
భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌పై హీరో సిద్ధార్థ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలు తీవ్ర దూమారం రేపుతున్నాయి. సిద్ధార్థ్‌పై చర్యలు తీసుకోవాలని, సైనాపై అతడు చేసిన ట్వీట్‌ను వెంటనే తొలగించాలని జాతీయ మహిళ కమిషన్ చైర్మన్ రేఖా శర్మ డిమాండ్ చేశారు. అంతేగాక సిద్ధార్థ్ వ్యాఖ్యలను వ్యతిరేకిస్తూ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు స్పందిస్తున్నారు. దీంతో ప్రస్తుతం సిద్ధార్థ్ ట్వీట్ తీవ్ర రచ్చకు దారి తీసింది. తాజాగా దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద స్పందిస్తూ సిద్ధార్థ్ వ్యాఖ్యలను తప్పబట్టింది.
చదవండి: సైనా నెహ్వాల్‌పై సిద్ధార్థ్ అభ్యంతరకర వ్యాఖ్యలు, నటుడిపై మహిళా కమిషన్ ఫైర్
‘ఇది ఎంతో మూర్ఖత్వం’ అంటూ చిన్మయి సిద్ధార్థ్‌పై మండిపడింది. ‘గతంలో మహిళలు పోరాడే అనేక అంశాల్లో సిద్ధార్థ్ ఎంతో మద్దతు ఇచ్చాడు, ఇప్పుడిలాంటి వ్యాఖ్యలు చేయడం బాధాకరం’ అని పేర్కొంది. అయితే వాట్సాప్, లేక ఇతర వేదికలపై ఇలాంటి అంశాలపై దుష్ప్రచారం చేసేందుకు భారీ యంత్రాంగం ఉంటుందన్న విషయం అర్థమైందని, ఈ వివాదాన్ని ఇంతటితో ముగిద్దామంటూ చిన్మయి పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment