Bachelor Party
-
హరియాణాలో విడాకుల సంబరం
చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు. ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం. ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు. View this post on Instagram A post shared by Manjeet Dhakad Dhakad (@m_s_dhakad_041) -
ఓటీటీలోకి కన్నడ హిట్ సినిమా.. అందులోనే స్ట్రీమింగ్
మరో క్రేజీ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైపోయింది. కన్నడ స్టార్ హీరో రక్షిత్ శెట్టి నిర్మించిన ఈ మూవీ.. ఆ భాషలో రిలీజై హిట్ టాక్ తెచ్చుకుంది. ఇప్పుడు ఇది ఓటీటీలోకి మూవీ లవర్స్‌ని నవ్వించబోతుంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన ఎలాంటి హడావుడి లేకుండా ఇచ్చేశారు. దీంతో ఓటీటీ ప్రేమికులు అలెర్ట్ అయిపోయారు. ఇంతకీ ఏంటా సినిమా? ఏ ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది? ఓటీటీల హవా పెరిగిన తర్వాత భాషతో సంబంధం లేకుండా సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. ఇప్పుడు వీళ్ల కోసమా అన్నట్లు కన్నడ హిట్ మూవీ 'బ్యాచిలర్ పార్టీ' ఓటీటీ విడుదలకు రెడీ అయిపోయింది. జనవరి 26న థియేటర్లకి వచ్చిన ఈ చిత్రం.. సోమవారం నుంచి అంటే మార్చి 4 నుంచి అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ కానుంది.అంటే ఈ రోజు అర్థరాత్రే. అలానే ఓటీటీలో రిలీజ్ విషయాన్ని కూడా కొన్ని గంటల ముందు మాత్రమే చెప్పారు. అంటే సడన్ స్ట్రీమింగ్ అన్నట్లే. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా టాలీవుడ్ లేడీ విలన్ నిశ్చితార్థం.. 14 ఏళ్ల ప్రేమకథ) మరోవైపు ట్రైలర్ చూస్తుంటే ఫుల్ ఆన్ కామెడీ ఎంటర్టైనర్గా ఉంది. భార్య-భర్త మధ్య ఉండే చిన్న సమస్యలతో కామెడీ పుట్టించినట్లు తెలుస్తోంది. అలానే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి బ్యాంకాక్‌లో చేసిన సందడి కూడా బాగానే ఉంది. అయితే ఓటీటీ స్ట్రీమింగ్ అనేది కేవలం కన్నడ వరకే ఉంటుందా? తెలుగు డబ్బింగ్ కూడా అందుబాటులోకి తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. 'బ్యాచిలర్ పార్టీ' కథ విషయానికొస్తే.. సంతోష్ (దిగంత్ మైకేల్) సాఫ్ట్వేర్ జాబ్ చేస్తుంటాడు. పెళ్లి కూడా అయ్యింటుంది. కానీ భార్య సంధ్య(సిరి రవికుమార్) వల్ల జీవితంలో సంతోషం అనేదే ఉండదు. పార్టీలు కూడా చేసుకోనివ్వకుండా ఆఫీస్ తర్వాత నేరుగా ఇంటికొచ్చేయాలనే టైప్. అలాంటి సంతోష్ అనుకోకుండా ఫ్రెండ్ బ్యాచిలర్ పార్టీలో తన పాత ఫ్రెండ్ మ్యాడీ (యోగా), పీటీ సర్ (అచ్యుత్ కుమార్)ని కలుస్తాడు. ఆ తర్వాత వీళ్లు ముగ్గురు కలిసి బ్యాంకాక్ వెళ్తారు. చివరకు ఏమైంది? ఈ జర్నీలో ఏం తెలుసుకున్నారు? అనేదే స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ థ్రిల్లర్ మూవీ.. తెలుగు స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
రకుల్ బ్యాచిలర్ పార్టీ.. ఆ ముగ్గురు హీరోయిన్లు ఎందుకున్నారంటే?
తెలుగులో పలు హిట్ సినిమాలు చేసిన హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పెళ్లికి రెడీ అయిపోతుంది. మొన్నటివరకు రూమర్స్ వచ్చాయి కానీ తాజాగా జరిగిన బ్యాచిలర్ పార్టీతో ఇది నిజమని తేలిపోయింది. ప్రస్తుతం కాబోయే భర్తతో కలిసి రకుల్ ఫుల్ చిల్ అవుతోంది. ఈమెతో పాటు టాలీవుడ్ ముద్దుగుమ్మలు కూడా ముగ్గురు కనిపించారు. ఇంతకీ వీళ్లందరూ ఎక్కడ పార్టీ చేసుకున్నారు? (ఇదీ చదవండి: దీనస్థితిలో 'షాపింగ్ మాల్' హీరో.. ఇప్పుడెలా ఉన్నాడో తెలుసా?) ముంబయి బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్.. హిందీలోనే కెరీర్ మొదలుపెట్టింది. కానీ 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' చిత్రంతో హిట్ కొట్టి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలానే రామ్ చరణ్, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల సరసన నటించి సక్సెస్ అందుకుంది. కానీ అలాఅలా ఈమెకు తెలుగులో ఛాన్సులు తగ్గిపోయాయి. దీంతో ముంబయికి షిఫ్ట్ అయిపోయింది. వరసగా హిందీ చిత్రాల్లో నటిస్తూ వస్తోంది. మరోవైపు ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో గత కొన్నాళ్ల నుంచి రకుల్ డేటింగ్ చేస్తోంది. ఈ విషయం దాదాపు అందరికీ తెలుసు. ఇప్పుడు వీళ్లిద్దరూ పెళ్లితో ఒక్కటి కాబోతున్నారు. ఫిబ్రవరి 22న గోవాలో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం థాయ్‌లాండ్‌లో బ్యాచిలర్ పార్టీ చేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ పార్టీలో మంచు లక్ష్మితో పాటు హీరోయిన్లు ప్రగ్యా జైస్వాల్, సీరత్ కపూర్ కూడా కనిపించారు. రకుల్‌కి వీళ్లు ముగ్గురు ఎప్పటి నుంచో స్నేహితులు. అలా ఇప్పుడు వీళ్లందరూ కలిసి పార్టీ చేసుకున్నారనమాట. (ఇదీ చదవండి: 'హనుమాన్' కోసం 70-75 సినిమాలు రిజెక్ట్ చేశా: హీరో తేజ) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
మెగా ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడలు గ్రాండ్ పార్టీ!
మెగా ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే మెగాస్టార్‌తో పాటు అల్లు అరవింద్ ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ జరిగాయి. ఈ జంట త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్య త్రిపాఠి తాజాగా బ్యాచులరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. (ఇది చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేదిక ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్ వెడ్డింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచులరేట్ పార్టీ జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె స్నేహితులు నీరజ, నితిన్ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. అయితే కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్ 1న వరుణ్ - లావణ్య వివాహం జరగనుందని సమాచారం. కాగా.. ఇప్పటికే రామ్‌చరణ్ - ఉపాసన దంపతులు తమ ముద్దుర కూతురు క్లీంకారతో కలిసి టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఇప్పటికే ఇటలీకి పయనమైనట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే! ) -
వరుణ్ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్!
మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో సింగిల్ జీవితానికి ముగింపు పలకబోతున్నాడు. అదేనండి హీరోయిన్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్నాడని చెబుతున్నాం. ఆగస్టులో మ్యారేజ్ ఉంటుందన్నారు కానీ ఎందుకో ఆ సమయంలో జరగలేదు. ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ చేశారు. అదే టైంలో వరుణ్ తేజ్.. బ్యాచిలర్ పార్టీ కూడా చేసేసుకున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!) దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. పెద్దల్ని ఒప్పించి ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక జరిగిన తర్వాతే వీళ్ల ప్రేమ విషయం బయటకొచ్చింది. అలానే తాము మొదటగా కలిసిన చోట అంటే ఇటలీలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కొన్నిరోజుల ముందే షాపింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు కాబోయే పెళ్లికొడుకు, ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు. వరుణ్ తేజ్‌తో పాటు 40 మంది ఫ్రెండ్స్ ఈ బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు. స్పెయిన్‌లో జరిగిన ఈ పార్టీకి మెగాహీరోల్లో సాయిధరమ్ తేజ్, అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబరు తొలివారంలో వరుణ్-లావణ్య పెళ్లి కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు వెళ్తారు. హైదరాబాద్‌కి తిరిగొచ్చిన తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు రిసెప్షన్ ఉంటుందట. (ఇదీ చదవండి: 'మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్) -
వైరల్: ఉద్యోగికి బ్యాచిలర్ పార్టీ ఇచ్చిన బన్నీ
జీవితంలో ఒక్కసారైనా తాము ఇష్టపడే సినీ తారలతో కలిసి ఓ ఫొటో దిగాలని అభిమానులు ఆశపడుతుంటారు. వారిని నేరుగా చూడాలని తాపత్రయపడుతుంటారు. కానీ వారందరికీ ఆ అవకాశం రాకపోవచ్చు. కానీ అల్లు అర్జున్ వద్ద పనిచేసే ఓ వ్యక్తి బంపర్ ఆఫర్ కొట్టేశాడు. అదేంటంటే.. ఇటీవల బన్నీ వద్ద పనిచేసే అభినవ్ నథ అనే వ్యక్తికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఈ క్రమంలో బన్నీ అతనికి బ్యాచిలర్ పార్టీ ఏర్పాటు చేసి సర్ప్రైజ్ చేశాడు. అనంతరం తన ఉద్యోగులందరితో కలిసి ఫోటో కూడా దిగాడు. దీంతో ఆ ఉద్యోగి ఆనందంలో మునిగి తేలుతున్నాడు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. కాగా తన స్టాఫ్‌ను కుటుంబ సభ్యుల్లో ఒకరిగా ట్రీట్ చేస్తానని, తన పెళ్లికి కూడా వెళతానని బన్నీ తెలిపాడు. చదవండి: ‘కలర్ ఫోటో’పై ప్రశంసలు కురిపించిన అల్లు అర్జున్ ఈ విషయం తెలుసుకున్నబన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తన కింద పని చేసే వారిని కూడా అల్లు అర్జున్ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటారని, అందరితోనూ కలివిడిగా ఉంటారని పొగిడేస్తున్నారు. అదే విధంగా ఇటవల కలర్ ఫోటో చిత్రంపై అల్లు అర్జున్ ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. సినిమా అద్భుతంగా ఉందంటూ దర్శకుడు సందీప్‌ను, చిత్రయూనిట్‌ను అభినందించాడు. ఇక ప్రస్తుతం బన్నీ సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమా చేస్తన్నాడు. ఎర్ర చెందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన హీరోయిన్గా నటిస్తున్నారు. కొంత వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌లో తిరిగి ప్రారంభం కానుంది. చదవండి: పుష్ప షూటింగ్; వైజాగ్‌కు బన్నీ, రష్మిక -
హల్చల్ చేస్తోన్న సానియా ఫోటోలు
భారత టెన్నిస్ ప్లేయర్ సానియా మీర్జా పారిస్ వీధుల్లో విహరిస్తున్నారు. తన చెల్లి ఆనమ్ మీర్జా త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఆనమ్ మీర్జా బ్యాచిలర్ పార్టీని పారిస్‌లో ఏర్పాటు చేశారు. ఈ పార్టీకి అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు మాత్రమే హాజరయ్యారు. అయితే ఈ బ్యాచిలర్ పార్టీలో సానియా మీర్జా హైలెట్‌గా నిలిచారు. పారిస్ వీధుల్లో దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో సానియా పోస్ట్ చేశారు. ప్రస్తుతం సానియా ఫోటోలు నెట్టింట్లో తెగ హల్చల్ చేస్తున్నాయి. అంతేకాకుండా ఆ ఫోటోలపై నెటిజన్లు సరదా కామెంట్స్ చేస్తున్నారు. ‘ఓ బిడ్డకు తల్లి అయినా మోడల్‌కు ఏ మాత్రం తీసిపోకుండా ఉన్నావ్’, ‘సానియా ఆటకు, యాటిట్యూడ్‌కు పెద్ద ఫ్యాన్’, అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇక గతకొద్ది రోజుల క్రితమే తాను పెళ్లి చేసుకోబోతున్నట్లు ఆనమ్ మీర్జా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టీమిండియా మాజీ సారథి అజారుద్దీన్ కొడుకు అసదుద్దీన్‌ను ఆనమ్ వివాహం చేసుకోబోతోందని అనేక వార్తలు వచ్చాయి. ఈ మధ్యకాలంలో వీరిద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. దీంతో ఆనమ్‌కు కాబోయే భర్త అసదుద్దీనే అంటూ నెటిజన్లు పేర్కొంటున్నారు. అయితే వీరిద్దరూ ఈ వార్తలపై ఇప్పటివరకూ స్పందించలేదు. అయితే ఆనమ్‌కు 2015లో హైదరాబాద్‌కే చెందిన ఓ బిజినెస్‌మన్‌తో వివాహమైంది. అయితే వీర్దిదరి మధ్య మనస్పర్థలు రావడంతో దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. -
బ్యాచిలర్స్ హంగామా
భూపాల్, అరుణ్ హీరోలుగా డి. రామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కనున్న చిత్రం ‘బ్యాచిలర్ పార్టీ’. బి.సుధాకర్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో జరిగింది. నటుడు శ్రీకాంత్ క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను సుధాకర్‌రెడ్డికి అందజేశారు. దర్శకుడు రామకృష్ణ మాట్లాడుతూ– ‘‘యువతకు మంచి వినోదాన్ని అందించే యాక్షన్ ఎంటర్టైనర్ మా బ్యాచిలర్ పార్టీ. సస్పెన్స్ ఎలిమెంట్స్‌తో పాటు కమర్షియల్ హంగులు ఉన్నాయి. నటనకు ఆస్కారం ఉన్న చిత్రం ఇది. సంగీతానికి కూడా చాలా ప్రాధాన్యత ఉంటుంది’’అన్నారు. ‘‘కథ వినగానే ఎంతో నచ్చింది. యూత్ మెచ్చే చిత్రం ఇది. వచ్చేవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తున్నాం’’ అన్నారు సుధాకర్‌రెడ్డి. నటులు శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్ తదితరులు పాల్గొన్నారు. రమణారెడ్డి, బెనర్జీ, కార్తిక్, రియా, గిరి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి అద్దంకి రాము కెమెరామేన్‌గా వ్యవహరించనున్నారు. -
బ్యాచిలరెట్ పార్టీ
ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉన్నారు. రీసెంట్గా న్యూయార్క్‌లో ‘బ్రైడల్ షవర్’ వేడుక జరుపుకున్న ఆమె తాజాగా తన గాళ్స్ గ్యాంగ్‌తో కలసి ‘బ్యాచిలరెట్ పార్టీ’కి సిద్ధమయ్యారు. పెళ్లి ఫిక్సయ్యాక అబ్బాయిలు బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటారు కదా. అమ్మాయిలు చేసుకునే పార్టీని ‘బ్యాచిలరెట్ పార్టీ’ అంటారు. ఈ పార్టీలో ప్రియాంక కజిన్ సిస్టర్ పరిణితీ చోప్రా కూడా జాయిన్ అయ్యారు. నెదర్‌ల్యాండ్స్‌లోని అమస్టర్‌డ్యామ్‌లో ‘బ్యాచిలరేట్ పార్టీ’ జరుపుకున్నారు. నిక్ జానస్తో ప్రియాంకా చోప్రా వివాహం డిసెంబర్ 1న జోద్‌పూర్‌లో జరగనుంది. అక్కడి మెహరంగ్ ఫోర్ట్‌లో ఈ నెల 29న సంగీత్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని సమాచారం. పార్టీలు, పెళ్లి పనులు చేసుకుంటున్నారు కానీ ‘ప్రియానిక్’ వేడుకల తేదీలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. -
‘ఆడపడుచు కోసం తప్పదు’
త్వరలోనే పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక చోప్రా ప్రస్తుతం బ్యాచిలర్ పార్టీలతో బీజిగా ఉన్నారు. ఈ ఏడాది డిసెంబర్లో ప్రియాంక - నిక్ జోనాస్‌లు వివాహ బంధంతో ఒక్కటి కానున్నారని సమాచారం. వీరి వివాహం ఉదయ్‌పూర్‌లో జరుగనుందని బీ-టౌన్లో వార్తలు విన్పిస్తున్నాయి. ప్రస్తుతం ఆమ్స్టర్డ్యామ్లో స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోన్న ప్రియాంక ఇందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులకు ఆనందాన్ని కల్గిస్తున్నారు. ఈ క్రమంలో ప్రియాంక పోస్ట్ చేసిన వీడియో ఒకటి ప్రస్తుతం ఇంటర్నెట్లో తెగ వైరల్ అవుతోంది. ప్రియాంక తనకు కాబోయే ఆడపడుచు సోఫియా టర్నర్‌ను(నిక్ జోనాస్ సోదరి) భుజాలపై మోస్తు ఉన్న వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఈ వీడియోలో ప్రియాంక ‘ఈ రోజుల్లో మరదలి(ఆడపడుచు) కోసం ఎన్నో చేయాల్సి వస్తోంది’ అంటూ కామెంట్ చేశారు. ఈ వీడియోకు ‘జే సోదరి’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. View this post on Instagram @sophiet On @priyankachopra's back "this is what u have to do for sister in laws these days" No wonder @nickjonas Fell for my generous queen. . . #priyankachopra #nickjonas #nickyanka @priyankachopra #priyankanickengagement #love #bollywood #hollywood @nickjonas #quantico @sophiet #baywatch #newyork #nyc #la #losaangeles #makeup #hair #eyes #nyfw #nyfw2018 #sophieturner A post shared by Imperfect Perfections (@priyankachopra_globe) on Nov 4, 2018 at 7:47am PST -
బ్యాచిలర్ పార్టీలో స్పెషల్ ఎట్రాక్షన్!
బ్యాచిలర్స్ పార్టీల్లో ఎవరెవరు కనిపిస్తుంటారు? పెళ్లి చేసుకోబోయే అబ్బాయి లేదా అమ్మాయి స్నేహితులు. బహుశా... శనివారం రాత్రి అయ్యుండొచ్చు! అక్కినేని నాగచైతన్య, సమంతలు తమ ఫ్రెండ్స్‌కి బ్యాచిలర్ పార్టీ ఇచ్చారట! రామ్‌చరణ్, చైతూ తమ్ముడు అఖిల్ నుంచి మొదలుకొని చైతూ–సమంత స్నేహితులు ఎందరో పార్టీకి వచ్చారు. వాళ్లలో ఒకతనున్నాడు... మీసం లేదు, గడ్డం లేదు, మాంచి హ్యాండ్సమ్ పర్సనాలిటీ! అతన్ని ఎవరైనా కాస్త దూరం నుంచి చూస్తే 30 ప్లస్ వ్యక్తి అనుకోవడం గ్యారెంటీ. దగ్గరకు వెళితే... అతనెవరో కాదు, ‘కింగ్’ నాగార్జున అని తెలిసి, కొంతమంది ఆశ్చర్యపోయారట. యస్... చైతూ–సమంత బ్యాచిలర్ పార్టీలో ఎవర్గ్రీన్ మన్మథుడు నాగార్జున స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారట! కుమారులతో నాగార్జున ఎప్పుడూ ఓ తండ్రిలా కాకుండా, ఫ్రెండ్‌లా ఉంటుంటారనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందువల్లే, చైతూ తండ్రిని స్పెషల్‌గా పిలిచుంటారు. అఖిల్ కూడా ‘ఎ నైట్ ఎమాంగ్ స్టార్స్... మై త్రీ ఓల్డర్ బ్రదర్స్’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫొటో పోస్ట్ చేశారు. అందులో చరణ్, చైతూ, అఖిల్ కాస్త గడ్డాలతో కనిపిస్తుంటే... క్లీన్ షేవ్ లుక్‌తో నాగ్ హ్యాండ్సమ్గా ఉన్నారు. ఈ పార్టీతో చైతూ–సమంతల పెళ్లి సందడి మొదలైంది. వచ్చే నెల 6న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పెళ్లి షాపింగ్‌లో బిజీగా ఉన్నారట!! -
షవర్...బ్యాచిలర్ పార్టీ లాగే
గంటకోసారి ఫోన్ కబుర్లు, నిమిషానికోసారి టెక్స్ట్ మెసేజ్‌లు, రోజుకోసారి ఎఫ్బీ అప్డేట్లూ... ఇలా అనుక్షణం మనతోనే మన కోసమే అన్నట్టున్న మన క్లోజ్ ఫ్రెండ్ మరికొన్ని క్షణాల్లో మరొకరి జీవిత భాగస్వామి. మన కోసం వెచ్చించిన టైమ్ ఇక తన లైఫ్ పార్ట్నర్ కోసం ఖర్చు చేయాలి. మనకు చెప్పిన స్వీట్‌నథింగ్స్ తన మనిషితో పంచుకోవాలి. ఇంత దూరాన్ని భరించాలంటే దానికి ముందు ఎంత దగ్గరితనం అనుభవించాలి? అందుకే మగవాళ్ల కోసం పుట్టుకొచ్చాయి బ్యాచిలర్ పార్టీలు. అదే కోవలో అమ్మాయిలు అమ్మాయిల కోసం పుట్టించిన పార్టీలే ‘బ్రైడల్ షవర్’లు. పెళ్లికూతురు కాబోతున్న అమ్మాయికి శుభాకాంక్షలు చెప్పేందుకు, బహుమతులు అందించేందుకు పెళ్లి రోజు దాకా ఆగాలా? ఆమెకు ప్రాణంలా మెలిగిన వారు కూడా పెళ్లిరోజునో, రిసెప్షన్ రోజునో వెళ్లి, గుంపులో గోవిందా అన్నట్టు ఓ గిఫ్ట్ప్యాకెట్ చేతిలో పెట్టేసి తిరిగి వచ్చేయాలా? ఠాట్... కుదరదంటే కుదరదనుకుంటున్నారు నవతరం. అందుకే బ్రైడల్ షవర్ పార్టీలకు హుషారుగా పచ్చజెండా ఊపేస్తున్నారు. చారిత్రక మూలాలూ... పెళ్లి పీటలు ఎక్కకుండానే ఏర్పాటు చేసే వేదికే బ్రైడల్ షవర్. చాలా కాలం కిందటే అంటే దాదాపు 1890 ప్రాంతం నుంచే నెదర్లాండ్స్, బెల్జియంలలో దీని ఆనవాళ్లు ఉన్నాయని చెప్తున్నారు. ఇది కూడా కట్నకానుకల వంటి ఆచారాల సమస్యలను ఎదుర్కోవడానికి వచ్చిందట. పెళ్లి కూతురికి కావల్సినవి అందించలేక తండ్రి చేతులెత్తేసినప్పుడు, లేదా తనకు ఇష్టం లేని వివాహం చేసుకుంటున్న కూతురిని తల్లిదండ్రులు పట్టించుకోనప్పుడు... స్నేహితులే చొరవ తీసుకుని ఈ తరహా కార్యక్రమాలు నిర్వహించేవారట. పెళ్లి చేసుకుంటున్నవారికి కావల్సిన వస్తువుల్ని, వారి సంసారానికి అవసరమైనవి సేకరించడానికి దీన్ని ఒక మార్గంగా ఆచారంలోకి తెచ్చారట. అదే కోవలో ఇంగ్లండ్‌లో బ్రైడ్ ఏలె పేరుతో కూడా ఓ వినూత్న కార్యక్రమం నిర్వహించేవారు. పెళ్లికూతురు, ఆమె స్నేహితులు కలిసి బీరు తయారు చేసి దాన్ని విక్రయించేవారట. తద్వారా వచ్చిన డబ్బులతో పెళ్లి ఖర్చులు పెట్టుకునేవారట. ఇది పెళ్లికి ఒక్కరోజు ముందు నిర్వహించేవారట. ఏదైతేనేం... మరింత ఆధునికతను సంతరించుకున్న ఈ సరదా సందడి... ఇటీవలి కాలంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చి... సహజంగానే అక్కడ నుంచి మన దేశానికి అలా మన కాస్మొపాలిటన్ సిటీకి కూడా వచ్చేసింది. వెళ్లిరావమ్మా... పెళ్లికూతురా... నగరంలో బ్రైడల్ షవర్లు ప్రారంభమై ఏడాది కావస్తోంది. ఇప్పుడిప్పుడే ఇవి ఊపందుకుంటున్నాయి. ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంటుందని తెలియగానే... ఆమె స్నేహితులంతా కలిసి చర్చించుకుని ఆ అమ్మాయి కోసం ఒక సర్ప్రైజ్ పార్టీని నిర్వహిస్తున్నారు. ఆ పార్టీలో ఆడి పాడడం, జ్ఞాపకాలు పంచుకోవడం, బహుమతులు అందించడం వంటివన్నీ సందడిగా సాగిపోతున్నాయి. వేడుక ముగిసే సమయానికి అందరూ కలిసి ఆమెను సాదరంగా సాగనంపడం కూడా. ఈ సందర్భంలో కొన్ని జతల కళ్లు చెమర్చడం వంటి సన్నివేశాలూ ఇక్కడ చోటు చేసుకుంటున్నాయి. నగరంలోని పలు రెస్టారెంట్స్, కాఫీషాప్స్, పబ్స్, క్లబ్స్... వంటివి ఈ తరహా బ్రైడల్ షవర్లకు ప్రస్తుతం వేదికలుగా మారాయి. పలువురు ఈవెంట్ మేనేజర్లు వీటిని నిర్వహించేందుకు ఉత్సుకత చూపుతున్నారు. ప్రస్తుతం ఈ తరహా పార్టీలకు మగవాళ్లను అనుమతించడం కనపడనప్పటికీ భవిష్యత్తులో ఈ నిబంధన మాయమవ్వొచ్చునని భావిస్తున్నారు. ఇటీవలే నగరానికి చెందిన మోడల్ సిపిక ఖండేల్వాల్ స్నేహితులు గత ఏడాదే ఆమె కోసం బ్రైడల్ షవర్ నిర్వహించారు. గ్లామర్ రంగ యువత ద్వారా ఇలాంటి కార్యక్రమాలకు వస్తున్న ప్రచారం మరింతమందికి స్ఫూర్తినిస్తోంది. సో.. బ్యాచిలర్ పార్టీల్లానే నగరం నలుమూలలా బ్రైడల్ షవర్లు కూడా పార్టీ ప్రియుల్ని తడిపి ముద్దచేయడం ఖాయం. ఎస్.సత్యబాబు