నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా
ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్ ఎప్పడు ఒక్కటవుతారు అని ఎదురు చూస్తున్న తేదీ రానే వచ్చేసింది. గురువారం మొదలయిన మెహందీ ఫంక్షన్ ద్వారా ప్రియానిక్ పెళ్లి సంబరాలు మొదలయ్యాయి. రాజస్థాన్‌లోని ఉమైద్ ప్యాలెస్‌లో నిన్నటి నుంచి డిసెంబర్ 3వరకూ పెళ్లి సంబరాలు జరుగుతాయన్న సంగతి తెలిసిందే. దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ వివాహ వేడుకలాగే పెళ్లికి సంబంధించిన ఫొటోలు బయటకు రాకూడదని సెక్యూరిటీ కూడా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారట ప్రియానిక్ కుటుంబ సభ్యులు. అందులో భాగంగా ఈ ప్యాలెస్‌ను 29నుంచి 3 వరకూ సందర్శకులు వీక్షించడానికి వీలు లేకుండా క్లోజ్ చేశారు. అలాగే ఆ హోటల్‌లోని స్టాఫ్‌కు కూడా సెలవులు ఇచ్చేశారట. వీళ్లకు డబుల్ హ్యాపీ అన్నమాట. మరి.. హోటల్‌లో స్టాఫ్ లేకపోతే ఎలా అంటే.. ఇప్పుడు ఆ ప్యాలెస్‌ను ప్రియానిక్ మ్యారేజ్ ఈవెంట్ ఆర్గనైజర్స్ టీమే చూసుకుంటుందట.
కేవలం క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమే హాజరు కానున్న మెహందీ ఫంక్షన్‌లో ప్రియాంకా పెట్టుకోబోయే హెన్నాను ప్రత్యేకంగా రాజస్థాన్‌లోని సోజట్ సిటీ నుంచి తెప్పిస్తున్నారట. ఇండియా మొత్తానికి హెన్నా ఎక్కువశాతం లభించేది ఈ సిటీ నుంచే. ఇక సంగీత్‌లో ప్రియాంక సినిమాల్లోని సాంగ్స్‌కి నిక్ కాలు కదపనున్నా రట. ఈ వేడుకల్లో విందు భోజనాలు కూడా ఆహా అనిపించేలాంటి ఐటమ్స్‌తో విస్తరి నింపేస్తారట. పంజాబీ, రాజస్థానీ, హైదరాబాదీ వంటకాలతో పాటు ఇటాలియన్, మెక్సికన్, చైనీస్ ఫుడ్ కూడా మెనూలో ఉంది. జోథ్‌పూర్ ఫేమస్ సిల్వర్ కోటెడ్‌తో తయారు చేసిన పాత్రలను వడ్డించడానికి ఉపయోగించనున్నారట. అన్నట్లు నిన్న మొన్నటి వరకూ ప్రియాంక, నిక్‌లకు అభిమానులు పెట్టిన పేరు ‘ప్రియానిక్’. ఇప్పుడు ముద్దుగా ‘పిక్‌నిక్’ అంటున్నారు. ఈ పిక్‌నిక్ పెళ్లి ఫొటోలు వెంటనే చూద్దామనుకుంటే.. ‘నో పిక్’ అంటున్నారు. పిక్‌నిక్ అధికారికంగా విడుదల చేసేవరకూ ఒక్క ఫొటో కూడా బయటకు రాదు.
Comments
Please login to add a commentAdd a comment