్లాడుతూ తల్లి పాలే బిడ్డకు శ్రేష్టమన్నారు. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాలలో తల్లుల విషయంలో మొదటి త్రైమాసికం నుంచి వారిని పర్యవేక్షించి అవసరమైతే పౌష్టికాహారం అందించే చర్యలు చేపట్టాలన్నారు. అనంతరం కలెక్టర్ 25వ తల్లిపాల వారోత్సవాల బ్రోచర్‌ను ఆవిష్కరించారు. 1098 హెల్ప్‌లైన్‌పై విస్తృత ప్రచారం 1098 హెల్ప్‌లైన్ టోల్‌ఫ్రీ నంబర్‌కు మహిళలు, పిల్లల అక్రమ రవాణా జరుగుతున్నప్పుడు సమాచారమివ్వాలని, దీనిని విస్తృత ప్రచారం చేయాలని ఐసీడీఎస్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో మహిళాభివృద్ధి శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా నివారణపై ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ జిల్లాలో మహిళలు, పిల్లల అక్రమ రవాణా ఎక్కువగా ఉందని, దీని నిరోధానికి ఐసీడీఎస్, పోలీస్, రెవెన్యూ సమన్వయంతో చర్యలు చేపట్టాలన్నారు. హెల్ప్‌లైన్‌కు సంబంధించి పోలీస్, ఆర్టీసీ, రైల్వే స్టేషన్లో ప్రజలకు కనిపించే ప్రాంతాలలో డిస్ప్లే బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి, ట్రైనీ కలెక్టర్ ఆనంద్, జేసీ–2 జె.రాధాకృష్ణమూర్తి, ఐసీడీఎస్ పీడీ పి.శారదాదేవి, యూనిసెఫ్ స్టేట్‌కో–ఆర్డినేటర్ సుహాసిని, డీఎంహెచ్‌వో కె.చంద్రయ్య, జీఎంఆర్ ప్రతినిధి సుధాకర్, జిల్లా శిశు సంరక్షణాధికారి సీహెచ్ వెంకట్రావు పాల్గొన్నారు. -
ద్రాక్ష పండ్లు, మంచి నిద్రతో మాతృత్వం
సంతానానికి నోచుకోని మహిళలకు ఇదో శుభవార్త. కంటినిండా నిద్రపోవడం, వీలైనంత ఎక్కువగా ద్రాక్ష పండ్లు తినడం ద్వారా కడుపు పండేందుకు అవకాశాలు మెరుగవుతాయని అంటున్నారు సౌతాంప్టన్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. మహిళలను బాధించే ఎండోమెట్రి యోసిస్కు సంబంధించిన అవగాహనలో మార్పు ద్వారా తాము ఈ అంచనాకు వచ్చామంటున్నారు. విపరీతమైన కడుపునొప్పి, నెలసరి సక్రమంగా లేకపోవడం ఎండోమెట్రియోసిస్ లక్షణాల్లో కొన్ని. గర్భం ధరించాలంటే పక్వదశలో ఉన్న అండాలను విడుదల చేయాల్సి ఉంటుంది. ఎండోమెట్రియోసిస్ కారణంగా అండాలు పక్వదశకు చేరకుండానే విడుదలవుతున్నట్లు తాజా పరిశోధనలో తెలిసింది. ఫాలికల్స్‌లో ఉండే ద్రవాల కారణంగా అండాలు దెబ్బతింటున్నట్లు వీరు గుర్తించారు. ఈ ద్రవాల కారణంగా రియాక్టివ్ ఆక్సిజన్ స్పీషీస్ (ఆర్వోఎస్) రసాయనాల ఉత్పత్తి జరుగుతుందని, ఇవి అండాల్లోని డీఎన్ఏను దెబ్బతీస్తాయని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న పరిశోధకుడు డాక్టర్ సైమన్లేన్ తెలిపారు. ద్రాక్ష పండ్లతోపాటు బ్లూబెర్రీలు, వేరుశనగలోనూ ఉండే యాంటీ యాక్సిడెంట్ రిస్వెరట్రాల్, మంచి నిద్రతో శరీరానికి చేరే మెలటోనిన్ల ద్వారా ఈ పరిస్థితిని అధిగమించవచ్చునని తాము ఎలుకలపై జరిపిన పరిశోధనల ద్వారా తెలుసుకున్నామని వివరించారు. -
'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'
లండన్: తనకు సొంతపిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని, పిల్లల్ని కనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు విజేత హెలెన్ మిర్రెన్(70) అన్నారు. అయితే, ఆ దశ తన జీవితంలో లేనందుకు మాత్రం చాలా బాధపడ్డానని, కన్నీటి పర్యంతం అయ్యానని తెలిపారు. అయితే, కొద్ది సేపటికే ఆ బాధను అధిగమించి సంతోషంగా మారిపోయానని అన్నారు. 1986 నుంచి ప్రముఖ దర్శకుడు టేలర్ హ్యాక్ ఫార్డ్ తో సహజీవనం ప్రారంభించిన ఆమె ఆయనను 1997లో వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు కూడా. కానీ, వారినే తన పిల్లలుగా భావించాను తప్ప సొంతంగా బిడ్డలు కావాలని మాత్రం అనుకోలేదని అన్నారు.'నేను పిల్లల్ను ప్రేమిస్తాను. వాళ్లు చాలా ఫన్నీ.. స్వీట్. కానీ నేనెప్పుడు నాకు పిల్లలు కావాలనుకోలేదు. కానీ, నేను ఇలా చెప్పిన మాట కూడా ఒక అబద్ధమేనని ప్యారెంట్ హుడ్ చిత్రం చూసిన తర్వాత తెలిసింది. ఆ సినిమా చూస్తూ తన జీవితంలో ఆ భాగ్యం లేకుండా పోయినందుకు కనీసం 20 నిమిషాలపాటు వెక్కివెక్కి ఏడ్చేశాను. కానీ, తర్వాత తేరుకున్నాను' అని ఆమె తెలిపారు. ఎవరి జీవితమైనా తండ్రిగాగానీ, తల్లిగాగానీ మారిపోకుండా ఆగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు. -
ఫేస్ బుక్ లో నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్..!
ఒకప్పుడు సోషల్ మీడియాలో ఐస్ బక్కెట్ ఛాలెంజ్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. సామాన్యుల నుంచీ సెలబ్రిటీలవరకూ విస్తరించిపోయింది. దేశాలు దాటి ఎల్లలు లేని స్పందనతో దూసుకు పోయింది. ప్రతివారూ ఈ ట్రెండ్ ను ఫాలో అయ్యేంత క్రేజ్ తెచ్చి పెట్టింది. ఆ తర్వాత అటువంటి ఎన్నో ఛాలెంజ్ లు సామాజిక మాధ్యమంలో కుప్పలు తెప్పలుగా కనిపించాయి. కొందరు ఛారిటీ కోసం, మరి కొందరు క్రేజ్ కోసం, ఇంకొందరు అధ్యయనాలకోసం ఇలా ప్రతి ఒక్కరు ఛాలెంజ్ పేరిట సామాజిక మాధ్యమంలో యూజర్లను విరివిగా ఆకట్టుకున్నారు. అయితే తాజాగా 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' ఫేస్ బుక్ లో అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పిల్లలు వద్దనుకునేవారికి ఇదో ప్రత్యేక వేదికయ్యింది. మాతృత్వం ఓ వరం అనే రోజులు పోయాయి. తల్లిదండ్రులు భారం అనుకునే కాలం కూడా చెల్లిపోయింది. ఇప్పుడు ఏకంగా పిల్లలే వద్దనుకునే యుగానికి చేరుకున్నాం. అందుకు ఇప్పుడు ఫేస్ బుక్ లో ప్రారంభమైన నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్ పెద్ద ఉదాహరణ. ఇందులో మహిళలు పిల్లలతో ఎలా ఆనందంగా ఉండగల్గుతున్నారో తెలుపుతూ ఫోటోలను పోస్ట్ చేయాలని, పిల్లలు లేనివారు కూడ అదే విధంగా తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరుతూ ఈ ఛాలెంజ్ ప్రారంభమైంది. అయితే ఈ కొత్త ఛాలెంజ్ పై కొందరు విమర్శకులు అభ్యంతరాలు కూడ వ్యక్తం చేశారు. ఇటువంటి వాటివల్ల పిల్లలు లేనివారు, కలగని వారు బాధపడే అవకాశం ఉందని, ఇటువంటి ప్రయత్నం మంచిది కాదని సలహాలు కూడ ఇచ్చారు. అయితే మిగిలిన వారు మాత్రం ఇదో సరదా ప్రయత్నమని, ప్రతి విషయాన్నీ సీరియస్ గా తీసుకోకూడదని కొట్టి పారేశారు. టీవీ షోల్లో కనిపించే మిసెస్ టేలర్.. తాను ప్రేమగా పెంచుకునే పిల్లితోపాటు... ఓ బాటిల్ వైన్, బాగా నిద్రపోతున్న ఐదు ఫోటోలను పోస్ట్ చేసి, ఇవి చూస్తే చిన్నపిల్లలున్న తల్లిదండ్రులకు ఏం గుర్తుకు వస్తోంది అంటూ కామెంట్ పెట్టింది. తన పోస్ట్ కు 'నాన్ మదర్ హుడ్ ఛాలెంజ్' అని పేరు కూడ పెట్టింది. నేను స్వయంగా పోస్ట్ చేసిన నా ఐదు ఫోటోలు పిల్లలు లేకుండా నేను ఎంత ఆనందంగా ఉన్నానో తెలుపుతాయని ఆమె చెప్పడం విశేషం. ఆమె ఫేస్ బుక్ పోస్ట్ కు 24 గంటల్లోనే లక్షా పదిహేనువేల లైక్ లు వచ్చాయి. దీనికి స్పందిస్తూ మరో మహిళ.. తన భర్తతో ఉన్న ఫోటోలతోపాటు, తమ ఇంట్లోని తెల్లని సోఫా, మరికొన్ని సన్నివేశాలను కూడ పోస్ట్ చేసి, వాటిపై కామెంట్ కూడ పెట్టింది. తన భర్త అంటే తనకెంతో ఇష్టమని, ఆరేళ్ళ తమ వివాహ జీవితం ఎంతో హాయిగా ఉందని, ఫ్యాన్సీ ప్రపంచంలో ఒకరికొకరుగా ఉండటం ఎంతో ఆనందాన్నిస్తుందని తెలిపింది. ఇలా ఎంతోమంది నాన్ మదర్ హుడ్ కు సపోర్ట్ చేయడం కనిపించింది. అయితే బెర్ట్ ఫోసిల్ అనే ఓ యూజర్ మాత్రం ఇదేకనుక అర్థవంతమైన ఛాలెంజ్ అని మీకనిపిస్తే... మీ పిల్లలు ఈ ఛాలెంజ్ లో భాగస్వాములు కాకుండా చూసుకోండి అంటూ చురక అంటించాడు. -
'ప్రపంచంలో దాన్ని మించిందే లేదు'
లాస్ ఎంజెల్స్: తల్లి కావడమే ప్రపంచంలో గొప్ప విషయం అని ప్రముఖ హాలీవుడ్ మోడల్ లారా బింగిల్ అన్నారు. 28 ఏళ్ల ఆమె ఇటీవల ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చి అతడి ఆలనపాలనలో మునిగిపోయింది. ఈ సందర్భంగా తన ఆనందాన్ని మీడియాతో పంచుకుంది. ప్రతి రోజు తన బిడ్డకు సపర్యలు చేయడమే తనకు గొప్ప చాలెంజ్‌గా మారిందని, అది కూడా చాలా సంతోషాన్నిస్తుందని, మాతృత్వాన్ని మించిన సంతోషం ఈ ప్రపంచంలో మరొకటి లేదని తాను భావిస్తున్నానని పేర్కొంది. ప్రతిరోజు తన చంటి ఆలనపాలనలో తానో కొత్త విషయం నేర్చుకుంటున్నానని, అవి నిజంగా అద్భుతమైన విషయాలని పేర్కొంది. తనకు ఇంత మంచి సంతోషాన్ని, అందుకు తగిన వాతావరణాన్ని ఏర్పాటుచేసిన కుటుంబ సభ్యులకు భర్త శ్యాం వార్టింగ్టన్కు ఎప్పటికీ రుణపడి ఉంటానంటూ మురిసిపోతుంది. -
తల్లికాబోతున్న హీరోయిన్?
న్యూఢిల్లీ: ప్రముఖబాలీవుడ్ హీరోయిన్ రాణీ ముఖర్జీ తల్లి కాబోతోందా? ఇటీవల ఆమె చేసిన కొన్ని వ్యాఖ్యానాల్నిబట్టి చూస్తే అవుననే అంటున్నాయి బాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం లండన్‌లో ఉన్న ఈ భామ ప్రసవానికి ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మసాజ్‌కు సంబంధించి కొన్ని కమెంట్లు చేసింది. దీంతో ఆమె తల్లికాబోతోందనే వార్తలు ఇపుడు బాలీవుడ్లో షికార్లు చేస్తున్నాయి. రాణీ ప్రముఖ దర్శకుడు, యష్ రాజ్ ఫిల్మ్స్ అధినేత ఆదిత్య చోప్రాను పెళ్లాడిన సంగతి తెలిసిందే. పెళ్లయిన తర్వాత రాణి బాలీవుడ్‌కు, మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో రాణి తల్లిగా ప్రమోషన్ కొట్టేసిందన్న వార్తలపై వారిద్దరినుంచి ఎలాంటి దృవీకరణ ఇంకా లభించలేదు. ఆదిత్య, రాణి దంపతులు తమ ప్రేమ, పెళ్లి విషయంలో వచ్చిన వార్తలను మొదట్లో రూమర్లు అంటూ చాలాకాలం కొట్టేశారు. ఇపుడు ఎలా స్పందిస్తారో చూడాలి. రాణి నటించిన చివరి చిత్ర్దం మర్దానీ. వివాహం తర్వాత రాణీ ముఖర్జీ మరే చిత్రంలోనూ నటించలేదు. -
సూపర్ మామ్
మాతృత్వం పేగుబంధానికే పరిమితం కాదని రుజువు చేస్తోంది సూపర్ మామ్. నా అన్న వారు లేని పిల్లలకు.. అక్కున చేర్చుకునే మాతృమూర్తులను పరిచయం చేస్తోందీ కొత్త కాన్సెప్ట్. అనాథఆశ్రమాల్లో అమ్మ లాలన కోసం ఆశగా ఎదురు చూసే చిన్నారులకు ఆత్మీయత చూపి వారి జీవన విధానాన్ని మార్చే ప్రయత్నంలో భాగంగానే ‘సూపర్ మామ్’ను ప్రారంభించామని అంటున్నారు మార్గ్ ఫౌండేషన్ ఫౌండర్ నఫీసా ఇస్మాయిల్. ఎవరూ లేని అనాథలను భావిభారత పౌరులుగా తీర్చిదిద్దడంలో కీలకమైన ‘అమ్మ’ పాత్రను పోషించడానికి మాతృమూర్తులను స్వాగతిస్తున్నారు. ఈ అమ్మదనం గురించి మరిన్ని విశేషాలు నఫీసా మాటల్లోనే.. - వాంకె శ్రీనివాస్ సిటీవాసులు చాలా మంది బర్త్‌డే సెలబ్రేషన్స్ అని, పెళ్లి రోజు వేడుకలని.. ఇలా ఏదో ఒక సందర్భాన్ని పురస్కరించుకొని అనాథ ఆశ్రమాలకు వెళ్లి అక్కడి పిల్లలతో కలసి సంబరాలు చేసుకోవడం పెరిగిపోయింది. వేడుకలు చేసుకోవడం వరకు బాగానే ఉన్నా.. మనకు తెలియకుండానే ఆ పిల్లలకు మరింత వేదనను మిగులుస్తున్నామన్నది మరచిపోతున్నాం. మన పిల్లలతో కేక్ కట్ చేసి ప్రేమానురాగాలను వాళ్ల కళ్లకు కడుతుంటే.. నా అనే వాళ్లు లేని పిల్లలకు పేరేంట్స్ గుర్తొస్తుంటారు. మనకు అలాంటి లైఫ్ ఎందుకు లేదా అని లోలోపలే ఆవేదన చెందుతుంటారు. అనాథాశ్రమాలకు వెళ్లి బర్త్ డే సెలబ్రేషన్స్, అన్నదానం, విద్యాదానానికి మాత్రమే పరిమితం కాకుండా.. ప్రతి నెలలో వీలైనన్నిసార్లు వాళ్లని కలసి సమస్యలను తెలుసుకొని గైడ్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించేదాన్ని. స్నేహితుల ప్రోత్సాహంతో... నాలుగేళ్ల క్రితం క్రిమినల్ లాయర్‌గా పనిచేస్తున్నప్పుడు వరకట్న హత్య, అత్యాచారం కేసుల్లో చాలా మంది పిల్లలు పేరేంట్స్‌కు దూరమవుతుండటం చూశా. వీరు జైలులో మగ్గుతుంటే.. అమ్మమ్మ, తాత ఉన్నా పేదరికం అడ్డురావడంతో పిల్లలని అనాథశ్రమాల్లో చేర్పిస్తుండటం చాలా బాధించింది. ఈ విషయాన్ని స్పెయిన్‌లో ఉన్న మా ఫ్రెండ్స్‌తో చర్చించా. ‘సూపర్ మామ్’ ఆలోచనను పంచుకున్నా. వాళ్లు నన్ను ముందుకు వెళ్లమని ప్రోత్సహించడంతో.. ఇప్పుడు ఈ ప్రాజెక్టుతో బిజీగా మారిపోయాను. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న అనాథాశ్రమాల ద్వారానే సూపర్ మామ్ చేపట్టాలని అధికారులతో చర్చలు జరుపుతున్నా. పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందనుకుంటున్నా. ఇలా చేస్తాం... ఒక్కో అనాథ ఆశ్రమంలో దాదాపు 60 మంది పిల్లలు ఉండొచ్చు. ఒక్కో పిల్లాడికి సూపర్ మామ్‌గా ఉండేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తాం. సామాజిక ఆలోచనతో ముందుకు వచ్చిన వారిని తీసుకొని ఒక్కో పిల్లాడితో అటాచ్ చేస్తాం. ఇలా వారు వీలున్నప్పుడుల్లా మాట్లాడుతూ వాళ్ల సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా ఎమోషనల్ సపోర్ట్ ఇస్తుంటాం. కెరీర్‌పై వాళ్లకు అవగాహన వచ్చే స్థాయి వరకు తీసుకువెళ్తాం. ఆ పిల్లలను ఎవరైనా దత్తత తీసుకునే వరకు అమ్మ లేని లోటు లేకుండా చేస్తాం. వారు భవిష్యత్‌లో పది మందికి సహయపడేలా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం. ఇలా చేయడం వల్ల ఆ చిన్నారులు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశాలుంటాయి. ఇప్పటివరకు ఈ పిల్లలను ఎవరూ పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల.. కొందరు వాళ్ల బలహీనతలను ఉపయోగించుకొని నా అన్న ఫీలింగ్‌ను కలిగించి, సంఘ వ్యతిరేక శక్తులుగా మారుస్తున్నారు. అందుకే ఆ పిల్లల్లో సాఫ్ట్ ఫీలింగ్ కలిగించి మంచి భవిష్యత్‌కు సూపర్ మామ్ ద్వారా బాటలు వేయాలనుకుంటున్నాం. మదర్ నఫీసా... ముగ్గురు పిల్లల తల్లి నఫీసా. 2007లో మార్గ్ ఫౌండేషన్ ప్రారంభించి మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్న నఫీసాకు కర్మవీర్ పురస్కార్ దక్కింది. ఈమె పెద్దమ్మాయి సారా మెడిసిన్ చేయగా, కుమారుడు తాసిఫ్ ఢిల్లీలో సివిల్స్ ప్రిపేర్ అవుతున్నాడు. చిన్న అమ్మాయి సైబ లా ప్రిపేర్ అవుతోంది. ముగ్గురు బిడ్డలను సరైన మార్గంలో పెట్టిన నఫీసా.. ఇప్పుడు సమాజానికి ఉపయోగపడే సూపర్ మామ్‌గా మారుతున్నారు. -
అమ్మ... గురు-బ్రహ్మ
బొమ్మను చేసి, ప్రాణం పోస్తే చాలు. బ్రహ్మ బాధ్యత తీరిపోతుంది. అమ్మ ప్రేమబంధం అలా తీరేది కాదు. కన్నపేగులా తెగిపోయేదీ కాదు. నవమాసాల బరువును మళ్లీ చేతుల్లోకి ఎత్తుకుంటుంది. బిడ్డ నీడను కూడా మోసుకు తిరుగుతుంది. కొన్నిసార్లు బ్రహ్మదేవుడు అన్నీ చెక్ చేసుకోకుండా డెలివరీ ఇచ్చేస్తాడు! అప్పుడు అమ్మే బ్రహ్మ అవుతుంది. బిడ్డను ‘కంప్లీట్’ గా తీర్చిదిద్దుతుంది. అలాంటి అమ్మలతో నడుస్తున్న బధిరుల పాఠశాలే... ఈవారం మన ‘ప్రజాంశం’. అన్నీ బాగున్న పిల్లలక్కూడా అమ్మ ఎప్పుడూ పక్కనే ఉండాలి. అలాంటిది పుట్టుకతోనే వినికిడి శక్తి లేక మాటకు దూరమైన చిన్నారులకు అమ్మ ఇంకెంత తోడుగా ఉండాలి?! మళ్లీ కడుపున పెట్టుకున్నంతగా! ఇక్కడ అమ్మలతో కలిసి ఆడుకుంటున్న పిల్లల్ని చూస్తుంటే దేవుడు పెట్టిన లోపాన్ని సవరించే శక్తి అమ్మకు మాత్రమే ఉంటుందనిపిస్తుంది. అవును... తమ కడుపునకాసిన కాయకు తొడిమగా తోడుంటున్న ఈ తల్లులు తమ బిడ్డల కోసం పాఠాలు చెప్పే గురువులుగా కూడా మారి వారికి కొత్త జన్మ ఇస్తున్నారు. అదేమిటో చూద్దాం! హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో ఉన్న ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాలలోని బధిర పిల్లల సక్సెస్ స్టోరీల గురించి చాలామందికి తెలుసు. అయితే వారి విజయాల వెనకున్న అమ్మల గురించి తెలుసుకున్నప్పుడు కళ్లు చెమరుస్తాయి. అమ్మల్ని గురువులుగా మార్చిన ఆ సొసైటీ నిర్వాహకుల గురించి వింటున్నప్పుడు చెవులు ఇంత అవుతాయి! ఆ బాధ తెలుసు... ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పి పదిహేడేళ్లు కావస్తోంది. ప్రస్తుతం ఈ పాఠశాలలో 270 మంది విద్యార్థులున్నారు. వీరిలో కాశ్మీర్, బీహార్, జార్ఖండ్ నుంచి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. ‘‘మా తమ్ముడు కుళయప్ప పుట్టుకతోనే మూగవాడు. అయినా కూడా మా అమ్మానాన్నలు ఎంతో పట్టుదలతో వాడిని బధిరుల పాఠశాలలో చేర్పించి చదువు చెప్పించారు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వాడి బాధలు చూశాను. దాంతో నా చదువు పూర్తవగానే హైదరాబాద్‌లోని ఓ బధిరుల పాఠశాలలో ఉపాధ్యాయుడిగా చేరాను. అక్కడ కొంత అనుభవం గడించాక 1996లో ‘ఆశ్రయ ఆకృతి’ పాఠశాల నెలకొల్పాను. ఐదుగురు పిల్లలకు పాఠాలు చెప్పడంతో మొదలుపెట్టాను. ప్రస్తుతం మా పాఠశాలకు మూడు బ్రాంచ్‌లున్నాయి. మూడువందలమంది విద్యార్థులున్నారు. యాభైమంది టీచర్లున్నారు. వీరిలో చాలామంది ఆ పిల్లల తల్లులే కావడం మా పాఠశాల ప్రత్యేకత’’ అంటూ పరిచయం చేసుకున్నారు ఆ పాఠశాల వ్యవస్థాపకులు డి.పి.కె బాబు. తల్లితండ్రుల ఆర్థికస్తోమతని బట్టి ఫీజుల్ని నిర్ణయించే ఈ పాఠశాల యాజమాన్యం... రెండేళ్ల క్రితం చార్మినార్ ప్రాంతంలో నెలకొల్పిన బ్రాంచ్‌లో డెబ్భైమంది విద్యార్థులను ఉచితంగా చేర్పించుకున్నారు. బిడ్డల కోసం... పుట్టిన బిడ్డ కొంచెం బరువు తక్కువుంటేనే బెంబేలెత్తిపోయే తల్లి... తన బిడ్డకు వినికిడి శక్తి లేదని తెలిస్తే ఎంతగా తల్లడిల్లుతుందో ఊహించగలం. బతికినంతకాలం తన బిడ్డ మరొకరికి భారం కాకుండా ఉండడానికి ఏం చెయ్యడానికైనా సిద్ధపడే తల్లుల్ని చేరదీసింది ఆశ్రయ ఆకృతి. ఇక్కడే తన కొడుకుని చదివిస్తూ... బిడ్డకోసం స్పెషల్ ఎడ్యుకేషన్‌లో ఎమ్‌ఎడ్ చేసి మరీ, ఇక్కడ పాఠాలు బోధిస్తున్న శశికళతో మాట్లాడితే మాతృత్వం వెనకున్న శక్తి గురించి అర్థమవుతుంది. ‘‘మా బిడ్డ బధిరుడు అని తెలియగానే ఈ స్కూల్లో చేర్పించాను. స్కూల్లో ఉన్న వసతులు, ఉపాధ్యాయుల సంఖ్య చూసి నా బిడ్డకు నాతో పనిలేదు... వాళ్లే అన్నీ నేర్పించేస్తారనుకున్నాను. అయితే, ఇక్కడ పిల్లలకు చెప్పిన విషయాల్ని ఇంటికెళ్లాక కూడా ప్రాక్టీస్ చేయించాలన్నారు. దానికోసం నేను కూడా బాబుతో ఉండాలన్నారు. మొదట్లో నాకు అర్థం కాలేదు... తర్వాత తెలిసింది. టీచర్స్‌తో పాటు నేను కూడా వాడికి చెప్పిన విషయాల్నే చెబుతూ పునశ్చరణ చేయిస్తూ ఉండాలని. అప్పటికి నేను డిగ్రీ చదువుకున్నాను. నేను బాబుకి బోధించే తీరుని చూసి స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఎడ్, ఎమ్‌ఎడ్ చేస్తే బాగుంటుందని, ఆ తర్వాత ఇక్కడే జాబ్ ఇస్తామని సార్ చెప్పడంతో నేను ఎమ్‌ఎడ్ పూర్తిచేశాను. చెప్పినట్లుగానే ఇక్కడే జాబ్ ఇచ్చారు. నా బిడ్డకే కాకుండా వాడిలాంటి మరికొందరికి పాఠాలు చెప్పే అవకాశం వచ్చింది’’ అని చెప్పారు శశికళ. ఈమెలాంటి తల్లులు ఇంకో పదిమంది ఉన్నారు. అన్ని శాఖల్లో... అందరి పిల్లల తల్లులు టీచర్లే కాలేరు కదా... ఎనిమిదో తరగతి చదువుతున్న అరుణ్‌కుమార్ తల్లి సునీత ఆయాగా పనిచేస్తోంది. అలాగే ఏడోతరగతి చదువుతున్న కార్తిక్ తల్లి మాధవి స్కూల్ అడ్మినిస్ట్రేన్ సెక్షన్లో పనిచేస్తున్నారు. శ్రీమేథా కాలేజీలో ఇంటర్ చదువుతున్న శామిత తల్లి కల్పన కూడా ఇక్కడ టీచర్‌గా పనిచేస్తున్నారు. ‘‘మా అమ్మాయి శామిత ఇక్కడ పదో తరగతి వరకు చదివి ఇప్పుడు మామూలు పిల్లలతో కలిసి ఇంటర్ చదువుతోంది. ఆమెతోపాటు గాయత్రి అనే అమ్మాయి కూడా అక్కడే ఇంటర్ చదువుతోంది. ఇద్దరూ ఫస్ట్‌క్లాస్ మార్కులతో ముందుకెళుతున్నారు. కంప్యూటర్లో కూడా ఫస్టే. ఎందుకంటే మా ఆశ్రయ ఆకృతిలో కంప్యూటర్, సైన్స్ ల్యాబ్‌లలోనే పిల్లలు ఎక్కువ గడుపుతారు. వారికుండే జ్ఞాపకశక్తి వృథా కాకుండా వారి దృష్టిని ఎక్కువగా కంప్యూటర్ పైనే పెడుతున్నాం. బధిరబిడ్డలు సాధించిన చిన్నిచిన్న విజయాలు కూడా మమ్మల్ని ఆకాశానికి ఎత్తేస్తాయి. మా అమ్మాయి పదోతరగతి పాసైనపుడు నా మనసు ఆనందంతో ఉప్పొంగిపోయింది’’ అంటూ కల్పన తన కూతురి గురించి గర్వంగా చెప్పారు. అదే నా విజయరహస్యం... మొక్కుబడిగా చెప్పే పాఠాలకు, తల్లి చెప్పే పాఠాలకు చాలా తేడా ఉంటుంది. తన పాఠశాల విజయానికి అదే కారణమంటారు డి.పి.కె బాబు. ‘‘ఈ పాఠశాలలో చదువుకున్న ఓ ఏడుగురు విద్యార్థులు ప్రస్తుతం ఇంజనీరింగ్ చేస్తున్నారు. మరో ఇద్దరు పాలిటెక్నిక్, ఓ పదిమంది ఇంటర్ చదువుతున్నారు. అమృతరత్న, మాధవి, ప్రీతి అని మరో ముగ్గురు ప్రముఖ గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. రెసిడెన్షియల్ పాఠశాలతో పాటు ఈ పిల్లల భవిష్యత్తు కోసం ఈ మధ్యనే ‘మల్టీమీడియా అండ్ యానిమేషన్ ట్రైనింగ్ సెంటర్’ ని కూడా నెలకొల్పాం’’ అని చెప్పారు బాబు. భవిష్యత్తులో ఇ-లెర్నింగ్... స్పీచ్ థెరపీ, లిప్ రీడింగ్ వంటివాటికి తోడు భవిష్యత్తులో ఇ-లెర్నింగ్ కంటెంట్‌ని పరిచయం చేయాలనుకుంటున్నారు ఈ పాఠశాల వ్యవస్థాపకులు. క్లాస్‌రూమ్‌లో టీచర్ చెప్పే పాఠాలు అందరికీ వినిపించవు. మిషన్లు పెట్టుకున్నా చాలా తక్కువమంది మాత్రమే పాఠాలు అర్థం చేసుకుంటారు. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి ఇ-లెర్నింగ్ చాలా సాయపడుతుందంటారు బాబు. ‘‘ప్రొజెక్టర్ (స్క్రీన్) ద్వారా గోడపై అక్షరాలు, దానికి సంబంధించిన బొమ్మలు కనిపిస్తాయి. ఆ పక్కనే బాక్సులో టీచర్ సైగలతో చెబుతుంటారన్నమాట. దీనివల్ల పిల్లలు పాఠం చక్కగా చదువుకునే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం దీనికి సంబంధించి కొన్ని పాఠాలను చిత్రీకరించి సీడీలు తయారుచేశాం. త్వరలో ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ తయారుచేస్తాం. ఇవి రెండూ మార్కెట్లోకి వస్తే ప్రభుత్వపాఠశాలలో చదువుకుంటున్న బధిర విద్యార్థులకు కూడా ఉపయోగం ఉంటుంది’’ అని ముగించారాయన. తన తమ్ముడి లాంటి ఎందరో పిల్లలకు బంగారు భవిష్యత్తునివ్వడానికి నడుం బిగించిన ఈ ఉపాధ్యాయుడికి ఆ స్కూలు విద్యార్థులు విజయకెరటాలయ్యారు. ఆ కెరటాల ధ్వనులు బధిరుల చెవుల్లోనే కాదు, మన చెవుల్లో కూడా మారుమోగేలా చేసిన వారందరికీ అభినందనలు చెప్పితీరాల్సిందే. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి భారం కాదు... వరం మామూలు పిల్లలతో పోలిస్తే బధిరులకు విపరీతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. మా కంప్యూటర్ ల్యాబ్‌లో వారు చేసే అద్భుతాలు చూసి నాకు ఆశ్చర్యం వేసింది. వారిలో ఉన్న ఈ ప్రత్యేకమైన శక్తికి పనిచెబితే వారి భవిష్యత్తుకి అదే ఆధారమవుతుందనే ఉద్దేశ్యంతో ఈ సెంటర్‌ని నెలకొల్పాను. అక్కడ శిక్షణ తీసుకున్న ఓ ముగ్గురు అమ్మాయిలకు డ్రీమ్ అనే గ్రాఫిక్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. మా విద్యార్థులతో పెద్దగా ఇబ్బందిపడాల్సిన అవసరం ఉండదు. వారికి అర్థమయ్యేలా చెప్పలేకపోతే ఒక పేపర్‌పై మీకు కావలసిన వర్క్ డీటెయిల్స్ ఇచ్చేస్తే నిమిషాల్లో చేసి మీ ముందుంచుతారు. కాకపోతే మా వాళ్లని వారు అర్థం చేసుకునేవరకూ మా సెంటర్ నుంచి ఒక ఉద్యోగి వెళ్లి ఓ పదిరోజులు తోడుగా ఉంటారు. మొన్నీమధ్యే ఆ కంపెనీవారు నాతో మా పిల్లల గురించి గొప్పగా చెప్పారు. అనవసరంగా సమయం వృధా చేయరు, కొద్దిపాటి అనుభవం వచ్చిందని చెప్పాపెట్టకుండా మరో కంపెనీకి వెళ్లిపోరు. కొత్తప్రయోగాలు చేస్తారు... అంటూ పొగుడుతుంటే బధిరులు భారం కాదు వరం అనిపించింది. - డి.పి.కె బాబు వ్యవస్థాపకులు, ఆశ్రయఆకృతి పాఠశాల