మెగా ఇంట పెళ్లి సందడి.. కాబోయే కోడలు గ్రాండ్ పార్టీ! | Lavanya Tripathi's Bachelorette Party Pics Goes Viral | Sakshi
Sakshi News home page

Lavanya Tripathi: మొదలైన పెళ్లి సందడి.. కాబోయే మెగా కోడలు గ్రాండ్ పార్టీ!

Published Sun, Oct 22 2023 1:39 PM | Last Updated on Sun, Oct 22 2023 2:14 PM

Lavanya Tripathi's Bachelorette Party Pics Goes Viral - Sakshi

మెగా ఇంట్లో ఇప్పటికే పెళ్లి సందడి మొదలైంది. ఇటీవలే మెగాస్టార్‌తో పాటు అల్లు అరవింద్ ఇంట్లో మెగా హీరో వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్‌ జరిగాయి. ఈ జంట త్వరలోనే వివాహాబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో నాగబాబు ఫ్యామిలీ పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే లావణ్య త్రిపాఠి తాజాగా బ్యాచులరేట్ పార్టీ సెలబ్రేట్ చేసుకుంది. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. 

(ఇది చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు)
 
వరుణ్ తేజ్- లావణ్య పెళ్లి వేదిక ఇప్పటికే ఫిక్స్ అయింది. ఇటలీలోని టుస్కానీలో డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ జరగనుంది. ఈ నేపథ్యంలో లావణ్య త్రిపాఠి తన ఫ్రెండ్స్‌తో కలిసి బ్యాచులరేట్ పార్టీ జరుపుకుంది. ఈ వేడుకలో ఆమె స్నేహితులు నీరజ, నితిన్‌ సతీమణి షాలినీ, నిహారిక, రీతూవర్మ  పాల్గొన్నారు. కాబోయే వధువుకు అభినందనలు తెలిపారు. 

అయితే కొద్ది మంది సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో వీరి పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. నవంబర్‌ 1న వరుణ్‌ - లావణ్య వివాహం జరగనుందని సమాచారం. కాగా.. ఇప్పటికే రామ్‌చరణ్‌ - ఉపాసన దంపతులు తమ ముద్దుర కూతురు క్లీంకారతో కలిసి టస్కానీ చేరుకున్నారు. అక్కడి పరిసరాలను చూపిస్తూ తాజాగా ఉపాసన ఫోటోలు, వీడియోలను తన ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్‌ చేశారు. పెళ్లి ఏర్పాట్లు దగ్గరుండి చూసుకునేందుకు ఈ జంట అక్కడికి వెళ్లిందని సమాచారం. కాబోయే వధూవరులు సైతం ఇప్పటికే ఇటలీకి పయనమైనట్లు తెలుస్తోంది.

(ఇది చదవండి: హీరోలను మించి రెమ్యునరేషన్.. ఆమె కోసం క్యూలో ఉండాల్సిందే! )

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement