చండీగఢ్: ఆధునిక కాలంలో పెళ్లికి ముందు బ్యాచిలర్ పార్టీలు చూస్తున్నాం. పెళ్లి వేడుకలు తిలకిస్తున్నాం. పెళ్లి తర్వాత రిసెప్షన్ పేరిట జరిగే విందు కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం. ఇలా వివాహం చుట్టూ ఎన్నో సంబరాలు ఉంటాయి. కానీ, విడాకుల సంబరం ఎప్పుడైనా చూశారా? హరియాణాలో ఇటీవల నిజంగా ఇలాంటి ఉత్సవం జరిగింది. మంజీత్ అనే యువకుడు తన భార్య నుంచి విడిపోయినందుకు చాలా సంతోషంగా తన బంధుమిత్రులకు విందు ఇచ్చాడు. కేక్ కట్ చేశాడు. డైవోర్స్ పార్టీ ఘనంగా నిర్వహించుకున్నాడు.
ఈ సందర్భంగా వేదిక వద్ద తన పెళ్లి ఫొటో, పెళ్లి జరిగిన తేదీ, విడాకులు మంజూరైన తేదీ తదితర వివరాలతో ఒక ఫ్లెక్సీ ముద్రించి అతికించాడు. అంతేకాదు తన మాజీ భార్య విగ్రహం లాంటిది అక్కడే ఏర్పాటుచేశాడు. ఆ విగ్రహం పక్కనే నిలబడి ఫోటోలకు పోజులిచ్చాడు. ఈ వ్యవహారమంతా సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఇలాంటి విడాకుల పారీ్టలు విదేశాల్లో ఎక్కువగా జరుగుతుంటాయని సమాచారం.
ఇప్పుడు మన దగ్గర కూడా ఈ పాశ్చాత్య సంస్కృతి మొదలైట్లు తెలుస్తోంది. మంజీత్ 2020లో కోమల్ అనే యువతిని పెళ్లి చేసుకున్నాడు. కానీ, వారి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. అభిప్రాయభేదాలతో నిత్యం కీచులాడుకోవడం కంటే విడిపోవడమే మేలని నిర్ణయానికొచ్చారు. ఈ ఏడాదే వారికి కోర్టు నుంచి విడాకులు మంజూరయ్యాయి. ఇప్పుడు తనకు అసలైన స్వాతంత్య్రం వచి్చందని మంజీత్ ఆనందంగా చెబుతున్నాడు. కానీ, ఇలాంటి విడాకుల వ్యవహారాలు, డైవోర్స్ పారీ్టలు మంచి పరిణామం కాదని పెద్దలు అభిప్రాయపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment