ఆలియా పెద్ద గొంతుతో అరిచేది.. పెళ్లయ్యాక..: రణ్‌బీర్‌ | Ranbir Kapoor: Alia Bhatt Changed her Loud Tone After Marriage | Sakshi
Sakshi News home page

Ranbir Kapoor: ఆలియా చాలా తెలివైనది.. నా మనసు నొచ్చుకోవద్దని..

Published Sun, Jul 28 2024 10:46 AM | Last Updated on Sun, Jul 28 2024 12:28 PM

Ranbir Kapoor: Alia Bhatt Changed her Loud Tone After Marriage

ఆలియా భట్‌ది పెద్ద గొంతు.. పెళ్లికి ముందు వరకు ఎలా ఉన్నా తర్వాత మాత్రం తన కోసం టోన్‌ మార్చుకుంది అంటున్నాడు స్టార్‌ హీరో రణ్‌బీర్‌ కపూర్‌. తాజాగా రణ్‌బీర్‌.. యూట్యూబర్‌ నిఖిల్‌ కామత్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్నాడు. ఈ సందర్భంగా అతడు మాట్లాడుతూ.. 'మా నాన్న గొంతుకు నేను భయపడేవాడిని. చిన్నప్పుడు ఆయన గట్టిగా మాట్లాడితే వణికిపోయేవాడిని. నా భార్య ఆలియా స్వరం కూడా పెద్దదే! 

నేను కూడా అలా చేయాల్సింది
కానీ నాకోసం దాన్ని మార్చుకోవడానికి ‍ప్రయత్నించింది. 30 ఏళ్లుగా ఉన్న టోన్‌ను మార్చుకోవాలంటే అంత ఈజీ కాదు. రాహా(కూతురు) కిందపడగానే వెంటనే రియాక్ట్‌ అయిపోతుంది. కానీ నా మనసు ఎక్కడా బాధపడకుండా చెప్తోంది. ఎల్లప్పుడూ నన్ను ప్రశాంతంగా ఉంచాలనే ట్రై చేస్తోంది. నేను కూడా ఆమెను ప్రశాంతంగా ఉంచితే బాగుండేది. కానీ అందుకోసం పెద్దగా కృషి చేయడం లేదనుకుంటా!

తనతో కలిసుండటం ఇష్టం
ఆలియా నా జీవితంలో చాలా స్పెషల్‌. తనపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఎప్పుడూ నన్ను నవ్విస్తూ ఉంటుంది. తనతో కలిసి హాలీడేకు వెళ్లడమన్నా, కలిసి ఇంటికి వెళ్లడమన్నా  ఇష్టం. ఆమె చాలా తెలివైనది. పని పట్ల ఎంతో శ్రద్ధ చూపిస్తుంది' అని తెలిపాడు. కాగా రణ్‌బీర్‌- ఆలియా.. కొంతకాలం డేటింగ్‌ తర్వాత 2022లో ముంబైలో పెళ్లి చేసుకున్నారు. గతేడాది వీరికి రాహా అనే కూతురు పుట్టింది. వీళ్లిద్దరూ ప్రస్తుతం లవ్‌ అండ్‌ వార్‌ అనే సినిమాలో నటిస్తున్నారు.

చదవండి: చిన్న పిల్లలతో లిప్‌ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement