
పరిణీతి, ప్రియాంక
ప్రియాంకా చోప్రా ప్రస్తుతం పెళ్లి మూడ్‌లో ఉన్నారు. రీసెంట్‌గా న్యూయార్క్‌లో ‘బ్రైడల్ షవర్’ వేడుక జరుపుకున్న ఆమె తాజాగా తన గాళ్స్ గ్యాంగ్‌తో కలసి ‘బ్యాచిలరెట్ పార్టీ’కి సిద్ధమయ్యారు. పెళ్లి ఫిక్సయ్యాక అబ్బాయిలు బ్యాచిలర్స్ పార్టీ చేసుకుంటారు కదా. అమ్మాయిలు చేసుకునే పార్టీని ‘బ్యాచిలరెట్ పార్టీ’ అంటారు. ఈ పార్టీలో ప్రియాంక కజిన్ సిస్టర్ పరిణితీ చోప్రా కూడా జాయిన్ అయ్యారు. నెదర్‌ల్యాండ్స్‌లోని అమస్టర్‌డ్యామ్‌లో ‘బ్యాచిలరేట్ పార్టీ’ జరుపుకున్నారు. నిక్ జానస్‌తో ప్రియాంకా చోప్రా వివాహం డిసెంబర్ 1న జోద్‌పూర్‌లో జరగనుంది. అక్కడి మెహరంగ్ ఫోర్ట్‌లో ఈ నెల 29న సంగీత్ ఫంక్షన్ ఏర్పాటు చేశారని సమాచారం. పార్టీలు, పెళ్లి పనులు చేసుకుంటున్నారు కానీ ‘ప్రియానిక్’ వేడుకల తేదీలు మాత్రం అధికారికంగా ప్రకటించలేదు.
Comments
Please login to add a commentAdd a comment