ప్రియాంకా చోప్, నిక్ జోనస్
దీప్‌వీర్ (దీపికా పదుకొన్– రణ్‌వీర్‌సింగ్) వివాహం జరిగిపోయింది. దీంతో ఇప్పుడు అందరూ ప్రియానిక్ (ప్రియాంకా చోప్రా–నిక్ జోనస్) షాదీ సంబరాల కోసం ఎదురు చూస్తున్నారు. పెళ్లి పనులు జోరుగా జరుగుతున్నాయని సమాచారం. రాజస్తాన్‌లోని జో«థ్‌పూర్‌లో ఉన్న మెహ్రాన్ పోర్ట్, ఉమ్మేద్ భవన్‌లో ప్రియానిక్ పెళ్లి సందడి మొదలైంది. అక్కడ పెళ్లి పనులు ఎలా జరుగుతున్నాయి? ఎక్కడిదాకా వచ్చాయి? అని తెలుసుకోవడానికి ప్రియాంకా చోప్రా తల్లి మధు చోప్రా జోథ్‌పూర్ వెళ్లారని బాలీవుడ్ సమాచారం. ఇటీవలే ప్రియానిక్ కూడా జోథ్‌పూర్ వెళ్లొచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది.
మరి...పెళ్లి కూతురు తరపువారు ఇంత హడావిడి చేస్తుంటే పెళ్లి కొడుకు సైడ్ మాత్రం ఎందుకు సైలెంట్‌గా ఉంటారు. అందుకే నిక్ తల్లిదండ్రులు డెనిస్, పాల్ కెవిన్ జోనస్‌లు కూడా జోథ్‌పూర్‌లో ల్యాండ్ అయ్యారని బీటౌన్ టాక్. మరోవైపు ‘ది స్కై ఈజ్ పింక్’ సినిమా కోసం ఢిల్లీలో ఉన్న ప్రియాంకా చోప్రా కూడా బ్రేక్ తీసుకుని జో«థ్‌పూర్‌లో వాలిపోవడానికి రెడీ అవుతున్నారట. సంగీత్, మోహందీ ఫంక్షన్స్‌తో స్టార్ట్ అయ్యే ప్రియానిక్ వివాహ వేడుకలు మొత్తం మూడు రోజులు (నవంబర్ 30 నుంచి డిసెంబర్ 2) జరుగుతాయి. ఈ వేడుకకు భారీ స్థాయిలో బాలీవుడ్ సినీ సెలబ్రిటీలు హాజరు కానున్నారు. హిందూ సంప్రదాయం, క్రిస్టియన్ ట్రెడిషన్ ప్రకారం ప్రియానిక్ రెండు పెళ్లిళ్లు చేసుకుంటారట.
Comments
Please login to add a commentAdd a comment