
నిక్ జోనస్, ప్రియాంకా చోప్రా
పెళ్లికి పట్టుమని వారం రోజులు కూడా లేదు. అందుకే పెళ్లి పనులతో ఫుల్ బిజీగా ఉన్నారు ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా, నిక్ జోనస్) కుటుంబ సభ్యులు. ఈ గ్రాండ్ వెడ్డింగ్‌కు సంబంధించి రోజుకో విశేషం బయటకు వస్తోంది. తాజాగా సెలబ్రిటీ స్టైలిస్ట్ మిమీ కట్రెల్ పెళ్లి వేడుకకు ప్రియాంకా చోప్రాను ముస్తాబు చేయనున్నారట. జిగి మడిడ్, బెల్లా హడిడ్, కైయా గెర్బర్ వంటి మోడల్స్‌కు స్టైలిస్ట్‌గా వ్యవహరించారు మిమీ కట్రెల్.
28న సంగీత్ కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యే ప్రియానిక్ వివాహ వేడుకలు కాక్‌టేల్ పార్టీ, మెహందీ ఫంక్షన్‌లతో పాటు ఇరు కుటుంబ సభ్యుల సంప్రదాయాల వివాహం ఉంటుంది. ఆ తర్వాత ఢిల్లీ, ముంబై నగరాల్లో పెళ్లి రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారని సమాచారం. వాటి తేదీలు ఇంకా నిశ్చయించలేదు. ఇటీవలే ఢిల్లీలో ఈ జంట థ్యాంక్స్ గివ్వింగ్‌ను కుటుంబ సభ్యులతో కలసి చేసుకున్నారు. ఆదివారం వరకూ కూడా ప్రియాంకా చోప్రా తన కొత్త సినిమా ‘ది స్కై ఈజ్ పింక్’ అనే షూటింగ్‌లో బిజీగా ఉండనున్నారు. ఆ తర్వాత పెళ్లి కూతురిలా మారిపోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment