నిక్ జోనస్, ప్రియాంక చోప్రా
‘‘ఈ వివాహం మీ ఇద్దరికీ సమ్మతమేనా? అవును, సమ్మతమే’’ అని ప్రేమాంగీకారాలతో శనివారం సాయంత్రం నిక్ జోనస్, ప్రియాంక చోప్రా భార్యాభర్తలు అయ్యారు. క్రిస్టియన్ సంప్రదాయంలో ఈ ఇద్దరూ ఒక్కటయ్యారు. నిక్ ఫ్యామిలీ, ప్రియాంక కుటుంబ సభ్యులు మరియు మరికొంత మంది కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం జరిగింది. హాలీవుడ్ డిజైనర్ రాల్ఫ్ లారెన్ ప్రియానిక్‌లకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఇవాళ హిందూ సంప్రదాయంలో ఈ ఇద్దరూ మరోసారి పెళ్లి చేసుకోనున్నారు. అలాగే క్రిస్టియన్ పెళ్లికి ముందు జరిగిన కార్యక్రమాల్లో పలు విశేషాలు...
‘‘మా రిలేషన్‌షిప్‌లో స్పెషల్ థింగ్ ఏంటంటే మా ప్రేమను, మా ఇష్టాలను, సంస్కృతులను అర్థం చేసుకున్న కుటుంబాలను ఒక్కటి చేయడమే. అందర్నీ కలుపుతూ పెళ్లి చేసుకోవడం ఇంకా అద్భుతంగా ఉంది. భారతీయ స్త్రీ వివాహంలో ముఖ్యమైంది మెహందీ పార్టీ. మరొక్కసారి మేం మాటిచ్చుకున్నాం. మేం కలగన్న పెళ్లి సంబరాలను ఓ మధ్యాహ్నం మొదలెట్టాం’’ అని పేర్కొంటూ ఈ ఫొటోలను షేర్ చేశారు ప్రియాంక.
► గురువారం జరిగిన మెహందీ ఫంక్షన్‌లో సుమారు ఐదున్నర కిలోల మెహందీని ఉపయోగించారట. ఈ మెహందీ రాజస్తాన్‌లోని సంజోత్ అనే సిటీ నుంచి రితేష్ అగర్వాల్ అనే వర్తకుడు వద్ద కొనుగోలు చేశారు. ఐశ్వర్యారాయ్ పెళ్లి మెహందీ కూడా ఇక్కడి నుంచే వచ్చిందని సమాచారం.
► ఈ పెళ్లి వేడుకలకు హాజరయిన అతిథులందరికీ వెల్కమ్ గిఫ్ట్ అందించారట ప్రియానిక్. ‘ఎన్‌పీ’ అనే కార్డ్‌తో సిల్వర్ క్లాత్‌తో ప్యాక్ చేసి ఉన్న ఈ వెల్కమ్ గిఫ్ట్‌లో ఏయే వస్తువులు ఉంటాయో తెలియాలి.
► మొన్న రాత్రి జరిగిన సంగీత్‌లో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు తరఫు వాళ్లందరూ ‘లడ్కేవాలీ’ లడ్కీవాలీ’గా విడిపోయి పాటలు పాడి, డ్యాన్స్‌లు చేశారట. అలాగే ప్రియాంక, నిక్ ఎలా కలుసుకున్నారో అని సరదాగా చేసి చూపించారు అని సమాచారం. నిక్ సోదరులు కెవిన్, జోయి జోనస్ పాటలతో రాక్ చేశారని టాక్. ఇండియన్, అమెరికన్ పాటలు పాడారట.
Comments
Please login to add a commentAdd a comment