వరుణ్‌ తేజ్ బ్యాచిలర్ పార్టీ.. పెళ్లికి అంతా సెట్! | Varun Tej Bachelor Party In Spain And Marriage Date With Lavanya Tripathi Confirmed, Deets Inside - Sakshi
Sakshi News home page

Varun Tej Bachelor Party: పార్టీ మూడ్‌లో మెగాహీరో బిజీ.. పెళ్లి డేట్ ఫైనల్!

Published Sat, Sep 30 2023 5:10 PM | Last Updated on Sat, Sep 30 2023 5:40 PM

Varun Tej Bachelor Party And Marriage Date Finalised - Sakshi

మెగాహీరో వరుణ్ తేజ్ త్వరలో సింగిల్ జీవితానికి ముగింపు పలకబోతున్నాడు. అదేనండి హీరోయిన్ లావణ్య త్రిపాఠిన పెళ్లి చేసుకోబోతున్నాడని చెబుతున్నాం. ఆగస్టులో మ్యారేజ్ ఉంటుందన‍్నారు కానీ ఎందుకో ఆ సమయంలో జరగలేదు. ఇప్పుడు కొత్త డేట్ ఫిక్స్ చేశారు. అదే టైంలో వరుణ్ తేజ్.. బ్యాచిలర్ పార్టీ కూడా చేసేసుకున్నట్లు తెలుస్తోంది.

(ఇదీ చదవండి: 'బిగ్‌బాస్ 7' నుంచి హాట్ బ్యూటీ ఎలిమినేట్!)

దాదాపు ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి.. పెద్దల్ని ఒప్పించి ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక జరిగిన తర్వాతే వీళ్ల ప్రేమ విషయం బయటకొచ్చింది. అలానే తాము మొదటగా కలిసిన చోట అంటే ఇటలీలోనే డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారు. కొన్నిరోజుల ముందే షాపింగ్ మొదలుపెట్టారు. ఇప్పుడు కాబోయే పెళ్లికొడుకు, ఫ్రెండ్స్ అందరికీ బ్యాచిలర్ పార్టీ ఇచ్చాడు.

వరుణ్ తేజ్‌తో పాటు 40 మంది ఫ్రెండ్స్ ఈ బ్యాచిలర్ పార్టీ చేసుకుంటున్నారు. స్పెయిన్‌లో జరిగిన ఈ పార్టీకి మెగాహీరోల్లో సాయిధరమ్ తేజ్, అతడి తమ్ముడు వైష్ణవ్ తేజ్ వెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు నవంబరు తొలివారంలో వరుణ్-లావణ్య పెళ్లి కన్ఫర్మ్ అయినట్లు సమాచారం. ఈ వేడుకకు కుటుంబ సభ్యులు, కొద్దిమంది సన్నిహితులు వెళ్తారు. హైదరాబాద్‌కి తిరిగొచ్చిన తర్వాత ఇండస్ట్రీ ప్రముఖులు, రాజకీయ నాయకులకు రిసెప్షన్ ఉంటుందట.

(ఇదీ చదవండి: 'మిస్‌ శెట్టి మిస్టర్‌ పొలిశెట్టి' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement