Chinmayi Sripaada
-
చైసామ్ విడిపోయి నేటికి మూడేళ్లు.. ఇంతలా వాడుకుంటారా?
టాలీవుడ్ సెలబ్రిటీ జంట సమంత- నాగచైతన్య విడాకులు తీసుకుని సరిగ్గా నేటికి మూడేళ్లవుతోంది. 2021 అక్టోబర్ 2న పరస్పర అంగీకారంతో విడిపోతున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రకటించారు. అప్పటినుంచి వీరి విడాకుల గురించి ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. ఇదిలా ఉంటే ఈ మధ్యే నాగచైతన్యకు.. హీరోయిన్ శోభిత ధూళిపాళతో ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. అటు సమంత.. తన వర్క్ లైఫ్‌లో మునిగిపోయింది.దారుణ వ్యాఖ్యలుఇలాంటి సమయంలో మంత్రి కొండా సురేఖ.. సామ్-చైలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. వీరు విడిపోవడానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణమని ఆరోపించారు. అక్కినేని కుటుంబ ప్రతిష్టను దిగజార్చేలా అనుచిత కామెంట్లు చేశారు. దీంతో నాగ్ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డాడు. మీ రాజకీయాల కోసం సినీప్రముఖుల జీవితాలను వాడుకోవద్దని హెచ్చరించాడు. ఇంతకు దిగజారుతారా?తాజాగా సామ్ స్నేహితురాలు, సింగర్ చిన్మయి ఎక్స్ వేదికగా స్పందించింది. 'మీ ఎజెండా కోసం, మైలేజ్ కోసం, వ్యూస్ కోసం, డబ్బు కోసం సమంత పేరును ఇంత భయంకరంగా వాడుకుంటారా? అందరి దృష్టి మీవైపు మళ్లడం కోసం సమంతను అస్త్రంలా ఉపయోగిస్తున్నారని అర్థమవుతోంది. కానీ మీ అందరికంటే తనెప్పుడూ అగ్రస్థానంలోనే ఉంటుంది. తనను కనీసం కలలో కూడా టచ్ చేయలేరు. ఈ నవరాత్రికి మీ పాపాలను కడిగేసుకోండి' అని ట్వీట్ చేసింది. pic.twitter.com/o2nFKDIE26— chaitanya akkineni (@chay_akkineni) October 2, 2021 I have been unfortunately watching the truly horrifying manner in which multiple individuals, Telugu youtube channels, media persons have been using Samantha’s name for their own mileage, agenda and to make money from click baits and views.End of the day all it proves is that…— Chinmayi Sripaada (@Chinmayi) October 2, 2024 చదవండి: మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున ఫైర్ -
సలార్ నటుడిపై లైంగిక ఆరోపణలు.. సింగర్ పోస్ట్ వైరల్!
సింగర్ చిన్మయి శ్రీపాద గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మహిళలు, చిన్నారులపై జరిగే దారుణాలపై నిత్యం యుద్ధం చేస్తూనే ఉంటోంది. ప్రపంచలో ఎక్కడ అఘాయిత్యం జరిగినా సోషల్ మీడియాలో వేదికగా పోరాటం చేస్తూనే ఉంది. గతంలో మీటూ ఉద్యమంలోనూ చిన్మయి శ్రీపాద గట్టిగానే మహిళల తరఫున పోరాడింది.తాజాగా నటుడు జాన్ విజయ్ మహిళలను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని ఆరోపించింది. కొన్ని రోజుల క్రితం ఇంటర్వ్యూకు వెళ్లిన ఓ మహిళా జర్నలిస్ట్‌తో అసభ్యంగా ప్రవర్తించాడని ప్రస్తావించింది. అతని ప్రవర్తనపై ఇతర మహిళలు కూడా తనతో మాట్లాడారని తెలిపింది. దీనికి సంబంధించిన కొన్ని స్క్రీన్షాట్లను చిన్మయి ట్విటర్లో షేర్ చేసింది. పని ప్రదేశాల్లో, పబ్‌లు, రెస్టారెంట్లలో జాన్ విజయ్ మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తనకు వచ్చిన స్క్రీన్‌షాట్స్‌ను పంచుకుంది. కాగా.. 2018లోనూ అతనిపై లైంగిక ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.కాగా.. జాన్ విజయ్ చివరిసారిగా మలయాళ నటుడు దిలీప్ నటించిన తంకమణి చిత్రంలో విలన్‌గా కనిపించాడు. 2017లో దేశాన్ని కుదిపేసిన లైంగిక వేధింపుల కేసులో నిందితుల్లో దిలీప్ కూడా ఒకరు. అంతే కాకుండా 'ఓరం పో', 'సర్పట్ట పరంబరై, 'సలార్: పార్ట్ 1- సీజ్ఫైర్' లాంటి చిత్రాల్లో జాన్ విజయ్ నటించారు. ప్రభాస్ నటించిన సలార్ మూవీలో రంగ పాత్రలో జాన్ విజయ్ కనిపించారు.More on John Vijay from others who read the post.One of them interviewed him on camera. pic.twitter.com/md6TkyYNJn— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024After The Newsminute report about the Sexual Assault case of Malayalam cinema also mentioned John Vijay for his misdemeanour with the journalistThere are other women speaking about his behaviour in general. pic.twitter.com/AfeLgdC0lY— Chinmayi Sripaada (@Chinmayi) July 26, 2024 -
సింగర్ చిన్మయిపై పోలీస్ కేసు.. కారణం అదేనంట..!
-
అర్ధరాత్రి 12 గంటల తర్వాత ఆడాళ్లకు ఏం పని? పైగా ఎక్స్పోజింగ్..
పదమూడేళ్ల వయసులోనే నాటకాల్లో నటించడం మొదలుపెట్టింది అన్నపూర్ణ. చిన్న వయసులోనే వెండితెరపై సందడి చేసింది. కొన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో రాణిస్తోంది. ప్రస్తుతం బామ్మ పాత్రలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూ అన్నపూర్ణమ్మగా పేరు గడించింది. అయితే ఆమె ఆడవాళ్లను కించపరుస్తూ మాట్లాడిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎక్స్పోజింగ్ ఎక్కువైంది 'అర్ధరాత్రి స్వతంత్రం అనగానే ఆరోజుల్లో ఆడవాళ్లు బయటకు వచ్చేవాళ్లా? ఆడదానికి ఎందుకు స్వాతంత్య్రం కావాలి? రాత్రి 12 గంటల తర్వాత ఏం పని? ఇప్పుడు ఎక్స్పోజింగ్ ఎక్కువైపోయింది. ఎవరూ మనల్ని ఏమీ అనొద్దు అనుకున్నా.. అందరూ మనల్ని ఏదో ఒకటి అనేట్లుగానే రెడీ అవుతున్నాం. ఎప్పుడూ ఎదుటివాళ్లది తప్పు అనకూడదు. మనవైపు కూడా కొంచెం ఉంటుంది' అని చెప్పుకొచ్చింది. సదరు వీడియో క్లిప్పింగ్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ తన వ్యాఖ్యలను ఖండించింది చిన్మయి. ఆమె అలా మాట్లాడుతుంటే.. 'నేను ఆమెకు పెద్ద అభిమానిని. ఆమె ఇలాంటి అభిప్రాయాలు వ్యక్తపరుస్తుంటే నా గుండె ముక్కలైనట్లు అనిపిస్తోంది. ఫేవరెట్ అనుకున్నవాళ్లు ఇలా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను. ఆమె చెప్పినదాని ప్రకారం.. ఏదైనా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చినా, యాక్సిడెంట్ అయినా సూర్యోదయం, సూర్యాస్తమయానికి మధ్యలోనే జరగాలి. ఆ తర్వాత లేడీ డాక్టర్స్, నర్సులు ఉండకూడదు. అర్ధరాత్రి పిల్లలు పుట్టకూడదు మనందరికీ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చి ఆస్పత్రికి వెళ్లినా ఆమె చెప్పినట్లు రాత్రిపూట మహిళా డాక్టర్లే ఉండొద్దు. రాత్రి 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు మగ డాక్టర్లే ఉంటారు. కాబట్టి ఒంట్లో బాగోలేకపోయినా రాత్రి ఆస్పత్రిలో ఉండకూడదు. ఆమె చెప్పిన రూల్ ప్రకారం పిల్లలు కూడా అర్ధరాత్రి పుట్టకూడదు. ఎందుకంటే గైనకాలజిస్టులు ఉండరు, ఉండకూడదు కాబట్టి! జోక్స్ పక్కనపెడితే ఇంట్లో వాష్‌రూమ్స్ లేక సూర్యోదయానికి ముందు పొద్దున్నే 3 గంటలకు లేచి పొలం గట్టుకు వెళ్తున్న ఆడవాళ్లు ఇంకా ఉన్నారు. అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ ఇప్పటికీ చాలా ఊర్లలో బాత్రూమ్సే లేవు. ఇలాంటి సందర్భాల్లో కూడా ఆడవాళ్లు ఎప్పుడు వస్తారా? వాళ్లపై ఎప్పుడు అఘాయిత్యానికి పాల్పడుదామా? అని ఎదురుచూస్తున్నవాళ్లు ఈ సమాజంలో ఉన్నారు. అయినా అమ్మాయిల వేషధారణ వల్లే ఈ అఘాయిత్యాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. భారత్‌లో అమ్మాయిలుగా పుట్టడం మన కర్మ' అని ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: తనకెందుకు క్రెడిట్? అని ఆటిట్యూడ్ చూపించా.. తర్వాతి సినిమాల్లో నాకు ఛాన్స్ ఇవ్వలే! -
వెక్కిరింతలతో ఆత్మహత్య.. అనుపమ, చిన్మయి భావోద్వేగం!
పొగడ్త పన్నీరు వంటిది.. వాసన చూసి వదిలేయాలి అంటుంటారు. విమర్శ కూడా అంతే.. వినీవినపడనట్లు వదిలేయాలే కానీ వాటి గురించి ఆలోచిస్తూ ఒత్తిడికి లోనవకూడదు. కానీ ఇక్కడ చెప్పుకునే మేకప్ ఆర్టిస్ట్ ప్రన్షు విమర్శలను తట్టుకోలేకపోయాడు. ట్రోలింగ్ భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. 16 ఏళ్లకే ప్రపంచాన్ని వదిలేసి వెళ్లిపోయాడు. 'నా కొడుకు మేకప్ వేయడం సొంతంగా నేర్చుకున్నాడు. అతడిని చూసి నేను గర్వపడ్డాను. 12వ తరగతి పూర్తయ్యాక వాడిని ముంబైకి పంపిద్దామని ఇప్పటినుంచే డబ్బులు కూడా దాచిపెడుతున్నాను. 2019లో నేను విడాకులు తీసుకున్నాను. అప్పటినుంచి ప్రన్షుతో కలిసి ఒంటరిగా జీవిస్తున్నాను. గతేడాది నుంచి వింతగా గతేడాది నా కొడుకు వింతగా ప్రవర్తించాడు. అమ్మా.. నేను అమ్మాయిలు, అబ్బాయిలు.. ఇద్దరి ఆకర్షణకు లోనవుతున్నానన్నాడు. నేను అతడిని తప్పుపట్టలేదు. తను మేకప్ వేసుకుంటే కూడా వద్దని వారించలేదు. సింగిల్ పేరెంట్‌గా ఎన్నో ఆర్థిక సమస్యలు వస్తుంటాయి. ప్రన్షు ప్రతిరోజు ఎంతో కష్టపడేవాడు. యూట్యూబ్ నుంచి మేకప్ ఎలా వేయాలని నేర్చుకున్నాడు. జేమ్స్ చార్లెస్‌ను చూసి స్ఫూర్తి పొందాడు. అతడిలానే ఉంటాననుకునేవాడు. ఎప్పటికైనా అతడిని కలవాలనుకునేవాడు. అదే చివరి ఫోన్ కాల్.. ప్రన్షు చిన్న వయసులోనే ఎంతో మెచ్యూర్‌గా ఆలోచించేవాడు. ద్వేషపూరిత కామెంట్లను ఎలా హ్యాండిల్ చేయాలో వాడికి బాగా తెలుసు. అంతెందుకు, ట్రోలింగ్ చూసి మేమిద్దరం నవ్వుకునేవాళ్లం. తన తండ్రిని కూడా చాలా ఏళ్ల క్రితమే బ్లాక్ చేశాడు. మళ్లీ ఎప్పుడూ ఆయన గురించి ఆలోచించలేదు. ప్రన్షు చాలా కష్టపడేతత్వం ఉన్న పిల్లాడు. తనకు ఎగ్జామ్స్ ఉండటంతో ట్యూషన్ మధ్యలో నుంచి ఇంటికి వచ్చేశాడు. ఉదయం 10 గంటలకు ఫోన్ చేసి మాట్లాడాను. అదే తనతో చివరి సంభాషణ అవుతుందని ఊహించలేదు. ఆ తర్వాత నా కొడుకు నాతో మాట్లాడలేదు. ఇంత పగ, ద్వేషమా? తను ఎక్కడున్నా రత్నమే. నా పిల్లాడిని నేను కోల్పోయాను. మీ పిల్లలు ఏం కావాలనుకుంటే అది కానివ్వండి. వారిని ఎలా ఉంటే అలా అంగీకరించండి అని ప్రన్షు తల్లి ఎమోషనలైంది. ఈ నోట్‌ను సింగర్ చిన్మయి శ్రీపాద షేర్ చేస్తూ.. భారతీయుల్లో పగ, ద్వేషం వంటివి ఎప్పటినుంచో ఉన్నాయా? లేదా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ దొరకడం వల్ల దాన్ని ఇప్పుడు చూపిస్తున్నారా తెలియడం లేదు అని మండిపడింది. ఈ పోస్ట్‌పై హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ స్పందిస్తూ గుండె బద్ధలైందని రాసుకొచ్చింది. చీర కట్టుకుని వీడియో కాగా ప్రన్షు మధ్యప్రదేశ్ ఉజ్జయినిలోని తన నివాసంలో నవంబర్ 21న ఆత్మహత్య చేసుకున్నాడు. దీపావళి పండగ సమయంలో ప్రన్షు చీర కట్టుకుని ఇన్‌స్టాగ్రామ్‌లో రీల్ చేశాడు. దీనికి విపరీతమైన నెగెటివ్ కామెంట్లు వచ్చాయి. ఆ ట్రోలింగ్‌ను తట్టుకోలేకే అతడు బలవన్మరణానికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై ఎల్‌జీబీటీక్యూలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమకు స్వేచ్ఛగా బతికే హక్కు లేదా? అని ప్రశ్నిస్తున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by 𝙋𝙧𝙖𝙣𝙨𝙝𝙪. (@glamitupwithpranshu) నోట్: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ.. -
చిన్మయి షేర్ చేసిన వీడియో చూశారా?
చిన్మయి శ్రీపాద.. ఎన్నో హిట్ సాంగ్స్ పాడింది. కొంతమంది హీరోయిన్లకు గొంతు కూడా అరువిచ్చింది. సోషల్ మీడియాలోనూ తన గొంతు బలంగానే వినిపిస్తూ ఉంటుంది. ఎటువంటి వివాదాస్పద గొడవపైనా స్పందించేందుకు వెనుకాడదు, తన సమాధానం బలంగా వినిపిస్తుంది. మరీ ముఖ్యంగా మహిళల హక్కుల కోసం ఎప్పుడూ ప్రశ్నిస్తూ ఉంటుంది. తాజాగా చిన్మయి ఓ ఆసక్తికర వీడియోను షేర్ చేసింది. రోబో సినిమాలో తను పాడిన కిలిమాంజారో పాటను మళ్లీ పాడింది. అందులో స్పెషల్ ఏముందనుకుంటున్నారా? మాసై తెగల గుంపుతో కలిసి ఈ పాట పాడుతూ వారితో కలిసి డ్యాన్స్ చేసింది. ఇది చూసిన అభిమానులు ఆ పాట మాకు ఇప్పటికీ ఫేవరెట్.. మీరు వారితో కలిసిపోయే విధానం చాలా బాగుంది అని కామెంట్లు చేస్తున్నారు. Kilimanjaro with Maasai ! pic.twitter.com/uwI5EVTjwi — Chinmayi Sripaada (@Chinmayi) November 17, 2023 చదవండి: 21 ఏళ్లకే విడాకులు.. జీవితంపై విరక్తి.. డిప్రెషన్.. చనిపోదామనుకున్నా.. -
రష్మిక డీప్ ఫేక్ వీడియో: గాయని చిన్మయి శ్రీపాద ఫైర్
నటి రష్మిక్ డీప్ ఫేక్ వీడియో ఉదంతం, ఫేక్ న్యూస్, తప్పుడు వీడియోలు, ఫోటోలపై పెద్ద చర్చకు దారి తీస్తోంది. అభ్యంతరకరంగా మార్ప్ చేసిన రష్మిక వీడియో నెట్టింట వైరల్ కావడంతో ఇప్పటికే పలువురు సెలబ్రిటీలు, నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాదు స్వయంగా బిగ్‌బీ దీనిపై ట్విటర్ వేదికగా ఆందోళన వ్యక్తం చేయడంతోపాటు సాక్షాత్తూ కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ కూడా స్పందించారు. ఇది చాలా ప్రమాదకరంగా పరిణ మిస్తోందంటూ ఆందోళన వ్యక్తం చేసిన కేంద్రమంత్రి సోషల్ మీడియా సంస్థలకు కీలక హెచ్చరికలు కూడా జారీ చేశారు. తాజాగా ప్రముఖ గాయని, మీటూ ఉద్యమానికి భారీ మద్దతిచ్చిన చిన్మయి శ్రీపాద కూడా ఎక్స్ (ట్విటర్)లో స్పందించారు. డీప్ ఫేక్ వీడియో రష్మిక ఇన్స్టాగ్రామ్ స్టోరీ చూశాను. ఈ వీడియోతో నిజంగా ఆమె కలవరపడుతునట్టు కనిపిస్తోందన్నారు. ప్రతిరోజూ మహిళల శరీరాలు దోపిడీకి గురవుతున్న దేశంలో, అమ్మాయిలను వేధించేందుకు ఒక సాధనంగా మారుతోంది... వారిని భయపెట్టేందుకు, బ్లాక్మెయిల్ చేసేందుకు, లైంగికంగా దాడి చేసేందుకు కూడా తీవ్రమైన ఆయుధంగా డీప్ ఫేక్స్ మారబోతోందన్నారు. అలాగే అమ్మాయిల గౌరవానికి ప్రమాదంగా మారిన ఏఐ, డీప్ ఫేక్ లాంటి వాటిపై అవగాహన లేని చిన్న గ్రామం లేదా పట్టణాల్లోని కుటుంబాల పరిస్థితి ఏంటి? అంటూ చిన్మయి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జైలర్ సినిమాలోని సెన్సేషనల్ ‘నువ్వు కావాలయ్యా’ పాట విడుదల తరువాత వచ్చిన ఒకప్పటి హీరోయిన్ సిమ్రన్ ఫేక్ వీడియోను ప్రస్తావించారు. ఏఐ మాయ అంటూ సిమ్రన్ ఇన్‌స్టాలో షేర్ చేసేదాకా దాదాపు ఎవ్వరికీ దీని గురించి తెలియదు.. అంటూ ఈ ఫేర్ వీడియో గురించి చిన్నయి గుర్తు చేశారు. అంతేకాదు డీప్‌ఫేక్‌ల ప్రమాదం, సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేలా సాధారణ ప్రజలకు , బాలికలకు అవగాహన కల్పించడానికి దేశవ్యాప్త ప్రచారాన్ని తక్షణమే ప్రారంభించాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సందర్భంగా మార్పింగ్ ఫోటోలతో అమ్మాయిలను, మహిళా రుణ గ్రహీతలను వేధిస్తున్న లోన్ యాప్‌ల అరాచకాలను ఆమె ప్రస్తావించారు. ఎంతో కొంత పరిజ్ఞానం, శిక్షణ ఉంటే తప్ప డీప్ ఫేక్ను సాధారణ ప్రజలు గుర్తించడం కష్టం అంటూ తప్పుడు కథనాలపై అవగాహన కల్పించాల్సిన ఆవశ్యకతను మరోసారి నొక్కి చెప్పారు. Several months ago, a video of one of our most favourite actors in an AI avatar performed to Kaavaalaa from Jailer released - only it wasn’t her. It was a Deep Fake. Nobody knows for sure whether Ms Simran had consented in advance to her likeness to be used in the Deep Fake AI… — Chinmayi Sripaada (@Chinmayi) November 6, 2023 View this post on Instagram A post shared by Simran Rishi Bagga (@simranrishibagga) -
ప్రభుత్వ జూనియర్ కళాశాల.. యదార్థ సంఘటనతో సినిమా టీజర్
'ప్రభుత్వ జూనియర్ కళాశాల' ట్యాగ్‌లైన్ పుంగనూరు. ఈ పేరుతోనే సినిమాను యూత్ ఆడియన్స్‌కు కనెక్ట్ చేశారు మేకర్స్. ఓ యదార్థ సంఘటన ఆధారంగా, ఆసక్తికరంగా తెరకెక్కిన ఈ చిత్రం తాజాగా టీజర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు శ్రీనాథ్ పులకురం దర్శకత్వం వహించారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇది వరకు విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ కూడా అందరినీ ఆకట్టుకుంది. నిర్మాతగా భువన్ రెడ్డి కొవ్వూరి ఈ సినిమాతో ఎంట్రీ ఇస్తున్నాడు. ఇందులోని నటీనటులు కొత్తవారు అయినా వారి నుంచి మంచి నటనను రాబట్టుకున్నట్లు టీజర్‌ను చూస్తుంటే అర్థం అవుతుంది. మ్యూజిక్ డైరెక్టర్ కార్తిక్ రోడ్రిగ్జ్ అద్భుతమైన మ్యూజిక్‌ను అందించారు. ఇందులో ఒకపాటను ప్రముఖ గాయని చిన్మయి పాడారు. యూత్ ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా టీనేజ్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా ఆడియో హక్కులను ఫాన్సీ రేటుకు టీ సిరీస్ తెలుగు సంస్థ దక్కించుకుంది. దీంతోనే చెప్పవచ్చు సినిమాకు మంచి స్కోప్ ఉందని. కార్తీక్ రోడ్రీగుజ్ స్వరాలను అందించగా కమ్రాన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను అందించారు. శ్రీ సాయి కిరణ్ లిరిక్స్ రాశారు. నిఖిల్ సురేంద్రన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. -
మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్ ఇచ్చిన యాంకర్
కోలీవుడ్‌లో తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయిన ఆయన స్టేజీపైన మాట్లాడుతూనే పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. దీన్ని ఊహించని యాంకర్ ఐశ్వర్య.. వేదికపై ఉన్న దండను విసిరేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కూల్ సురేశ్‌ను ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు. (ఇదీ చదవండి: 'కింగ్ ఆఫ్ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు) దీని తర్వాత, కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్ కోసమే అలాంటి పనిచేశానని చెత్త రీజన్ చెబుతూనే తాను ఒకరిని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను. నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పేనని కూల్ సురేశ్ ఒప్పుకున్నాడు. అందుకు గాను బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పాడు. తాజాగా యాంకర్ ఐశ్వర్య కూడా స్పందించింది. 'ఆ సంఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ షాక్‌కి గురవుతున్నాను. ఎవరూ ఊహించని తరుణంలో తను కూడా నా భుజాన్ని బలవంతంగా నొక్కేసి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరు ఏమి చేయగలరు? చెంప పగుల కొడతారు కదా..? అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.. అది వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయకూడదు. ఇంతకు ముందు కూల్ సురేష్ ఓ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతని చర్యలు నాకు నచ్చని మాట నిజమే. అందుకే అతన్ని స్టేజీపైకి పిలిచేముందు నేను నటుడు కూల్ సురేశ్ అని సింపుల్‌గా పిలుస్తాను. కానీ అది అతనికి ఇష్టం ఉండదు.. అతనిని అలా పిలవకూడదని కూడా కండీషన్ పెడతాడు. తనకు యూట్యూబ్ సూపర్‌స్టార్ అనే బిరుదు ఉంది. ఆ విధంగానే తనను ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పలువనని చెప్పడం జరిగింది.' అని ఆమె తెలిపింది. (ఇదీ చదవండి: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్ ఛాన్స్) అందుకే ఈసారి తన మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేశ్ ప్లాన్ వేసినట్లు తెలిపింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా కొట్టేస్తానని తెలిపింది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య వ్యక్తం తెలిపింది. For the kind attention of Tamil Film Producers, Directors, Artistes & PRO's: The activity of junior artiste #CoolSuresh is becoming worse day-by-day. Yesterday during the audio launch of #MansoorAliKhan #Saraku movie,@chennaipolice_ @tnpoliceoffl @MuraliRamasamy4 @Udhaystalin pic.twitter.com/b5kcaX1MUL — Ottran Dorai (@ottrandorai) September 20, 2023 -
యాంకర్‌తో నటుడి అనుచిత ప్రవర్తన, వీడియో వైరల్
కొందరు చేసే తిక్క పనుల వల్ల అవతలివారు ఇబ్బందిపడుతుంటారు. తాము చేసేది తప్పా? ఒప్పా? అని క్షణం కూడా ఆలోచించకుండా అప్రతిష్ట మూటగట్టుకుంటారు. తాజాగా తమిళ నటుడు కూల్ సురేశ్ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు. ప్రస్తుతం సినిమా అవకాశాలు లేక ఇతర చిత్రాల ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు సురేశ్. ఈ క్రమంలో తాజాగా సరక్కు సినిమా మ్యూజిక్ లాంచ్ ఈవెంట్‌కు హాజరయ్యాడు. ఈ సందర్భంగా అతడు పక్కనే ఉన్న యాంకర్ మెడలో పూలమాల వేశాడు. చేసింది తప్పని గద్దించిన నటుడు దీంతో ఇబ్బందిగా ఫీలైన సదరు యాంకర్ చిరాకుగా ఆ మాలను తీసి పడేసింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె అనుమతి లేకుండా అలా దండ వేసేయడం సంస్కారమేనా? అని నెటిజన్లు తిట్టిపోస్తున్నారు. కూల్ సురేశ్ ప్రవర్తనకుగానూ అదే స్టేజీపై ఉన్న నటుడు మన్సూర్ అలీ ఖాన్ క్షమాపణలు చెప్పాడు. అంతేకాకుండా సురేశ్‌ను సైతం క్షమాపణలు చెప్పాలని కోరాడు. దీంతో సురేశ్ మాట్లాడుతూ.. ఈ కార్యక్రమం మొదటి నుంచి మేము సరదాగానే మాట్లాడుకుంటున్నాం.. అని తన తప్పిదాన్ని కవర్ చేసేందుకు ప్రయత్నించాడు. ఆ చప్పట్లేంటి? చిన్మయి ఆగ్రహం మధ్యలో మన్సూర్ అలీ కలగజేసుకుంటూ ఏదైతేనేం.. నువ్వు చేసిన పని తవ్వు అని నొక్కి చెప్పడంతో సురేశ్ క్షమాపణలు చెప్పాడు. కానీ నెట్టింట మాత్రం నటుడి ప్రవర్తనను ఏకిపారేస్తున్నారు. తాజాగా సింగర్ చిన్మయి సైతం దీన్ని తప్పుపట్టింది. 'ఇది భయంకరమైన ప్రవర్తన.. ఇలాంటివారిపై ఎవరూ చర్యలు తీసుకోరు. పైగా దీన్ని వివాదంగా మార్చవద్దని ఆ అమ్మాయి నోరే మూయిస్తారు. అక్కడ ఉన్న కొందరు అబ్బాయిలైతే అతడు పూలమాల వేస్తుంటే చప్పట్లు కొడుతున్నారు' అని ఆగ్రహం వ్యక్తం చేసింది. Uncouth and horrible behaviour. Anyway based on how Tamilnadu deals with such behaviour, Nobody is going to take action on him and perhaps they’ll ask the girl not to make a fuss. And honestly - you should know how some men are - listen to male voices in the audience hooting… https://t.co/HO5pmWxb3b — Chinmayi Sripaada (@Chinmayi) September 20, 2023 Worst Behaviour #CoolSuresh 🥴 Evan Da Adhu Clap Panni Sirikurathu !! 🙄😠pic.twitter.com/n60oBovPy7 — 𝐕𝐢𝐣𝐚𝐲 𝐊𝐚𝐫𝐭𝐡𝐢𝐤𝐞𝐲𝐚𝐧ツ🦁 (@Vijay_Karthik27) September 20, 2023 చదవండి: అక్కినేని శతజయంతి వేడుకలు.. కాంస్య విగ్రహం ఆవిష్కరించిన వెంకయ్యనాయుడు -
బెల్ట్‌తో కొట్టుకుంటూ కొడుకును బెదిరించిన శ్రీహాన్, చిన్మయి ఫైర్
ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్ అవుతుంటుంది సింగర్ చిన్మయి శ్రీపాద. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అది తప్పని సోషల్ మీడియాలో నొక్కి చెప్తుంది. అలా ఎలా చేస్తారని చెడుగుడు ఆడేస్తుంది. తాజాగా బిగ్‌బాస్ రన్నరప్ శ్రీహాన్ అప్లోడ్ చేసిన వీడియోపై మండిపడింది చిన్మయి. ఇంతకీ అందులో ఏముందంటే.. మాట వినని చైతూను దారిలో పెట్టాలనుకున్న శ్రీహాన్ తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ వీడియో తీస్తున్న సిరి మాత్రం పకపకా నవ్వేసింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి. 'మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలామంది పేరెంట్స్ పిల్లలు చెప్పినట్లు నడుచుకోకపోతే కొట్టుకోవడమో లేదంటే చచ్చిపోతామనో బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా చూసిన సంబంధాన్ని ఓకే చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి ఈ జనరేషన్‌లోనైనా ఫుల్స్టాప్ పెట్టాలి' అంటూ వీడియో పోస్ట్ చేసింది. ఇది చూసిన శ్రీహాన్ ఫ్యాన్స్ వాళ్లేదో సరదాగా చేశారు, దానికింత సీరియస్‌గా తీసుకుంటున్నారేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పిల్లల ముందు స్వీయహాని చేసుకోవడం ముమ్మాటికీ తప్పే.. పిల్లల్ని అలాగేనా పెంచేది? అని ఫైర్ అవుతున్నారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆ హీరో తుపాకి కాల్చడం నేర్పించాడు బాలయ్య, చిరుల సంక్రాంతి ఫైట్.. ఇది మొదటిసారి కాదు, 11వసారి -
ఆ నిర్మాతను కలిసిన నటి.. వార్నింగ్ ఇచ్చిన సింగర్ చిన్మయి
సింగర్ చిన్మయి.. ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు. గాయనీగా, నటిగా, డబ్బింగ్ ఆర్టిస్ట్‌గా చిన్మయి ఇండస్ట్రీలో రాణిస్తోంది. ఆమె సింగర్‌గా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది. ముఖ్యంగా మీ టూ ఉద్యమం నేపథ్యంలో చిన్మయి బాగా పాపులర్ అయ్యింది. అప్పట్లో నిర్మాత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా నిలిచాయి. ఇక చిన్మయి సోషల్ మీడియా వేదికగా కూడా పలు సామాజీక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. చదవండి: ఆనందంలో ఐశ్వర్యను హగ్ చేసుకున్న అభిషేక్, ఆకట్టుకుంటున్న వీడియో అంతేకాదు యువతకు, మహిళలు సూచనలు ఇస్తూ వారిలో ధైర్యం నింపుతూ ఉంటుంది. ఇదిలా ఉంటే తాజాగా చిన్మయి సోషల్ మీడియా వేదికగా ఓ నటిని హెచ్చరించింది. ప్రముఖ తమిళ నిర్మాతను కలిసి ఆమెకు చిన్మయి వార్నింగ్ ఇస్తూ సూచనలు ఇచ్చింది. వివరాలు.. తమిళ నటి, వీజే అర్చనా అర్చన ఓ సినిమా షూటింగ్లో పాల్గొంది. ఆ షూటింగ్ సెట్‌కు వచ్చిన నిర్మాత వైరముత్తును ఆమె కలుసుకుంది. ఈ సందర్భంగా ఆయనతో దిగిన ఫొటోలను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. దీంతో తన ఫొటోలపై చిన్మయి స్పందిస్తూ సంచలన వ్యాఖ్యలు చేసింది. ‘అది ఇలాగే మొదలవుతుంది. అతనితో చాలా జాగ్రత్తగా ఉండు. వీలైతే అతడికి తగినంత దూరం పాటించు. ముఖ్యంగా ఇలా ఒంటరిగా అసలు కలవకు. నీతో తోడుగా ఎవరైనా ఉండేలా చూసుకో.. జాగ్రత్త’ అంటూ అర్చన పోస్ట్‌కు కామెంట్ చేసింది. దీంతో ఆమె కామెంట్ తమిళ ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. కాగా నటి చిన్మయి శ్రీపాద ప్రముఖ తమిళ పాటల రచయిత వైరముత్తు మధ్య గత కొన్నేళ్లుగా వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ చిన్మయి సంచలన ఆరోపణలు చేశారు. చదవండి: రామ్ చరణ్‌పై ‘కింగ్ ఖాన్’ షారుక్ ఆసక్తికర వ్యాఖ్యలు View this post on Instagram A post shared by Archana R (@vj_archana_) -
ఇకనైనా నోళ్లు మూస్తారా...చిన్మయి వైరల్ ఫోటోలు
చెన్నై: సరోగసీ ఒక విలాసవంతమైన వ్యాపారంగా మారిపోతున్న వైనం, సరోగసీ వివాదం, సోషల్ మీడియాలో ఆమెపై వస్తున్న వేధింపుల నేపథ్యంలో గాయని చిన్మయి శ్రీపాద బేబీ బంప్‌తో ఒక సెల్ఫీని ఇన్‌స్టాలో షేర్ చేశారు. తద్వారా అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కన్నారన్న పుకార్లకు చెక్ చెప్పారు. అంతేకాదు ఇద్దరు బిడ్డలకు పాలిస్తున్న ఫోటోను కూడా చిన్మయి షేర్ చేశారు. దీంతోపాటు తన అభిపప్రాయాలతో ఒక వీడియోను కూడా పంచుకున్నారు. ట్విన్స్‌కు పాలు పట్టడంలోని ఇబ్బందులు, బ్యాక్‌పెయిన్, షోల్టర్స్ పెయిన్ గురించి కూడా ఆమె చెప్పకనే చెప్పారు. దీంతో నిజంగా మీరు రియల్ శివగామి అంటున్నారు ఫ్యాన్స్. (Dhanteras 2022: బంగారు, వెండిపై ఫోన్‌పే క్యాష్ బ్యాక్ ఆఫర్) ‘ఓన్లీ సెల్ఫీ’ అటూ ప్రెగ్నెన్సీ సమయంలో తీసిన ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోళ్లు మూత పడ్డాయి. నిజంగా ఇది 'ఐకానిక్' పిక్ అంటూ ఫ్యాన్స్ కమెంట్ చేస్తున్నారు. “సరోగసీ అంటూ కారు కూతలు కూసిన వాళ్లంతా ఇకనైనా నోరు మూయండి” అని మరొకరు వ్యాఖ్యానించారు. చిన్మయి శ్రీపాద, నటుడు, నిర్మాత రాహుల్ రవీంద్రన్ దంపతులు ఈ ఏడాది జూన్‌లో ద్రిప్తా, శర్వాస్ అనే కవలలకు జన్మనిచ్చారు. వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు సరోగసీ విధానం ద్వారా పిల్లల్ని కనడం సాధారణంగా మారిపోయింది. అయితే ఆర్థిక ఇబ్బందుల కారణంగా కొందరు మహిళలు అద్దె తల్లులుగా మారుతున్నారనీ, కుటుంబ అవసరాల కోసం, డబ్బు సంపాదన కోసం సరోగేట్‌గా మారుతున్నారనేది ఒక వాదన. ఇందుకు పరిస్థితులను బట్టి కనీసం రూ.15 లక్షల నుంచి 30 లక్షల వరకు లేదా అంతకు మించి డబ్బు వసూలు చేస్తారట. అయితే దీనిపై నియంత్రణ లేకపోవడంతో భారత్ లో సరోగసీ దుర్వినియోగం అవుతుందన్న వాదనలు ఉన్నాయి. దీంతో భారత ప్రభుత్వం 2019లో సరోగసీని నిషేధించి, నియమ నిబంధనలను కఠినతరం చేసింది. (Motorola Edge 30 Ultra: కొత్త వేరియంట్, 200 ఎంపీ కెమెరా, భారీ లాంచింగ్ ఆఫర్) అద్దెగర్భం ద్వారా పిల్లల్ని కనడం(సరోగసీ) అనేది వ్యాపారంగా మారిపోయిందనే ఆరోపణల నేపథ్యంలో ఇటీవల సినీ నటులు నయన్, విఘ్నేష్ దంపతులు సరోగసి ద్వారా పిల్లల్ని కనడం పెద్ద చర్చకు దారి తీసింది. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించిన వివరణ కోరింది. అయితే ఆరేళ్ల క్రితమే తమ పెళ్లిన రిజిస్టర్ చేసుకున్నామని నయన్ దంపతులు ప్రకటించారు. ఇంతకుముందు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనస్ తో కలిసి సరోగసీ ద్వారా ఒక బిడ్డకు జన్మనిచ్చారు. వీరే కాదు, నటుడు షారుఖ్ ఖాన్ దంపతులు, శిల్పాశెట్టి దంపతులతోపాటు, తెలుగు నటి మంచు లక్ష్మి దంపతులు సైతం సరోగసీ విధానంలో పిల్లలకు జన్మనిచ్చారు.(Diwali Gifts: గిఫ్ట్స్, బోనస్‌లు అందుకున్నారా? మరి ట్యాక్స్ ఎంతో తెలుసా? ) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) > View this post on Instagram View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఎలా కన్నావు? అంటున్నారు.. నా ఆన్సరేంటంటే: చిన్మయి
ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద కవలలకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను అటు చిన్మయితో పాటు అటు ఆమె భర్త రాహుల్ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. మా ఇంట్లోకి ద్రిపత్, శ్రావస్ అడుగుపెట్టారంటూ సంతోషం వ్యక్తం చేశారు. అయితే పలువురు నెటిజన్లు చిన్మయి ఇంతకాలం తాను గర్భవతి అన్న విషయాన్ని దాచిపెట్టిందా? లేదా సరోగసి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిందా? అని రకరకాలుగా ప్రశ్నిస్తున్నారు. దీంతో వాటన్నింటికీ సమాధానమిస్తూ ఓ పోస్ట్ షేర్ చేసింది సింగర్. ఇందులో ఆమె ఏం రాసుకొచ్చిందంటే.. చాలామంది నేను సరోగసి ద్వారా కవలలను కన్నానా? అని అడుగుతున్నారు. విషయమేంటంటే.. నేను గర్భవతిగా ఉన్నప్పటి నుంచి నా ఫొటోలను ఏ ఒక్కటి కూడా బయటకు రానివ్వలేదు. చాలాకొద్ది మందికే ఈ విషయం తెలుసు. నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవడానికే ఇలా చేశాను. నా వ్యక్తిగత విషయాలను నేను ఎప్పుడూ బహిర్గతం చేయలేదు. పిల్లల ఫొటోలు కూడా కొంతకాలం వరకు సోషల్ మీడియాలో పోస్ట్ చేయను. ఇంకో విషయం చెప్పనా.. నాకు సిజేరియన్ చేసేటప్పుడు నేను భజన పాట పాడాను అని చెప్పుకొచ్చింది. కాగా, రాహుల్, చిన్మయిలది ప్రేమ వివాహం. 2014లో వీరి పెళ్లి జరిగింది. ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటుంది. అటు రాహుల్ వెండితెరపై నటుడిగా అలరిస్తున్నాడు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayi.sripada) చదవండి: పండంటి కవలలకు జన్మనిచ్చిన సింగర్ చిన్మయి ‘కెప్టెన్’ విజయకాంత్ కాలివేళ్లు తొలగింపు, రజనీకాంత్ ట్వీట్ -
ఆమె నా స్పోక్స్ పర్సన్ కాదు.. ఆమెను ఇబ్బంది పెట్టకండి
Singer Chinmayi About Her Mother Said Dont Disturb Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు. ఇలా వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో పలువురు చిన్మయి వాళ్లమ్మకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై చిన్మయి స్పందించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత అంశాలపై ఎవరైనా ఆమెతో మాట్లాడాలనుకుంటే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టద్దని తెలిపింది. ఆమె తనకు స్పోక్స్ పర్సన్ కాదని. తాను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిన వాళ్ల అమ్మకు సంబంధంలేదని తేల్చి చెప్పింది. తనతో మాట్లాడలనుకుంటే తన మేనేజర్‌కు కాల్ చేయవల్సిందిగా చిన్మయి పేర్కొంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందించిన చిన్మయి, ఇది మూర్ఖత్వమంటూ తీవ్ర వ్యాఖ్యలు
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అంతేగాక సిద్ధార్థ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ తీవ్ర రచ్చకు దారి తీసింది. తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్ వ్యాఖ్యలను తప్పబట్టింది. చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, నటుడిపై మహిళా కమిషన్ ఫైర్ ‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్‌పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామంటూ చిన్మయి పిలుపునిచ్చింది. -
చిన్మయికి ఆ ఇద్దరి మద్దతు.. స్క్రీన్ షాట్స్ వైరల్
Singer Chinmayi Shares Nri Messages Of Who Supporting Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటారు. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటారని తెలిసిన విషయమే. అలాగే ఎంతోమంది అమ్మాయిలు కూడా తమ బాధలను సోషల్ మీడియా ద్వారా చిన్మయికి చెప్తూ, సలహాలు తీసుకుంటారు. ఇటీవల చిన్మయి అమ్మాయిల వివాహం, కట్నం ఇవ్వడం, ఎన్ఆర్ఐ సంబంధాల గురించి తన ఇన్‌స్టా గ్రామ్‌లో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ పోస్ట్‌పై ఎంతోమంది నెటిజన్స్ ట్రోల్ చేశారు. కామెంట్ చేశారు. వారికి కూడా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది చిన్మయి. అయితే తాజాగా ఈ విషయంపై ఇద్దరు ఎన్ఆర్ఐలు చిన్మయికి మద్దతుగా నిలిచారు. ఈ విషయాన్ని స్వయంగా చిన్మయి బయటపెట్టింది. వారు చేసిన మెసేజ్‌లను స్క్రీన్‌షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'మీరు చెప్పినట్టుగానే చాలా మంది ఎన్ఆర్ఐలు ప్రవర్తిస్తున్నారు. మీ మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. కానీ వాటిని మీరు పట్టించుకోకండి. మీరు సరైనా దారిలో వెళ్తున్నారు. అమ్మాయిలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇది చాలా మంచి పని. మీ మాట విని ఒక్కరు మారిన చాలు. అమ్మాయిలు తమ కాళ్ల మీద తాము నిలబడినా చాలు.' అంటూ చిన్మయికి మద్దతుగా నిలిచారు. 'నిజమైన మనుషులు, మగవారికి నా పోస్టులతో ఎలాంటి బాధ ఉండదు. వారికి ఎలాంటి సమస్యలు లేవు. కానీ ఒక అమ్మాయి నో చెబితే తట్టుకోలేని వాళ్లు, వారి ఆధిపత్యం ఎక్కడ పోతుందో అని భయపడేవాళ్లు ఇలా చేస్తారు. ఇలా నాకు మద్దతుగా నిలిచిన వారు జెంటిల్మెన్స్. మీరు గోల్డ్.' అంటూ చిన్మయి షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) ఇదీ చదవండి: అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు -
అమ్మాయిలను ఆర్థికంగా, స్వేచ్ఛగా బతకనివ్వరు.. సింగర్ ఘాటు వ్యాఖ్యలు
Singer Chinmayi Sensational Comments About Marriages: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద పరిచయం అక్కర్లేని పేరు. క్యాస్టింగ్ కౌచ్ గురించి బహిరంగంగా పోరాడింది చిన్మయి. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స్పందిస్తుంటుంది. అమ్మాయిలకు పెళ్లిళ్ల గురించి కూడా సోషల్ మీడియా ద్వారా సలహాలు ఇస్తుంటుంది. అయితే ఇలా చేయడంతో అప్పుడప్పుడు నెటిజన్స్ ఇష్టానుసారంగా చిన్మయిని ట్రోలింగ్ చేస్తుంటారు. ఆ ట్రోలింగ్ కుడా చిన్మయి ధీటుగా సమాధానం ఇస్తుంది. తాజాగా మరోసారి తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో అమ్మాయిల పెళ్లి గురించి స్పందించింది. 'డ్రంకెన్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్ గురించి ఒక అవగాహన కార్యక్రమం ఉందనుకోండి. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవి చేయాలి. అవి చేయొద్దు. అని చెబుతారు. అంటే ప్రతీ ఒక్కరూ తాగి బండి నడుపుతున్నారని కాదు. అది ఎవరికి అవసరమో వారికే చెబుతున్నట్లు లెక్క. నేను పెడుతున్న స్టోరీస్ చూసి ఎన్ఆర్ఐస్ అందరూ అలా కాదు, జనరలైజ్ చేయకే.. అని వాగనక్కర్లేదు. ఓ అమ్మాయి తన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను అందరికీ చెబుతున్నాను. దీంతో మరో అమ్మాయి జాగ్రత్త పడుతుందని. నాకేమో ఈ ఫారెన్ సంబంధం ఎప్పటికీ అర్థం కాదు. తమ కూతురుకు గౌరవంగా జీవించే అవకాశం అస్సలు ఇవ్వరు. తన కాళ్ల మీద తాను నిలబడే స్వేచ్ఛ ఇవ్వరెందుకో అని తల్లిదండ్రుల గురించి ఆలోచిస్తుంటాను. కట్నం ఇచ్చి మరీ పెళ్లీ చేస్తారు. కానీ అమ్మాయిలను మాత్రం ఆర్థికంగా, స్వతంత్రంగా బతకనివ్వరు.' అంటూ ఇన్‌స్టాలో రాసుకొచ్చింది చిన్మయి. ఇంకా.. 'ఆర్థికంగా, స్వతంత్రంగా అమ్మాయిలు ఉంటే అవగాహనతో వేరే కాస్ట్ వారిని పెళ్లి చేసుకుంటారని భయం. ఫోర్స్ చేసి వెధవైనా పర్లేదు సొంత కాస్ట్‌లోనే వారినే పెళ్లి చేసుకోవాలి. తర్వాత కొట్టినా, తిట్టినా వాడితోనే కాపురం చేయాలి. ఈ స్టోరీస్ చూసి కొంతమంది అమ్మాయిలైన సరే కట్నం ఇవ్వను అని నిర్ణయించుకుంటే అది నాకు చాలు. అవగాహన కల్పిస్తుంటే హిస్టారికల్‌గా చూస్తే కూడా మనుషులకు కోపం వస్తుంది. బాలికల నుంచి సదీ సహగమనం లాంటి చెత్త సాంప్రదాయాలను మార్చేందుకు చూసిన ప్రతిసారీ ఇలాంటి కోపాన్నే ప్రదర్శించారు. అందరు అబ్బాయిలు తమ సోదరీమణులకు ఇలానే చేస్తారా ? చేయనంటే వారంతా నాతో అంగీకరించినట్టే. మిగిలిన వాళ్లకు కోపం వస్తే కోప్పడండి. మీ ఈగోలను సాటిస్ఫై చేసి మిమ్మల్ని శాంతింపచేసేందుకు నేను రాలేదు.' అంటూ చెప్పుకొచ్చింది. ఇదీ చదవండి: ‘బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా’ -
వెండితెరపై సందడి చేయబోతున్న రియల్ కపుల్
అక్కినేని వారసుడు అఖిల్ అక్కినేని, బుట్టబొమ్మ పూజా హెగ్డేలు జంటగా నటిస్తున్న చిత్రం ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్గా తెరకెక్కిన ఈ చిత్రం దసరా కానుకగా అక్టోబర్ 8న విడుదల కాబోతుంది. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రముఖ గాయనీ చిన్మయి సందడి చేయబోతున్నారు. ఈ రోజు(సెప్టెంబర్ 10) ఆమె పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ తన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. చదవండి: ‘ఆ రెండు సినిమాలు తీయకపోతే నా జీవితానికి అర్థం లేదు’ ఈ సందర్భంగా చిత్ర యూనిట్ చిన్మయికి విషెస్ కూడా తెలిపారు. అలాగే ఈ సినిమాలో ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్ కూడా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో వీరిద్దరూ కీలక పాత్రలు పోషించనున్నారట. అయితే జంటగానా, వీడిగానా అనేది క్లారిటీ లేదు. కానీ ఈ రీయల్ కపుల్ మాత్రం రీల్‌పై తొలిసారిగా సందడి చేయడం విశేషం. దీంతో వారి ఫ్యాన్స్ వారి పాత్రలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. కాగా ఇంతకాలం తెరవెనక తన గొంతులో ప్రేక్షకులను, సంగీత ప్రియులను ఆకట్టుకున్న చిన్మయి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ మూవీతో తెరపై అలరించబోతున్నారు. కాగా చిన్మయి స్టార్ హీరోయిన్ సమంతకు డబ్బింగ్ చెబుతున్న విషయం తెలిసిందే. చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ప్రముఖ లేడీ కమెడియన్ Wishing star singer @Chinmayi a very happy birthday - Team #MEB Also, Makes her Big-Screen Debut with #MostEligibleBachelor #AlluAravind @AkhilAkkineni8 @hegdepooja @baskifilmz @GopiSundarOffl #PradeeshMVarma #BunnyVas #VasuVarma @adityamusic @GA2Official #MEBOnOct8th pic.twitter.com/FiluWbzbTj — BA Raju's Team (@baraju_SuperHit) September 10, 2021 -
చిన్మయి ప్రెగ్నెన్సీ రూమర్స్.. సింగర్ రియాక్షన్
సింగర్ చిన్మయి పేరు వినని సినీ ప్రేక్షకులెవ్వరూ ఉండరు. దక్షిణాదిలో ఆమె గాత్రాన్ని ఆస్వాదిచని సంగీత ప్రేమికులు కూడా ఉండరు. అయితే ప్లేబ్యాక్ సింగర్, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు సంపాదించిన చిన్మయి మహిళలపై జరుగుతున్న లైంగిక దాడులపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. మీటూ, క్యాస్టింగ్ కౌచ్ ఉద్యమాన్ని దక్షిణాదిని ఉవ్వెతున ప్రచారం చేశారు. కోలీవుడ్ స్టార్ రైటర్ వైరముత్తు లాంటి వారికి వ్యతిరేకంగా ఆరోపణలు చేస్తూ మహిళల తరఫున ధైర్యంగా నిలబడ్డ మనిషి చిన్మయి. తాజాగా ఈ గాయని తనపై సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్‌పై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చారు. ఇటీవల చిన్మయి తన భర్త రాహుల్ రవిచంద్రన్ సోదరుడి వివాహానికి హాజరయ్యారు. ఈ ఫోటోలను రాహుల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో చిన్మయి చీర కట్టు ఉంది. అయితే చీర కట్టిన విధానం వల్ల ఆమె బేబి బంప్‌తో ఉన్నట్లు కనిపిస్తోంది. దీంతో చిన్మయి గర్భవతి అని, ఆమె తమ తొలి బిడ్డకు త్వరలో జన్మనివ్వబోతుందని నెట్టింట్లో, యూట్యూబ్‌లో పుకార్లు రేగాయి. రూమర్స్‌పై స్పందించిన చిన్మయి.. తను ప్రెగ్నెంట్ అంటూ వస్తున్న వార్తలను ఖండించారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో సుధీర్ఘ పోస్టు పెట్టారు. Wishing my babies @subiksharaman and @Rohit_Ravindran an amazing life together 😍😍❤️ pic.twitter.com/h2FLZ6Mr18 — Rahul Ravindran (@23_rahulr) July 1, 2021 ‘ఇది మా పెళ్లి ఫోటో. ఇందులో నేను మడిసార్ ధరించారు. దాన్ని క్యారీ చేయడంలో నాకు సమస్యలు ఉన్నాయి. మడిసార్ కారణంగా నా ఉదరం పెద్దదిగా ఉన్నట్లు కనిపిస్తుంది. కానీ నేను గర్భవతిని కాదు. చిన్మయి బేబీ బంప్ అంటూ యూట్యూబ్ ఛానల్స్ తప్పుగా పెట్టిన ఫోటోలను నేను ఈ రోజు చూశాను. వీటితో విసిగిపోయాను. మడిసార్తో ఎక్కువగా నడవడంతో చీర వదులుగా అయ్యింది. అయిన నా పర్సనల్ లైఫ్ విషయాలు షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. నా గురించి, సన్నిహితుల గురించి అస్సలు షేర్ చేయడం నాకు ఇష్టం ఉండదు. అలాగే ఒకవేళ నేను ప్రెగ్నెంట్ అయిన సమయం వచ్చినప్పుడు ఆ విషయాలు మీతో పంచుకోవచ్చు లేదా చెప్పకపోవచ్చు. అనా నా నిర్ణయం. మేము 100% పిల్లల ఫోటోలను ఎప్పుడూ సోషల్ మీడియాలో పంచుకోము. వారు సోషల్ మీడియాలో ఉండరు. ఈ వార్తలతో అలసిపోయాను. ఇప్పుడైతే ప్రెగ్నెన్సీ రూమర్స్‌ను ఆపండి’ అంటూ పుకా రాయుళ్లకు గట్టి కౌంటర్ ఇచ్చారు. -
బాల్యం నుంచి వేధింపులు, మీ స్ఫూర్తితో ధైర్యం చేశా: నెటిజన్
చిన్మయి శ్రీపాద.. గాయనీగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పరిశ్రమలో దూసుకుపోతున్న ఆమె ఒక్కప్పుడు పెద్దగా ఎవరికీ తెలియదు. తన గాత్రంతో ఎందరినో ఆకట్టుకున్న ఆమె.. చిన్మయి పేరుతో మాత్రమే సుపరిచితురాలు. తెరవెనుకే ప్రేక్షకులను అలరించిన ఆమె ఒక్కసారిగా మీటూ ఉద్యమంతో తెరపైకి వచ్చి పాపులర్ అయ్యింది. అంతకుముందు వరకు పాడటం కోసమే సవరించిన ఆమె గొంతు.. ఒక్కసారిగా గళాన్ని విప్పింది. బయట సమాజంలో ఆడవారు ఎదుర్కొంటున్న వివక్షను మీ టూ ఉద్యమం ద్వారా ఆమె ప్రశ్నించడం ప్రారంభించింది. అలా ఎంతో క్రేజ్ సంపాదించుకున్న చిన్మయి ఎంతోమంది మహిళలకు, బాలికలకు, యువతులకు ఆదర్శంగా నిలిచింది. తమ పట్ల జరుగుతున్న అఘాయిత్యాలపై నోరు మెదిపేందుకు భయపడుతున్న వారు సైతం ఆమె స్ఫూర్తితో బయటకు వచ్చి తమ బాధను చెప్పుకుంటున్నారు. తాజాగా ఓ యువతి తనకు జరిగిన ఘోరాన్ని తల్లిదండ్రులతో చెప్పుకున్నానని, అంతేగాక తనపట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ కామంధుడికి తగిన శిక్ష పడేలా చేశానంటూ ఆమె చిన్మయికి లేఖ రాసింది. అంతేగాక ఇది మీ వల్లే ఇంత ధైర్యం చేశానని కూడా చెప్పింది. ఈ లేఖ సదరు యువతి.. ‘మీరు నిజంగా మాకు స్ఫూర్తి మేడం. నేను నా బాల్యం నుంచి లైంగిక వేధింపులకు గురయ్యాను. మా కజిన్‌నే నాపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ విషయం మా అమ్మనాన్నలకు చెప్పేందుకు భయపడేదాన్ని. కానీ ఓ రోజు ధైర్యం చేసి నిజం చెప్పాను. అయితే వారు ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడొద్దని నన్ను హెచ్చరించారు. వారి నుంచి ఆ మాటలు విని నిరాశ పడ్డాను. కానీ మీలాంటి వ్యక్తులు అలాంటి వాటికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుండటంతో నాలాంటి వారిలో ధైర్యం వచ్చింది. మగవారు తప్పు చేసినా కూడా మనం ఎందుకు సైలెంట్‌గా ఉండాలనే ఆలోచన మొదలైంది. అందుకే ఇంట్లో ఎదురించలేకపోయిన బయట ఓ ఆకతాయి చేసిన పనికి పోలీసులకు ఫిర్యాదు చేశాను. పబ్లిక్ స్థలంలోనే అతడు నన్ను తాకడంతో తిరిగి ఎదిరించాను. అతడిపై ఫిర్యాదు కూడా చేశాను. వాడికి సరైన శిక్ష పడేలా చేశాను. మా లాంటి వారి గొంతుకలా నిలుస్తున్నందుకు మీకు ధన్యవాదాలు’ అంటూ రాసుకొచ్చిన లేఖను చిన్మయి తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఈ ఒక్క మెసేజ్‌తో జీవితం ధన్యమైంది: చిన్మయి
ఆమె గాత్రం మాధుర్యంగా ఉండటమే కాదు గళంలో ఆవేశమూ ఉంటుంది. పాడటానికి మాత్రమే సవరించే గొంతు.. ఏదైనా నిగ్గదీసి అడగడానికి సైతం వెనుకాడదు. ముఖ్యంగా ఆడవారి పట్ల జరుగుతున్న వివక్షను నిలదీసేందుకు ఆమె ఎప్పుడూ ముందుంటుంది. ఆవిడే ప్రముఖ సినీ గాయని చిన్మయి శ్రీపాద. అయితే ఆమెకు ఏ స్థాయిలో క్రేజ్ ఉందో, అదే స్థాయిలో ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. మరోవైపు ఎంతోమంది తమకు ఎదురైన చేదు అనుభవాలను, జరుగుతున్న అఘాయిత్యాలను చిన్మయికి చెప్పుకుని బాధపడుతుంటారు. అలా అనేక మంది బాధలను, వారి నిస్సహాయ స్థితిని చిన్మయి సోషల్ మీడియా ద్వారా ప్రపంచానికి చాటి చెప్పేవారు. ఆదివారం నాడు మదర్స్‌డే సందర్భంగా ఆమెకు ఓ స్పెషల్ మెసేజ్ వచ్చింది. "ప్రియమైన చిన్మయి.. చాలామంది పిల్లలు వారికేదైనా సమస్య రాగానే తల్లికి చెప్పుకుందామని చూస్తారు. మరీ ముఖ్యంగా అమ్మాయిలు ఏదైనా అమ్మతోనే పంచుకుంటారు. కానీ లైంగిక వేధింపుల విషయానికి వచ్చేసరికి మాత్రం వాటిని కన్నతల్లితో కూడా చెప్పుకోలేక బాధపడుతుంటారు. కానీ అలాంటి చేదు విషయాలను కూడా మేం నీతో చెప్పుకోగలిగాం. ఆ ధైర్యాన్ని నువ్వే మాకు అందించావు. అందుకే నీతో అన్నీ షేర్ చేసుకున్నాం. హ్యాపీ మదర్స్‌డే" అని వచ్చిన మెసేజ్ చూసి చిన్మయి ఎమోషనల్ అయింది. ఈ ఒక్క మెసేజ్‌తో తన జీవితానికి సార్థకత లభించినట్లు అయిందని భావోద్వేగానికి లోనైంది. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) చదవండి: ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం చెప్పినట్టు ఆడరు -
వ్యాక్సినేషన్ తర్వాత బ్లడ్ డోనేషన్‌పై చిన్మయి ఏమన్నారంటే..
చిన్మయి శ్రీపాద పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. సింగర్ కంటే కూడా ఆమె మీ టూ ఉద్యమంతో బాగా పాపులర్ అయ్యారు. ఈ ఉద్యమంలో తన ముక్కుసూటి తీరుతో ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇక సోషల్ మీడియాలో సైతం పలు విషయాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసి తరచూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేగాక తన వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ యాక్టివ్ ఉండే ఆమె పలు విషయాలపై నెటిజన్లకు సలహాలు, సూచనలు ఇస్తుంటారు. ముఖ్యంగా మహిళల భద్రతపై చర్చిస్తుంటారు. అలా ఎప్పుడు ఆసక్తికర విషయాలను పంచుకునే చిన్మయి తాజాగా ఓ సందేశాన్ని ఇచ్చారు. వ్యాక్సినేషన్ తర్వాత రక్తదానం ఇవ్వచ్చా లేదా అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై స్పష్టతనిస్తూ ఆమె ఓ వీడియోను షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింటా వైరల్ అవుతోంది. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపుతోన్న సంగతి తెలిసిందే. చిన్న-పెద్ద, పేద-ధనిక అనే ఎలాంటి భేదాభిప్రాయం లేకుండా అందరిపై మహమ్మారి తన పంజా విసురుతోంది. ఈ క్రమంలో కరోనా నివారణకు ప్రతి ఒక్కరూ వ్యాక్సినేషన్ తీసుకుంటోన్న సంగతి తెలిసిందే. దీంతో వ్యాక్సినేషన్ తీసుకున్న రక్తాదానం చేయడంపై ఆమె మాట్లాడుతూ.. వ్యాక్సిన్ తీసుకున్న దాదాపు 56 నుంచి 60 రోజుల వరకు బ్లడ్ డొనేట్ చేయరాదు. దాని వల్ల మున్ముందు బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో లేకుండా పోతుంది. కాబట్టి యువత ఒకసారి ఆలోచించండి.. వ్యాక్సినేషన్‌కు ముందే బ్లడ్ డొనేట్ చేయండి’ అంటూ ఆమె పిలుపునిచ్చారు. View this post on Instagram A post shared by Chinmayi Sripada (@chinmayisripaada) -
ఏదైనా నిగ్గదీసి అడిగే చైతన్యం ఆమె సొంతం
ఆమె సినిమాలకు పాడతారు... కానీ ఛాన్స్ కోసం వాళ్ళు చెప్పినట్టు ఆడరు. ఆమె స్టార్లకు గొంతు అరువిస్తారు... కానీ రాజీ పడి గొంతు విప్పద్దంటే ఊరుకోరు. ఆమె జీవితంలో ఎన్నో చేదు అనుభవాలు... అయినా సరే తారాలోకంలోని తప్పులుచూసి తల వంచుకు వెళ్ళిపోరు! ఆమె గళంలో ఆవేశం ఉంది. ఆమె అక్షరంలో ఆవేదన ఉంది. ఆమెకంటూ భిన్నమైన ఆలోచనా ఉంది. ఆధునిక స్త్రీ చైతన్యానికి ఓ ప్రతీక – సినీ గాయని చిన్మయి శ్రీపాద. ఏదైనా నిగ్గదీసి అడిగే ఆమె చైతన్యం... ఇవాళ సమాజంలో... ముఖ్యంగా సినీ రంగంలో... ప్రతిధ్వనిస్తున్న చిన్మయ నాదం! చిన్మయ వాదం!! అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా – సాక్షి టీవీ స్పెషల్ ఇంటర్వ్యూలో చిన్మయి శ్రీపాద పంచుకున్న మనోభావాలు... ► మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రతి ఏడాదీ సెలబ్రేట్ చేసుకుంటాం. కానీ ఇలాంటి ఓ రోజు ఉంది అంటే... ఇందు కోసం చాలామంది మహిళలు ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. దాడులకు లింగభేదం లేదు. అమ్మాయిలపైనే కాదు, అబ్బాయిలపైనా జరుగుతున్నాయి. ► మహిళా దినోత్సవం అని ఏడాదికోసారి మనం జరుపుకొంటున్నాం. ఆ తర్వాత మనం మహిళల గురించి మర్చిపోతున్నాం. ‘కట్నం ఇవ్వకూడదు... అడగకూడదు’ అని మన దేశంలో చట్టం ఉంది. కానీ అమ్మాయికిచ్చే కట్నం మీదే ఆమె లైఫ్ అంతా తిరుగుతోంది. ఇటీవల రష్మీ అనే అమ్మాయి 7 కోట్ల కట్నం ఇచ్చింది. కానీ వేధింపుల వల్ల చనిపోయింది. సో... ఒక అమ్మాయి ఎంత బాధ భరించినా ఫర్లేదు. పెళ్లి చేస్తే చాలనుకుంటున్నారు. చట్టాలున్నా భ్రూణహత్యలు చేస్తున్నారు. ► సోషల్ మీడియాలో ‘అమ్మాయి లంటే ఇలానే ఉండాలి’ అని కొన్ని మీమ్స్ ఉంటాయి. ‘మేం మగాళ్లం, ఫెమినిజం గురించి కూడా మేమే చెబుతాం’ అంటారు. ► ఇప్పటికీ మహిళలపై లైంగిక వేధింపులు, ఈవ్‌టీజింగ్, గృహహింస జరుగుతూనే ఉన్నాయి. అమ్మాయిలపై ఇవి నార్మలే... జరుగుతాయి అంటారు. ఎబ్యూజ్ అనేది నార్మల్ అని మన పేరెంట్స్ మనకు చెబుతున్నారు. కానీ ఎబ్యూజ్ అనేది ఎందుకు నార్మల్? ఒక అమ్మాయిగా నేను ఎందుకు ఎబ్యూజ్కు గురి కావాలి? ► దిశ కేసులో కూడా చూడండి. ‘ఆమె దుప్పటా వేసుకుందా? ఆ టైమ్‌లో ఆ అమ్మాయి అక్కడ ఏం చేస్తోంది? అప్పుడు పెద్ద టైమ్ కూడా కాలేదు’ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు. అర్ధరాత్రి ఓ మహిళ ఒంటరిగా తిరిగినప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చినట్లు అని గాంధీజీ చెప్పారు. కానీ ఇప్పటికీ ఆ పరిస్థితులు లేవు. ► వైరముత్తు గురించి నేను మొదట్లో మాట్లాడకపోవడానికి కారణం మా అమ్మగారు నన్ను మాట్లాడనివ్వకపోవడమే! మనల్ని ఎవరు సపోర్ట్ చేస్తారు? సొసైటీలో మనకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయో అని భయపడ్డారు. ► సోషల్ మీడియాలో నాపై రేప్ థ్రెట్ వస్తే కేసు పెట్టాను. 2011 నుంచి ఆ కేస్ నడుస్తూనే ఉంది. ఇండియాలోనే ఫస్ట్ సైబర్ క్రైమ్ కేస్ అది. ► చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ల గురించి మనం ఎప్పటి నుంచో మాట్లాడుతున్నాం. కానీ ఇప్పటికీ రాలేదు. ఎందుకంటే ఎక్కువగా మగాళ్ళే ఉన్నారు కదా! ఇక, ఒక కంపెనీలో 10మంది ఉద్యోగులుంటే ఐసీసీ అనేది (ఇంటర్నల్ కంప్లయింట్స్ కమిటీ) ఉండాలి అనేది రూల్. విశాఖ గైడ్లైన్స్కి తగ్గట్లు అన్ని ఆఫీసుల్లో కమిటీలు న్నాయా? ఎన్ని కంపెనీలు ఫాలో అవుతున్నాయి. ► ఒక అమ్మాయి ఒక అబ్బాయితో మాట్లాడటాన్ని సమాజంలో పెద్ద క్రైమ్‌గా చూస్తారు. ఆ అమ్మాయి, అబ్బాయి ఫ్రెండ్స్ అయ్యుండొచ్చు. ఒకవేళ వాళ్లు లవ్‌లో ఉంటే వారి తల్లితండ్రులతో మాట్లాడుకుంటారు. అంతేకానీ... అదొక పెద్ద నేరంలా చూడకూడదు. ఒక అబ్బాయి, అమ్మాయి మాట్లాడుకోవడమే తప్పు అనే కల్చర్ మారాలి. కల్చర్ అంటే... నిరంతరం మారుతూ ఉండేది. మనం 1852లో ఎలా ఉన్నాం? ఇప్పుడు ఎలా ఉన్నాం? టైమ్‌తో పాటు మారాలి. పాతకాలంలోలాగానే ఉండాలనుకుంటే టీవీలు చూడకూడదు. ఇంటర్నెట్ వాడకూడదు. ► ‘నువ్వు..మగాడివికాబట్టి ఏడవకూడదు. బాధపడకూడదు’ అంటారు. అమ్మాయిలు మేకప్ వేసుకోవడానికి మూడు నాలుగు గంటలు పడుతుంది అని మాట్లాడుతుంటారు. కానీ మేకప్ ఆర్టిస్టు, హెయిర్ డ్రెస్సింగ్ల పని గురించి కూడా ఆలోచించాలి. మేల్ యాక్టర్‌కు ఫిమేల్ హెయిర్ డ్రెస్సరెందుకు ఉండకూడదు. సూపర్ స్టార్ రజనీకాంత్‌కి వర్క్ చేసే మహిళ భానుగారు మేకప్ ఉమన్‌గా యూని యన్‌లో గుర్తింపు కోసం కోర్టుకు వెళ్ళాల్సొచ్చింది. ► నేను సింగర్‌గా వచ్చి 19 ఏళ్లు. నాతో మిస్ బిహేవ్ చేసింది వైరముత్తు ఒక్కరే. మంచివాళ్ళు చాలా మంది ఉన్నారు. కొద్దిమంది వల్లే ఇండస్ట్రీకి చెడ్డపేరు. ► నేను ఓపెన్‌గా మాట్లాడుతున్నాను అంటే నాకు మా ఆయన (నటుడు రాహుల్ రవీంద్రన్) మంచి సపోర్ట్ ఇచ్చారు. చాలామంది అమ్మాయిలు ఎందుకు బయటకు చెప్పడం లేదంటే వాళ్ల తల్లితండ్రులే ఫ్రీడమ్ ఇవ్వరు. అన్నదమ్ములే తమ సిస్టర్ను తప్పుపడుతున్నట్లు మాట్లాడుతున్నారు. చైన్ స్నాచింగ్ గురించి, బ్యాగ్ దొంగతనం గురించి చెప్పొచ్చు. కానీ సెక్సువల్ హెరాస్మెంట్ గురించి బయటకు చెబితే, అందులో అమ్మాయిల తప్పు ఉన్నట్లు మాట్లాడతారు. దొంగతనం కేసుల్లో దోషులను తప్పుపడితే.... హెరాస్మెంట్ కేసుల్లో మహిళలదే తప్పు అన్నట్టు మాట్లాడుతున్నారు. ► రేప్ కేసుల్లో కూడా తొందరగా మార్పులు రావాల్సిన అవసరం ఉంది. అలాగే సెక్స్ ఎడ్యుకేషన్ కూడా కావాలి. ఇప్పుడు రద్దీ బస్సులో ఒక ఆకతాయి గిల్లితే గిల్లాడు లెమ్మని అమ్మాయిలు చెప్పలేరు. దానికి సాక్ష్యం అంటే ఏం చూపిస్తాం? ► 21వ శతాబ్దంలోనూ సినిమాల్లో మహిళలను భోగవస్తువులుగా చూడటం తగ్గడం లేదు. అమ్మాయి ఒక బికినీ కానీ, చిన్న షార్ట్ కానీ వేసుకుంటే... కెమెరా చూపిస్తుంది ఎక్కడ చూడాలనేది! ఇంగ్లీష్ సినిమాల్లో బికినీ హీరోయిన్స్‌ను మామూ లుగానే చూపిస్తారు. కానీ మన సినిమాల్లో కెమెరా జూమ్‌లో చూపిస్తుంటారు. ► సమంత వండర్ వుమన్ . సమంత కూడా లైంగికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొని, గెలిచారు. సమంతకూ, నాకు పూర్వజన్మ కనెక్షన్ ఉందనుకుంటా. రాహుల్, సమంత ఓ తమిళ సినిమా ద్వారా కెరీర్‌ను స్టార్ట్ చేశారు. నా తెలుగు డబ్బింగ్ కెరీర్ సమంత ద్వారానే మొదలైంది. నా కంటే ముందు రాహుల్, సమంత మంచి ఫ్రెండ్స్. ► నా భర్త రాహుల్ నా కన్నా పెద్ద ఫెమినిస్టు. విపరీతంగా చదివే రాహుల్ నన్ను మార్చాడు. క్యాస్టిజమ్, సెక్సిజమ్ గురించి రాహులే నాకు ఎక్కువ చెప్పాడు. మహిళల డ్రెస్‌తో సంబంధం లేకుండా వారి ఫేస్‌లు చూసే మాట్లాడాలన్నది రాహుల్ నుంచే నేను నేర్చుకున్నా. రాహుల్ నన్ను సపోర్ట్ చేస్తున్నాడు కాబట్టే మేము ప్రశాంతంగా ఉన్నాం. మా ఫ్యామిలీ అంతా బాగుంది. ► సినీ గీత రచయిత వైరముత్తు దుష్ప్రవర్తన గురించి ఓపెన్ గా చెప్పా. కానీ, తమిళ డబ్బింగ్ యూనియన్ ప్రెసిడెంట్ రాధా రవి నన్ను బ్యాన్ చేశారు. కోర్టుకు వెళ్లా. ఇప్పటికీ పోరాడుతున్నా. సింగర్‌గా ఛాన్సులు తగ్గిపోయాయి. బాధగానే ఉంది. కానీ మా ఇంట్లో నన్ను సపోర్ట్ చేస్తున్నారు. నాకు కూడా కొన్ని వార్నింగ్‌లు వచ్చాయి. ‘పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడితే ఐటీ రైడ్స్ జరుగుతాయి’ అని చెప్పారు. ► జర్నలిస్టు ఎం.జె. అక్బర్ లైంగిక వేధింపులపై 20 మంది మహిళా జర్నలిస్టులు ఆరోపించారు. ప్రియా రమణి వర్సెస్ అక్బర్ కేసులో తాజా తీర్పు రిలీఫ్. కానీ, నువ్వు రేప్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని రీసెంట్గా ఓ జడ్జ్ అడిగారు. చాలా విషయాలు నేను ఓపెన్‌గా మాట్లాడతా. నా గురించి నేను ఆలోచించను. సొసైటీకి మంచి జరిగితే చాలు. -
మూగబోయిన బాలు గళం: ఒక శకం ముగిసింది!
సుప్రసిద్ధ నేపథ్య గాయకుడు, గాన గంధర్వుడు ఇకలేరంటే నమ్మశక్యం కావడంలేదు. దశాబ్దాల తరబడి తన అమృత గానంతో మైమరపించిన ఆ స్వరధార ఆగిపోయిందంటే జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంది. కానీ నమ్మక తప్పని కఠోర వాస్తవం. శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం (74) కరోనా మహమ్మారిపై సుదీర్ఘ పోరాటం తరువాత ఇక సెలవంటూ తనువు చాలించారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. సంపూర్ణ ఆరోగ్యంగా తిరిగి వస్తారని వేయి దేవుళ్లకు మొక్కుకున్న అభిమానులంతా శోక సంద్రంలో మునిగిపోయారు. ఎంతో మంది యువకళాకారులు, గాయకులకు స్ఫూర్తినివ్వడమే గాదు, వారికి ఒక గౌరవప్రదమైన జీవితాన్ని ప్రసాదించిన బాలు లేని లోటు తీరదు గాక తీరదు. ఆయనకు ఆయనే సాటి. బంగారానికి తావి అబ్బిన చందంగా తన అపూర్వ ప్రతిభతో ఇంతింతై వటుడింతై అన్నట్టు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ లాంటి భాషల్లో వేనవేల పాటలతో అలరించారు. అలరిస్తూనే ఉన్నారు. కానీ ఇంతలోనే మాయదారి మహమ్మారి ఆయనను మింగేసింది. సంగీత ప్రపంచానికి అంతులేని అగాధాన్ని మిగిల్చింది. బహుముఖ ప్రజ్ఞాశాలి గొంతునుంచి జాలు వారిన సుస్వరాలే మనకిక శరణ్యం. వి మిస్ యూ బాలూ సార్...ఫర్ ఎవర్ అండ్ ఎవర్ సోషల్ మీడియా ఇదే సందేశాలతో మారు మోగుతోంది. పలువురు ఆయనకు ఘన నివాళులర్పిస్తున్నారు. ఒక శకం ముగిసింది అంటూ ప్రఖ్యాత గాయని చిన్మయ శ్రీపాద ట్వీట్ చేశారు. సంగీత ప్రపంచంలో చిరస్థాయిగా మిగిలిపోతారన్నారు. బాలు గాయకుడు మాత్రమే కాదు. డబ్బింగ్ కళాకారుడిగా, నటుడిగా,సంగీత దర్శకుడిగా తన దైన ప్రతిభను చాటుకున్నారు. కమల్ హాసన్ , రజనీకాంత్, సల్మాన్ ఖాన్, భాగ్యరాజ్, మోహన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, కార్తీక్, నగేష్, రఘువరన్ లాంటి వారికి పలు భాషల్లో గాత్రదానం చేశారు. ముఖ్యంగా కమల్ హాసన్ కథానాయకుడిగా ఇంద్రుడు, చంద్రుడు సినిమాలోనూ, అలాగే 2010లో వచ్చిన దశావతారం చిత్రంలో కమల్ పోషించిన పది పాత్రల్లో 7 పాత్రలకు బాలునే డబ్బింగ్ చెప్పడం విశేషం. ఇందులో కమల్ పోషించిన ముసలావిడ పాత్ర కూడా ఉంది. అన్నమయ్య చిత్రంలో సుమన్ పోషించిన వేంకటేశ్వర స్వామి పాత్రకు, సాయి మహిమ చిత్రంలో బాలు డబ్బింగ్ చెప్పారు. జన్మకే లాలీ...అంటూ తరలిపోయారు 1969 లో మొదటిసారిగా నటుడిగా కనిపించిన బాలు తర్వాత తమిళ, తెలుగు చిత్రాల్లో తనదైన నటనతో ఆకట్టుకున్నారు. 2012లో తనికెళ్ళ భరణి దర్శకత్వంలోఆయన హీరోగా తెరకెక్కిన మిథునం ఈ సినిమాకు నంది ప్రత్యేక పురస్కారం లభించింది. అంతేనా కమల్ హాసన్, రజనీకాంత్, సల్మాన్ ఖాన్, విష్ణువర్ధన్, జెమిని గణేశన్, గిరీష్ కర్నాడ్, అర్జున్, నగేష్, రఘువరన్ లాంటి వారికి అమరిన ఆయన గొంతును మర్చిపోగలమా. ఆయా హీరోల, నటులు హావభావాలకు, గొంతుకు అనుగుణంగా తన గాత్రాన్ని మలుచుకోవడం ఆయన శైలి. అదే ఆయనకు ఎంతో వన్నె. అల్లు రామలింగయ్య, రాజబాబు లాంటి ఎందరో హాస్యనటులకు ఆయన పాడిన పాటలు ఆదరణకు నోచుకున్నాయి. అలనాటి అగ్రహీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్ మొదలు శోభన్ బాబు, కృష్ణ, కృష్ణంరాజు చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ నాగార్జున, మహేష్ బాబు, ఎన్టీఆర్ జూనియర్, ప్రభాస్ లాంటి ఇనాటి యంగ్ హీరోల దాకా ఆయన పాడని హీరో లేరు. 40 ఏళ్ళ సినీ ప్రస్తానంలో 11 భాషలలో, 40వేల పాటలు, 40 సినిమాలకి సంగీత దర్శకత్వంతో ఉర్రూత లూగించిన బహుముఖ ప్రజ్ఞాశాలి ఆయన. అందుకే అవార్డులు, జాతీయ పురస్కారాలు వచ్చి వరించాయి. (జీవితాన్నే మార్చేసిన ‘శంకరాభరణం’) Oru Sahabdham samaptam. Thank you for the memories. Thank you for showing that a singer can be a fantastic singer, act, voice act, produce, compose & more. You lived and how! Your art will live for aeons and I’ll always celebrate you. #SPB — Chinmayi Sripaada (@Chinmayi) September 25, 2020 బాలు తల్లిదండ్రులు : శ్రీపతి పండితారాధ్యుల సాంబమూర్తి (తండ్రి) , శకుంతలమ్మ (తల్లి) జీవిత భాగస్వామి : సావిత్రి సంతానం: చరణ్ , పల్లవి సోదరీమణులు : శైలజ, వసంత (కుమారుడు చరణ్, శైలజ, వసంత సినీ నేపథ్య గాయకులుగా ఉన్నారు)