
సోషల్ మీడియాలో ప్రస్తుతం ఓ చాలెంజ్ వైరల్ అవుతోంది. పదేళ్ల క్రితం ఎలా ఉన్నారు.. ప్రస్తుతం ఎలా ఉన్నారో తెలిపే ఫోటోలను షేర్ చేస్తూ ఈ చాలెంజ్‌ను వైరల్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం ఈ 10yearschallenge ట్రెండింగ్‌లో ఉంది. అయితే దీనివల్ల కొందరు చేదు అనుభవాలను ఎదుర్కొంటున్నారు. ఇక ఆకతాయిల చేష్టలకు కొదవే లేని సోషల్ మీడియాలో ఓ పిక్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.
బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా, నిక్ జోనస్‌ల ఫోటోలపై మీమ్స్ క్రియేట్ చేశారు. 2009లో ప్రియాంక ఓ పిల్లాడిని ఎత్తుకున్న ఫోటోను, 2019లో ప్రియాంక నిక్‌తో ఉన్న ఫోటోను జత చేసి సోషల్‌మీడియాలో షేర్ చేశారు. దీనిపై ప్రముఖ గాయని చిన్మయి శ్రీపాద ఘాటుగా స్పందించారు. ‘ఈ ఫోటోను చూస్తే వారి ఉద్దేశం ఏంటో అర్థమవుతోంది. తనకంటే 25ఏళ్లు చిన్న అమ్మాయిని పెళ్లి చేసుకునే ఈ దేశంలో.. అరవై ఏళ్ల వృద్దుడు చిన్న పిల్లలను చేసుకునే ఈ ప్రపంచంలో అటువంటి వారిని ఎవరూ ఏమనరు. కానీ ఒక అమ్మాయి తనకంటే చిన్నవాడిని పెళ్లి చేసుకుంటే మాత్రం ఇలాంటివి చేస్తూ ఉంటారు’ అంటూ ట్వీట్ చేశారు. ఈ మధ్యే.. తాను వేసుకున్న దుస్తులపై కామెంట్ చేసిన వ్యక్తిని దూషించిన రకుల్‌ను నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శించగా.. చిన్మయి మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment