Storytelling
-
డాటర్ ఆఫ్ ఆలియ : రాహా ‘ఆహా’ అంటూ వింటుంది
‘ఆలియా భట్ నటి మాత్రమే కాదు, ఎంటర్ప్రెన్యూర్ కూడా’... ఈ వాక్యానికి కొనసాగింపుగా ‘చక్కని స్టోరీ టెల్లర్’ అనే ప్రశంసను కూడా చేర్చవచ్చు. ఎందుకంటే ఆలియా ప్రతి రాత్రి తన కూతురు రాహాకు ఏదో ఒక పిల్లల పుస్తకం చదివి వినిపిస్తుంది. రాహా ‘ఆహా’ అంటూ వింటుంది.‘తల్లిదండ్రులు తమ పిల్లల కోసం పుస్తకాలు చదవడం అనేది వారి భవిష్యత్‌కు పెట్టుబడి పెట్టడంలాంటిది’ అంటుది ఆలియాభట్. ‘ఎడ్–ఏ–మమ్మా’ అనే చిల్డ్రన్ బ్రాండ్ (ప్లేవేర్, స్టోరీ బుక్స్, టాయ్స్ అండ్ మోర్) వోనర్ అయినా ఆలియా తన బ్రాండ్‌లో కొత్త చిల్డ్రన్ బుక్ సిరీస్‌ను లాంచ్ చేసింది. ‘పిల్లల కోసం తల్లులు స్టోరీ టెల్లింగ్ సెషన్లు నిర్వహించడం అనేది మంచి విధానం’ అంటున్నారు మానసిక నిపుణులు. ‘బెడ్ మీద పిల్లలకు పుస్తకాలు చదివి వినిపించడం అనేది వారి మానసిక వికాసంపై సానుకూల ప్రభావం చూపుతుంది. ఉచ్చారణలను, కొత్త పదాలను నేర్చుకుంటారు. పిల్లలకు కొత్త విషయాలు తెలియజేయడానికి ఇదొక అద్భుత సాధనం. ఇది పిల్లలతో తల్లిదండ్రుల భావోద్వేగ బంధాన్ని బలోపేతం చేస్తుంది. పిల్లల ఏకాగ్రతను పెంచుతుంది. రోజువారీ షెడ్యూల్లో ప్రతి రాత్రి పుస్తక పఠనాన్ని తప్పనిసరి చేయడం పిల్లల్లో క్రమశిక్షణను పెంచుతుంది’ అంటుంది కౌన్సెలింగ్ సైకాలజిస్ట్ శృతి వస్త. -
కథర్నాక్.. స్టోరీ టెల్లింగ్ మంత్ర
‘కథలు చెప్పకు’ అని పేరెంట్స్‌తో, ఫ్రెండ్స్‌తో సుతిమెత్తని తిట్లు తినని వారు యూత్‌లో తక్కువగానే ఉంటారు. అయితే ప్రసిద్ధ బ్రాండ్స్ మాత్రం ‘కథలు చెప్పండి ప్లీజ్’ అంటూ యంగ్ టాలెంట్‌కు ఆహ్వానం పలుకుతున్నాయి. ప్రకటనలకు సంబంధించి ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. రకరకాల బ్రాండ్లకు సంబంధించి భావోద్వేగాలతో మిళితమైన యాడ్స్ యువ సృజనకారులను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. అమూల్ బ్రాండ్ ‘అమూల్ గర్ల్’ ద్వారా సమకాలీన సంఘటనలతో కనెక్ట్ కావడానికి చేస్తున్న టాపికల్ యాడ్స్ పాపులర్ అయ్యాయి. నగల బ్రాండ్ ‘తనిష్క’ తమ వ్యాపార ప్రకటనల్లో ‘స్టోరీ టెల్లింగ్’ ఫార్మట్‌ను బలంగా ఉపయోగించుకుంటుంది. ఇక ‘లైఫ్‌బాయ్’ దగ్గరకు వస్తే... ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్ అనేది ్ర పాడక్ట్ను ప్రమోట్ చేయడానికే కాదు పబ్లిక్ హెల్త్ అవేర్నెస్ విషయంలోనూ ఉపయోగపడుతుందనేది అర్థమవుతుంది. శాస్త్ర, సాంకేతిక విషయాలపై వినియోగదారుల్లో ఆసక్తి కలిగించడానికి, పెంచడానికి ఇన్స్టాగ్రామ్ రీల్స్, స్టేజ్డ్ విజువల్స్‌ను ఉపయోగించుకుంటుంది అమెరికన్ మల్టీనేషనల్ కంపెనీ జనరల్ ఎలక్ట్రిక్. బ్రాండ్లు విస్తృత స్థాయిలో కన్జ్యూమర్లతో కనెక్ట్ కావడానికి తమ ప్రాడక్ట్‌కు సంబంధించిన అడ్వర్టైజింగ్ విషయంలో భావోద్వేగాలతో కూడిన ఎఫెక్టివ్ స్టోరీ టెల్లింగ్‌ను కోరుకుంటున్నాయి. అడ్వర్టైజింగ్ ప్రపంచంలో స్ట్రాటజిక్ స్టోరీ టెల్లింగ్ అనేది కీలకంగా మారింది. ఈ పవర్ఫుల్ టూల్ బ్రాండ్స్‌కు, కన్జ్యూమర్లకు మధ్య బలమైన వారధిగా మారింది. సర్వేల ప్రకారంప్రాడక్ట్లకు సంబంధించి సంప్రదాయ అడ్వర్టైజింగ్ల కంటే మిత్రుల మాటలనే విశ్వసిస్తోంది యువత. వారిలో నమ్మకం కలిగించాలంటే యాడ్ అనేది యూత్‌ఫుల్‌గా, మిత్రుడు కొత్త విషయం చెప్పినట్లుగా ఉండాలి. ఇందుకోసం బ్రాండ్స్ యువ స్టోరీ టెల్లర్స్‌ను ఉపయోగించుకుంటున్నాయి. వారి స్టోరీ టెల్లింగ్లోని తాజాదనానికి ప్రాధాన్యత ఇస్తున్నాయి. థీమ్‌ను గుర్తించడం, సెంట్రల్ క్యారెక్టర్స్‌ను డిజైన్ చేసుకోవడం, కస్టమర్ల హృదయాలను తాకేలా యాడ్‌ను తీర్చిదిద్దడం అనేవి స్టోరీ టెల్లింగ్‌లో కీలక విషయాలు. ఇలాంటి విషయాలలో యువ సృజనకారులు తమలోని నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటున్నారు. ఈ డిజిటల్ శకంలో స్టోరీ టెల్లింగ్ అనేది కొత్త రూ పాలతో సృజనాత్మకంగా వికసిస్తోంది. వర్చువల్ రియాలిటీ(వీఆర్), ఆగ్మెంటెడ్ రియాలిటీ (ఏఆర్), గేమింగ్ టెక్నాలజీ... మొదలైనవి స్టోరీ టెల్లింగ్‌లో కొత్త ద్వారాలు తెరుస్తున్నాయి. ‘స్టోరీ టెల్లింగ్ నైపుణ్యాన్ని పెంచుకోవడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది బలమైన సాధనం. టార్గెట్ ఆడియెన్స్‌ను మెప్పించేలా స్టోరీ టెల్లింగ్ కోసం ఏ.ఐ సాంకేతికత ఉపయోగపడుతుంది. పవర్ఫుల్ స్టోరీ టెల్లింగ్ ఉనేది బలమైన భావోద్వేగాల సమ్మేళనం’ అంటున్నాడు ‘పోకో’ ఇండియా కంట్రీ హెడ్ హిమాన్షు టాండన్. సినిమాల నుంచి ఇంటర్వ్యూల వరకు యూట్యూబ్ వీడియోలు చూస్తున్నప్పుడు ప్రకటనలు ప్రత్యక్షమైతే చిరాగ్గా అనిపిస్తుంది. కోల్‌కతాకు చెందిన ఇరవై రెండు సంవత్సరాల నివేదిత మాత్రం పనిగట్టుకొని రకరకాల అడ్వర్టైజ్మెంట్స్ను చూస్తుంటుంది. ‘ఒకప్పటి వ్యా పార ప్రకటనల్లో వారి బ్రాండ్‌కు సంబంధించిన గోల మాత్రమే ప్రధానంగా కనిపించేది. ఇప్పటి ప్రకటనల్లో మాత్రం ఇంటలెక్చువల్ ఫ్లేవర్, క్రియేటివిటీ కనిపిస్తోంది. వాటిని చూస్తుంటే ఇన్స్పైరింగ్గా ఉంటుంది. నాకు కూడా రకరకాల ఐడియాలు వస్తుంటాయి’ అంటుంది నివేదిత. ముంబైకి చెందిన ఇంజనీరింగ్ స్టూడెంట్ వికాస్ స్టోరీ టెల్లింగ్ ఫార్మాట్లో ‘నేను అయితే ఈ యాడ్‌ను ఇలా తీస్తాను’ అంటూ నోట్స్ రాసుకోవడం అలవాటు. ఒక్కముక్కలో చె΄్పాలంటే నివేదిత, వికాస్లాంటి యువ ఉత్సాహవంతులను బ్రాండ్స్ కోరుకుంటున్నాయి. తమకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, ప్రతిభను నిరూపించుకుంటే ఇక వారికి తిరుగేలేదు. స్టోరీ టెల్లింగ్ మంత్ర యాడ్‌లో స్టోరీ టెల్లింగ్ ఫార్మట్ అనేది కంపెనీకి, కస్టమర్లకు మధ్య భావోద్వేగాలతో కూడిన ఒక బంధాన్ని ఏర్పరుస్తుంది. ఎక్కడ.. ఎలా... ఎంత చెప్పాలో అంతే చెప్పాలనేది స్టోరీ టెల్లింగ్‌లో భాగం. మిస్ ఫైర్ అయితే మొదటికే మోసం వస్తుంది. ప్రకటనలకు సంబంధించి కొన్ని కంపెనీలు విఫలం కావడానికి కారణం... తమ ప్రాడక్ట్ గురించి తప్ప కన్జ్యూమర్ గురించి పట్టించుకోకపోవడం. అందుకే కన్జ్యూమర్‌ను హీరో చేసేలా స్టోరీ బిల్డ్ చేయాలి అనేది ముఖ్యమైన స్టోరీ టెల్లింగ్ మంత్ర. ‘ఫలానా యాడ్ ఎందుకు విఫలమైంది’ అనే విషయంలో యువ సృజనకారులు పోస్ట్‌మార్టం చేయడంతో పాటు ఒక యాడ్ సూపర్ డూపర్ హిట్ కావడంలోని కీలక అంశాలను ఔ పాసన పడుతున్నారు. ‘వాట్ మేక్స్ ఏ గ్రేట్ స్టోరీ’ అనే కోణంలో కస్టమర్ ఛాలెంజ్‌లను అధ్యయనం చేస్తున్నారు. -
కథ చెబుతాం ఊ కొడతారా..
చిన్నప్పుడు ‘అనగనగా..’అంటూ అమ్మమ్మలు, నానమ్మలు కథలు చెప్పే రోజులు గుర్తున్నాయా? కథను ఊరిస్తూ.. ఊహించేలా చెబుతుంటే ఆ పాత్రల్లోకి మనం పరకాయ ప్రవేశం చేసేవాళ్లం. కడుపులో ఉన్నప్పుడే ప్రహ్లాదుడు ‘నారాయణ మంత్రం’విని ఊకొట్టాడని.. తల్లిగర్భంలో ఉన్నప్పుడే అభిమన్యుడు ‘పద్మవ్యూహం’గురించి విని నేర్చుకున్నాడని పురాణాల్లో చదువుకున్నాం. దృశ్య రూపంలో కంటే శ్రవణ రూప కథనంలో పిల్లల ఊహాశక్తి మెరుగుపడుతుంది. అందుకే మనిషి పరిణామక్రమంలో కథ ప్రాధాన్యం అనన్య సామాన్యం. అయితే నేటి కంప్యూటర్ యుగంలో ఆ అదృష్టం పిల్లలకు పూర్తిగా దూరమైంది. కెరీర్ పరుగులో పడిపోయి.. పిల్లలకు కథలను చెప్పగలిగేంత సమయం, ఓపిక రెండూ తల్లిదండ్రులకు దొరకడం లేదు. అందుకే ఇప్పటి పిల్లలు కథలంటే గుగూల్లో సెర్చ్ చేస్తున్నారు. ఈ క్రమంలో పిల్లల్లో పఠనాసక్తిని పెంపొందిస్తూ చదువుపై వారికి ఆసక్తి కలిగించి.. తద్వారా వారిలోని సృజనాత్మక శక్తిని, నిద్రాణంగా దాగి ఉన్న కళలను వెలికి తీసే ఉద్దేశంతోనే పుట్టిందే స్టోరీ టెల్లింగ్ డే. ద్వారకానగర్ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి చక్కటి స్పందన లభిస్తోంది. – విశాఖపట్నం డెస్క్ నేటితరం చేతుల్లో పుస్తకాలు నలగవు కానీ ఫోన్లలోని యాప్స్ గిరగిరా తిరుగుతుంటాయి. స్మార్ట్ ఫోన్లు, వీడియో గేమ్‌లు, ఇంటర్నెట్లతో కాలం గడిపే చిన్నారుల్లో సృజనాత్మకశక్తి పూర్తిగా తగ్గిపోవడంతో పాటు వారిలో ఊబకాయం తదితర దీర్ఘకాలిక వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని అనేక సర్వేలు వెల్లడించాయి. ‘మీ పిల్లలు తెలివిగల వాళ్లు కావాలంటే వారికి రోజూ కథలు చెప్పండి’అని ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చెప్పారంటే.. చిన్నారుల జీవితాలను కథలు ఎంతగా ప్రభావితం చేయగలవో అర్థం అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రుల ఆలోచనల్లో ఇప్పుడిప్పుడే మార్పు వస్తోంది. పిల్లలకు ప్రతి రోజూ కథలు చెప్పే సమయం దొరక్కపోయినా.. వారాంతాల్లో తప్పనిసరిగా ‘స్టోరీ టెల్లింగ్’ కార్యక్రమాలకు తీసుకెళ్తున్నారు. పాఠశాలల్లో సైతం వారంలో కనీసం రెండు రోజులు స్టోరీ టెల్లింగ్ క్లాసులు ఉండేలా యాజమాన్యాలకు అభ్యర్థిస్తున్నారు . ఈ పరిస్థితుల్లో నగరంలో స్టోరీ టెల్లింగ్ నిపుణులు, ఈ తరహా కార్యక్రమాలకు రోజు రోజుకూ ఆదరణ పెరుగుతోంది. ‘మియావాకీ’ అలా మొదలైంది కథల ద్వారా పిల్లలను చదువు వైపు మళ్లించడం సులభమని ఉపాధ్యాయురాలు, ప్రముఖ స్టోరీ టెల్లర్ షింపీ కుమారి అంటున్నారు. జార్ఖండ్‌లోని ధన్‌బాద్ నివాసి అయిన షింపీ కుమారి ఎమ్మెస్సీ, బీఈడీ చదివారు. ఉద్యోగ రీత్యా 2006లో విశాఖ వచ్చారు. ఇక్కడ ఓ ప్రైవేట్ పాఠశాలలో సైన్స్, ఇంగ్లిష్ సబ్జెక్టులు బోధిస్తున్నారు. ద్వారకానగర్‌లోని పౌరగ్రంథాలయం కమిటీ కార్యదర్శి డీఎస్ వర్మ చొరవతో 7 నెలల కిందట మియావాకీ స్టోరీ టైమ్ కార్యక్రమానికి రూపకల్పన చేశారు. పౌర గ్రంథాలయంలో నెలలో రెండు రోజులు ఒకటి నుంచి 4వ తరగతి పిల్లలకు ఉదయం 10.15 నుంచి 11.30 వరకు, 5వ తరగతి నుంచి 8 తరగతి చదివే పిల్లలకు 11.15 నుంచి 12.30 వరకు కథలు చెప్పడం ప్రారంభించారు. తొలుత షింపీ కుమారి ఒక్కరే పిల్లలకు చక్కని కథలు చెబుతూ.. వివిధ అంశాలు వివరించేవారు. ఆమె తలపెట్టిన ఈ కార్యానికి తర్వాత నగరానికి చెందిన స్టోరీ టెల్లర్, వాయిస్ ఆరి్టస్ట్ సీతా శ్రీనివాస్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్) ఎడ్యుకేటర్ శ్రావ్య గరుడ, ఉపాధ్యాయిరాలు రబియా నవాజ్ తోడయ్యారు. వారు స్వచ్ఛందంగా తమ సేవలందిస్తూ చిన్నారులను తీర్చిదిద్దే గురుతర బాధ్యతలో భాగస్వాములయ్యారు. ఒక్క స్టోరీ టెల్లింగ్ ఎన్నో కళలను వెలికి తీస్తుందని షింపీకుమారి తెలిపారు. స్టోరీ టెల్లింగ్ క్లాస్ పూర్తయిన ప్రతిసారీ తాము పిల్లలతో డ్రాయింగ్, క్రాఫ్టŠస్, సింగింగ్, పప్పెట్రీ, ఒరిగామి తదితర కృత్యాలు పిల్లలతో చేయిస్తామని.. తద్వారా పిల్లల్లో తాము అనుకున్నది వ్యక్తీకరించే స్వతంత్రత వస్తుందన్నారు. భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్, విశాఖ పౌర గ్రంథాలయం సంయుక్త ఆధ్వర్యంలో గ్రంథాలయం మూడో అంతస్తులోని పిల్లల విభాగంలో నిర్వహించే ఈ కార్యక్రమానికి ఎలాంటి రుసుం చెల్లించనవసరం లేదని తెలిపారు. కథ అంటే ఓకే అంటారు సాధారణంగా పాట పాడదామా, డ్రాయింగ్ వేద్దామా అని పిల్లలను అడిగితే కొందరు మాత్రమే సరేనంటారు. అదే కథ వింటారా అంటే అందరూ ఓకే అంటారు. కథ చెప్పడం అనేది ఓ కళ. మిగతా కళలతో పోలిస్తే కథల్లో వినేవాళ్లే కళాకారులు. ఎందుకంటే కథ వినేవాళ్లు వాళ్ల బుర్రల్లో పాత్రలను ఊహించుకుంటారు. అందుకే కథలను అందరూ ఇష్టపడతారు. కెనడాలో మూడేళ్ల కిందట స్కూల్ కరిక్యులమ్‌లో స్టోరీ టెల్లింగ్‌ను చేర్చారు. మన సంప్రదాయంలో అది ఎప్పట్నించో ఉంది. చరిత్ర, పురాణాలను కథల ద్వారానే మనం చెప్తాం కదా.. ఊహాశక్తితో పాటు భాషా పరిజ్ఞానం కథలు వినడం వల్ల పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరుగుతుంది. తరగతుల్లో చెప్పే పాఠాల్లో దాదాపు సగం చిన్నారులకు గుర్తు ఉండవు. అదే ఓ కథలోని ప్రతీ సంఘటన పిల్లల మనసుల్లో బలంగా నాటుకుపోతుంది. వారిలో ఊహాశక్తి పెరుగుతుంది. కథ చెబుతూ పోతుంటే ఆ తర్వాత ఏం జరుగుతుందన్న విషయాన్ని చిన్నారులు ఊహిస్తూ ఉంటారు. ఇదే వారి మానసిక ఎదుగుదలకు ఉపయుక్తంగా నిలుస్తుందని నిపుణుల అభిప్రాయం. ఇక చరిత్రకు సంబంధించిన అంశాలను కథల్లా చెప్పడం ద్వారా భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పిల్లలకు తెలియజేయవచ్చు. మాతృభాషతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ తదితర భాషల్లో పిల్లలకు కథలు చెబితే వారికి భాషా పరిజ్ఞానం కూడా పెరుగుతుంది. కథ చెప్పడం ఓ కళ శ్రోతలను ఆకట్టుకునేలా కథలను చెప్పగలగడం ఓ ప్రత్యేకమైన కళ. కథల్లోని అంశాలకు తగ్గ ట్టు ఓ ఊహాజనిత లోకాన్ని కళ్లకు కట్టేలా కథలు చెప్పగలిగినపుడే శ్రోతలు ఆ కథలో పూర్తిగా నిమగ్నమవుతారు. ఇప్పటి స్టోరీ టెల్లర్స్ వారి హావభావాలను కథలతో కలిపి వ్యక్తీకరించడంతో పాటు పెయింటింగ్స్, పేపర్ కటింగ్స్, పాటలు వంటి వాటిని తమ మాధ్యమాలుగా వినియోగిస్తున్నారు. ఎంచుకున్న కథతోపాటు ఎత్తుగడ, ముగింపు అనే అంశాలు ఓ స్టోరీ టెల్లర్ నైపుణ్యాన్ని తెలియజేస్తా యి. కథలు అనగానే కేవలం చిన్నారులకు మాత్రమే పరిమితం అనుకుంటే పొరబడ్డట్టే. ఎన్నో ఒత్తిళ్లతో సతమతమయ్యే పెద్ద వారికి సైతం ఈ తరహా కథకాలక్షేపాలు ఎంతో ఉత్సాహాన్ని అందిస్తాయి. కథల్లా పాఠాలు కథలు వింటూ పాఠాలు వినడం.. కథలే పాఠాలైపోవడం నాకెంతో నచ్చింది. ఇంతకు ముందు చదివింది గుర్తుండేది కాదు. ఇప్పుడు మా బుక్స్‌లోని లెసన్స్ కథల్లా మారిపోయాక.. బాగా గుర్తుంటున్నాయి. మార్కులు కూడా బాగా వస్తున్నాయి. – బి.తనూశ్రీ, 3వ తరగతి, భారతీయ విద్యా భవన్స్ పబ్లిక్ స్కూల్ క్లాసెస్ బాగుంటున్నాయి స్టోరీ టెల్లింగ్ క్లాసెస్ చాలా బాగుంటున్నాయి. లైబ్రరీలో కొత్తకొత్త పుస్తకాలు కూడా నాకు చాలా నచ్చుతున్నాయి. బుక్స్ రీడింగ్ వల్ల కొత్త విషయాలు తెలుస్తున్నాయి. కథలు నేర్చుకోవడంతో పాటు చెప్పడం అలవాటు చేసుకుంటున్నా.. – సూర్య విహాన్ వర్మ, 3వ తరగతి, టింపనీ సీనియర్ సెకండరీ స్కూల్ అద్భుతాలు చేయవచ్చు కథలు ఎవరికైనా నచ్చుతాయి. అవి ఏ వయసు వారికైనా గుర్తుండిపోతాయి. కథ, కథలు చెప్పే విధానంలోను నవ్యత ఉంటే అవి మనల్ని జీవితాంతం వెంటాడుతాయి. మేం చేస్తున్నది అదే. కథల ద్వారా చిన్ని మనసుల్లో నైపుణ్యాన్ని చొప్పిస్తున్నాం. ఈ నెల 26న మియావాకీ స్టోరీటైమ్లో మళ్లీ కలుద్దాం. – సీతా శ్రీనివాస్, స్టోరీ టెల్లర్, వాయిస్ ఆర్టిస్ట్ విద్యార్థులకు మేలు చేస్తుంది స్టోరీ టెల్లింగ్ విద్యార్థులకు ఎంతో మేలు చేస్తుంది. ఏదైనా కథలా చెబితే వారికి ఇట్టే గుర్తుండిపోతుంది. ఒక్క చదువే కాదు.. సరైన రీతిలో భావవ్యక్తీకరణ అనేక విధాలుగా జీవితంలో ఉపయోగపడుతుంది. స్టోరీ టెల్లింగ్ ద్వారా ఆ నైపుణ్యం పిల్లలకు అందించేందుకు మేం కృషి చేస్తున్నాం. – శ్రావ్య గరుడ, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్(స్టెమ్) ఎడ్యుకేటర్ -
చెన్నై కథలమ్మ: ఇంట్లో కూర్చునే డబ్బు సంపాదించవచ్చు!
చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ జీవితం లాక్‌డౌన్‌కు ముందు లాక్డౌన్ తర్వాత వేరువేరుగా ఉంది. లాక్‌డౌన్‌కు ముందు స్కూళ్లు, కాలేజీలకు వెళుతూ ఆమె కథలు చెప్పేది. లాక్డౌన్ తర్వాత అంతా ముగిసినట్టే అనుకుంది. కాని జూమ్ ద్వారా ఆన్లైన్లో కూడా కథలు చెప్పొచ్చు అని ఎప్పుడైతే ప్రయత్నించిందో అప్పటినుంచి ఒక్క చెన్నై ఏంటి ప్రపంచమంతా వినేవాళ్లే. డబ్బులూ వస్తున్నాయి. కథ కూడా ఒక ఉపాధే సుమా. కథలన్నీ వెళ్లి కరోనా దగ్గరకు చేరే ఈ కాలంలో కూడా కథలు చెప్పి పిల్లలను కాసేపైనా మాయాలోకాలలో విచిత్ర మార్గాలలో సమయస్ఫూర్తి కలిగేలా నీతిని బోధిస్తూ విహరింప చేసే వారున్నారని తెలిస్తే సంతోషం కలుగుతుంది. ఇటీవల ప్రతిగయా హరన్ చెన్నై నుంచి హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ స్కూల్ వారి కోసం ఒక ఆన్లైన్ కథా సమయం నిర్వహించారు. అయితే అందులో పాల్గొంది పిల్లలు కాదు. టీచర్లు. అవును... పిల్లలేనా కథల మజా చూసేది పెద్దలు ఎందుకు చూడకూడదు అంటారు ప్రతిగయా. నిజమే. పెద్దలు కథలు వింటేనే కదా పిల్లలకు చెప్పగలుగుతారు. చెన్నై కథలమ్మ చెన్నైకి చెందిన ప్రతిగయా హరన్ గత ఏడేళ్ల నుంచి ‘స్టోరీ టెల్లింగ్’ను ఒక ఉపాధిగా చేసుకున్నారు. ‘స్టోరీ శాక్’ అనే ఫేస్బుక్ పేజీని నడుపుతున్నారు. తల్లిదండ్రులకు, ఇంట్లోని పెద్దలకు కథలు చెప్పే తీరిక లేని ఈ రోజుల్లో పిల్లలకు కథలు చెప్పాల్సిన అవసరాన్ని గుర్తించి కథలు చెబుతూ గుర్తింపు పొందారామె. అయితే లాక్‌డౌన్‌కు ముందు ఆమె నేరుగా పిల్లలను కలుస్తూ కథలు చెప్పారు. రెండేళ్ల క్రితం కరోనా వచ్చినప్పుడు అన్నీ మూతపడితే తన కథల సంచి కూడా మూలన పడేశారు. అంతా అయిపోయినట్టే అనుకున్నారు కానీ, కాదు. ఆన్లైన్ కథలు మూడు నెలల క్రితం ఆమె ఇలా ఆన్లైన్లో కథలు చెబుదాం అని నిశ్చయించుకున్నారు. అయితే సందేహం. పిల్లలు ఎదురుగా ఉంటే వారిని ఆకర్షిస్తూ కథలు చెప్పడం సులువు. ఆన్లైన్లో అంత బాగా చెప్పగలమా అనుకున్నారు. కాని ఆమె చేసిన మొదటి సెషన్ పెద్ద హిట్ అయ్యింది. పిల్లలు ఆమె కథలు చెబుతుంటే ఎంజాయ్ చేశారు. అంతేనా ఆమె నేరుగా ఉంటే చెన్నైలోని పిల్లలనే కలిసి చెప్పగలదు. ఆన్లైన్లో అడ్డంకి ఏముంది? ఎక్కడి వాళ్లకైనా చెప్పగలదు. ‘ఇంతకు ముందు నేను నాలుగు వారాలకు ఒక సెషన్ నిర్వహించేదాన్ని. ఇప్పుడు వారానికి ఒకటి. చాలామంది ఆన్లైన్ కథలను ఇష్టపడుతున్నారు’ అంటుంది ప్రతిగయా. జూమ్ ద్వారా ఆమె కథలు చెబుతుంది. ఆ ఒక్క సెషన్లో పాల్గొని కథలు వినాలంటే 150 నుంచి 250 వరకూ చెల్లించాలి. ‘అలా చెల్లించి అమెరికా, అరబ్ దేశాలలో నా కథలు వింటున్నారు’ అంది ప్రతిగయా. కొత్త అనుభూతి ప్రతిగయా చెన్నైలో పిల్లలకు ఇంగ్లిష్‌లో, తమిళంలో కథలు చెప్పేది. కాని ఆన్లైన్లో కథలు చెప్పడం మొదలెట్టాక తన మాతృభాషైన రాజస్తానీలో తన స్వరాష్ట్రం రాజస్థాన్ పిల్లలకు చెప్పే అవకాశం వచ్చింది. ‘ఇది ఊహించలేదు’ అంది ప్రతిగయా. ఒక పని చేయాలంటే ఇవాళ ప్రత్యేకంగా ప్రచారం అక్కర్లేదు. వాట్సప్, ఫేస్బుక్ చాలు. మీలో ప్రతిభ ఉంటే మీరు ఇంట్లో కూచునే మంచి వ్యాపకాన్నీ, ఆ వ్యాపకం నుంచి డబ్బును కూడా సంపాదించవచ్చు అంటుంది ప్రతిగయా. ఆమె చేసిన ఇంకో విశేషమైన పని ఏమిటంటే పెద్దలకు కథలు చెప్పడం. పెద్దవాళ్లు వచ్చి కథలు వినండి... బాల్యం గుర్తొస్తుంది.. ఉల్లాసమూ కలుగుతుంది అంటుందామె. ఇప్పుడు ఆమె కథలను నిజంగానే ఆబాలగోపాలం వింటున్నారు. చదవండి: పెట్రోలుపై రూ. 3 తగ్గింపు.. నష్టాన్ని భరిస్తామన్న ప్రభుత్వం! -
ఎవరీ దీపాకిరణ్
సాక్షి, హైదరాబాద్: భారత్ నుంచి తొలి ప్రొఫెషనల్ స్టోరీ టెల్లర్గా ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో 2017లో నిర్వహించిన ఇంటర్నేషనల్ స్టోరీ టెల్లింగ్ ఫెస్టివల్‌కి వెళ్లానని స్టోరీ టెల్లర్ దీపాకిరణ్ తెలిపారు. ఆ సమయంలో నేను గమనించింది ఏమిటంటే ఇరాన్ ప్రభుత్వం కళలకు ఇస్తున్న ప్రాధాన్యం. భావి తరాలకు కళలను ఒక ఉపాధి మార్గంగా మలుస్తున్న తీరు. అంత చిన్న దేశంలో 1000 దాకా కనూన్ పేరిట ఆర్ట్ సెంటర్స్ ఉన్నాయి. అవి కూడా చాలా పెద్దవి, విశాలమైన స్థలంలో ఏర్పాటు చేశారు. ఈ సెంటర్ వేదికగా స్టోరీ టెల్లర్స్, మ్యుజిషియన్స్, ఆర్టిస్ట్స్, సింగర్స్.. ఇలా ఏ కళలో రాణించాలనుకున్నా వారికి ప్రభుత్వమే శిక్షణ ఇస్తుంది. అంతేకాదు ఈ సెంటర్స్ ద్వారా శిక్షణ పూర్తి చేసుకున్నవారికి ఉద్యోగాలు కూడా ఇస్తుంది. మ్యూజిక్, పాటలు, పప్పెట్రీ, థియేటర్, క్రాఫ్టస్ ఏవైనా నేర్చుకోవాలనుకునే చిన్నారులకు ఈ సెంటర్స్‌లో శిక్షణ పూర్తిగా ఉచితం. ఆర్ట్ సెంటర్స్ అనే ఆలోచన చాలా బాగా అనిపించింది. మన దగ్గర హరికథ, బుర్రకథ వంటి కళలు దాదాపు అంతరించిపోయాయి. ఇదే సమయంలో ఇప్పుడు చాలా మంది యువతీ యవకులు ఇరానియన్ స్టోరీ టెల్లింగ్‌ని కెరీర్‌గా తీసుకుంటున్నారు. ఆర్ట్ నేపథ్యంగా జరిగే కిస్సా గోయె యాన్యువల్ ఫెస్టివల్‌కి వచ్చామని చెబితే పెద్ద సూపర్స్టార్లా ట్రీట్ చేస్తారు. మన నగరంలో కూడా ఇలాంటి సెంటర్స్ ఏర్పాటైతే ఆర్ట్‌ని కెరీర్‌గా ఎంచుకునేవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సిటీ ఆర్ట్ క్యాపిటల్‌గా మారేందుకు కూడా అవకాశం ఉంటుంది. -
కేసీఆర్ చెప్పిన కథతో...
సీనియర్ దర్శకులు అల్లాణి శ్రీధర్ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిలుకూరు బాలాజీ’. సాయికుమార్, ఎస్పీబీ, భానుశ్రీ మెహ్రా ముఖ్య తారలు. నేడు అల్లాణి శ్రీధర్ పుట్టినరోజు. ఆయన మాట్లాడుతూ– ‘‘శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి చేతులమీదగా విడుదలైన ‘శ్రీ చిలుకూరు బాలాజీ’ సినిమా పాటలలకు, ఆ తర్వాత రిలీజ్ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. త్వరలో చిత్రాన్ని రిలీజ్ చేస్తాం. అంతర్జాతీయ విలువలతో ఓ బాలల చిత్రం నా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా. ప్రస్తుతం అది నిర్మాణంలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్చెప్పిన కథాంశంతో, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిగారి పర్యవేక్షణలో సుమన్ లీడ్రోల్లో తీసిన ‘రైతేరాజు’ షార్ట్ ఫీచర్ ఫిల్మ్ త్వరలో అన్ని థియేటర్స్‌లో విడుదల కానుంది’’ అన్నారు.