మరోసారి ఇలాంటి పని చేస్తే చెంప పగలగొడతా.. నటుడికి వార్నింగ్‌ ఇచ్చిన యాంకర్‌ | Anchor Aishwarya React On Cool Suresh | Sakshi
Sakshi News home page

Cool Suresh Viral Video: అతను నా పట్ల ఇలాంటి పని ఎందుకు చేశాడంటే: యాంకర్‌

Published Thu, Sep 21 2023 4:34 PM | Last Updated on Thu, Sep 21 2023 5:37 PM

Anchor Aishwarya React On Cool Suresh - Sakshi

కోలీవుడ్‌లో  తాజాగా తమిళ నటుడు కూల్‌ సురేశ్‌ స్టేజీపై ఉన్న మహిళా యాంకర్‌తో అనుచితంగా ప్రవర్తించి విమర్శలపాలయ్యాడు.  సరక్కు సినిమా మ్యూజిక్‌ లాంచ్‌ ఈవెంట్‌కు హాజరయిన ఆయన స్టేజీపైన మాట్లాడుతూనే పక్కనే ఉన్న యాంకర్‌ మెడలో పూలమాల వేశాడు. దీన్ని ఊహించని యాంకర్‌ ఐశ్వర్య.. వేదికపై ఉన్న దండను విసిరేసి తన ఆవేదనను వ్యక్తం చేసింది. అనంతరం మాట్లాడిన మన్సూర్ అలీఖాన్ కూల్ సురేశ్‌ను ఖండిస్తూ ఆయన తరపున క్షమాపణలు చెప్పారు.

(ఇదీ చదవండి: 'కింగ్‌ ఆఫ్‌ కొత్త' ఓటీటీ విడుదల తేదీలో మార్పు)

దీని తర్వాత, కూల్ సురేష్ తన చర్యలకు క్షమాపణలు చెబుతూ ఒక వీడియోను విడుదల చేశాడు. సినిమా ప్రమోషన్‌ కోసమే అలాంటి పనిచేశానని చెత్త రీజన్‌ చెబుతూనే తాను ఒకరిని బాధపెట్టినందుకు చింతిస్తున్నాను. నిజంగానే తాను చేసింది చాలా పెద్ద తప్పేనని కూల్‌ సురేశ్‌ ఒప్పుకున్నాడు.  అందుకు గాను బహిరంగంగా క్షమాపణలు కోరాడు. ఇకపై అలాంటి తప్పులు చేయనని చెప్పాడు.

తాజాగా యాంకర్‌ ఐశ్వర్య కూడా స్పందించింది. 'ఆ సంఘటన గురించి తలచుకుంటే ఇప్పటికీ షాక్‌కి గురవుతున్నాను. ఎవరూ ఊహించని తరుణంలో తను కూడా నా భుజాన్ని బలవంతంగా నొక్కేసి అలా ప్రవర్తించాడు. ఎవరైనా అకస్మాత్తుగా బహిరంగంగా ఇలా ప్రవర్తిస్తే మీరు ఏమి చేయగలరు? చెంప పగుల కొడతారు కదా..? అలాగే ఇప్పుడు నేను అతని చెంప మీద ఎందుకు కొట్టలేదని ఆశ్చర్యపోతున్నాను. మొరటుగా ప్రవర్తించడంలో కూడా కొన్ని పరిమితులు ఉంటాయి.. అది వ్యక్తిగతంగా ఎవరినీ ప్రభావితం చేయకూడదు.

ఇంతకు ముందు కూల్ సురేష్ ఓ షోలో నాపై రచ్చ చేశాడు. సాధారణంగా అతని చర్యలు నాకు నచ్చని మాట నిజమే. అందుకే అతన్ని స్టేజీపైకి పిలిచేముందు నేను నటుడు కూల్ సురేశ్‌ అని సింపుల్‌గా పిలుస్తాను. కానీ అది అతనికి ఇష్టం ఉండదు.. అతనిని అలా పిలవకూడదని కూడా కండీషన్‌ పెడతాడు. తనకు యూట్యూబ్ సూపర్‌స్టార్ అనే బిరుదు ఉంది. ఆ విధంగానే తనను  ఎందుకు పిలవరని పలుమార్లు గొడవ కూడా పెట్టుకున్నాడు. కానీ అతని ప్రవర్తన సరిగా లేదు కాబట్టి నేను అలా పలువనని చెప్పడం జరిగింది.' అని ఆమె తెలిపింది.

(ఇదీ చదవండి: నయనతార సంచలన నిర్ణయం.. యూట్యూబర్‌కు గోల్డెన్‌ ఛాన్స్‌)

అందుకే ఈసారి తన మెడలో దండ వేసి అవమానించాలని కూల్ సురేశ్‌ ప్లాన్‌ వేసినట్లు తెలిపింది. ఇంకోసారి తన పట్ల ఇలా చేస్తే చెంప మీద కొట్టినా  కొట్టేస్తానని తెలిపింది. కనీసం అలాంటి పని చేయలేకున్నా అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఐశ్వర్య వ్యక్తం తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement