
విశాఖలో కిడ్నాప్ కలకలం
విశాఖ: విశాఖలో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. ఆపై బాధితుడి కుటుంబసభ్యులకు కిడ్నాపర్లు ఫోన్‌చేసి డబ్బులు డిమాండ్ చేశారు. ఆ వివరాలివి.. మణికంఠ అనే 20 ఏళ్ల యువకుడు కుటుంబంతో సహా స్థానిక లక్ష్మీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కొందరు గుర్తుతెలియని దుండగులు మణికంఠను పథకం ప్రకారం కిడ్నాప్ చేశారు.
మణికంఠ అపహరణ ఘటనపై అతడి కుటుంబసభ్యులు గోపాలపట్నం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మణికంఠను విడిచి పెట్టేందుకు కిడ్నాపర్లు తమకు పోన్‌చేసి రూ.15 లక్షలు డిమాండ్ చేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేస్తున్నారు. 9 పోలీస్ బృందాలు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టాయి.