
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం కాస్త ఆసక్తిగానే టాపిక్స్ జరుగుతున్నాయి. కొత్త చీఫ్‌గా ఓరుగల్లు బిడ్డ నబీల్ అఫ్రిది ఎంపికయ్యాడు. వీకెండ్‌లో నాగార్జున చెప్పినట్లుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా జరిగింది. ముందే ఊహించినట్లుగా ఆదిత్య ఓంను బయటకు పంపించారు. డే- 33, శుక్రవారం ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ సీజన్‌లో బెస్ట్ ప్రోమోగా దీనిని చెప్పవచ్చని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
బిగ్‌బాస్ ఇంటి నుంచి ఆదిత్య ఓం బయటకు వచ్చాక ఒక ఫన్నీ టాస్క్ జరిగింది. గత సీజన్‌ల మాదిరే ఈసారి కూడా హౌస్‌లోని కంటెస్టెంట్స్‌కు జాతకాలు చెప్పే టాస్క్‌ను ఇచ్చారు. జ్యోతిష్యుడిగా మణికంఠను బిగ్‌బాస్ ఎంపిక చేస్తాడు. తనకిచ్చిన పాత్రలో మణికంఠ అద్భుతంగా మెప్పించాడు. ఫన్నీగా అందరినీ నవ్వించాడు. తనకు వచ్చిన అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకున్నాడంటూ మణికంఠపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment