మరి నాకు ఎప్పుడు దొరుకుతాడో?! | Parineeti Chopra My Turn Comment On Priyanka Karwa Chauth Pic Hints Wedding | Sakshi
Sakshi News home page

‘నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో’

Published Fri, Oct 18 2019 1:55 PM | Last Updated on Fri, Oct 18 2019 2:04 PM

Parineeti Chopra My Turn Comment On Priyanka Karwa Chauth Pic Hints Wedding - Sakshi

మంచి భర్త దొరకాలంటే తన అక్కలాగే కఠిన ఉపవాసాలు చేయాలని బాలీవుడ్‌ హీరోయిన్‌ పరిణీతి చోప్రా అన్నారు. గురువారం కార్వా చౌత్‌(ఉత్త రాదిన పాటించే ఆచారం ఇది. కర్వా చౌత్‌ నాడు భర్త ఆయురారోగ్యాల కోసం రోజంతా ఉపవాసం ఉండి, చంద్రుడిని చూశాక భోజనం చేస్తారు) సందర్భంగా పలువురు బాలీవుడ్‌ తారామణులు తమ భర్తల కోసం ఉపవాస దీక్ష చేశారు. వారిలో గ్లోబల్‌ స్టార్‌ ప్రియాంక చోప్రా కూడా ఉన్నారు. తన భర్త నిక్‌ జోనస్‌తో కలిసి జోనస్‌ బ్రదర్స్‌ మ్యూజిక్‌ కన్సర్ట్‌కు హాజరైన పిగ్గీ చాప్స్‌ అక్కడే ఉపవాసాన్ని విరమించారు. ఈ సందర్భంగా తమ ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. నిక్‌ జోనస్‌ సైతం భార్యతో ఉన్న ఫొటోలు షేర్‌ చేస్తూ... ‘ నా భార్య భారతీయురాలు. తను హిందువు. అన్నింట్లోనూ అసమానమైనది. భారత సంస్కృతీ సంప్రదాయాల గురించి నాకు ఎన్నో విషయాలు వివరించింది. తనపై నాకున్న ప్రేమ ఇప్పుడు ఎన్నో రెట్లు పెరిగింది. అందరికీ కార్వా చౌత్‌ శుభాకాంక్షలు అంటూ ప్రియాంకను ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ క్రమంలో అందమైన జంట అంటూ ప్రియానిక్‌ దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక ప్రియాంక చెల్లెలు పరిణీతి చోప్రా కూడా అక్కాబావల ఫొటోలపై స్పందించారు. ‘ తను ఎప్పటినుంచో ఉపవాసాలు చేసింది. పరిపూర్ణమైన భర్తను పొందాలంటే ఇలాంటివి తప్పవని నిరూపించింది! నిజానికి భర్త కోసం ఉపవాసం చేయడం తనకు ఇదే మొదటిసారి!! మరి నాకు ఆ అవకాశం ఎప్పుడు వస్తుందో’ అంటూ సరదాగా కామెంట్‌ చేసింది. కాగా మెట్‌లాగాలో చూపులు కలిపిన ప్రియాంక చోప్రా- నిక్‌ జోనస్‌లు గతేడాది డిసెంబరులో వివాహ బంధంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. ఇక సినిమాల విషయానికొస్తే... ప్రియాంక నటించి, నిర్మాతగా వ్యవహరించిన.. ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ సినిమా విడుదల కాగా.. పరిణీతి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌ షూటింగ్‌ జరుపుకొంటోంది. డిస్నీ ఫ్రోజెన్‌-2 సిరీస్‌లో చోప్రా సిస్టర్స్‌ ఎస్లా, అన్నా పాత్రలకు గాత్రదానం చేశారు. ఈ మూవీ నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Include caption By using this embed, you agree to Instagram's API Terms of Use .

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement