
Singer Chinmayi Shares Nri Messages Of Who Supporting Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స‍్పందిస్తుంటారని తెలిసిన విషయమే. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద‍్వారా చిన్మయికి చెప్తూ, సలహాలు తీసుకుంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వడం, ఎన్ఆర్‌ఐ సంబంధాల గురించి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌పై ఎంతోమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి.
అయితే తాజాగా ఈ విషయంపై ఇద్దరు ఎన్‌ఆర్‌ఐలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి బయటపెట్టింది. వారు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్‌ఆర్‌ఐలు ప్రవర్తిస్తున‍్నారు. మీ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని మీరు పట్టించుకోకండి. మీరు సరైనా దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున‍్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు.' అంటూ చిన్మయికి మద్దతుగా నిలిచారు.
'నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఒక అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వారి ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. ఇలా నాకు మద్దతుగా నిలిచిన వారు జెంటిల్‌మెన్స్. మీరు గోల్డ్.' అంటూ చిన్మయి షేర్ చేసింది.
ఇదీ చదవండి: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment