చిన్న వయసులోనే స్టార్‌డమ్, నేషనల్ అవార్డ్.. ఈ హీరోయిన్‌ ఎవరో తెలుసా? | Alia Bhatt Rare Childhood Pic And Full Details | Sakshi
Sakshi News home page

Guess The Actress: బూరె బుగ్గల చిన్నది.. ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్

Published Sun, Jun 16 2024 3:51 PM | Last Updated on Sun, Jun 16 2024 4:03 PM

Alia Bhatt Rare Childhood Pic And Full Details

ఈమె స్టార్ హీరోయిన్. టీనేజీలోనే హీరోయిన్ అయిపోయింది. ఫస్ట్ మూవీ హిట్. ఆ తర్వాత అద్భుతమైన నటనతో చాలా మూవీస్‌తో హిట్స్ కొట్టింది. తనకంటూ సెపరేట్ బ్రాండ్ సృష్టించుకుంది. పాన్ ఇండియా లెవల్లో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. మరి ఇంతలా చెప్పాం కదా ఈమె ఎవరో కనిపెట్టారా? మమ్మల్నే చెప్పేయమంటారా?

పైన ఫొటోలో కనిపిస్తున్న బూరె బుగ్గల చిన్నారి పేరు ఆలియా భట్. 'ఆర్ఆర్ఆర్' సినిమాతో సీతగా నటించి, దక్షిణాదిలోనూ అభిమానుల్ని సొంతం చేసుకుంది. తండ్రి మహేశ్ భట్ ప్రముఖ దర్శకుడు. తల్లిది బ్రిటన్. ఈమె నటి కూడా. ఫ్యామిలీది మూవీ బ్యాక్ గ్రౌండే కాబట్టి 19 ఏళ్లకే 'స్టూడెంట్ ఆఫ్ ద ఇయర్' చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)

ఆ తర్వాత హిందీలో పలు సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా అద్భుతమైన గుర్తింపు సంపాదించింది. 'గంగూబాయ్' సినిమాలో యాక్టింగ్ దెబ్బకు ఏకంగా నేషనల్ అవార్డ్ కూడా దక్కించుకుంది. ఇక ఆస్కార్ తెచ్చిపెట్టిన 'ఆర్ఆర్ఆర్'లోనూ చిన్న పాత్రలో కనిపించింది. ఇకపోతే ఫాదర్స్ డే సందర్భంగా తండ్రితో తాను చిన్నప్పుడు ఉన్న ఓ ఫొటోని ఇన్ స్టాలో పోస్ట్ చేసి విషెస్ చెప్పింది. ఇందులో ఆలియాని చూసి ఫ్యాన్స్ తెగ కామెంట్స్ చేస్తున్నారు.

ఆలియా ఫ్యామిలీ విషయానికొస్తే.. హీరోయిన్‌గా ఫామ్‌లో ఉండగానే హీరో రణ్‌బీర్ కపూర్‌ని పెళ్లి చేసుకుంది. వీళ్లకు రహ అనే కూతురు కూడా ఉంది. ఇలా ఓ వైపు ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేస్తూ, మరోవైపు సినిమాల్లో నటిస్తూ ఎంతోమందికి స్ఫూర్తిగా నిలుస్తోంది.

(ఇదీ చదవండి: ఫాదర్స్ డే స్పెషల్.. కూతురితో రామ్ చరణ్ క్యూట్ ఫొటో)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement