singer Chinmayi
-
చిన్న పిల్లలతో లిప్ కిస్‌లా.. యాంకర్‌పై చిన్మయి ఫైర్!
టాలీవుడ్ సింగర్ చిన్మయి శ్రీపాద సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. మహిళలకు, చిన్న పిల్లలపై జరుగుతున్న అఘాయిత్యాలను ఖండిస్తూనే..అవగాహన కలిగించే అంశాలను చెబుతుంటారు. అయితే సోషల్ మీడియాలో ఆమె చేసే పోస్టులు కాంట్రవర్సీకి దారి తీసిన సందర్భాలూ ఉన్నాయి. మీటు ఉద్యమంలో భాగంగా వైరముత్తు లాంటి దిగ్గజ నటులపై ఆరోపణలు చేయడంతో కోలీవుడ్ ఆమెను బ్యాన్ చేసింది. అయినా కూడా చిన్మయి తన పోరాటం ఆపడం లేదు. ఇటీవల ప్రముఖ నటుడు విజయ్ జాన్ చేసే వికృతాలను బయటపెట్టిన చిన్మయి.. తాజాగా సోషల్ మీడియాలో మరో సంచలన పోస్ట్ పెట్టింది. టీవీ షోలో ఓ యాంకర్ చేసిన పనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.పిల్లల భవిష్యత్తుతో ఆటలా?ఓ టీవీ షోలో క ఫీమేల్ హోస్ట్.. ఒక చిన్న పిల్లాడిని ముద్దు ఇవ్వమని అడిగే సీన్ చూశాను. ఆ సీన్ చూసి.. అక్కడి ఆడియెన్స్‌తో పాటు తల్లిదండ్రులు తెగ నవ్వుతున్నారు.. అంతేకాదు వారిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఇలాంటి చేయడం వల్ల పిల్లలపై దుష్ప్రభావం పడుతుంది. ఒక వేళ ఈ పిల్లాడికి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ క్లాసులు చెబితే.. ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలియక అయోమయోగానికి గురవుతాడు.టీవీల్లో ప్రసారం అయ్యే ఇలాంటి షోలు చిన్నారుల భద్రతకు ఏ మాత్రం ఉపయోగపడవు. సమాజం కూడా వీటిని అంగీకరించకూడదు. ఇదంతా లైంగిక హింస కిందకే వస్తుంది. కానీ ఫన్ ఎప్పటికీ కాదు. దయచేసి అందరూ దీనని గుర్తుంచుకోండి’ అని చిన్మయి తన ఇన్‌స్టాలో రాసుకొచ్చింది. అయితే చిన్మయి ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేసిందనే విషయం తెలియదుక కానీ.. గతంలో ఓ పిల్లల షోలో మాత్రం టాలీవుడ్‌కి చెందిన స్టార్ యాంకర్ అనసూయ ఓ పిల్లాడితో ఇలా లిప్ కిస్ చేయించుకుంది. అయితే ఆమెను ఉద్దేశించే చిన్మయి ఈ పోస్ట్ పెట్టిందని కొంతమంది నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్
Singer Chinmayi Shares Nri Messages Of Who Supporting Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటారని తెలిసిన విషయమే. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్తూ, సలహాలు తీసుకుంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వడం, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌పై ఎంతోమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇద్దరు ఎన్ఆర్ఐలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి బయటపెట్టింది. వారు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని మీరు పట్టించుకోకండి. మీరు సరైనా దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు.' అంటూ చిన్మయికి మద్దతుగా నిలిచారు. 'నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఒక అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వారి ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. ఇలా నాకు మద్దతుగా నిలిచిన వారు జెంటిల్మెన్స్. మీరు గోల్డ్.' అంటూ చిన్మయి షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఇదీ చదవండి: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు -
ఇక్కడైతే బతికిపోయేవాడు
హాలీవుడ్ మూవీ మొఘల్, నిర్మాణ దిగ్గజం హార్వీ వెయిన్‌స్టీన్‌కి 23 ఏళ్ల జైలు శిక్ష విధించింది కోర్టు. లైంగిక వేధింపులు, అత్యాచారం చేసిన నేరానికి జైలు పాలయ్యారు హార్వీ. పలువురు నటీమణులను ఇబ్బంది పెట్టిన కారణంగా ఆయన లైంగిక వేధింపుల ఆరోపణలకు గురయ్యారు. ఆ తర్వాతే ‘మీటూ ఉద్యమం’ ఊపందుకుంది. ఇటీవల జరిగిన కేసు విచారణలో హార్వీకు 23 ఏళ్లు కారాగార శిక్ష విధిస్తున్నట్టు కోర్టు ప్రకటించింది. కోర్టు నిర్ణయంపై పలువురు హాలీవుడ్ హీరోయిన్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రస్తుతం హార్వీ వయసు 67 ఏళ్లు. ఇదిలా ఉంటే... ఇండియన్ ఇండస్ట్రీలో ‘మీటూ’ ఉద్యమం బాగా ఊపందుకోవడానికి కారణం బాలీవుడ్లో నటి తనుశ్రీ దత్తా, సౌత్‌లో సింగర్ చిన్మయి. ప్రముఖ రచయిత వైరముత్తుపై ఆరోపణలు చేశారు చిన్మయి. ఇప్పుడు హార్వీకి శిక్ష పడిన విషయాన్ని ఉద్దేశించి ‘‘ఇండియాలో పుట్టి ఉండాల్సింది అని హార్వీ అనుకునే వాడేమో. ముఖ్యంగా తమిళ నాడులో. ఇక్కడ ఉండి ఉంటే పార్టీలు చేసుకునేవాడు. తనకి పొలిటికల్ పార్టీలు సపోర్ట్ చేసుండేవి’’ అని ఇక్కడైతే హార్వీ బతికిపోయేవాడనే అర్థం వచ్చేట్లు చిన్మయి ట్వీట్ చేశారు. -
నామినేషన్ తిరస్కరణ
తమిⶠఇండస్ట్రీలో జరిగిన డబ్బింగ్ యూనియన్ ఎన్నికలపై ఎప్పుడూ లేని ఆసక్తి నెలకొంది. దానికి కారణం ప్రెసిడెంట్ పదవికి రాధారవిపై పోటీగా డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయని చిన్మయి నామినేషన్ వేయడమే. గతంలో ప్రముఖ రచయిత వైరముత్తు, నటుడు రాధారవిపై ‘మీటూ’ ఉద్యమంలో భాగంగా లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు చిన్మయి. ఆ తర్వాత డబ్బింగ్ యూనియన్ సభ్యత్వం నుంచి ఆమె తొలగించబడ్డారు. కానీ కోర్టు నుంచి ఇంటర్న్ ఆర్డర్ (చిన్మయిని యూనియన్ సభ్యురాలిగా పరిగణించాలి) తెచ్చుకున్నారు చిన్మయి. ఆ తర్వాతే రామరాజ్యం పార్టీ తరఫున డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ పదవికి నామినేషన్ వేశారామె. అయితే చిన్మయి నామినేషన్ తిరస్కరణకు గురయింది. దాంతో రాధారవి ప్రెసిడెంట్ పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ‘‘ఎలక్షన్ కమిషనర్ నేను సభ్యురాలిని కాదని నామినేషన్ తిరస్కరించారు. నా వద్ద కోర్ట్ ఇంటర్న్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఎందుకు సభ్యురాలిగా పరిగణించలేదో అర్థం కావడం లేదు. ఎవరి సూచనల మేరకు ఈ పని చేశారు? రాధారవి ఆజ్ఞ మేరకా? ఈ విషయంపై న్యాయపరంగా పోరాడతాను’’ అని ట్వీటర్లో పేర్కొన్నారు చిన్మయి. -
వైరముత్తు అలాంటివాడే!
కొన్ని రోజులుగా వైరముత్తు తనతో పని చేసేవారి మీద లైంగిక వేధింపులు జరిపాడు అంటూ గాయని చిన్మయి పలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆ ఆరోపణలకు మద్దతు పలికారు సంగీత దర్శకుడు రెహమాన్ సోదరి, సంగీత దర్శకురాలు, నిర్మాత రైహానా. ‘‘వైరముత్తు అలాంటివాడే అన్న విషయం ఇండస్ట్రీలో ఓపెన్ సీక్రెట్. వైరముత్తు ఇలాంటి వాడు అన్న సంగతి రెహమాన్‌కి తెలియదు. ‘నిజమా? ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే పరిస్థితి ఏంటి?’ అని రెహమాన్ నన్ను అడిగాడు. రెహమాన్ పుకార్లను పట్టించుకోడు. తన పనేంటో తను చేసుకుంటూ వెళ్తాడు. అలాగే కాంట్రవర్శీలు ఉన్నవాళ్లతో తను పనిచేయడు. మరి రెహమాన్ వీళ్లతో కలసి పనిచేయడా? అంటే.. అది తన ఇష్టం’’ అని పేర్కొన్నారు. చెడ్డవాడు హీరోయిన్ లేఖా వాషింగ్టన్ కూడా ‘మీటూ’ అంటూ పేరు చెప్పకుండా ఓ వ్యక్తిని ఆరోపించారు. శింబుతో కలసి లేఖ ‘కెట్టవన్’ అనే సినిమాలో యాక్ట్ చేయాల్సింది. అనుకోని కారణాల వల్ల ఆ సినిమా ఆగిపోయింది. ఇప్పుడు ట్వీటర్లో ‘ఒకే ఒక్క పదం.. కెట్టవన్.. మీటూ’ అని ట్వీట్ చేశారు. అంటే.. ఆమె ఎవర్ని అన్నారో ఊహించడం ఈజీ. అన్నట్లు ‘కెట్టవన్’ అంటే చెడ్డవాడు అని అర్థం. -
#మీటూ గాయని చిన్మయి ప్రత్యేక ఇంటర్వ్యూ
-
‘బ్యాడ్ టచ్’ గురించి బయటపెట్టిన గాయని
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని లైంగిక వేధింపులపై బాధితురాళ్ల బహిరంగ వెల్లడింపులతో సరిగ్గా ఏడాది క్రితం మొదలైన ‘మీ టూ’ మహిళా మహోద్యమం.. ఇన్నాళ్లకు మెల్లిగా బాలీవుడ్‌కూ ధైర్యాన్నిచ్చింది! పదేళ్ల క్రితం నానా పటేకర్ తనను లైంగికంగా వేధించాడని తనుశ్రీ దత్తా ఇప్పుడు బయట పెట్టడంతో, ఆ స్ఫూర్తితో.. మరికొంతమంది బాలీవుడ్ మహిళా ప్రముఖులు తమ జీవితంలోనూ జరిగిన అలాంటి చేదు అనుభవాలను ఒకరొకరుగా బహిర్గతం చేస్తున్నారు. సంఘటితం అవుతున్నారు. తాజాగా చెన్నై గాయని చిన్మయి శ్రీపాద.. ఎదుగుతున్న వయసులో తన మీద పడిన ‘బ్యాడ్ టచ్’ గురించి బయటికి చెప్పడంతో.. బాధితులకు మద్దతు లభిస్తోంది. మీ టూ కి.. ‘వియ్ టూ’ అని సపోర్ట్ ఇచ్చే వారి సంఖ్యా పెరుగుతోంది. తను పలికినా.. పాడినా మధురమే! ఇది చిన్మయి శ్రీపాద ఐడెంటిటీ. క్లాసిక్స్ నుంచి ‘మయ్యా.. మయ్యా..’ లాంటి ఐటమ్ సాంగ్స్ దాకా.. ఆమె నోట ఏ పాట విన్నా ప్రేక్షకులు మైమరిచిపోవాల్సిందే. డబ్బింగ్ చెప్పినా అంతే.. వింటూ ఉండిపోవాల్సిందే! అలాంటి చిన్మయి స్వరం ఈరోజు మారింది. బిటర్ చాక్లెట్ నమిలి మింగిన వికారాన్ని పంచుకుంది. ప్రపంచంలో ఎవరి.. ముఖ్యంగా ఏ అమ్మాయి బాల్యమూ భయం నీడ సోకకుండా సాగిన దాఖలా లేదు కదా అనిపిస్తోంది... ‘మీ టూ’ హ్యాష్‌ట్యాగ్ మూవ్మెంట్ స్టోరీస్ విన్నప్పటి నుంచీ. హాలీవుడ్ నిర్మాత హార్వీ వైన్‌స్టీన్ దాష్టీకాల వల్ల ఈ ఉద్యమం ప్రపంచవ్యాప్తం అయింది.లైంగిక వేధింపుల గురించి నోరు విప్పచ్చని.. అవి ఎప్పుడు జరిగినా చెప్పుకోవచ్చని.. వేధించిన వాడు సిగ్గు పడాలి కాని.. వేదనకు గురైన వారు కాదని బాధితులకు ధైర్యం ఇచ్చింది. అది మన వాళ్లకూ ప్లాట్‌ఫామ్ అయింది. టాలీవుడ్లో మెున్న శ్రీరెడ్డి.. బాలీవుడ్లో నిన్న తనుశ్రీదత్తా నిజాలను బయటపెట్టారు. ఇప్పుడు చిన్మయి గొంతు విప్పింది. చిన్నప్పటి అలాంటి సంఘటనలను ట్వీట్ చేసింది. ‘‘అప్పుడు నాకు ఎనిమిదేళ్లో... తొమ్మిదేళ్లో.. ‘సాంథోమ్ కమ్యూనికేషన్స్’ స్టూడియోలో మా అమ్మ తన డాక్యుమెంటరీ రికార్డింగ్‌లో ఉంది. నేను అక్కడే నిద్రపోతున్నాను. నా ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేస్తున్నట్టు అనిపించి దిగ్గున లేచేసరికి.. నా పక్కనే ఓ పెద్ద మనిషి! టీన్స్‌లో ఉన్నప్పుడు కిల్పాక్ (చెన్నై) బ్రిడ్జ్ దగ్గర ఒక ఈవ్ టీజింగ్ ఇన్సిడెంట్ వల్ల నా బైక్ యాక్సిడెంట్ అయి పడిపోయాను. నా కుడిచేయి కొట్టుకుపోయి.. కదల్లేని స్థితిలో నేనుంటే కొంతమంది మగవాళ్లు పడిపోయిన నా దగ్గరకు వచ్చి నా షర్ట్ జేబుల్లో ఏముందో చూసే వంకతో నా చెస్ట్ టచ్ చేసే ప్రయత్నం చేశారు. ఎంత నీచమైన ప్రవర్తన? ఇలాంటిది చాలామంది అమాయిలకు ఎదురయ్యే ఉంటుంది. నాకు పందొమ్మిదేళ్లప్పుడు.. మళ్లీ ఇంకో సంఘటన. ఈసారీ ఓ పెద్ద మనిషే. తన ఆఫీస్‌కు పిలిచాడు. నేను, అమ్మ ఇద్దరం వెళ్లాం. కాని నన్నొక్కదాన్నే లోపలికి రమ్మన్నాడు. బాగా పరియం ఉన్న వ్యక్తే కాబట్టి వేరే అనుమానాలు లేకుండా.. అసలు రాకుండా.. ఆయన క్యాబిన్లోకి వెళ్లాను. ఆయన టేబుల్ వెనకనుంచి వచ్చి.. నన్ను హగ్ చేసుకున్నాడు.. అసభ్యంగా ప్రవర్తించబోయాడు. చిన్మయి.. గత మూడేళ్లుగా ఆన్లైన్లో బెదిరింపులు, వేధింపులనూ ఎదుర్కొంటోంది. దీనికి సంబంధించి ఫిర్యాదూ చేసింది. వాళ్లు అరెస్టయ్యారు కూడా. అయితే అరెస్ట్ అయిన తర్వాతా ట్రోలింగ్ ఆగలేదు.పేరొందిన మహిళా రచయితలు, కార్యకర్తలూ ఆమెను ట్రోల్ చేశారు.. ‘మయ్యా.. మయ్యా.. లాంటి పాటపాడిన సింగర్ .. వేధింపులకు వ్యతిరేకంగా కంప్లయింట్ చేయకూడదు’ అనే కామెంట్స్‌తో! చాలామంది మగవాళ్లు, ఆడవాళ్లు సపోర్ట్ ఇచ్చారు ఆ మాటలకు. అంతేకాదు చిన్మయి మీద యాసిడ్ అటాక్ చేయాలని, రేప్ చేయాలని ఆగ్రహించిన మగవాళ్లూ ఉన్నారు. ఆడవాళ్లే ఆడవాళ్లకు సపోర్ట్ చేయని పరిస్థితి అని వాపోయింది చిన్మయి. ఇలా చిన్మయి మీద ఆన్లైన్లో కక్కుతున్న విషం చదివి.. యూట్యూబ్‌లో సినిమా రివ్యూలు చెప్పే ప్రశాంత్ అనే క్రిటిక్.. చిన్మయికి తాను సపోర్ట్ చేస్తున్నాను అని చెబుతూ వెంటనే ‘‘డోంట్ వర్రీ స్వీట్హార్ట్/ డార్లింగ్.. ఐ విల్ సపోర్ట్ యూ’’ అని ట్వీట్ చేశాడు. ఆయనలా స్వీట్హార్ట్, డార్లింగ్ అని పిలవడం చిన్మయికి చిరాకు తెప్పించింది. వెంటనే ‘‘డోంట్ కాల్ మి స్వీట్హార్ట్’’ అని రిటార్ట్ ఇచ్చి ప్రశాంత్‌కి సంబంధించిన డైరెక్ట్ మెస్సేజెస్ అన్నీ డిలీట్ చేసేసింది చిన్మయి. ఇక అప్పటినుంచి ప్రశాంత్ కూడా చిన్మయికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం మెుదలుపెట్టాడు. అప్పటిదాకా చాలా ఉదాత్తంగా మద్దతునిస్తానన్నవాడు తన అతిని ఆమె తిప్పికొట్టేటప్పటికి అసలు స్వభావం బయటపెట్టుకున్నాడు. చిన్మయి ట్వీట్ చేయడం చూసి ప్రశాంత్ బాధిత మహిళలంతా ఒక్కొక్కరే ట్వీట్స్ ద్వారా అతని వేధింపులను బయటపెట్టడం మొదలుపెట్టారు. దీంతో మీ టూ హాష్‌ట్యాగ్ ఉద్యమం మళ్లీ ఊపందుకుంది.సినిమా ఇండస్ట్రీ, జర్నలిజం ఫీల్డ్‌లోని లైంగిక వేధింపులన్నీ ఆన్లైన్లో పుటలు తెరిచాయి. ఉత్సవ్ చక్రబర్తీ అనే కమెడియన్ అసభ్యకర ప్రవర్తన గురించీ కొంతమంది మహిళలు రాశారు. హఫ్పోస్ట్ ఇండియా ట్రెండ్స్ మాజీ ఎడిటర్ అనురాగ్ వర్మ, బిజినెస్ స్టాండర్డ్ జర్నలిస్ట్ మయాంక్ జైన్, డీఎన్ఏ ముంబై ఎడిటర్ ఇన్ చీఫ్ గౌతమ్ అధికారి, నవలా రచయిత నాగర్కర్, కల్చరల్ క్రిటిక్ (సామాజిక ధోరణుల విమర్శకుడు) సదానంద్ మీనన్ వంటి వారి వేధింపుల పురాణాలన్నీ బయటకు వస్తున్నాయి. మొన్న శుక్రవారం నుంచి సోషల్ మీడియాలో గంటగంటకు ఇలాంటి పేర్లు, హెరాస్మెంట్ నంబర్లతో మీ టూ జాబితా పెరుగుతూ ఉంది.సైలెన్స్‌ను బ్రేక్ చేస్తే వచ్చే నష్టమేమీ లేదు.. పరిష్కారం దొరకడం తప్ప. మహిళ.. మగవాడి సొత్తు కాదు. ఈ మాటను సుప్రీం కోర్టు కూడా తన తీర్పు (497ఏ కేసుకు సంబంధించి)లో చెప్పింది. ఆత్మగౌరవం ఆమె హక్కు కూడా. ఆ ఇంగితంతో మెదలుదాం! ముందుకు కదులుదాం. వీళ్లు కూడా.. కంగనా రనౌత్.. పదిహేడేళ్లకే సినిమారంగంలోకి వచ్చింది. ఆ సమయంలో ఆమె ప్రముఖ బాలీవుడ్ యాక్టర్ ఇంట్లో ఉండేది. కంగనా పెద్ద స్టార్ అయ్యాక తనే ఆమె మెంటర్నని, గాడ్ఫాదర్నని చెప్పుకున్నాడు కూడా. అలాంటి వ్యక్తి తనను వేధింపులకు గురిచేశాడని, శారీరకంగా గాయపర్చాడనీ చెప్పింది కంగనా. అంతేకాదు ఆ వ్యక్తి మీద పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐర్ నమోదైందనీ తెలిపింది ఆమె. ఆ వ్యక్తి ఎవరో చెప్పడానికి కంగనా ఇష్టపడలేదు కాని ఆమె కెరీర్తొలినాళ్లలో గాడ్ ఫాదర్‌గా వ్యవహరించింది ఆదిత్య పంచోలి అనే ఊహగానాలూ ఉన్నాయి. కల్కి కోచ్లిన్ తొమ్మిదేళ్ల వయసులోనే అబ్యూజ్‌కు గురైన డార్క్ ఎక్స్‌పీరియెన్స్ ఆమెది. సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా గొప్పవాళ్లుగా.. పెద్దవాళ్లుగా చలామణి అవుతున్న వారితోనూ వేధింపులు తప్పలేదని ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది కల్కి. చిన్నప్పటి సంఘటనను ఇప్పటికీ ఓ శాపంలా తలచుకుంటానని అంటుంది కల్కి. సప్నా మోతీ భవ్నాని సెలెబ్రిటీ హెయిర్ స్టయిలిస్ట్, బిగ్ బాస్ సీజన్ 6 కంటెస్టెంట్.. సప్నా మోతీ భవ్నాని. చిన్నప్పటి నుంచి ప్రేమించి అబ్బాయినే పెళ్లి చేసుకున్నా గృహహింస తప్పలేదు. 24వ యేట షికాగో(అమెరికా) లో గ్యాంగ్‌రేప్‌కి గురైంది. దాన్నీ హింసకు ఒక ఆయుధంగా మలచుకున్నాడు భర్త. అయినా 20 ఏళ్లు సహించింది వివాహ, కుటుంబ వ్యవస్థల మీద గౌరవంతో. తన బలహీనత తన ప్రాణాలనే తీసే దశకు చేరుకున్నాక అప్పుడు ధైర్యం చేసింది. విడాకులు తీసుకొని స్వతంత్రంగా జీవిస్తోంది సప్నా. అనూష్క శంకర్ తెలుసు కదా.. ప్రఖ్యాత సితార్ విద్వాంసుడు రవి శంకర్ కూతురు. తన తల్లిదండ్రులు నమ్మి, గౌరవించే వ్యక్తి చేతుల్లోనే చిన్నప్పుడు కొన్నేళ్లపాటు సెక్సువల్ అబ్యూజ్‌కు గురయ్యానని.. ‘విమెన్స్ రైట్స్ క్యాంపెయిన్ గ్రూప్’ వీడియోలో షేర్ చేసుకుంది అనూష్క. గ్లామర్ ఇండస్ట్రీనే కాదు.. ప్రతి ఇండస్ట్రీలోనూ ఆ మాటకొస్తే ప్రతి ఇంట్లోనూ ఇలాంటి విషాదాలు వినిపిస్తూనే ఉంటాయి అంటారు ప్రముఖ బాలీవుడ్ నటి కాజోల్. నిజమే.. అందుకే గొంతు పెగల్చాలి. ఇలాంటి వాటికి ఎండ్ చెప్పాలి. మళ్లీ జరక్కుండా చూడాలి. ‘మీ టూ’ కి.. వియ్ టూ (we too) అంటూ సపోర్ట్ చేయాలి. – శరాది -
మీటూ సంచలనం : బాంబు పేల్చిన చిన్మయి
హాలీవుడ్లో రాజుకున్న ‘మీటూ’ ఉద్యమం భారత్‌లోనూ కలకలం సృష్టిస్తోంది. పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొన్న లైంగిక వేధింపులు ట్విటర్లో మోతమోగుతున్నాయి. పలువురు ప్రముఖ మహిళా జర్నలిస్టులు, రచయితలతో పాటు ఇతర సెలబ్రిటీలు తమకు ఎదురైన వేధింపులను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. ముఖ్యంగా ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద చేసిన వరుస ట్వీట్లు, మీటూ ఉద్యమం మరింత రాజుకునేలా చేశాయి. ఇటీవల తనుశ్రీ దత్తా-నానా పటేకర్ వివాదంతోనే మీటూ ఉద్యమం భారత్‌లో అగ్గిరాజైంది. గాయని చిన్మయి షేర్ చేసిన ట్వీట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 8 ఏళ్ల వయసులోనే వేధింపులు... అసభ్యకరంగా పురుషులు తాకిన సంఘటనలను మహిళలు గుర్తు చేసుకోవడం చాలా చాలా కఠినతరమని, చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులను, అసభ్యకరంగా తాకిన సంఘటనలను ఎదుర్కొన్నానని చిన్మయి చెప్పారు. ‘నాకు ఎనిమిది, తొమ్మిదేళ్ల వయసున్నప్పుడు అనుకుంటా. నేను నిద్రపోతున్నాను. మా అమ్మ తన డాక్యుమెంటరీ కోసం రికార్డింగ్ సెషన్‌ను పర్యవేక్షిస్తున్నది. పూజారి దుస్తుల్లో ఉన్న ఓ వ్యక్తి నన్ను అసభ్యకరంగా తాకినట్టు నాకు అనిపించింది. వెంటనే లేచి, అమ్మా ఈ అంకుల్ చాలా చెడ్డవాడు అని చెప్పేశా. ఆ సంఘటన శాంతోమ్ కమ్యూనికేషన్స్ స్టూడియోలో జరిగింది. ఆ స్టూడియో ఇప్పటికి ఉంది’ అదే నా మొదటి భయంకరమైన అనుభవమంటూ చిన్మయి ట్విటర్ వేదికగా తెలిపారు. అలా చిన్నప్పుడే తనకు లైంగిక వేధింపులు ప్రారంభమయ్యాయని చెప్పారు. సంఘంలో ఎంతో గౌరవమున్న వ్యక్తే అలా ప్రవర్తించాడు... ‘చెన్నైలో డిసెంబర్ మ్యూజిక్ ఫెస్టివల్ జరుగుతున్న సమయంలో ఓ పెద్ద మనిషి నాతో అసభ్యకరంగా ప్రవర్తించాడు. అప్పుడు నాకు 10 ఏళ్లు ఉంటాయి. అంతేకాక ఆ తర్వాత కూడా సంఘంలో ఎంతో గౌరవమున్న ఓ వ్యక్తి నన్ను ఆఫీసుకు రమ్మని చెప్పి, అనుమానాస్పదంగా కౌగలించుకుని, పైకి ఎత్తాడు. అది నాకు ఎంతో భయంకరమైన అనుభవం. ఆ సమయంలో అమ్మ కూడా ఉంది. కానీ నన్ను ఒక్కదాన్నే ఆఫీసులోకి రమ్మని చెప్పి అలా ప్రవర్తించాడు. అంతకముందు ఆ వ్యక్తి అలా ఎప్పుడు ప్రవర్తించలేదు. అతని వికృతి ప్రవర్తన, నన్ను చాలా ఆందోళనకు గురిచేసింది. ఆ తర్వాత కూడా నాకు చాలాసార్లు ఇలాంటి భయంకరమైన సంఘటనలు ఎదురయ్యాయి. పబ్లిక్ ఈవెంట్లు, కచేరిలకు అంతరాయం కలిగించడానికి ఆన్‌లైన్‌గా కూడా వేధింపులకు దిగడంతో, నేను తొలిసారి ఫిర్యాదు దాఖలు చేసి, అరెస్ట్ కూడా చేయించాను’ అని చిన్మయి చెప్పారు. ఇట్స్‌ప్రశాంత్ బండారం బట్టబయలు.... యూట్యూబ్‌లో మూవీలకు రివ్యూలు చేపట్టే ప్రశాంత్ అనే వ్యక్తి బండారాన్ని కూడా చిన్మయి ట్విటర్ వేదికగా బయటపెట్టారు. ఇటీవల ఇట్స్‌ప్రశాంత్ అనే అకౌంట్‌తో, అతను అసభ్యకరంగా మెసేజ్‌లు చేశాడని చెబుతూ.. అతని మెసేజ్‌లను ట్విటర్లో షేర్చేశారు. ఇట్స్‌ప్రశాంత్ అనే వ్యక్తి కేవలం చిన్మయినే కాక, మిగతా అమ్మాయిలతో కూడా ఇదే రకంగా ఫేస్బుక్, ట్విటర్ మాధ్యమాల ద్వారా అసభ్యకరంగా మెసేజ్‌లు చేస్తూ.. వేధిస్తున్నాడని తెలిసింది. ఇట్స్‌ప్రశాంత్ నుంచి ఎదుర్కొన్న పలు అనుభవాలను పలువురు అమ్మాయిలు చిన్మయి ట్విటర్‌కి షేర్ చేస్తున్నారు. మరోవైపు హఫ్పోస్ట్ ఇండియా మాజీ ట్రెండ్స్ ఎడిటర్ అనురాగ్ వర్మ, బిజినెస్ స్టాండర్డ్ జర్నలిస్ట్ మయాంక్ జైన్, డీఎన్ఏ ముంబై మాజీ ఎడిటర్-ఇన్-చీఫ్ గౌత్ అధికరి, నవలా రచయిత కిరణ్ నగర్కర్, సాంస్కృతిక విమర్శకుడు సదానంద్ మీనన్, కమెడియన్ ఉత్సవ్ చక్రవర్తి వంటి పలువురు ప్రముఖులు కూడా తోటి మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడినట్టు మీటూ ఉద్యమం ద్వారా సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళా జర్నలిస్టులు ఒక్కొక్కరూ చేస్తున్న ట్వీట్లు, వారు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలు.. సమాజంలో అత్యంత కీలకమైన వృత్తి జర్నలిజం పట్ల నమ్మకాన్ని సన్నగిల్లేలా చేస్తున్నాయి. ప్రతి గంట గంటకు లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళా జర్నలిస్ట్‌ల సంఖ్య పెరుగుతోంది. -
నన్ను లైంగికంగా వేధించారు: గాయని చిన్మయి
సాక్షి, చెన్నై : సోషల్ మీడియాలో క్రియాశీలకంగా ఉండే ప్రముఖ గాయని చిన్మయి తాజాగా వరుస ట్వీట్లలో బాలలపై లైంగిక హింస పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. బాల్యంలో అమ్మాయిలు, అబ్బాయిలు ఇద్దరిపై లైంగిక వేధింపులు కొనసాగుతున్నాయని ఆమె ఆవేదన వెలిబుచ్చారు. అంతేకాకుండా ఇటీవల ఓ కార్యక్రమంలో తన పట్ల ఓ గుర్తుతెలియని వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించాడని, తనను లైంగికంగా తాకాడని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో.. పిల్లలుగా ఉన్న సమయంలో ఎంతోమంది మహిళలు, పురుషులు ఇలా లైంగిక వేధింపులు ఎదుర్కొన్నవారేనని తెలియడం తనను షాక్‌కు గురిచేసిందని ఆమె పేర్కొన్నారు. ఉపాధ్యాయులు, సోదరులు, సహ ప్రయాణికులు, అంకుల్స్, గ్రాండ్‌పేరెంట్స్, ఆఖరికీ మహిళల చేతిలో కూడా వేధింపులు ఎదుర్కొన్నవారు ఉన్నారని ఆమె పేర్కొన్నారు. ‘సాధారణంగా ఇళ్లలో, ప్రజారవాణా ప్రదేశాల్లో, ఆధ్యాత్మిక స్థలాల్లో, విద్యాసంస్థల్లోనూ లైంగిక వేధింపులు చోటుచేసుకుంటున్నాయి. ఈ విషయాన్ని కుటుంబసభ్యులు, స్నేహితులకు చెప్పడానికి చాలామంది బాలికలు, బాలుర ధైర్యం చాలాదు. తాము చెప్పినా వారు నమ్మరేమోనని వెనకాడుతారు’ అని అన్నారు. బాలికలు చెప్తే వినే అవకాశమున్నా.. పురుషులు చెప్తే అసలే వినరని పేర్కొన్నారు. బాల్యంలో తమపై లైంగిక దాడి, లైంగిక వేధింపులు జరిగాయని పురుషులు చెప్తే.. వారినే ఎద్దేవా చేస్తారని, అదేవిధంగా మహిళలు చెప్తే.. వారు ఎంజాయ్ చేశారని నిందిస్తారని, బాలలు తమపై జరిగే లైంగిక దాడులను ఎంజాయ్ చేస్తున్నట్టు పెద్దలు పేర్కొనడం తరహాలో ఇది కూడా వికృతంగానే ఉంటుందని ఆమె కామెంట్ చేశారు. లైంగిక వేధింపుల గురించి తల్లిదండ్రులకు చెప్తే.. చదువు, ఉద్యోగాన్ని మాన్పించి.. ఇంట్లో కూర్చోబెడతారేమోనన్న భయంతో అమ్మాయిలు వెనుకాడుతారని, అయితే, ప్రస్తుతం పరిస్థితి కొంతవరకు మారినట్టు కనిపిస్తోందని గాయని చిన్మయి పేర్కొన్నారు. -
తెలుగు గాయనికి పెద్దనోట్ల రద్దు ఎఫెక్ట్!
రూ. 20 ఇచ్చి పెద్ద మనస్సు చాటుకున్న ఏటీఎం సెక్యూరిటీ గార్డ్ ప్రముఖ తెలుగు గాయని చిన్మయికి పెద్దనోట్ల రద్దు వల్ల అనూహ్య అనుభవం ఎదురైంది. అమెరికా నుంచి గురువారం ఉదయం భారత్‌లో అడుగుపెట్టిన చిన్మయి దంపతులను పెద్దనోట్ల రద్దు కష్టాలు వెంటాడాయి. పెద్దనోట్ల రద్దును ప్రకటించినప్పుడు వారు అమెరికాలో ఉన్నారు. ఇండియాకు తిరిగొచ్చి చూస్తే వారి వద్ద ఒక్కరూపాయి కూడా చెల్లుబాటు అయ్యే కరెన్సీ లేదు. దీంతో చిన్మయి భర్త రాహుల్ వెంటనే ఏటీఎం వద్దకు వెళ్లి కొత్త కరెన్సీ తీసుకోవడానికి ప్రయత్నించాడు. అయితే, ఏటీఎం సెక్యూరిటీ గార్డు ఉదయం 10 గంటల వరకు ఏటీఎంలో డబ్బు లోడ్ చేయరని, అప్పటివరకు ఆగాల్సిందేనని చెప్పాడు. దీంతో నిరాశ చెందిన రాహుల్‌ను ఏటీఎం సెక్యూరిటీ గార్డు తన పెద్ద మనస్సుతో ఆదుకున్నాడు. దంపతులు చాయ్ తాగేందుకు రూ. 20 ఇచ్చాడు. ఈ విషయాన్ని చిన్మయి తన ఫేస్బుక్ పేజీలో వెల్లడించింది. మంచి హృదయమున్న మనుష్యులు మనలో ఇంకా చాలామంది ఉన్నారంటూ ఆమె సంతోషాన్ని వ్యక్తం చేసింది. పలు సినీగీతాలు పాడిన చిన్మయి సినిమాల్లో సమంతకు డబ్బింగ్ చెప్తూ తనదైన ముద్ర వేసిన సంగతి తెలిసిందే.