ఎయిర్‌పోర్ట్‌లో వరుణ్ తేజ్ - లావణ్య త్రిపాఠి.. వీడియో వైరల్! | Varun Tej And Lavanya Tripathi Head To Dehradun For Second Reception, Airport Video Goes Viral - Sakshi
Sakshi News home page

Varun Tej-Lavanya Airport Video: వరుణ్ తేజ్- లావణ్య రిసెప్షన్.. ఎక్కడో తెలుసా?

Published Wed, Nov 15 2023 5:03 PM | Last Updated on Wed, Nov 15 2023 5:30 PM

Varun Tej and Lavanya Tripathi head to Dehradun for second reception - Sakshi

ఈ ఏడాది జూన్‌లో నిశ్చితార్థం చేసుకున్న వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి నవంబర్‌ 1న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని టుస్కానీలో జరిగిన వీరి పెళ్లికి మెగా ఫ్యామిలీ, నితిన్, అల్లు ‍అర్జున్, అత్యంత ‍సన్నిహితులు, స్నేహితులు కూడా హాజరయ్యారు. అక్టోబర్‌ 30న మొదలైన పెళ్లి వేడుకలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఇటలీలో పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరలైన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత హైదరాబాద్ తిరిగొచ్చిన జంట టాలీవుడ్‌ ప్రముఖు కోసం గ్రాండ్ రిసెప్షన్‌ నిర్వహించారు. మాదాపూర్‌లోని ఎన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఘనంగా జరిగింది. 

దీపావళి సందర్భంగా తొలిసారి మెగా కోడలిగా వేడుకలు జరుపుకుంది లావణ్య. తాజాగా మరోసారి రిసెప్షన్‌ వేడుకల కోసం బయలుదేరారు. డెహ్రాడూన్ వెళ్తూ హైదరాబాద్‌లోని విమానాశ్రయంలో కనిపించారు. ఎందుకంటే లావణ్య త్రిపాఠి యూపీలోని ఫైజాబాద్‌లో పుట్టినా.. తన బాల్యంలో తల్లిదండ్రులతో కలిసి డెహ్రాడూన్‌లోనే ఉన్నారు. అక్కడే లావణ్య పేరేంట్స్ ఉన్నారు.  లావణ్య తరఫు బంధువుల కోసం మరోసారి రిసెప్షన్ వేడుక నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరితో నిహారిక కొణిదెల కూడా డెహ్రాడూన్ వెళ్తున్నారు. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement