Rakul Preet Is Married Next Year Says Manchu Lakshmi - Sakshi
Sakshi News home page

అబ్బాయిని నా దగ్గరకు పంపితే రకుల్‌ సీక్రెట్స్‌ అన్నీ చెప్తా :లక్ష్మీ

Published Sat, May 8 2021 12:47 PM | Last Updated on Sat, May 8 2021 1:33 PM

Rakul Preet Singh Marriage May Be Next Year Says Manchu Lakshmi - Sakshi

ఇండస్ర్టీలో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, మంచు లక్ష్మీ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అన్న సంగతి తెలిసిందే. ఇద్దరూ కలిసి పార్టీలు చేసుకుంటూ తెగ ఎంజాయ్‌ చేస్తుంటారు. తాజాగా వీరిద్దరూ రానా హోస్ట్‌గా చేస్తున్న నెం.1యారీ షోకు వెళ్లారు. ఈ సందర్భంగా మంచు లక్ష్మీ లైఫ్‌లోకి రకుల్‌ ఎంటర్‌ అయ్యాక అన్ని పద్దతులు మరిపోయాయని రానా చెప్పాడు. ముఖ్యంగా ఫుడ్‌ విషయంలో చాలా స్ర్టిక్‌ అయిపోయిందని, ఏం తినాలన్నా, పదిసార్లు ఆలోచిస్తుంటుందని, ఎక్కడికి అయినా వెళ్లినా రకులే ఫుడ్‌ ఆర్డర్‌ చేస్తుందని వివరించాడు.

క రకుల్‌ పెళ్లి మేటర్‌ ప్రస్తావించగా..ఈ ఏడాదిలోనే రకుల్‌ పెళ్లి ఉంటుందని మంచు లక్ష్మీ తెలిపింది. కాదు కాదంటూ రకుల్‌ వారించినా పెళ్లి ప్రయత్నాలు అయినా జరుగుతాయని, లేదా బాయ్‌ఫ్రెండ్‌ వస్తాడేమో అని లక్ష్మీ పేర్కొంది. ఇక వచ్చే అబ్బాయి ఎవరో తన వద్దకు వస్తే రకుల్‌ గురించి అన్ని విషయాలు చెప్పి పంపిస్తానని ఫన్నీగా బదులిచ్చింది. ఇక గతంలో రానా- రకుల్‌ ప్రీత్‌సింగ్‌లు డేటింగ్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ వార్తలను ఖండించిన రకుల్‌..తామిద్దం మంచి ఫ్రెండ్స్‌ మాత్రమేనని క్లారిటీ ఇచ్చింది. ప్రస్తుతం రకుల్‌ తెలుగులో క్రిష్‌ దర్శకత్వంలో ఓ సినిమా (ఇందులో వైష్ణవ్‌తేజ్‌ హీరో), తమిళంలో శివ కార్తికేయన్‌ ‘ఆయలాన్‌’ చిత్రాలతో పాటు బాలీవుడ్‌లోనూ నాలుగు సినిమాలు చేస్తోంది. 

చదవండి : వేసవిలో హీరోయిన్‌ రకుల్‌ తాగే డ్రింక్‌ ఇదే..‌
'కరోనా వైరస్‌ను నాశనం చేస్తా..ఇది జస్ట్‌ చిన్న ఫ్లూనే'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement