boomerang
-
ఈ ఫోటోలో కనిపిస్తున్నది రాయి మాత్రం కాదు! అది ఏంటంటే..
ఈ ఫొటోలో కనిపిస్తున్న రాయి ఒక గ్రహశకలం. ఇటీవల ఇది సహారా ఎడారిలో దొరికింది. అప్పుడప్పుడు పలుచోట్ల గ్రహశకలాలు నేల మీదకు రాలిపడటం మామూలే! ఇందులో విశేషమేమిటంటారా? ఇది మొట్టమొదటి బూమరాంగ్ గ్రహశకలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహశకల ప్రభావం కారణంగా దాదాపు పదివేల ఏళ్ల కిందట ఇది భూమి నుంచి విడివడి అంతరిక్షానికి తుళ్లిపోయిందని, మళ్లీ అక్కడి నుంచి నేల మీదకు రాలిపడిందని వారు చెబుతున్నారు. ఈ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు ‘ఎన్డబ్ల్యూఏ 13188’ అని పేరుపెట్టారు. దీనిపై ఫ్రాన్స్‌లోని మార్సిలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ శిలలో భూఉపరితలానికి చెందిన పదార్థాలే ఉన్నాయని, ఇది అగ్నిపర్వతానికి చెందిన శిల అని వారు వెల్లడించారు. గ్రహశకలాల అన్వేషకులు కొందరు దీనిని 2018లో మొరాకోలోని సహారా ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. ఇది శాస్త్రవేత్తలకు చేరడంతో, వారు దీనిపై సుదీర్ఘ పరిశోధనలు జరిపి, ఇది భూమ్మీద దొరికిన మొట్టమొదటి ‘బూమరాంగ్ గ్రహశకలం’ అని ప్రకటించారు. (చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు") -
అక్టోబర్‌లో రానున్న అధర్వ ‘బూమరాంగ్’
తమిళంలో ప్రతిభావంతులైన యువ కథానాయకుల్లో అధర్వ మురళి ఒకరు. అనువాద చిత్రం ‘అంజలి సీబీఐ’ (తమిళంలో ‘ఇమైక నోడిగల్’)తో తెలుగు ప్రేక్షకులనూ ఆకట్టుకున్నారు. నయనతారకు తమ్ముడిగా ప్రారంభ సన్నివేశాల్లో లవర్ బాయ్‌గా, పతాక సన్నివేశాలు వచ్చేసరికి యాక్షన్ హీరోగా రెండు వేరియేషన్స్ ఉన్న క్యారెక్టర్లో ప్రేక్షకులందర్నీ మెప్పించారు. రీసెంట్గా వరుణ్‌తేజ్ ‘గద్దలకొండ గణేష్’లో దర్శకుడు కావాలనుకునే యువకుడిగా అధర్వ మురళి అద్భుతంగా నటించారు. త్వరలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అధర్వ మురళి కథానాయకుడిగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘బూమరాంగ్’. మేఘా ఆకాష్, ఇందూజ రవిచంద్రన్ కథానాయికలు. ఆర్. కణ్ణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని శ్రీమతి జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ తెలుగులో విడుదల చేస్తుస్తున్నారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత సీహెచ్ సతీష్‌కుమార్ మాట్లాడుతూ ‘కమర్షియల్ హంగులతో పాటు ప్రేక్షకులు కోరుకునే కొత్త కథాంశంతో ఈ చిత్రం రూపొందింది. ఓ సన్నివేశం తర్వాత మరో సన్నివేశం... నెక్ట్స్ ఏం జరుగుతుందనేలా దర్శకుడు చక్కటి స్ర్కీన్ ప్లే రాశారు. అధర్వ మురళి అద్భుతంగా నటించారు. ‘అందాల రాక్షసి’, ‘ఎవడే సుబ్రమణ్యం’, ‘అర్జున్‌రెడ్డి’, ‘హుషారు’ చిత్రాల్లో పాటలతో తెలుగు ప్రేక్షకులను వీనులవిందైన స్వరాలను అందించిన రధన్, ఈ చిత్రానికి హిట్ ఆల్బమ్ ఇచ్చారు. త్వరలో పాటల్ని, అక్టోబర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’ అని అన్నారు. -
అందరినీ ఆకట్టుకునేలా ‘బూమరాంగ్’
బూమరాంగ్ చిత్రం జనరంజకంగా ఉంటుందని ఈ చిత్ర కథానాయకుడు అధర్వ పేర్కొన్నారు. ఈయనకు జంటగా ఇందుజా, మేఘాఆకాశ్ నటించారు. దర్శకుడు ఆర్.కన్నన్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ఇది. రథన్ సంగీతాన్ని, సెల్వ ఛా యాగ్రహణం అందించిన ఈ చిత్రం 8న తెరపైకి రావడానికి ముస్తాబైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్‌ల్యాబ్‌లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్ మాట్లాడుతూ.. ఒక చిత్రం అనుకున్న విధంగా రూపొందించాలంటే హీరో సహకారం అవసరం అన్నారు. అలా ఈ చిత్రానికి నటుడు అధర్వ బలంగా నిలిచారని అన్నారు. అందుకే తాను అధర్వతో మరో చిత్రాన్ని ఏప్రిల్‌లో ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. బూమరాంగ్ చిత్రానికి సహకారాన్ని అందించిన పంకజ్ మెహతా, అన్భుచెలియన్, రాంప్రసాద్‌లకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానన్నారు. బూమరాంగ్ చిత్రాన్ని మంచి తేదీలో విడుదల చేయడానికి సహకరించిన ట్రైడెంట్స్ ఆర్ట్స్ రవీంద్రన్‌కు ధన్యవాదాలు చెప్పుకుంటున్నానని దర్శక నిర్మాత ఆర్.కన్నన్ అన్నారు. చిత్ర కథానాయకుడు అధర్వ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని ఎప్పుడు ప్రారంభించామో, ఎప్పుడు పూర్తి చేశామో తెలియలేదన్నారు. అంతవేగంగా బూమరాంగ్ చిత్రాన్ని పూర్తి చేశామని తెలిపారు. బూమరాంగ్ అంటే కర్మ అని అర్థం అని, మనం ఏం చేశామో అదే మనకు తిరిగి వస్తుందని అన్నారు. ఈ చిత్రం కోసం ప్రచార బృందం అంటూ ఏమీ ఉండదన్నారు. ఈ చిత్రాన్ని తాము అంతా కలిసి జనరంజకంగా రావడానికి శ్రమించి పని చేశామని చెప్పారు. ఇందులో హీరోయిన్లుగా నటించిన మేఘాఆకాశ్, ఇందుజా ఇద్దరూ తమిళ భాష తెలిసిన నటీమణులనీ, వారికి ఉజ్వల భవిష్యత్ ఉంటుందనీ అధర్వ పేర్కొన్నారు. -
ఒక్కడే కానీ మూడు గెటప్స్
‘హృదయం’ ఫేమ్ మురళి గుర్తుండే ఉంటారు. మురళి కుమారుడు అథర్వా మురళి హీరోగా తమిళంలో వరుస సినిమాలతో మంచి బిజీగా ఉన్నారు. లవర్‌బాయ్‌గా లవ్‌స్టోరీ సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం అథర్వ నటిస్తున్న చిత్రాల్లో ‘బూమర్యాంగ్’ ఒకటి. ఈ సినిమా కోసం గుండు చేయించుకున్నారు. ఇందులో అథర్వ మూడు డిఫరెంట్ గెటప్స్‌లో కనిపిస్తారట. అందులో ఈ గుండు పాత్ర ఒకటి. ‘‘ఈ పాత్ర కోసం గుండు చేయించుకుంటే వేరే సినిమాలకు ఇబ్బంది అవుతుంది అనుకున్నాను. కానీ అథర్వ అదేం ఆలోచించలేదు. వెంటనే గుండు చేయించుకున్నాడు. స్క్రిప్ట్‌కి చాలా ముఖ్యమైన సీన్స్ ఇవి’’ అని దర్శకుడు కన్నన్ పేర్కొన్నారు. -
డబ్బింగ్ చెప్పానోచ్..
కొన్నిసార్లు మనసుకి నచ్చిన పాత్రలు చేసినప్పుడు డబ్బింగ్ వేరే వాళ్లు చెబితే నటిగా తమకు పరిపూర్ణత ఉండదని ఫీల్ అవుతుంటారు హీరోయిన్లు. అందుకే వాళ్ల పాత్రలకు వాళ్లే డబ్బింగ్ చెప్పుకుంటుంటారు. మేఘా ఆకాశ్ కూడా ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నారు. అధర్వ మురళి, మేఘా ఆకాశ్ జంటగా రూపొందిన తమిళ చిత్రం ‘బూమర్యాంగ్’. ఈ సినిమాలో మేఘ బాగా నటించారని, వేరేవాళ్లు డబ్బింగ్ చెబితే ఆ కంప్లీట్‌నెస్ పోతుందేమోనని దర్శకుడు కన్నన్ భావించారట. దాంతో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నారు మేఘ. ‘‘డబ్బింగ్ చెప్పడం సరదాగా అనిపించింది’’ అన్నారు మేఘ. నిజానికి మేఘ మాతృభాష తమిళ్. మరి.. మదర్ టంగ్‌లో డబ్బింగ్ చెబితే విశేషం ఏంటి అంటున్నారా? కొందరు నాయికలు మాతృభాషలో కూడా సొంత గొంతు వినిపించరు. వేరేవాళ్లు డబ్బింగ్ చెప్పాల్సిందే. -
అధర్వ కోసం రూ.కోటి సెట్
తమిళసినిమా: సినిమాకు గ్లామర్‌తో పాటు భారీతనం చాలా అవసరం. అదే విధంగా కొత్తదనం కూడా ఉండాలి. అందుకే యువ నటుడు అధర్వ చిత్రంలోని ఒక్క పాట కోసమే కోటి రూపాయల ఖర్చుతో బ్రహ్మాండమైన సెట్‌ను వేశారు. నటుడు అధర్వ నటిస్తున్న తాజా చిత్రం బూమరాంగ్. టైటిల్లోనే కొత్తదనం కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. చిత్రం కూడా జనరంజకంగా ఉంటుందంటున్నారు ఈ చిత్ర దర్శక నిర్మాత ఆర్.కన్నన్. అవును ఇంతకు ముందు పలు విజయవంతమైన చిత్రాలను తెరకెక్కించిన ఈయన తాజాగా మసాలా పిక్చర్స్ పతాకంపై నిర్మిస్తూ, దర్శకత్వం వహిస్తున్న చిత్రం బూమరాంగ్. ఇందులో అధర్వకు జంటగా నటి మేఘాఆకాశ్, ఉపన్పటేల్ నటిస్తున్నారు. ఇందులో ఒక పాట కోసం కళాదర్శకుడు శివ రూ. కోటి వ్యయంతో బ్రహ్మాండమైన సెట్‌ను రూపొందించారట. దీని గురించి దర్శక నిర్మాత ఆర్. కన్నన్ తెలుపుతూ సమాజానికి అవసరం అయిన ఒక ముఖ్యమైన, చాలా బలమైన అంశం గురించి చెప్పే భారీ యాక్షన్ కథా చిత్రంగా బూమరాంగ్ ఉంటుందన్నారు. ఈ చిత్రంలో దేశం గురించి ఒక పాట చోటు ఉంటుందన్నారు. ఈ పాట కోసం ఒక బ్రహ్మాండమైన భారీ సెట్‌ను వేసినట్లు తెలిపారు. సంగీతదర్శకుడు రతన్, గీతరచయిత వివేక్‌ల పాట అద్భుతంగా రావాలన్న తన కలను అర్థం చేసుకుని తాను ఊహించిన దానికంటే బెటర్ పాటను అందించారని అన్నారు. మేయాదమాన్ చిత్రం ఫేమ్ ఇందుజా తమ చిత్రంలో చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తున్నారని తెలిపారు. ఈ పాత్రను ఎవరు పాషించాలన్న చర్చ జరిగినప్పుడు చిత్ర యూనిట్ అంతా ఏకగ్రీవంగా ఇందుజా పేరునే చెప్పారన్నారు. చిత్ర షూటింగ్ ప్రణాళిక బద్దంగా చాలా వేగంగా జరుగుతోందని ఆర్.కన్నన్ చెప్పారు. -
అంచనాలు తారుమారు
సాక్షి, రాజమండ్రి : రాజమండ్రి నగరపాలక సంస్థపై తెలుగుదేశం పార్టీ అంచనాలు బూమరాంగ్ అయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మూడోసారి మేయర్ పీఠం దక్కించుకుందామనుకున్న ఆ పార్టీ నేతలను ఇప్పుడు ఓటమి భయం వెంటాడుతోంది. ఒక పక్క అంతర్గత కుమ్ములాటలు, మరో పక్క పేదల పక్కా ఇళ్ల పంపిణీని అడ్డుకున్న ఆ పార్టీ నేతల పాపం కట్టకట్టుకుని తమకు ముప్పు తెస్తున్నాయని పార్టీ అభ్యర్థులే ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. బాజా భజంత్రీలతో స్థానికేతర జనాలతో డివిజన్లలో టీడీపీ పెద్ద ఎత్తున ప్రచారం సాగిస్తూ పైకి బింకం ప్రదర్శిస్తున్నా, స్థానికులలో వ్యక్తం అవుతున్న వ్యతిరేకత పార్టీ వర్గాలను అంతర్గతంగా గుబులుకు గురిచేస్తోంది. ఎసరు పెడుతున్న అసంతుష్టులు పార్టీ సీనియర్ నేత బుచ్చయ్య చౌదరి కార్పొరేషన్ ఎన్నికల్లో అవలంబించిన కొత్త వ్యూహం బెడిసి కొడుతోంది. సీనియర్లు, పార్టీని నమ్ముకుని కొనసాగుతున్న వారిని కాదని కొత్తవారికి కార్పొరేటర్ టికెట్లు కేటాయించిన తీరు పలువార్డుల్లో క్యాడర్ని తీవ్ర అసంతృప్తికి గురి చేసింది. దీంతో పన్నెండుకు పైగా డివిజన్లలో స్థానిక తమ్ముళ్లు ఇండిపెండెంట్లకు కొమ్ముకాస్తూ, సొంత అభ్యర్థులకు ఎసరు పెడుతున్నారని తెలుస్తోంది. తొలిరోజుల్లో తమ పార్టీకి బూమ్ ఉందని జూమ్ చేసి చూపించిన టీడీపీ నేతలు, తాజా పరిస్థితులు చూసి బెంబేలెత్తుతున్నారు. భంగపడ్డ ఆశావహుల తీరుకు అసంతృప్తిగా ఉన్న అభ్యర్థులు ప్రచారజోరు కూడా తగ్గించారని సమాచారం. పేదల ఇళ్లకు అడ్డుపడిన పాపం వెంటాడుతోంది.. ఎప్పుడు తమకు పక్కా ఇళ్లు అందుతాయా అని నగరంలో నిరుపేదలు ఎనిమిదేళ్లుగా కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారు. ఎట్టకేలకు రెండు నెలల క్రితం అధికారులు 2500 ఇళ్ల పంపిణీని చేపట్టారు.అయితే వీటి పంపకాాలను బుచ్చయ్యచౌదరి నాయకత్వంలో టీడీపీ నేతలు అడ్డుకోవడంతో లబ్ధిదారులు తిరగబడ్డారు. అంతేకాకుండా తరిమికొట్టారు. దీంతో ఆగ్రహించిన బుచ్చయ్య ఈ ప్రభుత్వం ఉండగా ఇళ్లను పంచనివ్వబోమని సభ పెట్టి మరీ సవాల్ చేశారు. నాటి ఈ సంఘటన ప్రభావం నేడు పేదల వాడల్లో ప్రతిఫలిస్తోంది. తమ నోటికాడ కూడు లాక్కున్న నేతకు ఓటడిగే హక్కు ఎక్కడిదని వివిధ డివిజన్లలో ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఈ ఎదురుగాలి నేపథ్యంలో ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి మురళీమోహన్ సైతం డివిజన్లలో పర్యటనకు అనాసక్తత వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. -
రూల్ 77 కింద స్పీకర్‌కు తిరస్కరణ నోటీసు ఇచ్చిన సిఎం
-
ముఖ్యమంత్రి లాస్ట్బాల్ బూమెరాంగ్
ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఇన్నాళ్లుగా లాస్ట్బాల్ అంటూ ఊరించిన వ్యూహం కాస్తా బూమెరాంగ్ అయ్యింది. సొంత పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు.. చీఫ్ విప్ కూడా ముఖ్యమంత్రిపై తీవ్రస్థాయిలో తిరగబడ్డారు. రాష్ట్ర విభజన బిల్లు అంతా తప్పులు తడకలుగా ఉన్నందున దాన్ని రాష్ట్రపతికి తిప్పి పంపాలని స్పీకర్ నాదెండ్ల మనోహర్‌కు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నోటీసు ఇచ్చారు. అసెంబ్లీ రూల్ 77 కింద విభజన బిల్లును తిప్పి పంపాలని ఆయన కోరారు. అయితే దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు మండిపడ్డారు. స్వయంగా చీఫ్ విప్ గండ్ర వెంకటరమణారెడ్డి కూడా ముఖ్యమంత్రిపై తాము విశ్వాసం కోల్పోయామని తెలిపారు. ముఖ్యమంత్రితో పాటు విపక్షనేత చంద్రబాబు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, విభజన బిల్లులో తప్పులున్నాయన్న పేరుతో వాటిని వెనక్కి పంపాలని చెప్పడం సరికాదన్నారు. ఇన్నాళ్లు దీని గురించి ఎందుకు మాట్లాడలేదని, ఇప్పుడు విభజన బిల్లు వెనక్కి పంపాలని సీఎం స్పీకర్‌కు లేఖ రాయడం ఏకపక్ష నిర్ణయమని ఆయన చెప్పారు. ఆయన వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని, సీఎంపై విశ్వాసం కోల్పోయామని గవర్నర్‌ను కలిసేందుకు తెలంగాణ ప్రాంత ప్రజా ప్రతినిధులమంతా చర్చించుకుని నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. పనిలో పనిగా గండ్ర వెంకట రమణారెడ్డితో పాటు టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు కేటీఆర్, ఈటెల రాజేందర్ గవర్నర్ నరసింహన్‌ను కూడా కలవాలని నిర్ణయించారు.