పేరెంటింగ్
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్‌ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.
‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్‌లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు.
‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త.
Comments
Please login to add a commentAdd a comment