
నిక్ జోనస్, ప్రియాంక చోప్రా
సకుటుంబ సపరివారం సంగీతంగా ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్), కుటుంబ సభ్యులు సంబరాల్లో మునిగితేలారు. శనివారం క్రిస్టియన్, ఆదివారం హిందూ సంప్రదాయాల్లో ఒక్కటయ్యారు ప్రియానిక్. ఇరు కుటుంబ సభ్యులు సంగీత్ కార్యక్రమాన్ని సరదాగా జరుపుకున్నారు. సంగీత్ కార్యక్రమం వీడియోను, ఫొటోలను ప్రియాంక షేర్ చేస్తూ ‘‘డ్యాన్స్ కాంపిటీషన్‌లా మొదలైన సంగీత్ కార్యకమం చివరికి ప్రేమ పూర్వక సంబరాల్లా ముగిశాయి. మా ఇద్దరి స్టోరీలను పాటల రూపంలో, డ్యాన్స్ రూపంలో భలే సరదాగా చూపించారు. వాళ్ల శ్రమకు, ఆప్యాయతకు రుణపడి ఉంటాం. ఇరు కుటుంబాల కలయికను అద్భుతంగా ఆరంభించడం ఆనందంగా ఉంది’’ అని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment