కేసీఆర్‌ చెప్పిన కథతో... | Raiteraju short feature film will be released soon in all theaters. | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ చెప్పిన కథతో...

Published Sat, Jun 24 2017 12:35 AM | Last Updated on Wed, Aug 15 2018 9:40 PM

కేసీఆర్‌ చెప్పిన కథతో... - Sakshi

కేసీఆర్‌ చెప్పిన కథతో...

సీనియర్‌ దర్శకులు అల్లాణి శ్రీధర్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం ‘శ్రీ చిలుకూరు బాలాజీ’. సాయికుమార్, ఎస్పీబీ, భానుశ్రీ మెహ్రా ముఖ్య తారలు. నేడు అల్లాణి శ్రీధర్‌ పుట్టినరోజు. ఆయన మాట్లాడుతూ– ‘‘శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్‌ స్వామి చేతులమీదగా విడుదలైన ‘శ్రీ చిలుకూరు బాలాజీ’ సినిమా పాటలలకు, ఆ తర్వాత రిలీజ్‌ చేసిన ట్రైలర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది.

త్వరలో చిత్రాన్ని రిలీజ్‌ చేస్తాం. అంతర్జాతీయ విలువలతో ఓ బాలల చిత్రం నా స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నా. ప్రస్తుతం అది నిర్మాణంలో ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రికేసీఆర్‌చెప్పిన కథాంశంతో, వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డిగారి పర్యవేక్షణలో సుమన్‌ లీడ్‌రోల్‌లో తీసిన ‘రైతేరాజు’ షార్ట్‌ ఫీచర్‌ ఫిల్మ్‌ త్వరలో అన్ని థియేటర్స్‌లో విడుదల కానుంది’’ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement