చిన్న పిల్లలతో లిప్‌ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్‌! | Singer Chinmayi Fires On TV Anchor, Instagram post Goes Viral | Sakshi
Sakshi News home page

చిన్న పిల్లలతో లిప్‌ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్‌!

Published Sun, Jul 28 2024 8:48 AM | Last Updated on Sun, Jul 28 2024 11:28 AM

Singer Chinmayi Fires On TV Anchor, Instagram post Goes Viral

టాలీవుడ్‌ సింగర్‌ చిన్మయి శ్రీపాద సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహిళలకు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూనే..అవగాహన కలిగించే అంశాలను చెబుతుంటారు. అయితే సోషల్‌ మీడియాలో ఆమె చేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి దిగ్గజ నటులపై ఆరోపణలు చేయడంతో కోలీవుడ్‌ ఆమెను బ్యాన్‌ చేసింది. అయినా కూడా చిన్మయి తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల  ప్రముఖ నటుడు విజయ్ జాన్ చేసే వికృతాలను బయటపెట్టిన చిన్మయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీవీ షోలో ఓ యాంకర్‌ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.

పిల్లల భవిష్యత్తుతో ఆటలా?
ఓ టీవీ షోలో క ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్‌తో పాటు తల్లిదండ్రులు తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియక అయోమయోగానికి గురవుతాడు.

టీవీల్లో ప్రసారం అయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు  ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది.  అయితే చిన్మయి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్‌ చేసిందనే విషయం తెలియదుక కానీ.. గతంలో ఓ పిల్లల షోలో మాత్రం టాలీవుడ్‌కి చెందిన స్టార్‌ యాంకర్‌ అనసూయ ఓ పిల్లాడితో ఇలా లిప్‌ కిస్‌ చేయించుకుంది. అయితే ఆమెను ఉద్దేశించే చిన్మయి ఈ పోస్ట్‌ పెట్టిందని కొంతమంది నెటిజన్స్‌ అభిప్రాయపడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement