'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను' | Never wanted my own children: Helen Mirren | Sakshi
Sakshi News home page

'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'

Published Mon, Mar 28 2016 8:49 AM | Last Updated on Sun, Sep 3 2017 8:44 PM

'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'

'సొంతబిడ్డలు వద్దనుకొని ఇప్పుడు ఏడుస్తున్నాను'

లండన్: తనకు సొంతపిల్లలు వద్దని నిర్ణయించుకున్నానని, పిల్లల్ని కనే ఆలోచన తనకు ఎప్పుడూ రాలేదని ప్రముఖ హాలీవుడ్ నటి, ఆస్కార్ అవార్డు విజేత హెలెన్ మిర్రెన్(70) అన్నారు. అయితే, ఆ దశ తన జీవితంలో లేనందుకు మాత్రం చాలా బాధపడ్డానని, కన్నీటి పర్యంతం అయ్యానని తెలిపారు. అయితే, కొద్ది సేపటికే ఆ బాధను అధిగమించి సంతోషంగా మారిపోయానని అన్నారు. 1986 నుంచి ప్రముఖ దర్శకుడు టేలర్ హ్యాక్ ఫార్డ్ తో సహజీవనం ప్రారంభించిన ఆమె ఆయనను 1997లో వివాహం చేసుకుంది. అప్పటికే ఆయనకు ఇద్దరు కుమారులు కూడా.

కానీ, వారినే తన పిల్లలుగా భావించాను తప్ప సొంతంగా బిడ్డలు కావాలని మాత్రం అనుకోలేదని అన్నారు.'నేను పిల్లల్ను ప్రేమిస్తాను. వాళ్లు చాలా ఫన్నీ.. స్వీట్. కానీ నేనెప్పుడు నాకు పిల్లలు కావాలనుకోలేదు. కానీ, నేను ఇలా చెప్పిన మాట కూడా ఒక అబద్ధమేనని ప్యారెంట్ హుడ్ చిత్రం చూసిన తర్వాత తెలిసింది. ఆ సినిమా చూస్తూ తన జీవితంలో ఆ భాగ్యం లేకుండా పోయినందుకు కనీసం 20 నిమిషాలపాటు వెక్కివెక్కి ఏడ్చేశాను. కానీ, తర్వాత తేరుకున్నాను' అని ఆమె తెలిపారు. ఎవరి జీవితమైనా తండ్రిగాగానీ, తల్లిగాగానీ మారిపోకుండా ఆగకూడదని ఆమె అభిప్రాయపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement