
‘అమ్మాయి పుట్టాక మా ఆయనలో పూర్తిగా మార్పు వచ్చింది’ అనే మాట అక్కడక్కడా వింటుంటాం. అంటే... ఎప్పుడూ ఫైర్‌బ్రాండ్‌లా ఉండే భర్త శాంతమూర్తిగా మారిపోతాడు. వ్యసనాల బారిన పడిన భర్త ఆ చీకటి నుంచి బయటికి వస్తాడు.ఒక్క ముక్కలో చెప్పాలంటే... పిల్లలకు ఉండే పవర్ అదే! తాజా విషయానికి వస్తే... ఒక ఇంటర్వ్యూలో భర్త రణ్‌బీర్ కపూర్ గురించి చెప్పారు ఆలియా.‘రాహా పుట్టిన తరువాత రణ్‌బీర్ మారిపోయాడు’ అనడమే కాదు ‘రాహాను ఎంటర్‌టైన్ చేయడానికి చాలా క్రియేటివ్‌గా ఆలోచిస్తాడు’ అని ప్రశంసలు కురిపించారు ఆలియా.
మరి ముద్దుల కూతురు మాటేమిటి? ‘రాహా కూడా రణ్‌బీర్‌ను బాగా ఎంటర్‌టైన్ చేస్తుంది’ అని చెప్పారామె. ‘వారిద్దరూ మాట్లాడుకుంటుంటే తండ్రీ కూతుళ్లు మాట్లాడుకున్నట్లుగా కాకుండా ఇద్దరు స్నేహితులు మాట్లాడుకుంటున్నట్లుగా ఉంటుంది’ అని మురిసిపోతారు ఆలియా. ‘వాళ్లిద్దరూ మాట్లాడుకుంటున్నప్పుడు తీసిన వీడియోలు నాకు భవిష్యత్ కాలంలో అపూర్వమైన నిధులు’ అని కూడా అంటారామె.
ఇంతకీ రాహా వల్ల రణ్‌బీర్‌లో వచ్చిన మార్పు ఏమిటి? ఆలియా సూటిగా చెప్పకపోయినా ఆమె మాటలను బట్టి అర్థమయ్యేదేమిటంటే.... ‘మునుపటితో పోల్చితే చాలా ప్రశాంతంగా కనిపిస్తున్నాడు’ ‘ఇతరులతో మాట్లాడే విధానంలో మార్పు వచ్చింది’ మార్పు... మంచిదే కదా! థ్యాంక్స్.... రాహా! రాహా అంటే స్వాహిలీ భాషలో ‘సంతోషం’ అని అర్థం.
Comments
Please login to add a commentAdd a comment