
రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వంలో మణికంఠన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ‘కుడుంబస్తన్’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్‌లో ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా మణికంఠన్ తన జర్నీ ప్రారంభించాడు. అయితే, జై భీమ్ సినిమాలో చేసిన చిన్న పాత్రే తనను హీరోగా నిలబెట్టింది. 2023లో రొమాంటిక్ కామెడీ మూవీ 'గుడ్ నైట్'తో హీరోగా ఫస్ట్ హిట్ మణికందన్ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తను నటించిన 'కుడుంబస్తన్' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా మణికందన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు వర్షన్ విడుదల కానుంది.
కుడుంబస్తన్ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయం దక్కించుకోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్ ఈ చిత్రం విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్‍కు రానుందని జీ5 పేర్కొంది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్‍కు రానుందని తెలిపింది. థియేటర్‌లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదలైన కుడుంబస్తన్ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ కావడం విశేషం.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‍డ్రాప్‌లో తెరకెక్కిన్న ఈ చిత్రానికి రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వం వహించారు. జీవితంలో డబ్బు ముఖ్యం కాదని ఈ చిత్రం చాటిచెబుతుంది. చిన్న ఉద్యోగంతో కుటుంబ భారాన్ని మోస్తూ.. ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగతి యువకుడి పాత్రలో మణికంఠన్ అదరగొట్టాడని చెప్పవచ్చు. కేవలం రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 7న తెలుగు వర్షన్‌ను జీ5లో చూసేయండి.
Comments
Please login to add a commentAdd a comment