
సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా
క్రేజీ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు అమన్ ప్రీత్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘నిన్నే పెళ్లాడతా’. అమన్ సరసన సిద్దికా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వైకుంఠ్ బోను దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు తొలి పాటకు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రంలోని రెండో లిరికల్ వీడియో సాంగ్‌ను రకుల్ ప్రీత్ సింగ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది. ‘సఖుడా’ అంటూ సాగే ఈ పాటను నవనీత్ కంపోజ్ చేయగా చైతన్య ప్రసాద్ సాహిత్యం అందించాడు. చిన్మయి శ్రీపాద ఆలపించారు. (అంతరిక్షానికి వెళ్తున్నట్లుగా ఉంది: రకుల్)
‘సఖుడా చెలికాడా తెగువె కలవాడా సరదా వరదై రారా.. సఖుడా చెలికాడా సరసపు మొనగాడా మదిలో మదివై పోరా’ అంటూ సాగే ఈ ప్రేమ పాట యూత్‌ను ముఖ్యంగా లవర్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. నటి మంచు లక్ష్మి కూడా ఈ పాట తనను ఎంతగానో ఆకట్టుకుందని, లిరిక్స్ సూపర్బ్ అని ట్విటర్‌లో పేర్కొంటూ పాటకు సంబంధించిన లింక్‌ను షేర్ చేశారు. దీంతో ఈ పాట మరింత వైరల్ అయింది. ఇక ఈ చిత్ర టైటిల్ పోస్టర్‌ను కింగ్ నాగార్జున విడుదల చేయడంతో అందరి దృష్టి ‘నిన్నే పెళ్లాడతా’ పై పడింది. ఈశ్వరి, అంబిక ఆర్ట్స్ పతాకంపై బొల్లినేని రమ్య, వెలుగోడు శ్రీధర్‌బాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సాయికుమార్, అన్నపూర్ణ, సీత తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కలాదర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. (నాన్న అర్థమవడానికి ఏళ్లు పట్టింది)
What beautiful lyrics and how nice you look my darling @AmanPreetOffl https://t.co/S5IwuB1c9t.. Can't wait for the movie now
— Lakshmi Manchu (@LakshmiManchu) June 18, 2020