prediction
-
2025.. ప్రపంచం అంతానికి ఆరంభం: బాబా వంగా కాలజ్ఞానం
బాబా వంగా.. దివ్యదృష్టి కలిగిన బల్గేరియన్ కాలజ్ఞాని. ఈమెను ‘నోస్ట్రాడమస్ ఆఫ్ ది బాల్కన్స్’ అని కూడా పిలుస్తారు. రెండవ ప్రపంచ యుద్ధం లాంటి ప్రధాన సంఘటనలను ఈమె ముందుగానే ఊహించారని చెబుతారు. రాబోయే సంవత్సరం అంటే 2025లో జరగబోయే ఒక ఘటన గురించి బాబా వంగా ముందుగానే చెప్పారు.2025లో ఐరోపాలో జరిగే ఒక భారీ యుద్ధం గురించి వంగా ముందుగానే హెచ్చరించారు. ఇది ప్రపంచ జనాభాకు భారీ చేటు తీసుకురానున్నదని ఆమె పేర్కొన్నారు. 5079 నాటికి మానవజాతి పూర్తిగా నాశనమవుతుంది.. అందుకు 2025లో ప్రపంచం అంతమయ్యేందుకు బీజం పడుతుందని బాబా వంగా తీవ్రంగా హెచ్చరించారు. 2043 నాటికి యూరప్ ముస్లిం పాలనలోకి వస్తుందని, 2076 నాటికి కమ్యూనిజం ప్రపంచవ్యాప్తంగా తిరిగి విస్తరిస్తుందని ఆమె అంచనా వేశారు.2025 నాటికి భూమిపై గ్రహాంతర జీవులు కనిపిస్తాయని, ఈ జీవులు భూమిపై తమ ఉనికిని చాటుకుంటాయని ఆమె పేర్కొన్నారు. కాగా 16వ శతాబ్దపు ఫ్రెంచ్ జ్యోతిష్కుడు నోస్ట్రాడమస్ కూడా ఇదే విధమైన అంచనాలు అందించారు. ఆయన 2025లో జరగబోయే యూరోపియన్ యుద్ధం గురించి ప్రస్తావించారు. బాబా వంగా భవిష్యత్‌లో జరగబోయే వాతావరణ మార్పుల కారణంగా ఏర్పడే కరువు, అడవులలో కార్చిచ్చు తదితర పర్యావరణ విపత్తులను ముందుగానే అంచనా వేశారు. 1911 అక్టోబర్ 3న జన్మించిన బాబా వంగా తన 84వ ఏట 1996 ఆగస్టు 11న కన్నుమూశారు. నిజమైన బాబా వంగా అంచనాలురెండవ ప్రపంచ యుద్ధం: విధ్వంసం, భారీ మరణాల అంచనాసోవియట్ యూనియన్ విచ్ఛిన్నం: యూఎస్ఎస్ఆర్ పతనాన్ని 1991కి ముందే ఊహించారు.చెర్నోబిల్ విపత్తు: 1986లోనే బాబా వంగా అంచనా వేశారు.స్టాలిన్ మరణం: బాబా వంగా ముందుగానే చెప్పారు.కుర్స్క్ జలాంతర్గామి విపత్తు: 2000కి ముందుగానే వంగా ఊహించారు. సెప్టెంబర్ 11 దాడులు: ‘ఉక్కు పక్షులు’ అమెరికాపై దాడి చేస్తాయని బాబా వంగా ముందుగానే అంచనా వేశారు. 2004 సునామీ: హిందూ మహాసముద్రంలో విధ్వంసకర సునామీ ప్రమాదం.1985 భూకంపం: ఉత్తర బల్గేరియాలో భూకంపం.9/11 దాడులతో సహా పలు ముఖ్యమైన సంఘటనలలో బాబా వంగా భవిష్య అంచనాలు 85శాతం వరకూ నిజమయ్యాయని కొందరు నిపుణులు చెబుతుంటారు.ఇది కూడా చదవండి: బ్యాటరీలు, బ్లేడ్లు సహా పొట్టలో 56 వస్తువులు -
ప్రోటీన్లపై పరిశోధనకు నోబెల్
స్టాక్‌హోమ్: మనిషి ఆరోగ్యకరమైన జీవనానికి మూలస్తంభాలైన ప్రోటీన్ల డిజైన్లు, వాటి పనితీరుపై విశేష పరిశోధనలు చేసిన ముగ్గురు శాస్త్రవేత్తలకు ఈ సంవత్సరం రసాయనశాస్త్ర విభాగంలో నోబెల్ అవార్డ్ వరించింది. ప్రోటీన్లపై శోధనకుగాను శాస్త్రవేత్తలు డేవిడ్ బెకర్, డెమిస్ హసాబిస్, జాన్ జంపర్లకు 2024 ఏడాదికి కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు కెమిస్ట్రీ నోబెల్ కమిటీ సారథి హెనర్ లింక్ బుధవారం ప్రకటించారు. పురస్కారంతోపాటు ఇచ్చే దాదాప రూ.8.4 కోట్ల నగదు బహుమతిలో సగం మొత్తాన్ని బేకర్‌కు అందజేయనున్నారు. మిగతా సగాన్ని హసాబిస్, జాన్ జంపర్లకు సమంగా పంచనున్నారు. జీవరసాయన శాస్త్రంలో గొప్ప మలుపు ‘‘అమైనో ఆమ్లాల క్రమానుగతి, ప్రోటీన్ల నిర్మాణం మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరించారు. వీరి పరిశోధన రసాయనరంగంలో ముఖ్యంగా జీవరసాయన శాస్త్రంలో మేలి మలుపు. ఈ ముందడుగుకు కారకులైన వారికి నోబెల్ దక్కాల్సిందే’’ అని నోబెల్ కమిటీ కొనియాడింది. అమెరికాలోని సియాటెల్‌లో ఉన్న వాషింగ్టన్ విశ్వవిద్యాలయంలో డేవిడ్ బేకర్ పనిచేస్తున్నారు. హసాబిస్, జాన్ జంపర్ లండన్‌లోని గూగుల్ సంస్థకు చెందిన డీప్‌మైండ్ విభాగంలో పనిచేస్తున్నారు. ‘‘బేకర్ 2003లో ఒక కొత్త ప్రోటీన్‌ను డిజైన్‌చేశారు. అతని పరిశోధనా బృందం ఇలా ఒకదాని తర్వాత మరొకటి కొత్త ప్రోటీన్లను సృష్టిస్తూనే ఉంది. వాటిల్లో కొన్నింటిని ప్రస్తుతం ఫార్మాసూటికల్స్, టీకాలు, నానో మెటీరియల్స్, అతి సూక్ష్మ సెన్సార్లలో వినియోగిస్తున్నారు. వీళ్ల బృందం సృష్టించిన సాంకేతికతతో వెలువడిన ఎన్నో కొత్త డిజైన్ల ప్రోటీన్లు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి’’అని నోబెల్ కమిటీలో ప్రొఫెసర్ జొహాన్ క్విస్ట్ శ్లాఘించారు. BREAKING NEWSThe Royal Swedish Academy of Sciences has decided to award the 2024 #NobelPrize in Chemistry with one half to David Baker “for computational protein design” and the other half jointly to Demis Hassabis and John M. Jumper “for protein structure prediction.” pic.twitter.com/gYrdFFcD4T— The Nobel Prize (@NobelPrize) October 9, 2024 నిర్మాణాలను అంచనా వేసే ఏఐ మోడల్ డెమిస్ హసాబిస్, జంపర్లు సంయుక్తంగా ప్రోటీన్ల నిర్మాణాలను ఊహించగల కృత్రిమమేధ నమూనాను రూపొందించారు. దీని సాయంతో ఇప్పటిదాకా కనుగొన్న 20 కోట్ల ప్రోటీన్ల నిర్మాణాలను ముందే అంచనావేయొచ్చు. చదవండి: ఏఐ మార్గదర్శకులకు...ఫిజిక్స్ నోబెల్ -
48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం?
మరో రెండు రోజుల్లో అంటే రాబోయే 48 గంటల్లో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోంది. న్యూ నోస్ట్రాడమస్‌గా పేరొందిన భారతీయ జ్యోతిష్య నిపుణులు కుశాల్ కుమార్ ఈ అంచనా వేశారు. జూన్ 18న మూడో ప్రపంచ యుద్ధం ప్రారంభం కాబోతోందని కుశాల్ తెలిపారు.ఆయన వెల్లడించిన వివరాల ప్రకారం భారత్-పాక్ సరిహద్దుల్లో ఉగ్రదాడులు, ఉత్తర కొరియా సైన్యం దక్షిణ కొరియా సరిహద్దు ప్రాంతంలోకి ప్రవేశించడం, ఇజ్రాయెల్- లెబనాన్ మధ్య పెరుగుతున్న ఘర్షణలు ఇవన్నీ మూడవ ప్రపంచ యుద్ధం ప్రారంభానికి సంకేతాలు.జూన్ 18న సంభవించే అత్యంత బలమైన గ్రహాల సంఘర్షణ ఫలితంగా మూడవ ప్రపంచ యుద్ధం మొదలవుతుందని కుశాల్ తెలిపారు. మేలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మృతి చెందిన తర్వాత కుశాల్ ఈ అంచనా అందించారు. జూన్ 9న యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి దీనికి ముందస్తు సూచనగా ఆయన పేర్కొన్నారు. కాగా ఈ దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మట్టుబెట్టే పనిలో మన సైనికులు నిమగ్నమై ఉన్నారు. జూన్ 10, 12 తేదీల్లో కూడా ఉగ్రదాడులు జరిగాయి.కుశాల్ కుమార్ అంచనా ప్రకారం రాబోయే 48 గంటలు క్లిష్టమైనవి. ఈ సమయంలో యుద్ధం చెలరేగే అవకాశం ఉంది. మూడో ప్రపంచ యుద్ధం పెను విధ్వంసాన్ని నృష్టించనుంది. ఆకాశం నుంచి ఉపగ్రహాలు కిందికి దూసుకువస్తాయని, అడవులు బూడిదగా మారుతాయని ఆయన తెలిపారు. అన్ని దేశాలు ఒకదానితో మరొకటి పోరాటానికి దిగుతాయని, ఈ యుద్ధం మొత్తం ప్రపంచాన్నంతటినీ సర్వనాశనం చేస్తుందని కుశాల్ వివరించారు. -
సెఫాలజిస్ట్ యోగేంద్ర ప్రెడిక్షన్... శశిథరూర్ ఆసక్తికర కామెంట్స్
తిరువనంతపురం: లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ సొంతగా మ్యాజిక్‌ఫిగర్ దాటదని ప్రముఖ సెఫాలజిస్ట్ యోగేంద్రయాదవ్ చేసిన వ్యాఖ్యలపై ఎంపీ శశిథరూర్ స్పందించారు. మ్యాజిక్ ఫిగర్‌కు కావల్సిన 272 సీట్లు బీజేపీకి ఈసారి సొంతగా రావని యోగేంద్ర ఇటీవల చెప్పారు.ఎన్డీఏ కూటమి మొత్తం కలిసి మాత్రం మెజారిటీ సీట్లు సాధిస్తుందని తెలిపారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఈసారి మెరుగైన సీట్లు సాధిస్తుందని జోస్యం చెప్పారు. దీనిపై శశిథరూర్ ఎక్స్(ట్విటర్)లో స్పందించారు.ప్రభుత్వ వ్యతిరేకత ఫ్యాక్టర్ వల్ల బీజేపీ 230 సీట్లకు కూడా పడిపోవచ్చన్నారు. ముందు ముందు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకేనే అవకాశం ఉందని థరూర్ పేర్కొన్నారు. -
‘నాలుగు రోజుల్లో మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ దాడులు’
భోపాల్: త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాజస్తాన్‌లో మాదిరిగానే మధ్యప్రదేశ్‌లో కూడా వచ్చే నాలుగు రోజుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) బృందాలు సోదాలు జరిపే అవకాశముందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ జోస్యం చెప్పారు. ఇటీవలే రాజస్తాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు, మాజీ విద్యాశాఖ మంత్రి గోవింద్ సింగ్ దోతాస్రా ఇంటిపై ఈడీ దాడులు జరిగిన విషయం తెలిసిందే. పరీక్ష పేపర్ లీకేజీ కేసులో మనీల్యాండరింగ్ ఆరోపణలపై సోదాలు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఆదివారం భోపాల్‌లో జరిగిన మీడియా సమావేశంలో దిగ్విజయ్ సింగ్ ఈ దాడులను ప్రస్తావించారు. ఒకపక్క అధికారులను వేధిస్తున్న బీజేపీ నేతలు, మరోపక్క రాజస్తాన్ లో మాదిరిగా మధ్యప్రదేశ్‌లోనూ ఈడీ సోదా లు జరిపిస్తారని అన్నారు. దాడులు జరగటానికి అవకాశం ఉందంటూ కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నేతల పేర్లను ఆయన పేర్కొన్నారు. -
అక్టోబరు 14 నుంచి మరిన్ని విపత్తులు? అభిజ్ఞానంద ఏం చెప్పాడు?
జ్యోతిష్యం... ఇది నమ్మకాలకు సంబంధించిన శాస్త్రం. దీనిని నమ్మేవారు జాతకాల ప్రకారమే జీవితాలు ముందుకు సాగుతుంటాయని చెబుతుంటారు. దీనిని నమ్మనివారు జాతకాలనేవి మూఢ నమ్మకాలని చెబుతుంటారు. అయితే ఒక్కోసారి జ్యోతిష్కులు కాలగణనను అనుసరించి తెలిపే భవిష్యవాణి నిజమవుతుంటుంది. ఒక్కోసారి నిజాలు కాకుండా మిగిలిపోతాయి. దీంతో ఒక్కోసారి జ్యోతిష్కులు గొప్పవారని, మరోమారు వారు తప్పుదారి పట్టిస్తుంటారని పలువురు చెబుతుంటారు. ఏదిఏమైనా కర్నాటకలోని మైసూరువాసి అభిజ్ఞానంద చెప్పే భవిష్యవాణిపై కొందరు ఆసక్తి కనబరుస్తుంటారు. చిన్నవయసులోనే అపరిమితమైన విషయపరిజ్ఞానాన్ని సంపాదించి, అందరి మెప్పుపొందిన అభిజ్ఞానంద మరోమారు భవిష్యవాణి వినిపించారు. అభిజ్ఞానంద చెప్పిన కొంత భవిష్యవాణి నిజం కాగా, మరికొంత ఫెయిలయ్యింది. అయితే ఆ కుర్రాడి నాలెడ్జ్, పరిణతి అందరినీ ఆకట్టుకుంటోంది. 2006లో జన్మించిన అభిజ్ఞానంద బాల్యం నుంచే తన మేథోతనాన్ని ప్రదర్శించసాగాడు. కరోనా విపత్తు గురించి ముందే చెప్పి, అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఎంతో పేరు సంపాదించుకున్నాడు. మరోవైపు 8 ఏళ్ల వయసుకే భగవద్గీతను కంఠతా పట్టేసి, వాటికి వివరణలు ఇస్తూ అందరినీ ఆకట్టుకున్నాడు. పిన్నవయసులోనే ఆయుర్వేదిక్ మైక్రోబయాలజీలో పోస్ట్‌గ్రాడ్యుయేషన్ చేసిన అభిజ్ఞానంద తాజాగా మరో భవిష్యవాణిని వినిపించాడు. ముంబై దాడులు జరిగిన సమయంలో ఎటువంటి గ్రహగతులు ఉన్నాయో ఇప్పుడు కూడా అటువంటి పరిస్థితులే ఉన్నాయని, ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం పెచ్చుమీరే పరిస్థితులున్నాయని అభిజ్ఞానంద జోస్యం చెప్పాడు. దీనికితోడు పలు విపత్తులు ప్రపంచాన్ని చుట్టిముడతాయని, దీంతో వరుస విషాదాలు వెంటాడుతాయని పేర్కొన్నాడు. ముఖ్యంగా ఈ ఏడాది అక్టోబరు 14 తరువాత ప్రపంచ రాజకీయాల్లో భారీ మార్పులు చోటుచేసుకుంటాయని, కొన్ని ప్రాంతాల్లో అనుకోని సంఘటనలు జరుగుతాయని అభిజ్ఞానంద తెలిపాడు. తాజాగా ఆఫ్ఘనిస్తాన్ భూకంపం, ఇజ్రాయిల్‌పై దాడుల నేపధ్యంలో అభిజ్ఞానంద వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఏ గ్రహగతుల కారణంగా ఇటువంటి విపత్కర పరిస్థితులు సంభవిస్తాయో ఆ వీడియోలో తెలియజేశాడు. తన వీడియోలో ఒక మ్యాప్ పొందుపరిచి.. ఏఏ ప్రాంతాల్లో కల్లోలం ఏర్పడుతుందో చూపించాడు. ఇజ్రాయెల్, పాలస్తీనాల యుద్ధ ప్రభావం ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాలపై కూడా ప్రభావం చూపనుందని పేర్కొన్నాడు. ఈ గ్రహతుల ప్రభావం భారతదేశంపైన కూడా ఉన్నదని అభిజ్ఞానంద తెలిపాడు. ఇది కూడా చదవండి: కిమ్ సోదరి యో జోంగ్ ఎందుకంత డేంజర్? -
వచ్చే ఉగాదికి ఘోర విపత్తు.. జోస్యం చెప్పిన కోడిమఠం స్వామి
దొడ్డబళ్లాపురం: దేశంలో 2024 ఉగాది నాటికి ఫెర దుర్ఘటన జరుగుతుందని కోడిమఠం స్వామి జోస్యం చెప్పారు. విపత్తుల గురించి ఆయన తరచ జోస్యాలు చెప్పడం తెలిసిందే. ఆదివారంనాడు హాసన్ జిల్లా అరసికెరె తాలకా హారనహళ్లిలోని కోడిమఠంలో మీడియాతో మాట్లాడిన ఆయన ప్రపంచానికి మూడు గండాలు ఉన్నాయని అన్నారు. ఒకటి రెండు దేశాలు కనుమరుగవుతాయని, జనం అకాల మృత్యువాత పడతారని చెప్పారు. 2024 ఉగాదిలోపు ముగ్గురు ప్రముఖ వ్యక్తులకు గండం ఉందని, పాలకులు ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఈ గండాలను తప్పించవచ్చన్నారు. ఆ గండాలేమిటో కాలం వచ్చినప్పుడు చెబుతానన్నారు. భారీవర్షాలు కురిసి పట్టణాలకు, నగరాలకు అపాయం ఉందన్నారు. పెద్ద పెద్ద భవనాలు కుప్పకూలుతాయన్నారు. అందరూ ఆధ్యాతి్మక చింతన అలవరచుకోవాలన్నారు. -
అవిశ్వాసం.. నాలుగేళ్ల కిందటి ప్రధాని మాటలు వైరల్
ఢిల్లీ: ఎన్డీయే సర్కార్‌పై అవిశ్వాసం ప్రవేశపెట్టిన వేళ.. మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. విపక్షాలు మళ్లీ 2023లో అవిశ్వాసం తీర్మానం ప్రవేశపెడతాయని ప్రధాని నరేంద్ర మోదీ నాలుగేళ్ల కిందట మాట్లాడిన మాటల్ని బీజేపీ వైరల్ చేస్తోంది. 2019 ఫిబ్రవరి 7వ తేదీన బడ్జెట్ సమావేశాల టైంలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించారు. ఆ సమయంలో 2023లో ప్రతిపక్షం మరో అవిశ్వాసానికి రెడీ అవుతుందని వ్యాఖ్యానించారు. ‘‘2023లో మరో అవిశ్వాసంతో ముందుకు వచ్చేలా వాళ్లకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’’ అంటూ ఆయన ప్రసంగించగా.. పక్కనే ఉన్న రాజ్‌నాథ్ సహా అధికార ఎంపీలంతా టేబుల్స్‌ను తట్టి నవ్వులు చిందించారు. ‘‘మేం చేసిన సేవకు ఇద్దరు ఎంపీల నుంచి ఇప్పుడు అధికారంలోకి వచ్చాం. అహంకారంతో వాళ్లు 400 నుంచి 40కి పడిపోయారు. ఇవాళ వాళ్లు ఎక్కడున్నారో చూడండి.. అంటూ కాంగ్రెస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారాయన. ఆ సమయంలో సోనియా గాంధీ, ఇతర కాంగ్రెస్ నేతలు సైతం అక్కడే ఉన్నారు. VIDEO: PM Sh @narendramodi had made a prediction 5 years back about the opposition bringing a No confidence motion! pic.twitter.com/dz8McicQ40 — Dr Jitendra Singh (@DrJitendraSingh) July 26, 2023 అంతకు ముందు ఏడాది అంటే.. 2018లో మోదీ ప్రభుత్వంపై అప్పటి యూపీఏ కూటమి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టింది. ఎన్డీయేకు 325 మంది, విపక్షాలకు 126 మంది మద్దతు ఇవ్వడంతో అది వీగిపోయింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఇండియా కూటమి, బీఆర్ఎస్ పార్టీ వేర్వేరుగా ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. స్పీకర్ ఓం బిర్లా చర్చకు అనుమతిస్తూ.. అఖిలపక్ష భేటీ తర్వాత తేదీని నిర్ణయయిస్తామని లోక్‌సభలో వెల్లడించారు. -
‘ఒడిశా ఘోర రైలు ప్రమాదం.. దేశానికి మరో ముప్పు ఉంది’
కోలారు(బెంగళూరు): ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం జరిగిన తరువాత దేశానికి మరో ప్రమాదం పొంచి ఉందని కోడిమఠం శివానంద శివయోగి స్వామి తెలిపారు. ఆయన తరచూ జోస్యాలు చెబుతూ ఉండడం తెలిసిందే. గురువారం తాలూకాలోని సుగటూరు గ్రామంలోని యోగి నారాయణస్వామి మఠాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు. తాను గతంలో చెప్పినట్లుగా ఈసారి రాష్ట్రంలో పూర్తి మెజారిటీ కలిగిన ప్రభుత్వం వచ్చింది. అదే విధంగా ఈ సంవత్సరం పెద్ద ప్రమాదం సంభవిస్తుందని తెలిపిన విధంగానే ఘోర రైలు ప్రమాదం జరిగింది. ఆపై దేశానికి మరో పెను ప్రమాదం పొంచి ఉందని అన్నారు. కై వార తాతయ్య మళ్లీ పుట్టి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయన్నారు. అలాంటి సూచనలు ఇప్పటికే కొండ ప్రాంతంలో కనిపించిందన్నారు. రాష్ట్రంలో ఆధ్యాత్మికత దారి తప్పితే ప్రభుత్వానికి ప్రమాదమని తెలిపారు. చదవండి: పట్టాలు తప్పిన ఊటీ టాయ్ ట్రైన్ -
CSK Vs RR: పటిష్టమైన రాజస్థాన్ రాయల్స్‌తో సీఎస్కే 'ఢీ'.. గెలుపెవరిది..?
ఐపీఎల్-2023 సీజన్లో ఇవాళ (ఏప్రిల్ 12) మరో రసవత్తర సమరం జరుగునుంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా రాజస్థాన్ రాయల్స్- చెన్నై సూపర్ కింగ్స్ హోరాహోరీగా తలపడనున్నాయి. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ప్రస్తుత సీజన్లో ఇరు జట్లు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో చెరి రెండిటిలో గెలుపొంది, పాయింట్ల పట్టికలో 2 (ఆర్ఆర్), 5 (సీఎస్కే) స్థానాల్లో నిలిచాయి. ఈ మ్యాచ్‌లో గెలుపెవరిది అన్న విషయాన్ని విశ్లేషిస్తే.. ప్రస్తుత సమీకరణల దృష్ట్యా రాజస్థాన్‌కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయి. ఆ జట్టు ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు సాధించింది. బ్యాటింగ్‌లో యశస్వి, బట్లర్, కెప్టెన్ శాంసన్, హెట్‌మైర్.. బౌలింగ్‌లో బౌల్ట్, చహల్, అశ్విన్ భీకర ఫామ్‌లో ఉన్నారు. పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్‌లోనూ వీరు రాణించినప్పటికీ.. ప్రభ్‌సిమ్రన్, శిఖర్ ధవన్ అద్భుతంగా బ్యాటింగ్ చేసి ఆర్ఆర్ హ్యాట్రిక్ విజయావకాశాలపై దెబ్బకొట్టారు. సీఎస్కే విషయానికొస్తే.. ఈ జట్టు కూడా ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించి, పర్వాలేదనిపిస్తుంది. రెండు మ్యాచ్‌ల్లో నామమాత్రపు స్కోర్లు సాధించినా.. లక్నోపై మాత్రం భారీ స్కోర్ చేసింది. సీఎస్కే బ్యాటింగ్ విభాగం మొత్తం రుతురాజ్ గైక్వాడ్‌పైనే ఆధారపడి ఉంది. ఈ జట్టు గెలిచిన రెండు మ్యాచ్‌ల్లో తలో చేయి వేస్తే గట్టెక్కింది. కోట్లు పోసి కొన్న ఆటగాళ్లు (చాహర్, స్టోక్స్) గాయాల బారిన పడటం ఆ జట్టుకు మైనస్ పాయింట్‌గా చెప్పవచ్చు. అనారోగ్యం కారణంగా గత మ్యాచ్ ఆడని మొయిన్ అలీ ఈ మ్యాచ్‌కు కూడా అందుబాటులోకి రాకపోతే జట్టు విజయావకాశాలు భారీగా దెబ్బతింటాయి. కాన్వే, రాయుడు, దూబే పర్వాలేదనిపిస్తున్నా వారి స్థాయికి తగ్గ ఆటతీరును కనబర్చాల్సి ఉంది. జడేజా, ధోని లోయర్ ఆర్డర్లో వస్తుండటంతో వారికి పెద్దగా అవకాశాలు రావడం లేదు. వారి నుంచి కూడా మ్యాచ్ విన్నింగ్స్ నాక్ బాకీ ఉంది. ముంబైతో మ్యాచ్‌లో వెటరన్ రహానే సుడిగాలి హాఫ్‌సెంచరీ చేయడం సీఎస్కేకు శుభపరిణామం. బౌలింగ్‌లో జడేజా, సాంట్నర్, తుషార్ దేశ్‌పాండే, హంగార్గేకర్ పర్వాలేదనిపిస్తున్నారు. ఓవరాల్‌గా చూస్తే ఇరు జట్లు సమవుజ్జీలుగా కనిపిస్తున్నప్పటికీ.. సీఎస్కేపై రాజస్థాన్‌కే విజయాకాశాలు అధికంగా ఉన్నాయి. తుది జట్ల విషయానికొస్తే.. సీఎస్కే రెండు మార్పులు చేయవచ్చు. మొయిన్ అలీ రీఎంట్రీ ఖాయం కాగా.. స్టోక్స్, దీపక్ చాహర్ ఈ మ్యాచ్‌లో ఆడటం అనుమానమే. ఆర్ఆర్ జట్టు డీసీపై గెలుపొందిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. తుది జట్లు (అంచనా).. సీఎస్కే: డెవాన్ కాన్వే, రుతురాజ్, రహానే, జడేజా, ధోని, శివమ్ దూబే, ప్రిటోరియస్, సాంట్నర్, మొయిన్ అలీ, రాయుడు, మగాలా, తుషార్ దేశ్‌పాండే ఆర్ఆర్: యశస్వి జైస్వాల్, బట్లర్, శాంసన్, రియాన్ పరాగ్, హెట్‌మైర్, దృవ్ జురెల్, అశ్విన్, హోల్డర్, బౌల్ట్, సందీప్ శర్మ, చహల్, మురుగన్ అశ్విన్ -
DC VS MI: బోణీ కొట్టని జట్ల మధ్య పోటీ.. గెలుపెవరిది..? అర్జున్ ఎంట్రీ పక్కా..!
ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 11) మరో రసవత్తర సమరంగా జరుగనుంది. ప్రస్తుత ఎడిషన్‌లో ఇప్పటిదాకా బోణీ కొట్టని ఢిల్లీ క్యాపిటల్స్- ముంబై ఇండియన్స్ జట్లు ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో అమీతుమీ తేల్చుకోనున్నాయి. రాత్రి 7: 30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలపెవరిది అన్న విషయాన్ని విశ్లేషిస్తే.. ప్రస్తుత జట్ల సమీకరణల దృష్ట్యా ఢిల్లీకే విజయావకాశాలు కాస్త ఎక్కువగా ఉన్నాయి. అయితే ఇదే రిజల్ట్ వస్తుందని మాత్రం కచ్చితంగా చెప్పలేము. గత రెండ్రోజులుగా నడుస్తున్న ట్రెండ్ చూస్తే ఈ విషయం అర్ధమవుతుంది. గెలుస్తాయనుకున్న జట్లు ఓడాయి, ఓడిపోతాయనుకున్న జట్లు సంచలన విజయాలు నమోదు చేశాయి. గత రెండు మ్యాచ్‌ల్లో బ్యాటర్లు క్షణాల వ్యవధిలో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశారు. గుజరాత్‌తో మ్యాచ్‌లో కేకేఆర్ ఆటగాడు రింకూ సింగ్ (ఆఖరి 5 బంతులకు 5 సిక్సర్లు), ఆర్సీబీతో మ్యాచ్‌లో లక్నో ఆటగాడు పూరన్ (15 బంతుల్లో 50) ఓడతాయనుకున్న తమ జట్లను ఒంటిచేత్తో గెలిపించారు. ఎంఐ-డీసీ మ్యాచ్ విషయానికొస్తే.. జట్ల బలాబలాల పరంగా చూస్తే ముంబైతో పోలిస్తే డీసీ కాస్త బలంగా కనిపిస్తుంది. ప్రస్తుత సీజన్లో ఇరు జట్లు ఆడిన మ్యాచ్‌లను పరిశీలిస్తే, ముంబైతో పోలిస్తే డీసీ ప్రదర్శన కాస్త మెరుగ్గా ఉందని చెప్పాలి. ముంబై బ్యాటర్లు (తిలక్ వర్మ మినహా) తామాడిన రెండు మ్యాచ్‌ల్లో పరుగులు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. డీసీ బ్యాటర్లు సైతం తామాడిన 3 మ్యాచ్‌ల్లో ఇదే పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. వార్నర్, రొస్సో కాస్త పర్వాలేదనిపించారు. బౌలింగ్ విషయానికొస్తే.. ఈ విభాగంలోనూ ముంబై కంటే డీసీ ఆటగాళ్లే బెటర్‌గా ఉన్నారు. ముంబై బౌలింగ్ విభాగమంతా ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్‌ల్లో కేవలం 5 వికెట్లు మాత్రమే పడగొట్టగలిగారు. ఇదొక్కటి చాలు ముంబై బౌలింగ్ ఎంత బలహీనంగా ఉందో చెప్పడానికి. మరో పక్క డీసీ బౌలింగ్ విభాగం ముంబైతో పోలిస్తే చాలా బెటర్ అని చెప్పాలి. ఆ జట్టు స్పిన్నర్లు అక్షర్, కుల్దీప్ అద్భుతంగా రాణిస్తుండగా, పేసర్లు ఖలీల్ అహ్మద్, ముకేశ్ కుమార్, నోర్జే పర్వాలేదనిపిస్తున్నారు. ఎలా చూసినా ముంబైతో పోలిస్తే డీసీనే మెరుగ్గా ఉంది కాబట్టి, ఆ జట్టుకే విజయావకాశాలు అధికంగా ఉండే ఛాన్స్ ఉంది. అంతేకాక డీసీకి సొంత మైదానంలో ఆడుతుండటం అదనంగా కలిసి వస్తుంది. ఒకవేళ బ్యాటింగ్‌లో రోహిత్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ చెలరేగితే మాత్రం ముంబైను ఆపడం ఎవరి తరం కాదు. ఆర్చర్ మినహా నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ లేకపోవడం ముంబైకి అతి పెద్ద మైనస్ అని చెప్పవచ్చు. అలాగని స్పిన్ విభాగం సైతం ఏమంత బలంగా లేదు. ఇక ఈ మ్యాచ్ కోసం ముంబై ఇండియన్స్ బౌలింగ్‌లో పలు మార్పులు చేయవచ్చు. సీఎస్కేతో మ్యాచ్‌కు దూరంగా ఉన్న ఆర్చర్ నేడు బరిలోకి దిగవచ్చు. గత మ్యాచ్‌లో ఆడిన అర్షద్ ఖాన్‌పై వేటు వడవచ్చు. అతని స్థానంలో సచిన్ తనయుడు అర్జున్ టెండూల్కర్ తుది జట్టులోకి రావచ్చు. బ్యాటింగ్ విభాగంలో ట్రిస్టస్ స్టబ్స్ స్థానంలో డెవాల్డ్ బ్రెవిస్ ఆడేందుకు అవకాశాలు ఎక్కుగా ఉన్నాయి. డీసీ విషయానికొస్తే.. ఈ జట్టులో పెద్ద మార్పులు ఉండకపోవచ్చు. రాజస్థాన్‌తో ఆడిన జట్టునే డీసీ యాజమాన్యం యధాతథంగా బరిలోకి దించవచ్చు. గత 3 మ్యాచ్‌ల్లో దారుణంగా విఫలమైన పృథ్వీ షాపై వేటు పడే అవకాశం ఉంది. అతని స్థానంలో యశ్ ధుల్‌కు అవకాశం ఇవ్వవచ్చు. వికెట్‌కీపర్ కోటాలో సర్ఫరాజ్ అహ్మద్‌కు లాస్ట్ ఛాన్స్ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. తుది జట్లు (అంచనా).. ఢిల్లీ క్యాపిటల్స్: పృథ్వీ షా/యశ్ ధుల్, డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీశ్‌పాండే, రిలీ రొస్సో, అభిషేక్ పోరెల్/సర్ఫరాజ్ అహ్మద్ (వికెట్‌కీపర్), లలిత్ యాదవ్, అక్షర్ పటేల్, రోవ్‌మన్ పావెల్, కుల్దీప్ యాదవ్, నోర్జే, ముకేశ్ కుమార్, ఖలీల్ అహ్మద్ ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్‌కీపర్), డెవాల్డ్ బ్రెవిస్, కెమారూన్ గ్రీన్, సూర్యుకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, అర్జున్ టెండూల్కర్, పియుశ్ చావ్లా, బెహ్రెన్‌డార్ఫ్, కుమార్ కార్తికేయ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4301451426.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్.. సన్‌రైజర్స్‌లో కీలక మార్పులు
SRH VS LSG: ఐపీఎల్-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్ 7) లక్నో సూపర్ జెయింట్స్- సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడనున్నాయి. అటల్ బిహారి స్టేడియంలో రాత్రి 7: 30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఎల్ఎస్జే విషయానికొస్తే.. ఈ జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మార్కస్ స్టొయినిస్ స్థానంలో సఫారీ వికెట్‌కీపర్ క్వింటన్ డికాక్‌కు తుది జట్టులో చోటు దొరకవచ్చు. జయదేవ్ ఉనద్కత్‌ను ఫైనల్ ఎలెవెన్‌లో ఆడించవచ్చు. పేసర్ యశ్ ఠాకూర్ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండే అవకాశం ఉంది. సన్‌రైజర్స్ విషయానికొస్తే.. రెగ్యులర్ కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ ఈ మ్యాచ్‌లో తప్పక బరిలో ఉంటాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసిన భువీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వికెట్‌కీపర్ కోటాలో గ్లెన్ ఫిలిప్స్‌కు బదులు హెన్రిచ్ క్లాసెన్ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్ స్పిన్నర్ మయాంక్ మార్కండే ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉండవచ్చు. తుది జట్లు (అంచనా).. సన్‌రైజర్స్ హైదరాబాద్: మయాంక్ అగర్వాల్, అభిషేక్ శర్మ, హ్యారీ బ్రూక్, రాహుల్ త్రిపాఠి, ఎయిడెన్ మార్క్రమ్ (కెప్టెన్), హెన్రిచ్ క్లాసెన్ (వికెట్‌కీపర్), వాషింగ్టన్ సుందర్, భువనేశ్వర్ కుమార్, టి నటరాజన్, ఉమ్రాన్ మాలిక్, ఫజల్హక్ ఫారూఖీ, మయాంక్ మార్కండే (ఇంపాక్ట్ ప్లేయర్) లక్నో సూపర్ జెయింట్స్: కేఎల్ రాహుల్ (కెప్టెన్), క్వింటన్ డికాక్ (వికెట్‌కీపర్), కైల్ మేయర్స్, దీపక్ హుడా, కృనాల్ పాండ్యా, నికోలస్ పూరన్, కృష్ణప్ప గౌతమ్, మార్క్ వుడ్, రవి బిష్ణోయ్, జయదేవ్ ఉనద్కత్, ఆవేశ్ ఖాన్, యశ్ ఠాకూర్ (ఇంపాక్ట్ ప్లేయర్) -
BGT 2023: ఆసీస్‌తో తొలి టెస్ట్.. తుది జట్టులో ఇషాన్ కిషన్..!
Ravi Shastri Prediction: బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి ఆస్ట్రేలియాతో జరుగనున్న తొలి టెస్ట్ కోసం టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి తన ప్లేయింగ్ ఎలెవెన్‌ను(భారత్) ప్రకటించాడు. ఐసీసీ రివ్యూ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలి టెస్ట్‌లో భారత తుది జట్టు ఇలా ఉండబోతుందంటూ తన అంచనాను వెల్లడించాడు. రవిశాస్త్రి పిక్ చేసిన 11 మందిలో రెండు అనూహ్య ప్రతిపాదనలు ఉన్నాయి. వికెట్‌కీపర్‌గా శ్రీకర్ భరత్ బదులు ఇషాన్‌కిషన్‌ను ఎంచుకున్న అతను.. అక్షర్ పటేల్‌ను కాదని కుల్దీప్ యాదవ్ వైపు మొగ్గు చూపాడు. ఓపెనింగ్ స్థానం కోసం శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ మధ్య తీవ్ర పోటీ ఉంటుందని అంచనా వేశాడు. అఖరి నిమిషంలో కెప్టెన్, కోచ్ ఈ విషయంపై నిర్ణయం తీసుకోవచ్చని అభిప్రాయపడ్డాడు. గిల్ రాహుల్ మధ్య పోటీ ఉంటుందని చెప్పిన రవిశాస్త్రి ఐదో స్థానాన్ని సూర్యకుమార్ యాదవ్‌కు కన్ఫర్మ్ చేసి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. పై పేర్కొన్న ప్రతిపాదనలు మినహాయించి అందరూ ఊహించినట్లుగానే జట్టును ఎంచుకున్నాడు. ఇదే సందర్భంగా రవిశాస్త్రి మరో ప్రిడిక్షన్ కూడా చేశాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని టీమిండియా 4-0తో క్లీన్‌స్వీప్ చేస్తుందని చెప్పాడు. కీలకమైన ఓపెనింగ్ మ్యాచ్‌లో గెలిస్తే.. టీమిండియాలో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, తద్వారా సిరీస్‌ను క్లీన్ చేయడం సులువవుతుందని అభిప్రాయపడ్డాడు. ఇదిలా ఉంటే, రేపటి నుంచి ప్రారంభం కాబోయే తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. తమతమ శిక్షణా శిబిరాల్లో భారత్, ఆసీస్ ఆటగాళ్లు చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనల్లో నిమగ్నమై ఉన్నాయి. ఇక ఇరు జట్ల మధ్య గత రికార్డులను ఓసారి పరిశీలిస్తే.. భారత్, ఆసీస్‌లు ఇప్పటివరకు మొత్తం 102 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఎదురెదురు పడగా 30 మ్యాచ్‌ల్లో టీమిండియా, 43 సందర్భాల్లో ఆసీస్ గెలుపొందాయి. మిగిలిన 29 మ్యాచ్‌ల్లో 28 డ్రా కాగా, ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక సిరీస్‌ల విషయానికొస్తే.. ఇరు జట్ల మధ్య 27 సిరీస్‌లు జరగ్గా ఆసీస్ 12, భారత్ 10 సిరీస్‌లు గెలిచాయి. 5 సిరీస్‌లు డ్రాగా ముగిసాయి. రవిశాస్త్రి అంచనా వేసిన తుది జట్టు.. రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్/శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, సూర్యకుమర్ యాదవ్, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ ఆస్ట్రేలియాతో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమర్ యాదవ్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అశ్విన్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, జయదేవ్ ఉనద్కత్ సిరీస్ షెడ్యూల్.. ఫిబ్రవరి 9-13 వరకు తొలి టెస్ట్, నాగ్‌పూర్ ఫిబ్రవరి 17-21 వరకు రెండో టెస్ట్, ఢిల్లీ మార్చి 1-5 వరకు మూడో టెస్ట్, ధర్మశాల మార్చి 9-13 వరకు నాలుగో టెస్ట్, అహ్మదాబాద్ వన్డే సిరీస్.. మార్చి 17న తొలి వన్డే, ముంబై మార్చి 19న రెండో వన్డే, విశాఖపట్నం మార్చి 22న మూడో వన్డే, చెన్నై -
భూకంపం వస్తుందని మూడు రోజుల ముందే చెప్పాడు.. ఎవరూ నమ్మలే..
టర్కీ, సిరియాలో సోమవారం భారీ భూకంపం సంభవించి 2300 మందికిపైగా చనిపోవడం యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. అయితే ఈ ఉపద్రవాన్ని ఓ వ్యక్తి మూడు రోజుల ముందే ఊహించారంటే? నమ్మగలరా? టర్కీ, సిరియాలో త్వరలో భారీ భూకంపం రాబోతుందని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు. కానీ ఎవరూ దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆయన అంచనాలు ఎప్పుడూ నిజమైన దాఖలాలు లేవని కొట్టిపారేశారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన చెప్పిందే నిజమైంది. రిక్టర్ స్కేలుపై 7.8 తీవ్రతో భూకంపం వచ్చి టర్కీ, సిరియా అతలాకుతలం అయ్యాయి. వేల భవనాలు నేలమట్టయ్యాయి. బిల్డింగులు పేక మేడల్లా కూలిపోయాయి. భూకంపాన్ని ముందే ఊహించిన ఈ వ్యక్తి పేరు ఫ్రాంక్ హూగర్బీట్స్. భూకంప కార్యకలాపాలను అధ్యయనం చేసే 'సోలార్ సిస్టం జియోమెట్రిక్ సర్వే'(SSGEOS) పరిశోధకులు. ఈయన మూడు రోజుల క్రితం చేసిన ట్వీట్ ఇది.. 'అతి త్వరలో లేదా తర్వాత సౌత్ సెంట్రల్ టర్కీ, జోర్డాన్, సిరియా, లెబనాన్ ప్రాంతాల్లో 7.5 తీవ్రతో భారీ భూకంపం వస్తుంది.' అని ఫ్రాంక్ ఫిబ్రవరి 3న ట్వీట్ చేశారు. Sooner or later there will be a ~M 7.5 #earthquake in this region (South-Central Turkey, Jordan, Syria, Lebanon). #deprem pic.twitter.com/6CcSnjJmCV — Frank Hoogerbeets (@hogrbe) February 3, 2023 అయితే ఈ ట్వీట్‌ను కొందరు కొట్టపారేశారు. ఫ్రాంక్ నకిలీ శాస్త్రవేత్త అని విమర్శలు కూడా గుప్పించారు. గతంలో ఆయన అంచనాలు ఏనాడూ నిజం కాలేదని చులకన చేసి మాట్లాడారు. కానీ మూడు రోజుల తర్వాత ఆయన అంచనాలే అక్షరసత్యం కావడంతో అందరూ షాక్ అయ్యారు. భూకంపం అనంతరం ఫ్రాంక్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను చెప్పిందే నిజమైందని వందల మంది ప్రాణాలు కోల్పోవడం బాధగా ఉందని ట్వీట్ చేశారు. వందేళ్లకు ఓసారి ఇలాంటి భారీ భూకంపం వస్తుందని, 115, 526 సంవత్సారాల్లో కూడా ఇలాంటి పెను విపత్తులే సంభవించాయని వివరించారు. My heart goes out to everyone affected by the major earthquake in Central Turkey. As I stated earlier, sooner or later this would happen in this region, similar to the years 115 and 526. These earthquakes are always preceded by critical planetary geometry, as we had on 4-5 Feb. — Frank Hoogerbeets (@hogrbe) February 6, 2023 భూకంపం తర్వాత ట్విట్టర్లో ఫ్రాంక్ ఫాలోవర్ల సంఖ్య భారీగా పెరిగింది. ఆయన పేరుతో నకిలీ ఖాతాలు కూడా సృష్టించే పరిస్థితి వచ్చింది. దీంతో యూజర్లు జాగ్రత్తగా ఉండాలని, తన పేరుతో నకిలీ ఖాతాలు క్రియేట్ చేస్తున్న వారిపై ఫిర్యాదు చేయాలని సూచించారు. చదవండి: టర్కీ భూకంపం లైవ్ వీడియో.. పేకమేడలా కూలిన భవనాలు.. భయానక దృశ్యాలు.. -
న్యూజిలాండ్‌తో మూడో వన్డే.. టీమిండియా ఎలా ఉండబోతుందంటే..?
IND VS NZ 3rd ODI: స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 2-0 తేడాతో కైవసం చేసుకున్న టీమిండియా.. జనవరి 24న నామమాత్రంగా జరిగే మూడో వన్డేలో ప్రయోగాల బాట పట్టనుందా..? అంటే అవుననే సమాధానమే వినిపిస్తుంది. ఇండోర్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో షాబాజ్ అహ్మద్, చహల్, ఉమ్రాన్ మాలిక్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. తొలి రెండు వన్డేలు ఆడిన కుల్దీప్ యాదవ్, వాషింగ్టన్ సుందర్, శార్దూల్ ఠాకూర్లకు విశ్రాంతినివ్వాలని మేనేజ్మెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 27 నుంచే ప్రారంభంకానున్న టీ20 సిరీస్ (న్యూజిలాండ్‌తో) నేపథ్యంలో చహల్, ఉమ్రాన్ మాలిక్‌లకు ఓ అవకాశం ఇవ్వాలన్నది మేనేజ్మెంట్ అభిప్రాయమని సమాచారం. చహల్, ఉమ్రాన్ మాలిక్ ఇద్దరూ టీ20 జట్టులో కూడా ఉండటంతో ఈ మార్పులు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. పైన పేర్కొన్న మూడు మార్పులు మినహాయించి, రెండో వన్డే ఆడిన జట్టునే యధాతథంగా కొనసాగించవచ్చు. ఓపెనర్లుగా రోహిత్, గిల్, వన్‌డౌన్‌లో విరాట్ కోహ్లి, ఆతర్వాత ఇషాన్ కిషన్, సూర్యకుమార్, హార్ధిక్, షాబాజ్ అహ్మద్, షమీ, సిరాజ్, ఉమ్రాన్, చహల్ తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌లో భారత్ తొలి వన్డేలో 12 పరుగుల తేడాతో, రెండో వన్డేలో 8 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. -
కర్ణాటకలో సంకీర్ణం వస్తుందా? కోడిమఠం స్వామీజీ జోస్యం ఇదే
సాక్షి, బెంగళూరు: త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, సంకీర్ణ ప్రభుత్వం ఎట్టిపరిస్థితుల్లోను అధికారంలోకి రాదని కోడిమఠం స్వామీజీ జోస్యం చెప్పారు. విజయనగర జిల్లా హొసపేటెలో ఆయన మాట్లాడుతూ.. 2023 అసెంబ్లీ ఎన్నికల భవిష్యత్తును తెలియజేశారు. ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో సంకీర్ణ ప్రభుత్వం వస్తుందని కొందరు చర్చించుకుంటున్న నేపథ్యంలో కోడిమఠం పీఠాధికారి డాక్టర్ శివానంద శివయోగి రాజేంద్ర మహాస్వామీజీ భవిష్యత్ రాజకీయాల గురించి నర్మగర్భంగా పేర్కొనడం చర్చనీయాంశమైంది. ఒకే పార్టీ అధికారంలోకి వస్తుందని, ఇద్దరు గొప్ప వ్యక్తులు కనుమరుగవుతారన్నారు. ఉగాది అనంతరం గత ఏడాది కంటే మంచి వర్షాలు పడుతాయన్నారు. కరోనా వచ్చినా భయమేమీ లేదని, ప్రాణహాని ఉండదన్నారు. -
బంగ్లాదేశ్‌తో తొలి టెస్ట్.. టీమిండియా ఇదే..!
IND VS BAN 1st Test: 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా చట్టోగ్రామ్ వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్ల మధ్య రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. భారతకాలమానం ప్రకారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయే ఈ మ్యాచ్‌లో గెలుపు కోసం ఇరు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి. వన్డే సిరీస్ గెలిచిన ఉత్సాహంలో ఆతిధ్య బంగ్లాదేశ్ ఉరకలేస్తుండగా.. టెస్ట్ సిరీస్ గెలిచి పరువు కాపాడుకోవాలని టీమిండియా పట్టుదలగా ఉంది. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌కు భారత తుది జట్టు ఎలా ఉండబోతుందోనని సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టులో మార్పులు చేర్పులతో గజిబిజి గందరగోళంగా ఉన్న టీమిండియా పరిస్థితి మ్యాచ్ సమయానికి ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తుది జట్టులో తప్పక ఉంటాడనుకున్న ఉనద్కత్ ఇండియాలోనే ఇరుక్కుపోవడం, వికెట్‌కీపర్‌గా ఎవరిని ఎంపిక చేయాలన్న సందిగ్ధత టీమిండియా యాజమాన్యాన్ని తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఈ మ్యాచ్‌లో సరైన జట్టు ఎంపిక జరగక టీమిండియా ఓడితే, అది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ప్రభావం చూపుతుందని మేనేజ్మెంట్ ఆందోళన చెందుతుంది. జట్టులో ఏడు స్థానాలు ఖరారు కాగా.. మిగిలిన 4 స్థానాలపై సందిగ్ధత నెలకొంది. వికెట్‌కీపర్ స్థానం కోసం పంత్, శ్రీకర్ భరత్ మధ్య పోటీ ఉండగా, ఆల్‌రౌండర్ల బెర్త్‌కు అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, శార్దూల్ ఠాకూర్ పోటీ పడుతున్నారు. స్పిన్నర్లుగా అశ్విన్, కుల్దీప్ స్థానానికి ఎలాంటి ఢోకా లేనప్పటికీ.. పేసర్ల విభాగంలో ఉమేశ్, సిరాజ్, సైనీ మధ్య పోటీ ఉంది. భారత తుది జట్టు (అంచనా): ఓపెనర్లుగా కెప్టెన్ కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, వన్ డౌన్లో పుజారా, నాలుగో స్థానంలో కోహ్లి, ఐదో ప్లేస్‌లో శ్రేయస్ అయ్యర్ పేర్లు ఖరారు కాగా, పంత్/ శ్రీకర్ భరత్, అక్షర్ పటేల్/సౌరభ్ కుమార్/ శార్ధూల్ ఠాకూర్, అశ్విన్, కుల్దీప్ యాదవ్, ఉమేశ్ యాదవ్, సిరాజ్/ సైనీ భారత్: శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ -
న్యూజిలాండ్‌తో తొలి టీ20.. శాంసన్ సహా 'ఆ ఇద్దరికి' మొండిచెయ్యి..?
IND VS NZ 1st T20: టీ20 వరల్డ్‌కప్-2022 అనంతరం సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్ రెస్ట్ తీసుకోవడంతో యువ జట్లతో (టీ20, వన్డే సిరీస్‌లకు వేర్వేరు జట్లు) న్యూజిలాండ్ పర్యటనకు బయల్దేరిన టీమిండియా.. రేపు (నవంబర్ 18) వెల్లింగ్టన్లోని స్కై స్టేడియంలో 3 మ్యాచ్‌ల సిరీస్‌లతో భాగంగా తొలి టీ20 ఆడనుంది. ఈ పర్యటనలో టీ20 సిరీస్‌కు హార్ధిక్ పాండ్యా, వన్డే సిరీస్‌కు శిఖర్ ధవన్ టీమిండియాకు నాయకత్వం వహించనుండగా.. వీరి సారధ్యంలో యువ ఆటగాళ్లతో కూడిన భారత జట్టు ఆతిధ్య జట్టుతో అమీతుమీకి సై అంటుంది. భారతకాలమానం ప్రకారం రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రారంభమయ్యే తొలి టీ20లో భారత తుది జట్టు ఎలా ఉండే అవకాశం ఉందంటే.. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సీనియర్ల గైర్హాజరీలో యువ ఆటగాళ్లు ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, ఉమ్రాన్ మాలిక్‌లకు తుది జట్టులో చోటు లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. రిషబ్ పంత్, ఇషాన్ కిషన్ ఇద్దరినీ జట్టులోకి తీసుకుంటే, సంజూ శాంసన్ బెంచ్‌కే పరిమితం కాక తప్పదు. వరల్డ్‌కప్‌లో అవకాశాలు దక్కని దీపక్ హుడా తుది జట్టులో తప్పక ఉండే ఛాన్స్ ఉంది. స్పిన్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్, హర్షల్ పటేల్ ఛాన్స్ కోసం ఎదురు చూడాల్సి రావచ్చు. స్పెషలిస్ట్ స్పిన్నర్ కోటాలో యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్ మధ్య తీవ్ర పోటీ నెలకొన్నప్పటికీ.. స్కై స్టేడియంలో పిచ్ పరిస్థితుల దృష్ట్యా కుల్దీప్కే అవకాశం దొరకవచ్చు. పేసర్ల కోటాలో స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ స్థానాలు పక్కా కాగా.. ఉమ్రాన్ మాలిక్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య పోటీ ఉంటుంది. అయితే పేస్‌కు అనుకూలించే వెల్లింగ్టన్ పిచ్‌పై మేనేజ్మెంట్.. ఉమ్రాన్ మాలిక్‌ను ఫస్ట్ చాయిస్‌గా తీసుకునే అవకాశం ఉంది. తుది జట్టు (అంచనా).. శుబ్‌మన్ గిల్, ఇషాన్ కిషన్, శ్రేయస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్‌కీపర్), హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ టీ20 సిరీస్‌కు భారత జట్టు.. హార్ధిక్ పాండ్యా (కెప్టెన్), రిషబ్ పంత్ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, సంజూ శాంసన్, వాషింగ్టన్ సుందర్, యుజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, భువనేశ్వర్ కుమార్, అర్షదీప్ సింగ్, ఉమ్రాన్ మాలిక్. చదవండి: Viral Video: సిక్స్ ప్యాక్ బాడీలతో టీమిండియా క్రికెటర్లు..! video -
బ్రిటన్ రాణి ఆ రోజే చనిపోతుందని ముందే చెప్పాడు.. ఇప్పుడు కింగ్ చార్లెస్
లండన్: బ్రిటన్ రాణి ఎలిజబెత్ 2 గురువారం(సెప్టెంబర్ 8న) మరణించిన విషయం తెలిసిందే. అయితే ఆమె అదే రోజు చనిపోతుందని ముందుగానే ఊహించాడు ఓ వ్యక్తి. ఈ ఏడాది జులైలోనే అతను ఈమేరకు ట్వీట్ చేశాడు. లోగన్ స్మిత్(@logan_smith526) అనే పేరుతో ఉన్న ఇతని ట్విట్టర్ ఖాతా ద్వారా ఈవిషయాన్ని వెల్లడించాడు. బ్రిటన్‌కు అత్యధిక కాలం మహారాణిగా ఉన్నవారు సెప్టెంబర్ 8, 2022న మరణిస్తారు అని అతను ట్వీట్లో పేర్కొన్నాడు. రాణి మరణించిన క్షణాల్లోనే ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. లోగన్ స్మిత్ ట్వీట్‌ను వేలమంది రీట్వీట్ చేశారు. అయితే అతడు తన ట్వీట్లో రాణి మరణించే తేదీతో పాటు కొత్త రాజు ఎప్పుడు చనిపోతాడనే విషయాన్ని కూడా చెప్పడం బ్రిటన్ ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. కింగ్ చార్లెస్ 2026 మార్చి 28న మరణిస్తారని అతడు అంచనావేయడమే ఇందుకు కారణం. ఈ ట్వీట్‌ను ట్విట్టర్లో ఎక్కువమంది రీట్వీట్ చేస్తుండటంతో లోగన్ స్మిత్ తన ఖాతాను ప్రైవేటుగా మార్చుకున్నాడు. దీంతో అతని పాత ట్వీట్లు సాధారణ యూజర్లకు కన్పించడంలేదు. అయితే పాత ట్వీట్ స్క్రీన్ షాట్లనే చాలా మంది యూజర్లు మళ్లీ షేర్ చేస్తున్నారు. మరికొందరు లోగన్ స్మిత్ ప్రెడిక్షన్ చూసి షాక్‌కు గురవుతున్నారు. ఓ యూజర్ అయితే లోగన్ నువ్వు జాగ్రత్త.. బ్రిటిష్ ప్రజలు నీకోసం వస్తారు అని హెచ్చరించాడు. మరో యూజర్ స్పందిస్తూ ఇప్పటికే రాణి మరణంతో శోకసంద్రంలో మునిగిపోయాం, అలా చెప్పొద్దు అని రాసుకొచ్చాడు. మరొక యూజర్ స్పందిస్తూ.. కింగ్ చార్లెస్ 2026లో చనిపోతారనే అంచనా కరెక్ట్ కాదు. ఎవరు ఎప్పుడు చనిపోతారో నిర్ణయించేది ఆ భగవంతుడే అని రాసుకొచ్చాడు. ఎలిజబెత్ 2 మరణానంతరం ఆమె కుమారుడు కింగ్ చార్లెస్ 3 వారసుడిగా బాధ్యతలు చేపట్టారు. చదవండి: బ్రిటన్ పార్లమెంట్లో కింగ్ చార్లెస్–3 తొలి ప్రసంగం -
ప్రపంచకప్ తర్వాత హార్ధిక్ రిటైర్ అవడం ఖాయం
-
దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. భారత జట్టులో మూడు మార్పులు..!
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి రెండు మ్యాచ్‌లో ఓటమి చెందిన టీమిండియా.. మంగళవారం విశాఖపట్నం వేదికగా జరగనున్న మూడో టీ20లో తాడో పేడో తెల్చుకోవడానికి సిద్దమైంది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 0-2తో భారత్ వెనుకబడి ఉంది. అయితే మూడో టీ20కు టీమిండియా తుది జట్టులో పలు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. కాగా తొలి రెండు మ్యాచ్‌ల్లో బౌలర్లు దారుణంగా విఫలమయ్యారు. గత రెండు మ్యాచ్‌ల్లోనూ విఫలమైన అక్షర్ పటేల్ స్థానంలో దీపక్ హుడా తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే విధంగా టీమిండియా స్పెషలిస్ట్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ భారీగా పరుగులు సమర్పించుకున్నాడు. దీంతో అతడికి మూడో టీ20కు తుది జట్టులో చోటు దక్కడం కష్టమనే చెప్పుకోవాలి. ఈ క్రమంలో అతడి స్థానంలో యువ స్పిన్నర్ రవి బిష్ణోయ్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మరోవైపు పేసర్ ఆవేష్ ఖాన్ కూడా ఈ మ్యాచ్‌కు బెంచ్‌కు పరిమతమయ్యే సూచనలు కన్పిస్తున్నాయి. అతడి స్థానంలో ఆర్షదీప్కు సింగ్‌ను ఆడించాలని మేనేజేమెంట్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా జమ్మూ స్పీడ్ స్టార్ ఉమ్రాన్ మాలిక్ మరో సారి బెంచ్‌కే పరిమతమయ్యే అవకాశం ఉంది. తుది జట్టు అంచనా : ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్ (కెప్టెన్) (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), దినేష్ కార్తీక్, దీపక్ హుడా, హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్ చదవండి: Joe Root: ఎప్పుడు కొట్టని షాట్ ఆడాడు.. అందుకే ఆశ్యర్యపోయాడా? -
ప్రభాస్ పెళ్లి జరిగేది అప్పుడేనట.. తేల్చి చెప్పేసిన జ్యోతిష్యుడు
పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న ఏకైక స్టార్ హీరో ప్రభాస్. ఈ మిర్చి హీరో వరుస పెట్టి పాన్ ఇండియా మూవీస్ చేస్తూ అభిమానులను తెగ అలరిస్తున్నాడు. డార్లింగ్ చేస్తున్న ఈ సినిమాలన్నింటి బడ్జెట్ మొత్తం కలిపితే సుమారు రూ. 1000 కోట్లకు పైగానే ఉంటుంది. ఇంతటి స్టార్ రేంజ్ ఉన్న ప్రభాస్ ఇంకా టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లలో ఒకరిగా మిగిలిపోయాడు. ఈ మిస్టర్ పర్ఫెక్ట్ పెళ్లి గురించి వచ్చే పుకార్లు, విశేషాలు తరచుగా వార్తల్లో ప్రధానాంశాలుగా ట్రెండ్ అవుతాయి. అంతే కాకుండా ఈ బుజ్జిగాడి పెళ్లి కోసం ఫ్యాన్స్‌తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే అప్పట్లో బాహుబలి సినిమా తర్వాత పెళ్లి చేసుకుంటానని వాళ్ల ఇంట్లో చెప్పినట్లు స్వయంగా ప్రభాస్ తెలిపాడు. కానీ ఇప్పటికీ వరకు ఆ గుడ్ న్యూస్ చెప్పలేదు. తాజాగా ప్రభాస్ వివాహం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. 42 ఏళ్లు ఉన్న ప్రభాస్ ఈ ఏడాదే పెళ్లి చేసుకునే అవకాశాలున్నాయని ప్రముఖ జ్యోతిష్యుడు ఆచార్య వినోద్ కుమార్ చెబుతున్నారు. 'హీరో ప్రభాస్ త్వరలోనే వివాహం చేసుకుంటారు. అక్టోబర్ 2022 నుంచి అక్టోబర్ 2023 మధ్యలో ఎప్పుడైనా ప్రభాస్ పెళ్లి జరగవచ్చు. మోస్ట్ హ్యాండ్సమ్ పాన్ ఇండియా స్టార్ విషయంలో ఇది నా జ్యోతిష్యం.' అని తెలిపారు. మరి ఈ జ్యోతిష్యుడు చెప్పినట్టు ప్రభాస్ వివాహం జరుగుతుందా ? లేదా ? అన్నది చూడాలి. ఇదిలా ఉంటే ప్రభాస్ హస్తాసాముద్రికా నిపుణుడిగా నటించిన 'రాధేశ్యామ్' చిత్రం ఈ నెల 11న విడుదలకు సిద్ధంగా ఉంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే 'ప్రేరణ'గా ఆకట్టుకోనుంది. View this post on Instagram A post shared by Acharya vinod kumar (@acharyavinodkumar) -
కరోనా పీడ విరగడయ్యేది అప్పుడేనా..?
సాక్షి, హైదరాబాద్: కేసులు, మరణాలు, ఆక్సిజన్ కొరత, ఆరోగ్య సమస్యల గురించి వార్తలు వినీవినీ విసిగిపోయాం. ఈ కోవిడ్ మహమ్మారి పీడ విరగడయ్యేది ఎప్పుడన్న ప్రశ్న అందరి మనసులను తొలుస్తోంది. ఈ నేపథ్యంలో పలువురు నిపుణులు వేర్వేరుగానైనా ఏకాభిప్రాయంతో మే చివరికి కరోనా పీడ విరగడయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని చెబుతుండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఆ వివరాలేంటో చూసేద్దాం. దేశంలో రెండో దశ కరోనా కేసుల సంఖ్య మే నెల 14 నుంచి 18వ తేదీ మధ్య కాలంలో శిఖర స్థాయికి చేరుకుంటాయని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ అధ్యాపకులు రూపొందించిన మోడల్లో తెలిపారు. ‘ససెప్టబుల్, అన్‌డిటెక్టెడ్, టెస్టెడ్ (పాజిటివ్) అండ్ రిమూవ్డ్ అప్రోచ్ (సూత్ర)’మోడల్‌ను వీరు తయారు చేశారు. ఇప్పటికే భారత్‌లో రోజువారీ కేసుల సంఖ్య 3 లక్షల కన్నా ఎక్కువై 4 రోజులు అవుతోంది. దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 28 లక్షల వరకు ఉండగా, మే నెల మధ్య కాలానికి 38 నుంచి 48 లక్షలకు చేరుకోవచ్చని, అదే నెలాఖరుకు కేసుల సంఖ్య రోజుకు 4.4 లక్షలకు చేరుతాయని ఐఐటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ఢిల్లీ, హరియాణా, రాజస్తాన్‌లతో పాటు తెలంగాణలో ఏప్రిల్ 25 నుంచి 30 మధ్యకాలంలో కేసుల సంఖ్య పెరిగి శిఖర స్థాయికి చేరుకుంటాయని, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌లలో ఇప్పటికే ఆ పరిస్థితి ఏర్పడి ఉండొచ్చని వివరిస్తున్నారు. కాగా, అంచనా వేసేందుకు వినియోగించిన సమాచారం ఎప్పటికప్పుడు మారిపోతున్న నేపథ్యంలో తుది ఫలితాలపై కొంత అసందిగ్ధత ఉందని ఈ మోడలింగ్‌కు నేతృత్వం వహించిన శాస్త్రవేత్త మణినీంద్ర అగ్రవాల్ ట్విట్టర్‡ ద్వారా తెలిపారు. రోజువారీ కొత్త కేసుల సంఖ్య కూడా మే నెల 4–8వ తేదీ మధ్య కాలంలో శిఖరస్థాయికి చేరుతాయని సూత్రా మోడల్ అంచనా వేసింది. కాగా, కొద్ది రోజుల కింద కరోనా ఏప్రిల్ 15 –20 మధ్యకాలంలో శిఖర స్థాయికి చేరుతుందని ఐఐటీ–హైదరాబాద్, కాన్పూర్ శాస్త్రవేత్తలు అంచనా విడుదల చేసినా.. కానీ ఇది వాస్తవం కాలేదు. ఇతరులదీ అదేమాట.. ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్ శాస్త్రవేత్తల ‘సూత్రా’మోడల్ దేశీయంగా, విదేశాల్లో సిద్ధం చేసిన ఇతర మోడళ్ల ఫలితాలకు చాలా దగ్గరగా ఉండటం కరోనా పీడ విరగడయ్యేందుకు ఎక్కువ సమయం లేదన్న భరోసా కల్పిస్తోంది. హరియాణాలో అశోకా యూనివర్సిటీకి చెందిన గౌతమ్ మీనన్ వేసిన అంచనా ప్రకారం కరోనా వైరస్ కేసులు ఏప్రిల్ 15–మే 15 మధ్యకాలంలో అత్యధిక స్థాయికి చేరనున్నాయి. మరోవైపు అమెరికాలోని మిషిగన్ యూనివర్సిటీ శాస్త్రవేత్త ప్రొఫెసర్ భ్రమర్ ముఖర్జీ అంచనా కూడా మే 15కు కేసులు శిఖరస్థాయికి ఆ తర్వాత తగ్గుముఖం పడుతాయని చెప్పడం విశేషం. భ్రమర్ ముఖర్జీ అంచనాల ప్రకారం మే నెల మధ్యకు దేశంలో కేసుల సంఖ్య రోజుకు 8 నుంచి 10 లక్షల వరకు ఉంటుంది. సియాటెల్ కేంద్రంగా పనిచేస్తున్న ‘ది ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్’(ఐహెచ్ఎంఈ) కూడా దాదాపు ఇదే అంచనా వేసింది. నమోదైన కేసుల ఆధారంగా భ్రమర్ ముఖర్జీ, ఐహెచ్‌ఎంఈలు అంచనాలను సిద్ధం చేశారు. ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టకపోతే మే నెల మొదటి వారంలో కేసుల సంఖ్య రోజుకు 5 లక్షలకు చేరుకుంటుందని, రోజువారీ మరణాలు 3 వేల కంటే ఎక్కువ నమోదు కావొచ్చని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. మరణాలు పెరుగుతాయా? ఐహెచ్ఎంఈ లెక్కల ప్రకారం.. ఆగస్టు ఒకటి నాటికి భారత్‌లో కోవిడ్ కారణంగా సంభవించే మరణాల సంఖ్య కనిష్టంగా 9.59 లక్షలు గరిష్టంగా 10.45 లక్షలుగా ఉండొచ్చని అంచనా వేశారు. ప్రజలందరూ కచ్చితంగా మాస్కులు ధరిస్తే మరణాల సంఖ్య 8.8 లక్షలకు పరిమితం చేయొచ్చని పేర్కొన్నారు. ఫిబ్రవరిలో కేంద్రం విడుదల చేసిన సీరో సర్వే ప్రకారం అసలు కేసుల కంటే నమోదైన కేసుల దాదాపు 27 రెట్లు తక్కువ. ఈ తేడాల మేరకు లెక్కలు 10 నుంచి 20 రెట్లు తక్కువ చూపుతారని పరిగణించి అంచనా వేశామని భ్రమర్ ముఖర్జీ తెలిపారు. చదవండి: (దేశంలో రాబోయే రోజుల్లో కరోనా విశ్వరూపం) -
ఆగస్టు 10 నాటికి 20 లక్షలకు పైమాటే!
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో కరోనా మహమ్మారి విలయం కొనసాగుతోంది. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష మార్క్‌ను దాటేయడంతో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ శుక్రవారం కీలక హెచ్చరిక చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పటిష్ట చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో కరోనా మరింత వేగంగా విస్తరిస్తుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధ చర్యలు తీసుకోవాలన్నారు. (పది లక్షలు దాటిన కేసులు) దేశంలో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలను దాటేసింది. ఇదే వేగంతో కరోనా విస్తరిస్తూ ఉంటే..ఆగస్టు 10వ తేదీ నాటికి దేశంలో 20 లక్షల కేసులను కూడా దాటేస్తుందని అంచనా వేశారు. ఈ మహమ్మారిని కట్టడికి కేంద్ర ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా, నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాంటూ రాహుల్ ట్వీట్ చేశారు. అంతేకాదు దేశంలో మొత్తం కేసులు ఈ వారంలో 10 లక్షలను దాటుతాయంటూ గతంలో హెచ్చరించిన విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. (కరోనాతో మాజీ సీనియర్ అధికారి, రచయిత్రి మృతి) కాగా ప్రస్తుతం ప్రపంచంలో కోటికి పైగా కేసులు నమోదయ్యాయి. అమెరికాలో అత్యధికంగా 35 లక్షల కేసులతో అమెరికా మొదటి స్థానంలో ఉండగా, 20.1 లక్షల పాజిటివ్ కేసులతో బ్రెజిల్ రెండో స్థానంలోనూ, 10 లక్షలకు పైగా కేసులతో ఇండియా మూడవ స్థానంలో నిలిచింది. అయితే కేసుల ఉధృతి ఇలాగే కొనసాగితే, ఆగస్టు రెండో వారంలోపే కేసుల విషయంలో బ్రెజిల్‌ను అధిగమించనుందనే అంచనాలు నెలకొన్నాయి. -
అప్పట్లోనే ‘కరోనా’ను ఊహించారా?
న్యూఢిల్లీ : కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుందని కొందరు ముందే ఊహించారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఈ మేరకు పలు కథనాలు ప్రచారంలో ఉన్నాయి. తాజాగా అమెరికా రచయిత్రి సిల్వియా బ్రౌన్ 12 ఏళ్ల కిందటే(2008లో) తను రాసిన ‘ఎండ్ ఆఫ్ డేస్’ బుక్‌లో కరోనా వైరస్ గురించి ప్రస్తావించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఈ బుక్కు సంబంధించిన కొన్ని ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ‘2020 సమయంలో.. న్యుమోనియాను పోలిన ఒక జబ్బు ప్రపంచ వ్యాప్తంగా విస్తరిస్తుంది. ఊపిరితిత్తులు, శ్వాసనాళాలపై ఇది ప్రభావం చూపుతోంది. దీనికి చికిత్స కష్టంగా మారుతుంది. అయితే అది ఎంత వేగంగా విస్తరిస్తుందో అంతే వేగంగా మాయమవుతుంది. ఈ జబ్బు పదేళ్ల తర్వాత మళ్లీ విజృంభించి.. ఆ తర్వాత పూర్తిగా కనుమరుగు అయిపోతుంద’ని సిల్వియా ఈ బుక్‌లో పేర్కొన్నారు. అయితే బుక్‌లో పేర్కొన్న విధంగానే కరోనా వైరస్ లక్షణాలు ఉండటంతో నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 12 ఏళ్ల కిందటే కరోనా గురించి ఎలా ఊహించారని షాక్‌కు గురవుతున్నారు. ఓ నెటిజన్ స్పందిస్తూ.. దీనిని చూసినప్పుడు ఆశ్చర్యం వేసినప్పటికీ కొద్దిగా ఉపశమనం కూడా కలిగిందని పేర్కొన్నారు. (చదవండి : మైండ్ స్పేస్ ఖాళీ కాలేదు : సజ్జనార్) కొద్ది రోజుల కిందట కూడా కరోనాకు సంబంధించి కొన్ని కథనాలు వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ‘ఈశాన్య దిక్కున విషగాలి పుట్టేను.. ’ అనే పద్యంలో చెప్పింది కరోనా గురించేనని మెజారిటీ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. అలాగే డీన్ కూన్జ్ అనే రచయిత 40 ఏళ్ల కిందటే ‘ది ఐస్ ఆఫ్ డార్క్’ అనే నవలలో ఓ వైరస్‌కు వుహాన్ 400 అనే పేరు పెట్టాడు. వుహాన్ నగరం వెలుపల ఓ ల్యాబ్‌లో దీన్ని తయారుచేస్తారని.. ఇది మనుషులపై మాత్రమే తన ప్రభావాన్ని చూపుతుందని డీన్ ఆ నవలలో పేర్కొన్నాడు. ఇప్పుడు కరోనా ఉనికి కూడా వుహాన్ నగరంలోనే కేంద్రీకృతం కావడంతో డీన్ నవల నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.(చదవండి : 'తెలంగాణలో కరోనా కేసు నమోదు కాలేదు')