Manikanta
-
ఓటీటీలో 'మణికంఠన్' హిట్ సినిమా తెలుగు వర్షన్ స్ట్రీమింగ్
రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వంలో మణికంఠన్, శాన్వీ మేఘన జంటగా నటించిన ‘కుడుంబస్తన్’ ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. కోలీవుడ్‌లో ఆర్జే నుండి డబ్బింగ్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్, సెకండ్ హీరోగా మణికంఠన్ తన జర్నీ ప్రారంభించాడు. అయితే, జై భీమ్ సినిమాలో చేసిన చిన్న పాత్రే తనను హీరోగా నిలబెట్టింది. 2023లో రొమాంటిక్ కామెడీ మూవీ 'గుడ్ నైట్'తో హీరోగా ఫస్ట్ హిట్ మణికందన్ అందుకున్నాడు. ఆ తర్వాత లవర్ సినిమాతో మరో విజయాన్ని దక్కించుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో తను నటించిన 'కుడుంబస్తన్' విడుదలై భారీ విజయాన్ని అందుకుంది. అలా హ్యాట్రిక్ హిట్స్ కొట్టిన హీరోగా మణికందన్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే, ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో తెలుగు వర్షన్ విడుదల కానుంది.కుడుంబస్తన్ సినిమా కోలీవుడ్‌లో భారీ విజయం దక్కించుకోవడంతో తెలుగు అభిమానులు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. దీంతో తాజాగా జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఈ చిత్రం విడుదలపై అధికారికంగా ప్రకటన చేసింది. మార్చి 7వ తేదీ నుంచి స్ట్రీమింగ్కు రానుందని జీ5 పేర్కొంది. ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగు, కన్నడ, మలయాళం,హిందీ భాషలలో స్ట్రీమింగ్కు రానుందని తెలిపింది. థియేటర్లో కేవలం తమిళ వర్షన్ మాత్రమే విడుదలైన కుడుంబస్తన్ ఓటీటీలో మాత్రం ఐదు భాషల్లో రిలీజ్ కావడం విశేషం.మిడిల్ క్లాస్ ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన్న ఈ చిత్రానికి రాజేశ్వరన్ కాళిసామి దర్శకత్వం వహించారు. జీవితంలో డబ్బు ముఖ్యం కాదని ఈ చిత్రం చాటిచెబుతుంది. చిన్న ఉద్యోగంతో కుటుంబ భారాన్ని మోస్తూ.. ఐఏఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న మధ్యతరగతి యువకుడి పాత్రలో మణికంఠన్ అదరగొట్టాడని చెప్పవచ్చు. కేవలం రూ. 10 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సుమారు రూ. 30 కోట్లకు పైగానే రాబట్టినట్లు తెలుస్తోంది. అందుకే ఈ సినిమా ఓటీటీ విడుదల కోసం చాలామంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి ఉన్న వారు మార్చి 7న తెలుగు వర్షన్‌ను జీ5లో చూసేయండి. -
జ్యోతిష్యుడిగా మణికంఠ.. జాతకం మార్చేసిన ప్రోమో
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం కాస్త ఆసక్తిగానే టాపిక్స్ జరుగుతున్నాయి. కొత్త చీఫ్‌గా ఓరుగల్లు బిడ్డ నబీల్ అఫ్రిది ఎంపికయ్యాడు. వీకెండ్లో నాగార్జున చెప్పినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. ముందే ఊహించినట్లుగా ఆదిత్య ఓంను బయటకు పంపించారు. డే- 33, శుక్రవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ సీజన్లో బెస్ట్ ప్రోమోగా దీనిని చెప్పవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.బిగ్‌బాస్ ఇంటి నుంచి ఆదిత్య ఓం బయటకు వచ్చాక ఒక ఫన్నీ టాస్క్ జరిగింది. గత సీజన్ల మాదిరే ఈసారి కూడా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు జాతకాలు చెప్పే టాస్క్‌ను ఇచ్చారు. జ్యోతిష్యుడిగా మణికంఠను బిగ్‌బాస్ ఎంపిక చేస్తాడు. తనకిచ్చిన పాత్రలో మణికంఠ అద్భుతంగా మెప్పించాడు. ఫన్నీగా అందరినీ నవ్వించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడంటూ మణికంఠపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. -
OLD: ఆసక్తిని పెంచుతున్న క్రైమ్ థ్రిల్లర్ ‘ఓఎల్‌డీ’ కాన్సెప్ట్ గ్లింప్స్
మణికంఠ వారణాసి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఓఎల్‌డీ’(OLD). రాకేశ్ శ్రీపాద దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అల్టిమేట్ సినీ ప్లానెట్ పతాకంపై జి రాణి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. మే మొదటి వారం లో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తారు. ఉగాది పండుగను పురస్కరించుకొని కాన్సెప్ట్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు రాకేష్ మాట్లాడుతూ.. ‘ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ చిత్రం. 2008 టైం పీరియడ్ లో జరిగే కథ. మా చిత్రానికి "ఓ ఎల్ డి" టైటిల్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ప్రస్తుతానికి ప్రీ ప్రొడక్షన్ పనుల్లో ఉన్నాం. మే మొదటి వారం లో హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటాం. జూన్ చివరి వారం లో చిత్రాన్ని విడుదల చేస్తాం’ అని తెలిపారు. -
మా అమ్మ ముందే ఒళ్లంతా వాతలు పెట్టాడు.
హిందూపురం అర్బన్: ‘మా అమ్మ ముందే అతను ఇనుప కడ్డీలతో నాకు ఒళ్లంతా వాతలు పెట్టాడు టీచర్... చాలా నొప్పిగా ఉంది. కూర్చోలేకపోతున్నా...’ అంటూ ఆరేళ్ల చిన్నారి ఏడుస్తూ చెప్పిన మాటలు విని ఆ ఉపాధ్యాయురాలు చలించిపోయారు. చిన్నారిని బుజ్జగించి వివరాలు ఆరా తీయగా... ఓ మారుతండ్రి పైశాచికత్వం వెలుగు చూసింది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని బసవేశ్వర కాలనీలో నివాసం ఉంటున్న అమృతకు చంద్రిక (6) అనే కుమార్తె ఉంది. కొంతకాలంగా అమృతకు భర్త దూరంగా ఉంటుండగా, ఆమె మణికంఠ అనే ఆటోడ్రైవర్‌తో సహజీవనం చేస్తోంది.బుధవారం రాత్రి చిన్నారి చంద్రిక పరుపుపై మూత్రం పోసిందన్న కారణంతో మారుతండ్రి మణికంఠ ఇనుప చువ్వలు కాల్చి తల్లి అమృత చూస్తుండగానే బాలిక మూతి, తొడ, ఇతర సున్నిత ప్రాంతాల్లో వాతలు పెట్టాడు. బాలిక రాత్రంతా ఏడుస్తూ ఉండిపోయింది. ఆ చిన్నారి గాయాలతోనే గురువారం ఉదయం బసవేశ్వర కాలనీలోని పాఠశాలకు వచ్చింది. పాఠశాలలో సరిగా కూర్చోలేక ఇబ్బంది పడుతున్న చంద్రికను గుర్తించిన ఉపాధ్యాయురాలు శిల్ప దగ్గరికి తీసుకుని పరిశీలించగా... శరీరమంతా వాతలు కనిపించాయి. టీచర్ వెంటనే ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందించగా, వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీంతో హిందూపురం రూరల్ ఏఎస్ఐ జయరామిరెడ్డి పాఠశాల వద్దకు చేరుకుని చిన్నారి పరిస్థితిని గమనించి స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అక్కడి నుంచి వెంటనే హిందూపురం ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మణికంఠ తనకు వాతలు పెట్టినట్లు చిన్నారి పోలీసులకు తెలిపింది. దీంతో మణికంఠపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. కాగా, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలికను వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని వైద్యులకు సూచించారు. బాలికకు వాతలు పెట్టిన వ్యక్తిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఐని కోరారు. -
Karnataka Assembly election 2023: భూమిపుత్రున్ని: ఖర్గే
కలబురిగి: అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసిన వేళ కర్ణాటక ప్రజలనుద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే భావోద్వేగపూరిత వ్యాఖ్యలు చేశారు. సోమవారం కలబురిగిలో బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ‘‘నన్నెవరైనా చంపితే చంపొచ్చు గాక! తుదిశ్వాస దాకా పేదల కోసం, వారి ప్రయోజనాల పరిరక్షణ కోసం పోరాడుతూనే ఉంటా’’ అని స్పష్టం చేశారు. ‘‘నేను కన్నడ భూమిపుత్రున్ని. అందుకు ఎంతగానో గర్వపడతా’’ అన్నారు. ఖర్గేను, ఆయన భార్యాపిల్లలను చంపేందుకు బీజేపీ అభ్యర్థి మణికంఠ రాథోడ్ కుట్ర పన్నారని కాంగ్రెస్ ఆరోపించడం, అందుకు రుజువుగా ఆడియో రికార్డు విడుదల చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఖర్గే ఈ వ్యాఖ్యలు చేశారు. అది కచ్చితంగా బీజేపీ అగ్ర నేతల మనసు లోంచి పుట్టుకొచ్చిన ఆలోచనే అయ్యుంటుందని ఆరోపించారు. వారి దన్ను లేనిదే ఎవరూ అలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. ‘‘చిన్నతనంలోనే కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకుని ఒంటరిగా మిగిలాను. వాళ్లేమైనా చేసుకోవచ్చు. కానీ ఇలాంటి బెదిరింపులకు భయపడను. నన్ను కాపాడేందుకు అంబేడ్కర్ అందించిన రాజ్యాంగముంది. కర్ణాటక ప్రజలంతా నా వెనక ఉన్నారు. కాంగ్రెస్ అధ్యక్ష పదవి చేపట్టాక దేశ ప్రజలంతా నా వెనకే ఉన్నారు. మన దేశంలో సగటు ఆయు ప్రమాణం 70 ఏళ్లే. నాకు 81 ఏళ్లు. అంటే ఇప్పటికే బోనస్ పీరియడ్‌లో ఉన్నా. మహా అయితే మరో ఎనిమిదేళ్లు బతుకుతానేమో. నన్నూ, నా కుటుంబాన్నీ తుడిచి పెట్టొచ్చు గాక. భయపడేది లేదు. నా స్థానంలో మరొకరు పుట్టుకొస్తారు’’ అన్నారు. ‘‘ప్రధాని మోదీ కూడా పదేపదే నా కుమారుని గురించి మాట్లాడుతున్నారు. అతనిది మోదీ స్థాయి కాదు. నా గురించి మాట్లాడితే అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు. ‘‘తాను భూమిపుత్రున్నని గుజరాత్లో మోదీ చెప్పుకుంటారు. తన కోసం బీజేపీని గెలిపించాలని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలను కోరారు. అలాగే కర్ణాటక భూమిపుత్రుడినైన నా కోసం కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరుతున్నా’’ అన్నారు. తాను కాంగ్రెస్ అధ్యక్షునిగా ఉండగా రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు సహకరించాలని కోరారు. బెంగళూర్‌లో రాహుల్ బస్సు ప్రయాణం బనశంకరి: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి చివరి రోజైన సోమవారం కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బెంగళూరులో హల్చల్ చేశారు. కన్నింగ్‌హాం రోడ్డులో కాఫీ డేలో కాసేపు గడిపారు. అక్కడ కాఫీ రుచి చూశాక దగ్గర్లోని లోకల్ బస్టాప్‌లో కాలేజీ విద్యార్థులు, వర్కింగ్ విమెన్‌తో మాటలు కలిపారు. స్టూడెంట్లతో సెల్ఫీ దిగారు. తర్వాత లోకల్ బస్సెక్కి ప్రయాణికురాళ్లతో మాట్లాడారు. లింగరాజపురంలో బస్సు దిగి బస్టాప్‌లో మహిళలతో మరోసారి ముచ్చటించారు. ‘ధరల పెరుగుదల, ఇంటి పెద్ద అయిన ప్రతి మహిళకూ నెలకు రూ.2,000 ఇస్తామన్న కాంగ్రెస్ హామీ, ఉచిత బస్సు ప్రయాణం తదితరాలపై వారు నాతో లోతుగా చర్చించారు’’ అని చెప్పుకొచ్చారు. -
నటి చాందినీని మోసం చేసిన కేసులో కొత్త ట్విస్ట్..
సాక్షి ప్రతినిధి, చెన్నై: మాజీ మంత్రి (అన్నాడీఎంకే) మణికంఠన్ సౌకర్యవంతమైన జైలు జీవితం భగ్నమైంది. జైళ్లశాఖకు చెందిన విజిలెన్స్ అధికారుల సాక్షిగా బండారం బట్టబయలు కావడంతో చెన్నై సైదాపేట సబ్ జైలు నుంచి చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు ఆయన్ని తరలించారు. మంగళవారం జరిగిన ఈ ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నాడీఎంకే ప్రభుత్వ హాయాంలో సమాచార శాఖా మంత్రిగా పనిచేసిన మణికంఠన్‌ను.. పర్యాటకాభివృద్ధి పనుల నిమిత్తం నటి చాందినీ అనేకసార్లు కలిశారు. ఈ రకంగా వాద్దరి మధ్య ఏర్పడిన పరిచయం బలపడింది. తన భార్యతో సరిపడటం లేదని, వైవాహిక జీవితం విఫలమైందని పేర్కొంటూ అతడు చాందినీకి చేరువయ్యాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మబలికి చెన్నై అడయారులో ఇల్లుతీసుకుని భార్యభర్తల్లా మెలిగేవారు. ఈ క్రమంలో ఆమె గర్భం దాల్చినపుడల్లా అబార్షన్ చేయించాడు. వివాహం చేసుకొమ్మని ఒత్తిడి చేయడంతో చంపేస్తానని బెదిరించేవాడు. దీంతో భయపడిపోయిన చాందినీ చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జివాలీని స్వయంగా కలిసి మణికంఠన్‌పై ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి విచారణ చేపట్టగానే మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయి ముందస్తు జామీనుకు దరఖాస్తు చేసుకోగా మద్రాసు హైకోర్టు తోసిపుచ్చింది. బెంగళూరులోని ఒక రిసార్టులో దాక్కుని ఉన్న మణికంఠన్‌ను వారం రోజుల క్రితం చెన్నై పోలీసులు అరెస్ట్ చేసి సైదాపేట సబ్ జైల్లో పెట్టారు. అయితే అక్కడి అధికారులను మచ్చిక చేసుకుని లగ్జరీ జీవితాన్ని గడుపుతున్నట్లు జైళ్లశాఖ ఇంటెలిజెన్స్ అధికారులకు సమాచారం వచ్చింది. దీంతో జైళ్లశాఖ విజిలెన్స్ అధికారులు మంగళవారం ఉదయం అకస్మాత్తుగా సైదాపేట సబ్జైలుకెళ్లి తనిఖీలు చేపట్టారు. మాజీ మంత్రి మణికంఠన్ రూంలో ఎయిర్‌కూలర్, మెత్తని పరుపు, దిళ్లు, సువాసన వెదజల్లే బాటిళ్లు గుర్తించారు. అంతేగాక చార్జర్ సౌకర్యంతో సెల్‌ఫోన్‌ను ఉండటాన్ని గమనించారు. ఈమొత్తం సామగ్రిని స్వాధీనం చేసు కున్న విజిలెన్స్ అధికారులు మణికంఠన్‌ను వెంటనే చెన్నై పుళల్ సెంట్రల్ జైలుకు తరలించారు. మణికంఠన్‌కు సకల సౌకర్యాలు కల్పించిన జైలు అధికారులపై విచారణకు ఆదేశించారు. చదవండి: భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని -
భార్యాభర్తల తరహాలో జీవితం.. మూడుసార్లు అబార్షన్: నటి చాందిని
సాక్షి, చెన్నై: నటి చాందిని వ్యవహారంలో లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నాడీఎంకే మాజీ మంత్రి మణికంఠన్ అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. అతడి కోసం పోలీసులు నాగపట్టినం, రామానాథపురం జిల్లాల్లో గాలిస్తున్నట్లు తెలుస్తోంది. పలు తమిళ చిత్రాల్లో నటించిన చాందినీ ఇటీవల చెన్నై వెప్పేరీ పోలీస్‌స్టేషన్‌లో మణికంఠన్‌పై ఇటీవల ఫిర్యాదు చేశారు. అందులోని వివరాలు.. మలేషియా పర్యాటకాభివృద్ధి రాయబార కార్యాలయంలో పనిచేస్తున్నపుడు విధి నిర్వహణలో భాగంగా తరచూ భారత్‌కు రాకపోకలు సాగించేదానిని. పర్యాటకాభివృద్ధి సంబంధించి మాట్లాడాల్సి ఉందని అప్పట్లో రామనాథపురం అన్నాడీఎంకే ఎమ్మెల్యేగా ఉండిన మణికంఠన్.. భరణి అనే వ్యక్తిద్వారా సమాచారం ఇచ్చారు. దీంతో 2017 మే 3వ తేదీన మంత్రి హోదాలో మణికంఠన్‌ను ఆయన ఇంటి వద్ద కలిశాను. అదే సమయంలో నా సెల్‌ఫోన్ నెంబరు తీసుకున్న మణికంఠన్ పెళ్లిపేరుతో నమ్మబలికాడు. చెన్నై బిసెంట్‌నగర్‌లోని ఒక అపార్టుమెంటులో భార్యాభర్తల తరహాలో జీవితం సాగించాం. ఈ సమయంలో మూడుసార్లు నాకు తన స్నేహితుడైన ఓ డాక్టర్ సహాయంతో అబార్షన్ చేయించాడు. వేధింపులతో నా కళ్లు దెబ్బతిన్నాయి. పెళ్లి చేసుకుందామని కోరడంతో.. రహస్యంగా తీసిన నా అంతరంగ ఫొటోలను టెలిగ్రాం ద్వారా పంపి బెదిరింపులకు దిగాడు.. అంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో చెన్నై పోలీస్ కమిషనర్ శంకర్ జీవాల్ అదేశాల మేరకు అడయారు మహిళా పోలీస్‌స్టేషన్‌లో పలుసెక్షన్లపై మణికంఠన్, భరణిపై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. -
మహిళా సమస్యలతో టార్చర్
ప్రస్తుత సమాజంలో మహిళలు ఎదుర్కొంటున్న పరిస్థితుల నేపథ్యంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టార్చర్’. గగన్, మణికంఠ, శ్యామ్, దుర్గాప్రసాద్, శ్రీరామ్ సంతోషి, ప్రమీళ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం. నాయుడు దర్శకత్వంలో రఘు తోట్ల నిర్మిస్తున్నారు. రఘు తోట్ల మాట్లాడుతూ– ‘‘లేడీ ఓరియంటెడ్ నేపథ్యంలో సాగే చిత్రమిది. హరి చెప్పిన కథ బాగుండటంతో సినిమాను నిర్మించడానికి ముందుకొచ్చాను. ఈ నెల 15న రెగ్యులర్ షూటింగ్ ఆరంభిస్తాం’’ అన్నారు. ‘‘ఈ కథ కోసం చాలా రోజులుగా అందరం కష్టపడ్డాం. ఓ మహిళ స్టోరీని తీసుకుని మంచి స్క్రిప్టును రెడీ చేశాం’’ అన్నారు ఎం.ఎం. నాయుడు. ‘‘ఈ దేశంలో ఉన్న ప్రతి మహిళ శారీరకంగానో, మానసికంగానో సమస్యలు ఎదుర్కొంటోంది. చాలా తక్కువ మంది మాత్రమే వారు పడ్డ వేదనను బయటకి చెప్పుకుంటున్నారు. అలాంటి కథాంశంతో మా సినిమా ఉంటుంది’’ అన్నారు గగన్. ఈ చిత్రానికి సంగీతం: ప్రజ్వల్ క్రిష్, కెమెరా: తరుణ్. -
భార్యాభర్తల ఆత్మహత్యాయత్నం
అనంతపురం ,ధర్మవరం రూరల్: కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... ధర్మవరానికి చెందిన నాగభూషణ కుమార్తె వనితకు చెన్నేకొత్తపల్లి మండలం బసంపల్లికి చెందిన మణికంఠతో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగా సాగింది. మణికంఠ హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఇటీవల భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు వచ్చాయి. రోజురోజుకూ వీరి మధ్య గొడవ పెరుగుతూపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్ నుంచి ధర్మవరం వచ్చిన మణికంఠ రైల్వే స్టేషన్లో పురుగుమందు తాగి తల్లిదండ్రులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు. వెంటనే తల్లిదండ్రులు ఇతరుల సహాయంతో మణికంఠను ధర్మవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న వనిత భర్తను చూసి అక్కడి నుంచి వెళ్లి తను కూడా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కూడా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎన్కౌంటర్లో 'దాదా' హతం
సాక్షి, చెన్నై: అన్నానగర్‌లో విల్లుపురానికి చెందిన దాదా మణికంఠన్ ఎన్కౌంటర్లో హతం అయ్యాడు. విల్లుపురం, పుదుచ్చేరిలను వణికించి ఈ దాదా చెన్నైలో నక్కి ఉన్న సమచారంతో అక్కడి నుంచి వచ్చిన పోలీసులు తూటాలకు పనిపెట్టారు. కాగా, సినీ తరహాలో వంద మంది ఈ దాదా ఇది వరకు రౌడీ రాజ్యాన్ని ఏళాడు. విల్లుపురం జిల్లా కుల్లం పాళయంకు చెందిన మణికంఠన్ గత పదిహేను సంవత్సరాలుగా విల్లుపురం, పుదుచ్చేరిల్లో తన కంటూ ఓ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకుని దాదాగా చెలమణి అవుతూ వచ్చాడు. ఇక్కడే ఉన్న మరో దాదా రాజ్‌కుమార్ వర్గంతో మణికంఠన్ వర్గం నిత్యం తలబడుతూ వచ్చేది. సినీ తరహాలో మణికంఠన్ వంద మంది రౌడీలను తన పనులకు ఉపయోగించుకుంటూ రాజ్యాన్ని ఏళాడు. 21 హత్యలు, కిడ్నాప్‌లు అంటూ అనేక కేసులు మణి కంఠన్‌పై ఉన్నాయి. ఇటీవల చెన్నై అన్నానగర్‌లో జరిగిన రిలయన్స్ బాబు హత్య కేసులోనూ మణికంఠన్ హస్తం ఉందని విచారణలో తేలింది. ఈ నేపథ్యంలో మణికంఠన్ అన్నానగర్ వెస్ట్‌లోని ఓ అపార్ట్మెంట్లో తలదాచుకుని ఉన్నట్టుగా విల్లుపురం ఎస్పీ జయకుమార్‌కు రహస్య సమాచారం అందింది. దీంతో సబ్ ఇన్స్పెక్టర్లు ప్రభు, ప్రకాష్ మంగళవారం రాత్రి ఆ అపార్ట్‌మెంట్‌కు చేరుకున్నారు. మణికంఠన్‌ను పట్టుకున్నారు. అరెస్టు వారెంట్ చేస్తున్నట్టు చెప్పారు. ఇందుకు సమ్మతించినట్టు నటించినమణికంఠన్ ఇంట్లోకి రమ్మని ఆహ్వానించి హఠాత్తుగా ప్రభుపై కత్తితో దాడి చేశాడు. దీంతో ఆందోళన చెందిన ప్రకాష్ తన తుపాకీ తూటాను ఎక్కబెట్టాడు. రెండు రౌండ్లు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడ్డ అతడ్ని చికిత్స నిమిత్తం కీల్పాకం ఆస్పత్రికి తరలించగా మరణించినట్టు వైద్యులు తేల్చారు. గాయపడ్డ ప్రభుకు చికిత్స అందిస్తున్నారు. అన్న బాటలో తమ్ముళ్లు మణికంఠన్‌కు ఓ అన్న, ఇద్దరు తమ్ముళ్లు, అక్క ఉన్నారు. అన్న గతంలో మరణించాడు. తమ్ముళ్లు ఇద్దరు మణికంఠన్‌కు కుడి, ఎడమ భుజంగా ఉండే వారు. ఐదేళ్ల క్రితం ప్రత్యర్థుల దాడిలో తమ్ముడు ఆర్ముగం హతం అయ్యారు. గత ఏడాది మరో తమ్ముడు మైఖెల్ కోర్టుకు వెళ్తున్న సమయంలో స్పృహ తప్పి మరణించాడు. తమ్ముళ్ల మరణంతో మకాంను చెన్నైకు మార్చేసి, ఇక్కడి నుంచే రహస్యంగా తన కార్యకలాపాల్ని మణికంఠన్ సాగిస్తూ వచ్చినట్టుగా విచారణలో తేలింది. గతంలో ఓ మారు ఎన్కౌంటర్ నుంచి తృటిలో తప్పించుకున్న మణి కంఠన్ ఈసారి పోలీసుల తూటాలకు బలయ్యాడు. మృతుడికి భార్య ఆనంది, ఇద్దరు కుమారులు, ఓకుమార్తె ఉన్నారు. కాగా, ఈ ఎన్కౌంటర్ మీద పోలీసుల్ని వివరణ కోరుతూ మానవ హక్కుల కమిషన్ బుధవారం నోటీసులు జారీ చేసింది. నాలుగువారాల్లోపు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. -
విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం
-
విశాఖలో కిడ్నాప్ కలకలం
విశాఖ: విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆపై బాధితుడి కుటుంబసభ్యులకు కిడ్నాపర్లు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ వివరాలివి.. మణికంఠ అనే 20 ఏళ్ల యువకుడు కుటుంబంతో సహా స్థానిక లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు మణికంఠను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు. మణికంఠ అపహరణ ఘటనపై అతడి కుటుంబసభ్యులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మణికంఠను విడిచి పెట్టేందుకు కిడ్నాపర్లు తమకు పోన్‌చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 9 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి. -
41 ఫోర్లు, 13 సిక్సర్లు
మణికంఠ ట్రిపుల్ సెంచరీ సెంచరీ కొట్టిన ఆర్యన్ ∙ తొలి వికెట్‌కు 518 పరుగుల భాగస్వామ్యం డీపీఎస్ ఘనవిజయం l హెచ్‌సీఏ అండర్–16 స్కూల్ లీగ్ చిలకలగూడ: హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్‌సీఏ) ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అండర్–16 స్కూల్ లీగ్ క్రికెట్లో ఆదివారం అద్భుతం చోటు చేసుకుంది. సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టుతో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్, నాచారం) బ్యాట్స్‌మన్ ఆదం మణికంఠ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నమ్మశక్యంకానిరీతిలో ఏకంగా ట్రిపుల్ సెంచరీ నమోదు చేసి ఔరా అనిపించాడు. 142 బంతులు ఆడిన మణికంఠ 41 ఫోర్లు, 13 సిక్సర్ల సహాయంతో 316 పరుగులు చేసి అవుటయ్యాడు. మణికంఠతోపాటు మరో ఓపెనర్ గడ్డం ఆర్యన్ (129 బంతుల్లో 159; 16 ఫోర్లు) కూడా కదంతొక్కాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 240 బంతుల్లో 518 పరుగులు జోడించడం విశేషం. మరో బ్యాట్స్‌మన్ సాయి కౌశిక్ (25 బంతుల్లో 57; 10 ఫోర్లు) కూడా రాణించాడు. మరోవైపు సుల్తాన్ ఉల్ ఉలూమ్ జట్టు ఎక్స్‌ట్రాల రూపంలో 107 పరుగులు ఇవ్వడం గమనార్హం. దాంతో తొలుత బ్యాటింగ్‌కు దిగిన డీపీఎస్ నిర్ణీత 50 ఓవర్లలో 3 వికెట్లకు 649 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం 650 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సుల్తాన్ ఉల్ ఉలూమ్ స్కూల్ జట్టు పృథ్వీ (6/35), మనీశ్ (3/9)ల ధాటికి 14 ఓవర్లలోనే 54 పరుగులకు కుప్పకూలింది. దాంతో డీపీఎస్ జట్టు 595 పరుగుల భారీ తేడాతో విజయం దక్కించుకుంది. ‘ట్రిపుల్’ సెంచరీతో చెలరేగిన మణికంఠతోపాటు సెంచరీ సాధించిన ఆర్యన్లకు స్కూల్ యాజమాన్యంతోపాటు తండ్రి ఆదం విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి అభినందించారు. చిలుకూరులోని వీజీ రావు క్రికెట్ గ్రౌండ్స్‌లో నారాయణ కాన్సెప్ట్ స్కూల్‌తో జరిగిన మ్యాచ్‌లో గౌతమ్ మోడల్ స్కూల్ ఘనవిజయాన్ని సాధించింది. ఈమ్యాచ్‌లో 293 పరుగుల తేడాతో గెలుపొందింది. మొదట బ్యాటింగ్ చేసిన గౌతమ్ మోడల్ స్కూల్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 363 పరుగులు చేసింది. ఓపెనర్లు హర్ష్ (103 బంతుల్లో 107; 13 ఫోర్లు), బి. రూపేశ్ (102 బంతుల్లో 84; 5 ఫోర్లు) తొలివికెట్‌కు 222 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి భారీస్కోరును అందించారు. రాహుల్ రెడ్డి (55) అర్ధసెంచరీతో ఆకట్టుకున్నాడు. అనంతరం నారాయణ కాన్సెప్ట్ స్కూల్ 22 ఓవర్లలోనే కేవలం 70 పరుగులకే ఆలౌటై ఓడిపోయింది. అనికేత్ 18 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టగా, తర్షిత్ కేవలం 1 పరుగు మాత్రమే ఇచ్చి 3 వికెట్లను దక్కించుకున్నాడు. -
ఇంటిపై నుంచి పడి బాలుడి మృతి
పెనమలూరు: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలో ఇంటిపై నుంచి పడి మణికంఠ అనే ఐదేళ్ల బాలుడు మృతిచెందాడు. శనివారం సాయంత్రం ఇంటి రెండో అంతస్తులో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తూ జారి కింద పడ్డాడు. హుటాహుటిన విజయవాడలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే అక్కడ చికిత్సపొందుతూ ఆదివారం మృతిచెందాడు. బాలుడి తల్లి శశికళ విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. బాలుడి మృతితో తల్లి శోకంలో మునిగిపోయింది. -
కన్నబిడ్డలు కాలదన్నారు
పోరుమామిళ్ల : ఈ చిత్రంలో కనిపిస్తున్న వృద్ధుని పేరు బడిగించల సుబ్బన్న. ఊరు ప్రొద్దుటూరు. ఇతను గతంలో మగ్గం నేసేవాడు. ఇతనికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు. అందరికీ వివాహాలు చేశాడు. వయసు మీద పడటంతో ఏపనీ చేయలేక ఇంటి వద్దే ఓ బంకు పెట్టుకుని జీవిస్తుండగా దాన్ని రెండో కుమారు డు వెంకటసుబ్బయ్య స్వాధీనం చేసుకున్నాడు. కొడుకు, కోడలు కలిసి సుబ్బన్నను గెంటేశారు. పెద్ద కొడుకు శివయ్య మైలవరం మండలం వేపరాలలో మగ్గం నేసుకుంటూ భార్యాబిడ్డలను పోషించుకుంటున్నాడు. ఇక మూడో కుమారుడు మణికంఠ కూడా కడపలో ఉంటున్నాడు. అతను కూడా తండ్రి బాగోగులు పట్టించుకోలే దు. తన కంటే ఇద్దరు పెద్దవాళ్లు ఉండగా వారికి పట్టం ది తనకెందుకు అని కరాఖండిగా చెప్పేశాడు. అంతటితో ఆగకుండా తండ్రిని తీసుకెళ్లి నాలుగు రోజుల క్రి తం కాశినాయన మండలంలోని జ్యోతి క్షేత్రంలో వది లేసి వెళ్లాడు. అతనికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో కొందరి సాయంతో సోమవారం రాత్రి పోరుమామిళ్లలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరాడు. తనకు ముగ్గురు కొడుకులున్నా ఎవరూ తనకు అన్నం పెట్టడం లేదని కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య మాత్రం నెల్లూరులో చిరువ్యాపారం చేసుకుంటున్న తన కూతురు లక్ష్మిదేవి వద్ద ఉంటోందని చెప్పాడు. ఈ నేపథ్యంలో మంగళవారం ఆసుపత్రి నుంచి డిస్చార్జి అయిన సుబ్బన్నకు ఎటు వె ళ్లాలో దిక్కుతోచలేదు. తనను ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్పించండి అని అక్కడున్న వారిని ప్రాధేయపడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న జ్ఞాన సరస్వతి దేవి ట్రస్టు ప్రతినిధి శ్రీనివాసులు తమ సంస్థ సభ్యులతో కలిసి వృద్ధుడిని తీసుకెళ్లి కడపలోని గుడ్‌హార్ట్ ఫౌండేషన్‌లో చేర్చాడు. కన్నబిడ్డలు కాలదన్నినా తన స్థితిని చూసి స్పందించి వృద్ధాశ్రమంలో చేర్పించిన యువకులకు అతను కృతజ్ఞతలు తెలిపాడు. -
స్ఫూర్తి ప్రదాతలు
ఇన్ బాక్స్ మారుతున్న జీవనశైలితోపాటు మనుషుల్లో కూడా మానవత్వం ఉం దని నిరూపించే జీవన దానం ఒక గొప్ప ఆదర్శమని రుజువు చేసిన మణికంఠ అనే డ్రైవర్ నేడు తెలుగువారికి స్ఫూర్తిదాతగా నిలిచారు. తాను చనిపోతూ కూడా ఐదుగురు ఆపన్నులకు ప్రాణదానం చేయ డాన్ని జాతి మొత్తం ఆదర్శంగా తీసుకోవాలి. ప్రాణాపాయస్థితిలో ఉన్న వారికి చివరి నిమిషంలో కూడా తోడ్పాటు నందించాలని భావించే ఈ ఉత్కృష్ట గుణంపై విస్తృతంగా అవగాహన కల్పించాలి. వందల కిలో మీటర్ల దూరం నుంచి అవయవాలను శరవేగంగా తరలించి సంబం ధిత ఆసుపత్రికి చేర్చడంలో పోలీసులు నిర్వహిస్తున్న పాత్ర అత్యంత కీలకం. అవయవ దానం చేయడం ఒక వంతు అయితే, దాన్ని నిర్దిష్ట సమయంలో అవసరమైన రోగులకు అందించడంలో పోలీసులు అంది స్తున్న సేవలు అమోఘం. యశోదా ఆసుపత్రిలో ఇటీవల ఇలాగే గుండె చికిత్సను సకాలంలో నిర్వహించడం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మన దేశం ఖర్మకొద్దీ వీఐపీల సేవల్లోనే మునిగిపోతున్న పోలీసుల పట్ల ప్రజ లు తీవ్ర వ్యతిరేకత వ్యక్తంచేస్తున్నా, ఇలాంటి మానవీయ అంశాల్లో సహాయ కార్యక్రమాలను చేపట్టడం వారిపై సదభిప్రాయాన్ని పెంచు తోంది. ఎంతోమంది మణికంఠలు ముందుకు రావాలి. ఎందుకంటే ఆపత్కాలంలో నిజమైన సహాయాన్ని అందించేది పేదలే. వీరే మానవ లోకంలో మణిదీపాలు. శొంఠి విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ మృత్యుంజయ యాగమా? తెలుగు సినీ పరిశ్రమకు చెందిన మహామహులంతా వరుసగా కాలం చేయడం టాలివుడ్‌కి అరిష్టంగా భావిస్తూ కళాకారుల క్షేమం కోసం, మృత్యుంజయ యాగం నిర్వహించనున్నట్లు ఇటీవల నటుడు మురళీ మోహన్ ప్రకటించారు. చిత్రపరిశ్రమలో ఆకస్మిక మరణాలను నియం త్రించడానికి పరిపూర్ణానందస్వామి వారిచేత మనుషు లను సజీవులుగా ఉంచే యాగం చేయాలన్నది వీరి లక్ష్యం. సినీ ప్రముఖుల మరణాలకు అసలు కారణాలు మరొక చోట ఉండగా మృత్యుంజయ యాగాలతో ఆ మర ణాలను ఆపివేయాలనుకోవడమే హాస్యాస్పదం. చిత్ర సీమలో నటీనటులు తమ మేకప్ కోసం నిత్యం ఉపయోగి స్తున్న రసాయనాల ప్రభావం, ఆహార నియమాలు ఏమాత్రం పాటించ కపోవటం, మాదక ద్రవ్యాలు, మద్యం అతిగా సేవించడం, వేళా పాళా లేని షెడ్యూళ్ల భారం వంటివి టాలివుడ్లో ఆకస్మిక మరణాలను బాగా పెంచుతున్నాయి. పైగా హైదరాబాద్ వాసులు హుస్సేన్‌సాగర్ నీటితో పండించిన పంటలు ఉపయోగించడం, భారీ పరిశ్రమలు విడుదల చేస్తున్న విషవాయువుల వలన కాలుష్యం కోరల్లో చిక్కి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. హుస్సేన్ సాగర్ నీటిని ప్రక్షాళన చేసే కార్యక్రమం ఎంత త్వరగా పూర్తి చేస్తే మహానగరంలో ప్రజల ఆరోగ్యానికి అంతగా భరోసా ఉంటుంది. ఎ.వై. శెట్టి సీనియర్ సిటిజన్, పత్తిపాడు అపరిశుభ్రతకు ఆవాసాలు జంటనగరాల్లో ఆర్టీసీ బస్టాండ్లు మహత్మాగాంధీ, జూబ్లీ, దిల్సుక్ నగర్ ఇలా అవీ ఇవీ అనే తేడా లేకుండా అపరిశుభ్రతకు నిలయాలుగా మారాయి. నిత్యం వేలాది మంది ప్రయాణీకులతో రద్దీగా ఉండేచోట మరుగుదొడ్లు, మూత్రశాలలు కంపు గొడుతున్నా పట్టించుకునే నాధు లులేరు. ఆ మరుగుదొడ్లు ఉపయోగిస్తే రోగాలు రావడం ఖాయం. అటువైపుగా వెళ్లాలంటేనే ప్రయాణికులు ముక్కుమూసుకుని వెళ్లవల సిన పరిస్థితి దాపురించంది. మరి ఆర్టీసీ అధికారులు ఏం చేస్తున్నట్లు? ఇక తినుబం డారాల స్టాల్స్ విషయం చెప్పే పనిలేదు. ఇష్టం వచ్చిన రేట్లతో ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ అధికారులు మాత్రం పండుగ పబ్బం అంటూ రెట్టింపు చార్జీలు వడ్డిస్తూ ప్రయాణి కుల నడ్డి విరవడం సమంజసమా? బస్టాండులలో ఈ అసౌకర్యం పట్ల ఒక్క అధికారి కానీ, సంబంధిత మంత్రి కానీ నిలదీసిన పాపాన పోలేదు. ఇక భద్రత విషయం అంతంత మాత్రమే. ఏ ఇద్దరూ ముగ్గురూ పోలీసులు అక్కడ తచ్చాడుతుంటారు. ఏదైనా సంఘటన జరిగినప్పుడు మాత్రం హడావుడి చేయడం. మళ్లీ సద్దుమణగటం షరా మామూలే. ఆకస్మిక తనిఖీలను అధికారులు చేపడుతున్నారో లేక చూసీ చూడనట్లు ఊరకుంటున్నారో తెలియని పరిస్థితి. వేలాది ప్రయాణికు లకు నిత్యం కలుగుతున్న ఈ అసౌకర్యాల పట్ల ఇకనైనా అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవాలని విన్నపం. శిష్ట్లా అన్నపూర్ణ చందానగర్, హైదరాబాద్ -
పండుగకు వచ్చి... విగతజీవులయ్యారు
అత్తిలి : పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం బల్లిపాడులో విషాదం చోటు చేసుకుంది. నిన్న అదృశ్యమైన ముగ్గురు చిన్నారులు..చివరికి చెరువులో శవాలై తేలారు. దుళ్ళ గ్రామానికి చెందిన వేల్పూరు రాంబాబు కుమారుడు మణికంఠ, తణుకు మండలం వేల్పూరుకు చెందిన కోటి చుక్కల నాగేంద్ర కుమార్ ఇద్దరు కుమార్తెలు పావని దుర్గ మహాలక్ష్మి, పల్లవిలు సంక్రాంతికి అమ్మమ్మ ఇంటికి వచ్చారు. వీరంతా దగ్గరలోని గుడి దగ్గరకు ఆడుకోవడానికి వెళ్లి తిరిగి రాలేదు. ఆడుకునేందుకు వెళ్లిన పిల్లలు ఎంతకూ తిరిగి రాకపోవడంతో ఆందోళనతో కుటుంబసభ్యుల వెతికారు. అయినా ఫలితం లేకపోవటంతో తల్లిదండ్రులు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు జరుపుతుండగనే..చిన్నారుల శవాలు చెరువులో లభ్యం కావడంతో వారి తల్లిదండ్రులు ఆవేదనకు అంతు లేకుండా పోయింది. ఇప్పటివరకూ ఓ చిన్నారి మృతదేహం వెలికి తీయగా, మిగతా ఇద్దరి మృతదేహాలు వెలికి తీస్తున్నారు. -
జనరేటర్, డీజిల్ ఇంజన్ పనిచేయలేదు...విషాదం!
ఆదిలాబాద్: బావిలోపడిన ఓ విద్యార్థిని రక్షించేందుకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. అగ్నిమాపక వాహనం వచ్చినా అందులో జనరేటర్ పనిచేయలేదు. 8వ తరగతి చదువుతున్న విద్యార్థి మణికంఠ ఉట్నూరు క్రీడా పాఠశాల బావిలో పడ్డాడు. ఆ విద్యార్థిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా ప్రయత్నించింది. బావిలో నీరు తోడేందుకు ప్రయత్నించగా, ఫైర్ ఇంజన్లో జనరేటర్ పనిచేయలేదు. అధికారులు వెంటనే డీజిల్ ఇంజన్‌ను తెప్పించారు. అదీ పనిచేయలేదు. అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. వారు ఎంత కష్టపడినా చిన్నారి ప్రాణాలు దక్కలేదు. మణికంఠ మృతి చెందాడు.