IPL 2023 SRH VS LSG Teams Prediction: SRH And LSG Likely To Make Huge Changes For This Match - Sakshi
Sakshi News home page

IPL 2023 SRH Vs LSG: లక్నో సూపర్‌ జెయింట్స్‌తో మ్యాచ్‌.. సన్‌రైజర్స్‌లో కీలక మార్పులు

Published Fri, Apr 7 2023 11:07 AM | Last Updated on Fri, Apr 7 2023 12:18 PM

IPL 2023 SRH VS LSG: Teams Prediction - Sakshi

SRH VS LSG: ఐపీఎల్‌-2023లో భాగంగా ఇవాళ (ఏప్రిల్‌ 7) లక్నో సూపర్‌ జెయింట్స్‌- సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్లు తలపడనున్నాయి. అటల్‌ బిహారి స్టేడియంలో రాత్రి 7: 30 గంటలకు ప్రారంభంకాబోయే ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్లు భారీ మార్పులు చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత ఎల్‌ఎస్‌జే విషయానికొస్తే.. ఈ జట్టులో రెండు మార్పులకు ఆస్కారం ఉంది. మార్కస్‌ స్టొయినిస్‌ స్థానంలో సఫారీ వికెట్‌కీపర్‌ క్వింటన్‌ డికాక్‌కు తుది జట్టులో చోటు దొరకవచ్చు. జయదేవ్‌ ఉనద్కత్‌ను ఫైనల్‌ ఎలెవెన్‌లో ఆడించవచ్చు. పేసర్‌ యశ్‌ ఠాకూర్‌ ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండే అవకాశం ఉంది. 

సన్‌రైజర్స్‌ విషయానికొస్తే.. రెగ్యులర్‌ కెప్టెన్‌ ఎయిడెన్‌ మార్క్రమ్‌ ఈ మ్యాచ్‌లో తప్పక బరిలో ఉంటాడు. తొలి మ్యాచ్‌లో కెప్టెన్సీ చేసిన భువీ వైస్‌ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. వికెట్‌కీపర్‌ కోటాలో గ్లెన్‌ ఫిలిప్స్‌కు బదులు హెన్రిచ్‌ క్లాసెన్‌ తుది జట్టులోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లెగ్‌ స్పిన్నర్‌ మయాంక్‌ మార్కండే ఇంపాక్ట్‌ ప్లేయర్‌గా ఉండవచ్చు. 

తుది జట్లు (అంచనా)..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌: మయాంక్‌ అగర్వాల్‌, అభిషేక్‌ శర్మ, హ్యారీ బ్రూక్‌, రాహుల్‌ త్రిపాఠి, ఎయిడెన్‌ మార్క్రమ్‌ (కెప్టెన్‌), హెన్రిచ్‌ క్లాసెన్‌ (వికెట్‌కీపర్‌), వాషింగ్టన్‌ సుందర్‌, భువనేశ్వర్‌ కుమార్‌, టి నటరాజన్‌, ఉమ్రాన్‌ మాలిక్‌, ఫజల్‌హక్‌ ఫారూఖీ, మయాంక్‌ మార్కండే (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)

లక్నో సూపర్‌ జెయింట్స్‌: కేఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌), క్వింటన్‌ డికాక్‌ (వికెట్‌కీపర్‌), కైల్‌ మేయర్స్‌, దీపక్‌ హుడా, కృనాల్‌ పాండ్యా, నికోలస్‌ పూరన్‌, కృష్ణప్ప గౌతమ్‌, మార్క్‌ వుడ్‌, రవి బిష్ణోయ్‌, జయదేవ్‌ ఉనద్కత్‌, ఆవేశ్‌ ఖాన్‌, యశ్‌ ఠాకూర్‌ (ఇంపాక్ట్‌ ప్లేయర్‌)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement