
ఇంతవరకు ప్రపంచం అంతం ఫలానా టైంలో అంటూ ఏవేవో పుకార్లు హల్‌చల్ చేశాయి. వాటిపై సినిమాలు కూడా వచ్చాయి. కానీ అది నిజంగా ఎప్పుడని చెప్పేందుకు కచ్చితమైన ఆధారాలు కానరాలేదు. తాజాగా సరిగ్గా ఆ ఏడాదిలోనే ప్రపంచం అంతం అని చెప్పేందుకు ఆధారాలు వెలుగులోకి వచ్చాయి. అది కూడా సర్ హైజాక్ న్యూటన్ పరిశోధనలో బహిర్గతమవ్వడం విశేషం. నిజానికి దాన్ని ఆ శాస్త్రవేత్త ఎలా నిర్థారించారనేది కూడా పరిశోధనలో వివరించారు.
చలనం, గురుత్వాకర్షణ నియమాలను రూపొందించడంలో ప్రసిద్ధి చెందిన సర్ ఐజాక్ న్యూటన్ 1704లో రాసిన ఓ లేఖలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఇలా ప్రపంచం అంతం అవ్వడాన్ని ముందుగా అంచనా వేయడాన్ని డూమ్స్‌డే సిద్ధాంతం లేదా ప్రవచనం అని అంటారు. ఇక న్యూటన్ తన డూమ్స్‌డే ప్రవచనాన్ని బైబిల్ పొటెస్టంట్ వివరణ, బైబిల్ చరిత్ర తర్వాత జరిగిన సంఘటనలు, ఆర్మగెడానా యుద్ధం ఆధారంగా ఆ విషయాన్ని నిర్థారించినట్లు లేఖలో పేర్కొన్నారు.
తాను చెప్పిన ఏడాది కంటే ముందే ప్రపంచం ముగిసిపోతుంది అనడానికి ఎలాంటి కారణాలు కనిపించడం లేదని ఆ లేఖలో తెలిపారు. ఇది కేవలం అంత్య సమయం అంచనా వేయడానికే గాక ఊహజనిత వ్యక్తుల తొందపాటు ఊహలను ఆపడం, వారి అంచనాలు సరైన కావని తేల్చి చెప్పేందుకే ఇలా దీనిపై పరిశోధన చేసి మరి గణించినట్లు లేఖలో వివరించారు
అదంతా 150 నవల నిడివి గల పుస్తకాల్లో పొందుపరిచినట్లు తెలిపారు. దానిలోని 1260, 1290, 2300 రోజుల సంఖ్యను ఉపయోగించి ఏ ఏడాది అంతమవుతుందనేది నిర్ణయించాడు న్యూటన్. దీనిలోని కొన్ని ముఖ్యమైన క్షణాల ముగింపు, ప్రారంభాన్ని సూచిస్తాయి. ఆ రోజులను సంవత్సరాలుగా నిర్ణయించాడు. తత్ఫలితంగా 800 ADని చర్చిని వదిలివేయడం అధికారికంగా ప్రారంభమైన తేదీగా నిర్ణయించారు.
అదే పవిత్ర రోమన్ సామ్రాజ్యం స్థాపించబడిన సంవత్సరం. అంటే ప్రపంచం ఆరంభమైన 1,260 సంవత్సరాలకు మళ్లీ రీసెట్ అవుతుందని లేఖలో తెలిపారు. ఆదిమ సంవత్సర క్యాలెండర్ ప్రకారం పన్నెండు నుంచి ఒక సంవత్సరం ముప్పే రోజుల నుంచి ఒక నెల వరకు లెక్కడించడం జరుగుతుందని లేఖలో పేర్కొన్నారు.
స్వల్పకాలిక జంతువుల రోజులను జీవించిన రాజ్యాల సంవత్సరాలకు గుర్తుగా ఉంచారు. 1260 రోజుల కాలం, ముగ్గురు రాజులు AC 800 పూర్తి విజయం సాధించిన తేదీలుగా నిర్ణయిస్తే ముగింపు కాలం ఏసీ 2060తో ముగుస్తుందట.
ఇలాంటే డూమ్స్ డే అంచనాలను వేసిన ఏకైక వ్యక్తి న్యూటన్ మాత్రమే కాదు 1500 లలో నివసించిన ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్, 2025 లో ఒక పెద్ద గ్రహశకలం భూమిని ఢీకొట్టవచ్చని లేదా గ్రహానికి ప్రమాదకరమైన సామీప్యతలోకి రావచ్చని అంచనా వేశారు.
(చదవండి: కొత్త.. రుచుల కోకా కట్టుకున్నదీ పేట..)
Comments
Please login to add a commentAdd a comment