
Singer Chinmayi About Her Mother Said Dont Disturb Her: ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితులు, జరుగుతున్న విషయాలు, అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యలపై స‍్పందిస్తుంటుంది. కొన్నిసార్లు పలు అంశాల్లో తనదైనా శైలిలో స్పందించి వివాదాలు కూడా ఎదుర్కొంది. సోషల్ మీడియా ద్వారా తమ బాధలను చెప్పుకునే అమ్మాయిలకు సలహాలు, సూచనలు ఇస్తూ ధైర్యం చెప్తుంటుంది. ఆమెకు పలువురు అబ్బాయిలు కూడా మద్దతు పలుకుతూ ఉంటారు.
ఇలా వృత్తిపర, వ్యక్తిగత విషయాలపై ఆమెతో చర్చించాలనుకునే వారి సంఖ్య పెరిగింది. దీంతో పలువురు చిన్మయి వాళ్లమ్మకు ఫోన్లు చేయడం ప్రారంభించారు. ఈ విషయంపై చిన్మయి స్పందించింది. వృత్తిపరమైన, వ్యక్తిగత అంశాలపై ఎవరైనా ఆమెతో మాట్లాడాలనుకుంటే వాళ్ల అమ్మకు ఫోన్ చేసి ఇబ్బందిపెట్టద్దని తెలిపింది. ఆమె తనకు స్పోక్స్ పర్సన్ కాదని. తాను సోషల్ మీడియాలో ఏం పోస్ట్ చేసిన వాళ్ల అమ్మకు సంబంధంలేదని తేల్చి చెప్పింది. తనతో మాట్లాడలనుకుంటే తన మేనేజర్‌కు కాల్ చేయవల్సిందిగా చిన్మయి పేర్కొంది.