Chinmayi Sripaada Fires On Bigg Boss Fame Srihan - Sakshi
Sakshi News home page

Shrihan: కొడుక్కి శ్రీహాన్‌ బ్లాక్‌మెయిల్‌.. ఫైర్‌ అయిన చిన్మయి

Jan 8 2023 3:35 PM | Updated on Jan 8 2023 3:49 PM

Chinmayi Sripaada Fires On Bigg Boss Fame Srihan - Sakshi

ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ

ఎక్కడ ఏం జరిగినా వెంటనే రియాక్ట్‌ అవుతుంటుంది సింగర్‌ చిన్మయి శ్రీపాద. ఎవరైనా తప్పు చేశారని అనిపిస్తే ఏమాత్రం ఆలోచించకుండా వెంటనే అది తప్పని సోషల్‌ మీడియాలో నొక్కి చెప్తుంది. అలా ఎలా చేస్తారని చెడుగుడు ఆడేస్తుంది. తాజాగా బిగ్‌బాస్‌ రన్నరప్‌ శ్రీహాన్‌ అప్‌లోడ్‌ చేసిన వీడియోపై మండిపడింది చిన్మయి.

ఇంతకీ అందులో ఏముందంటే.. మాట వినని చైతూను దారిలో పెట్టాలనుకున్న శ్రీహాన్‌ తనను తాను కొట్టుకుంటున్నట్లుగా నటించాడు. 'ఎన్నిసార్లు చెప్పాలి.. నా మాట వింటావా? లేదా?' అని బెల్ట్‌తో కొట్టుకున్నట్లు నటించాడు. దీంతో చైతూ 'వింటా డాడీ, కొట్టుకోవద్దు.. సారీ' అంటూ ఏడుస్తుండగా దీన్నంతటినీ వీడియో తీస్తున్న సిరి మాత్రం పకపకా నవ్వేసింది. ఈ వీడియోపై ఆగ్రహం వ్యక్తం చేసింది చిన్మయి.

'మనకు మనం హాని చేసుకోవడం వల్ల పిల్లల మనసుపై తీవ్ర ప్రభావం పడుతుంది. చాలామంది పేరెంట్స్‌ పిల్లలు చెప్పినట్లు నడుచుకోకపోతే కొట్టుకోవడమో లేదంటే చచ్చిపోతామనో బెదిరిస్తారు. మరీ ముఖ్యంగా చూసిన సంబంధాన్ని ఓకే చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటామని బెదిరిస్తారు. ఈ ధోరణికి ఈ జనరేషన్‌లోనైనా ఫుల్‌స్టాప్‌ పెట్టాలి' అంటూ వీడియో పోస్ట్‌ చేసింది. ఇది చూసిన శ్రీహాన్‌ ఫ్యాన్స్‌ వాళ్లేదో సరదాగా చేశారు, దానికింత సీరియస్‌గా తీసుకుంటున్నారేంటి? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు నెటిజన్లు మాత్రం.. పిల్లల ముందు స్వీయహాని చేసుకోవడం ముమ్మాటికీ తప్పే.. పిల్లల్ని అలాగేనా పెంచేది? అని ఫైర్‌ అవుతున్నారు.

చదవండి: ఆ హీరో తుపాకి కాల్చడం నేర్పించాడు
బాలయ్య, చిరుల సంక్రాంతి ఫైట్‌.. ఇది మొదటిసారి కాదు, 11వసారి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement