సైకలాజికల్‌ థ్రిల్లర్‌ | Boomerang Movie Glimpse Launch | Sakshi
Sakshi News home page

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

Published Mon, Feb 24 2025 12:08 AM | Last Updated on Mon, Feb 24 2025 12:08 AM

Boomerang Movie Glimpse Launch

అనూ ఇమ్మాన్యుయేల్, శివ కందుకూరి లీడ్‌ రోల్స్‌లో నటిస్తున్న చిత్రం ‘బూమరాంగ్‌’(Boomerang). పలు భాషలలో 34 చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా చేసిన ఆండ్రూ బాబు దర్శకత్వంలో లండన్‌ గణేశ్, డా. ప్రవీణ్‌ రెడ్డి ఊట్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సితార ఫిల్మ్స్‌ లిమిటెడ్‌ లైన్‌ ప్రోడక్షన్‌ని నిర్వహిస్తోంది. ఈ సినిమా త్వరలోనే రిలీజ్‌ కానుంది. ఈ సినిమా గ్లింప్స్‌  రిలీజ్‌ కార్యక్రమాన్ని ఆదివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ సందర్భంగా శివ కందుకూరి మాట్లాడుతూ– ‘‘విభిన్నమైన చిత్రం ఇది.

ఈ సినిమాలో ఓ డార్క్‌ సైడ్, స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌ ఉన్నాయి’’ అని అన్నారు. ‘‘ఇది మెసేజ్‌ ఓరియంటెడ్‌ సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ఫిల్మ్‌. ఈ సినిమా కథ విని ప్రవీణ్‌గారు వెంటనే ఒప్పుకున్నారు’’ అని తెలిపారు ఆండ్రూ బాబు. ‘‘కర్మ సిద్ధాంతం ఆధారంగా ఈ సినిమా తీశాం. అవుట్‌పుట్‌ బాగా వచ్చింది.

ఈ సినిమాకి అందరి సపొర్ట్‌ కావాలి’’ అని పేర్కొన్నారు ప్రవీణ్‌ రెడ్డి. ‘‘బూమరాంగ్‌’ మంచి థ్రిల్లర్‌ ఫిల్మ్‌’’ అన్నారు మ్యూజిక్‌ డైరెక్టర్‌ అనూప్‌ రూబెన్స్‌. ఈ కార్యక్రమంలో దర్శకుడు విజయ్‌కుమార్‌ కొండా, నిర్మాత కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్‌  అతిథులుగా పాల్గొని, మాట్లాడారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement