రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే? | Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: పెళ్లి సందడి మొదలు.. బ్యాచిలర్ పార్టీతో చిల్!

Published Mon, Feb 5 2024 2:34 PM

Rakul Preet Singh Bachelor Party With Manchu Lakshmi And Pragya Jaiswal - Sakshi

తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ అయిపోతుంది. మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి కానీ తాజాగా జరిగిన బ్యాచిలర్ పార్టీతో ఇది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి రకుల్ ఫుల్ చిల్ అవుతోంది. ఈమెతో పాటు టాలీవుడ్‌ ముద్దుగుమ్మలు కూడా ముగ్గురు కనిపించారు. ఇంతకీ వీళ్లందరూ ఎక్కడ పార్టీ చేసుకున్నారు?

(ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్‌ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?)

ముంబయి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. కానీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే రామ్ చరణ్, అ‍ల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ అందుకుంది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది.

మరోవైపు ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నాళ్ల నుంచి రకుల్ డేటింగ్ చేస్తోంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ కూడా కనిపించారు. రకుల్‌కి వీళ్లు ముగ్గురు ఎప్పటి నుంచో స్నేహితులు. అలా ఇప్పుడు వీళ్లందరూ కలిసి పార్టీ చేసుకున్నారనమాట. 

(ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ)

Advertisement
 
Advertisement
 
Advertisement