ఈ ఫొటోలో కనిపిస్తున్న రాయి ఒక గ్రహశకలం. ఇటీవల ఇది సహారా ఎడారిలో దొరికింది. అప్పుడప్పుడు పలుచోట్ల గ్రహశకలాలు నేల మీదకు రాలిపడటం మామూలే! ఇందులో విశేషమేమిటంటారా? ఇది మొట్టమొదటి బూమరాంగ్ గ్రహశకలమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గ్రహశకల ప్రభావం కారణంగా దాదాపు పదివేల ఏళ్ల కిందట ఇది భూమి నుంచి విడివడి అంతరిక్షానికి తుళ్లిపోయిందని, మళ్లీ అక్కడి నుంచి నేల మీదకు రాలిపడిందని వారు చెబుతున్నారు.
ఈ గ్రహశకలానికి శాస్త్రవేత్తలు ‘ఎన్‌డబ్ల్యూఏ 13188’ అని పేరుపెట్టారు. దీనిపై ఫ్రాన్స్‌లోని మార్సిలే యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు పరిశోధనలు జరుపుతున్నారు. ఈ శిలలో భూఉపరితలానికి చెందిన పదార్థాలే ఉన్నాయని, ఇది అగ్నిపర్వతానికి చెందిన శిల అని వారు వెల్లడించారు. గ్రహశకలాల అన్వేషకులు కొందరు దీనిని 2018లో మొరాకోలోని సహారా ఎడారి ప్రాంతంలో కనుగొన్నారు. ఇది శాస్త్రవేత్తలకు చేరడంతో, వారు దీనిపై సుదీర్ఘ పరిశోధనలు జరిపి, ఇది భూమ్మీద దొరికిన మొట్టమొదటి ‘బూమరాంగ్ గ్రహశకలం’ అని ప్రకటించారు.
(చదవండి: నీటిలోని కాలుష్యాన్ని క్లీన్ చేసే.." మైక్రో రోబోలు")
Comments
Please login to add a commentAdd a comment